కారేట్ విత్తనాల ఆవశ్యక నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Wild carrot
Daucus carota May 2008-1 edit.jpg
The umbel of a wild carrot
Scientific classification edit
Unrecognized taxon ([//en.wikipedia.org/w/index.php?action=edit&title=Template:taxonomy/Daucus&preload=Template:Taxonomy/preload
fix]):
Daucus
Species:
Binomial name
Template:Taxonomy/DaucusDaucus carota
పుష్పవిన్యాసం
ఎండిన కాయలు/పళ్లు

కారేట్ విత్తనాల ఔషధ గుణాలున్నఆవశ్యక నూనె.కారేట్ నూనెను వైల్డ్ కారేట్/అడవి కారేట్ విత్తనాల నుండి స్టీము డిస్టీలేసను పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. అడవి కారేట్ ను తెలుగులో అడవి గజ్జర అంటారు.అడవి కారేట్ మొక్క ఆపేసి కుటుంబానికి చెందిన మొక్క. అడవి కారేట్ మొక్క యొక్క వృక్ష శాస్త్ర పేరు డౌకస్ కరోట (Daucus carota).కారేట్ విత్తనాల నూనె/కారేట్ నూనె మట్టి వంటి వాసన కల్గి ఉంది. మానసికవత్తిడి (stress) నితగ్గిస్తుంది.చర్మఉపతితల కణాలను మెరుగు మెరుస్తుంది, సొరసిస్, ఎక్క్జిమా, కురుపులు, బొబ్బలు, వంటి వాటిని నివారించును.చర్మ ముడతలు నివారిస్తుంది.

అడవి కారేట్ మొక్క[మార్చు]

అడవి కారేట్ ఏకవార్షిక లేదా బహువార్షిక ముగా పెరిగే పొదవంటి మొక్క.వెంట్రుకల వంటి నూగు ఆకుల ఉపరితలం మీద వుండును.పూలు గుత్తి మీద గొడుగు ఆకారంలో విస్తరించివుండును.పూలు తెల్లగావుండి మష్యాలో పర్పుల్ రంగులో వుండును.అడవి కారేట్ మొక్క ఆపేసి కుటుంబానికి చెందిన మొక్క. అడవి కారేట్ మొక్క యొక్క వృక్ష శాస్త్ర పేరు డౌకస్ కరోట (Daucus carota).కారేట్ అనే పదం గ్రీకు పదం కరోటోస్ ('Carotos) నుండి వచ్చింది.కారేట్ ఎన్నో ఔషధ గుణాలు కల్గివున్నది.అలాగే కారేట్ నూనెలో కరోటిన్, విటమిన్ A ఉండటం వలన ఆరోగ్రకారమైన చర్మానికి, కేశాలకు, చిగుళ్ళకు,, పళ్ళకు ఏంతో ఉపయోగకరం.[1]

మొక్క ఒకామీటరు ఎత్తు వరకు పెరుగును.పూలు విచ్చుకోక ముందు పాలిపోయిన పింకు రంగులో వుండును గొడుగులా విచ్చుకున్నాక లెల్లవా గుండును.సాగు చేసే మాములు కారేట్ లా అడవి కారేట్ కూడా తినవచ్చును.[2]

నూనె సంగ్రహణ[మార్చు]

కారేట్ ఆవిత్తనాల ఆవశ్యక నూనె సాధారణంగా స్టీము డిస్టీలేసను పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.అలాగే మొక్క మొత్తం భాగాలనుండి కూడా ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు.

కారేట్ విత్తనాల ఆవశ్యక నూనె[మార్చు]

కారేట్ విత్తనాల నూనె/కారేట్ నూనె మట్టి వంటి వాసన కల్గి ఉంది.నూనె కొంచం తీపిగా వుండి పొడి మట్టి వాసన వుండును.కారేట్ నూనెను సాధారణంగా ఐరోపా లోని అడవి కారేట్ విత్తనాలనుండి ఉత్పత్తి చేస్తారు.

నూనెలోని రసాయన పదార్థాలు[మార్చు]

