Jump to content

ఎన్. సి. కారుణ్య

వికీపీడియా నుండి
(కారుణ్య నుండి దారిమార్పు చెందింది)
కారుణ్య
జననం (1986-03-01) 1986 మార్చి 1 (వయసు: 40)[1]
వృత్తిగాయకుడు

ఎన్. సి. కారుణ్య (ఆంగ్లం:N. C. Karunya)సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. ఇతడు ఇండియన్ అయిడల్ (సీజన్ 2) లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తొలి జీవితం

[మార్చు]

కారుణ్య 1 మార్చి 1986 తేదీన హైదరాబాదు లో ఒక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. నాలుగు సంవత్సరాల వయసునుండే సంగీతంలో శిక్షణ పొందాడు. మామయ్య ఎన్.సి.మూర్తి వద్ద 14 సంవత్సరాలకే కఠోరమైన శిక్షణ పొందాడు. ఇతడు ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. చిన్నతనంలోనే చిరు సరిగమలు పేరుతో ఆల్బమ్ చేసాడు. దీనిని చిరంజీవి ఆవిష్కరించారు. తర్వాత ఈటీవీ లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురి ని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. సోనీ టెలివిజన్ లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ రెండవ సంచికలో పాల్గొని అశేష జనావళికి ప్రీతి పాత్రుడై రెండవ విజేతగా నిలిచాడు.

సినిమా పాటలు

[మార్చు]
సినిమా పాటలు
క్రమ సంఖ్యసంవత్సరంచిత్రంపాటసంగీత దర్శకుడుభాష
12005వంశంపల్లె పల్లెహెచ్. మధుసూదన్తెలుగు
22006లగే రహో మున్నాభాయ్ఆనే చర్ ఆనేశంతను మొయిత్రాహిందీ
32006అశోక్ఏకాంతంగా ఉన్నామణిశర్మతెలుగు
42006సైనికుడుఓరుగల్లుకే పిల్లాహారిస్ జయరాజ్తెలుగు
52007చిరుతఎందుకో పిచ్చి పిచ్చిగామణిశర్మతెలుగు
62008కంత్రి123 నేనొక కంత్రిమణిశర్మతెలుగు
72010మర్యాద రామన్నఅమ్మాయి కిటికీ పక్కనఎం. ఎం. కీరవాణితెలుగు
82010ఖలేజాఓం నమో శివరుద్రాయమణిశర్మతెలుగు
92010ఆరెంజ్ఓల ఓలాలహారిస్ జయరాజ్తెలుగు
102011శక్తియమగా ఉందేమణిశర్మతెలుగు
112011తీన్ మార్వయ్యారాల జాబిల్లిమణిశర్మతెలుగు
122011సీమ టపాకాయ్ధీరే ధీరే ధీరే దిల్లేవందేమాతరం శ్రీనివాస్తెలుగు
13 2014 నా రాకుమారుడు హే గర్ల్ అచ్చు రాజమణి తెలుగు
142015భమ్ బోలేనాథ్వన్స్ అపాన్ ఏ టైమ్సాయి కార్తీక్తెలుగు
152021వెన్నెల వచ్చే పదమనివెన్నెల వచ్చే పదమనిపివిఆర్ రాజాతెలుగు

మూలాలు

[మార్చు]
  1. "ఎన్. సి కారుణ్య". littlemusiciansacademy.com. the original నుండి 11 జూన్ 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 July 2017.