కారందోశ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారందోశ
కారందోశ సినిమా పోస్టర్
దర్శకత్వంత్రివిక్రమ్ గాజులపల్లి[2]
నిర్మాతవీణా వేదిక ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్[2]
తారాగణంశివకుమార్ రామచంద్రపు, వై. కాశీ విశ్వనాథ్, సూర్య శ్రీనివాస్
ఛాయాగ్రహణంరాజా భట్టాచార్జీ
కూర్పుసురేష్ అర్స్
సంగీతంపాటలు:
సిద్ధార్థ్ వాకిన్స్‌
నేపథ్య సంగీతం:
దేవ్ గురు
విడుదల తేదీ
30 డిసెంబరు 2016 (2016-12-30)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కారందోశ 2016, డిసెంబరు 30న విడుదలైన తెలుగు హాస్య నేపథ్య చలనచిత్రం.[3] వీణా వేదిక ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గాజులపల్లి త్రివిక్రమ్[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకుమార్ రామచంద్రపు, వై. కాశీ విశ్వనాథ్, సూర్య శ్రీనివాస్ తదితరులు నటించారు.[4] జాతీయ ఉత్తమ ఎడిటర్ పురస్కారం[5] పొందిన సురేష్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశాడు. చివరి సన్నివేశాల్లో సరదాగా, మంచి భావోద్వేగాలతో ఉన్న డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.[6]

కథా సారాంశం

[మార్చు]

వేమ‌న (శివ‌ రామ‌చంద్ర‌వ‌ర‌పు), ర‌వి (సూర్య‌శ్రీనివాస్‌), బ‌లి (అనిల్‌) ఒకే గదిలో కలిసివుంటారు. క‌ష్ట‌డితేనే మ‌నిషికి గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్మే వ‌క్తి ర‌వి, ఉద్యోగం చేసుకుంటుంటాడు. వేమ‌న మాత్రం ఏదో ఒక‌టి చేసి ఎదిగిపోవాల‌నుకునే వ్య‌క్తి. బ‌లి ఏ క‌ష్టం లేకుండా కాలం గ‌డిపేస్తుంటాడు. ఈ ముగ్గురు స్నేహిత‌ఉలు జీవితాలు ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌ని సినిమా క‌థ‌.[7]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: త్రివిక్రమ్ గాజులపల్లి
 • నిర్మాత: వీణా వేదిక ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
 • సంగీతం: సిద్ధార్థ్ వాకిన్స్‌
 • నేపథ్య సంగీతం: దేవ్ గురు
 • పాటలు: శ్రీరామ్ సాంజీ
 • ఛాయాగ్రహణం: రాజా భట్టాచార్జీ
 • కూర్పు: సురేష్

పాటలు

[మార్చు]
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఫేస్‌బుక్ వాల్ మీద (రచన: శ్రీరామ్ సాంజీ)"శ్రీరామ్ సాంజీసిద్ధార్థ్ వాకిన్స్‌3:10
2."దోశలు పోసి దేశాన్ని (రచన: శ్రీరామ్ సాంజీ)"శ్రీరామ్ సాంజీహేమచంద్ర3:58
3."కరిగిపోతుందా కలై జీవితం (రచన: శ్రీరామ్ సాంజీ)"శ్రీరామ్ సాంజీసాయి చరణ్, సిద్ధార్థ్ వాకిన్స్‌4.52
మొత్తం నిడివి:11.20

మూలాలు

[మార్చు]
 1. "Low budget Telugu movies". filmytelugu.com. Archived from the original on 19 అక్టోబరు 2017. Retrieved 8 February 2020.
 2. 2.0 2.1 2.2 "Article About Karam Dosa". cinibucket.com. Archived from the original on 19 అక్టోబరు 2017. Retrieved 8 February 2020.
 3. "Article About genre of Karam Dosa". atozupdate.com. Archived from the original on 19 అక్టోబరు 2017. Retrieved 8 February 2020.
 4. "Article About Promotions and Casting Karam Dosa". cinedust.in. Archived from the original on 15 ఫిబ్రవరి 2019. Retrieved 8 February 2020.
 5. "43rd National Film Awards (India)". Directorate of Film Festivals. Archived from the original on 15 December 2013. Retrieved 7 February 2020.
 6. "Review About Karam Dosa". www.123telugu.com. 30 December 2016. Archived from the original on 6 డిసెంబరు 2019. Retrieved 8 February 2020.
 7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (31 December 2016). "కారందోశ". Archived from the original on 8 ఫిబ్రవరి 2020. Retrieved 8 February 2020.

ఇతర లంకెలు

[మార్చు]