కారేట్ విత్తనాల ఆవ్స్యక నూనెలో ఆల్కహాలులు, టేర్పెనులు, అల్డి హైడులు, పైనేనులు అసిటెట్ వంటి చాలా రసాయన సంయోగ పదార్థాలు వున్నప్పటికి, ప్రధానమైనవి ఆల్ఫా-పైనేన్, కాంపెన్, బీటా-పైనేన్, సబినెన్, మైర్సేన్, y-టెర్పినెన్, లిమోనెన్, బీటా-బిసబోలెన్, జెరానైల్ అసిటెట్, కరోటోల్.[1].నూనెలో ఇంకా కారోటోల్, ఆల్ఫా పైనేన్, డౌక-4,8- డైయెన్, బీటా కారియో పిల్లేన్, (E) - Dauc-8-en-4B-ol లు ఉన్నాయి.[3] పోర్చుగల్ లోని కారేట్ నూనెలో జెరానైల్ అసితేట్ 29.0%, ఆల్ఫా-పైనేన్ 27.2 $ వున్నట్లు గుర్తించారు.[4] విత్తనాలలో ఆవశ్యక నూనె 1.0-1.6% వరకు వుండును.[5] కారేట్ విత్తనాలలో ఆవశ్యక నూనెతో పాటు కొవ్వు ఆమాలు కూడా ఉన్నాయి.కొవ్వు ఆమ్లాలు దాదాపు6-7% వరకు ఉన్నాయి.కానీ కారేట్ గింజలనుండి కొవ్వూఆమ్లాలను ప్రయోగ రీత్యామినహా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసిన డాఖాలాలు లేవు.

నూనె భౌతిక గుణాలు[మార్చు]

నూనె భౌతిక గుణాల పట్టిక[6]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 విశిష్ట గురుత్వం, 25.°Cవద్ద 0.90000 - 0.94300
2 వక్రీభవన సూచిక, 20.°Cవద్ద 1.48900 - 1.49200
3 దృశ్యభ్రమణం -4.00 నుండి -30.00
4 ఫ్లాష్ పాయింట్ 48.33 °C
5 ద్రావణీయత నీటిలో కరుగదు, ఆల్కహాల్,, పారఫిన్ ఆయిల్స్ లో కరుగును.

కారేT విత్తనాలలోని కొవ్వు ఆమ్లాలు[మార్చు]

కారేత్ విత్తనాలలోని కొవ్వు ఆమ్లాలు వాటి సాతంమ్[7]

వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 పామిటిక్ ఆమ్లం 10.01*±0.13
2 పామిటోలిక్ ఆమ్లం 0.64±0.02
3 స్టియరిక్ ఆమ్లం 2.41±0.06
4 ఒలిక్ ఆమ్లం 0.17±0.01
5 లినోలిక్ ఆమ్లం 11.82±1.17
6 పెట్రోసిలినిక్ ఆమ్లం 59.35±3.81
7 వసేనిక్ ఆమ్లం 0.55±0.01
8 అరచిడిక్ ఆమ్లం 0.81±0.03
9 గుర్తింప బదానీ ఆమ్లాలు 14.26

నూనె ఉపయోగాలు[మార్చు]

  • అడవి కారేట్ నూనె కాలేయం లోని విష పదార్థాలను తొలగించి, కామర్ల వ్యాధిని నిరోధించును.అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచును.[1]
  • కీళ్ల నొప్పులకు, కీళ్లవాత నొప్పులనివారణలో కూడా పనిచేయును. ముక్కులోని, గొంతులోని, ఊపిరి తిత్తులల్లోని కండరాల పొరలను బలపరచును.[1]

బయటి వీడియో లింకులు[మార్చు]

ఇవికుడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Carrot seed essential oil information". essentialoils.co.za. https://web.archive.org/web/20180403000615/https://essentialoils.co.za/essential-oils/carrot-seed.htm. Retrieved 24-10-2018. 
  2. "Wild Carrot". flowersofindia.net. https://web.archive.org/web/20180308154618/http://www.flowersofindia.net/catalog/slides/Wild%20Carrot.html. Retrieved 24-10-2018. 
  3. "Carrot Seed Essential Oil". aromaweb.com. https://web.archive.org/web/20180226165143/https://www.aromaweb.com/essential-oils/carrot-seed-oil.asp. Retrieved 24-10-2018. 
  4. "New Claims for Wild Carrot (Daucus carota subsp. carota) Essential Oil". https://web.archive.org/web/20180602011635/https://www.hindawi.com/journals/ecam/2016/9045196/. Retrieved 24-10-2018. 
  5. "Composition of the Essential Oil from Daucus carota ssp. carota Growing Wild in Vienna". .researchgate.net. https://web.archive.org/web/20181024081748/https://www.researchgate.net/publication/261665179_Composition_of_the_Essential_Oil_from_Daucus_carota_ssp_carota_Growing_Wild_in_Vienna. Retrieved 24-10-2018. 
  6. "daucus carota fruit oil". thegoodscentscompany.com. https://web.archive.org/web/20180315112010/http://www.thegoodscentscompany.com/data/es1024732.html. Retrieved 24-10-2018. 
  7. "Chemical composition of carrot seeds (Daucus carota L.) cultivated in Turkey:characterization of the seed oil and essential oil". jonnsaromatherapy.com. https://web.archive.org/web/20170809033715/http://jonnsaromatherapy.com/pdf/GC-MS_Daucus_carota_2007_01.pdf. Retrieved 24-10-2018.