కార్టూనిస్ట్ అరుణ్
| కార్టూనిస్ట్ అరుణ్ | |
|---|---|
| జననం | 1960 నవంబర్ 26 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
| నివాస ప్రాంతం | విజయవాడ |
| ఇతర పేర్లు | యస్.వి.రమణారావు |
| వృత్తి | కార్టూనిస్ట్ |
| భార్య / భర్త | వనజ |
| పిల్లలు | ఒక అబ్బాయి, ఒక అమ్మాయి |
అరుణ్ కలం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తి పేరు సుంకర వెంకట రమణారావు.
జీవిత విశేషాలు
[మార్చు]కృష్ణా జిల్లా, విజయవాడలో 26 నవంబర్ 1960 లో పుట్టిన అరుణ్, ఆరో తరగతి నుంచే సైన్స్ పుస్తకాల్లోని బొమ్మలుగీయడం ప్రారంభించిన ఈయనకు పదో తరగతిలోకి వచ్చే సరికి బొమ్మలు గీయడంలో ఓ అవగాహన వచ్చింది. తన సొంత శైలితో బొమ్మలు గీయడానికి ఈ వ్యంగ్య (కార్టూన్) చిత్రకళని ప్రారంభించాడు. కేంద్రప్రభుత్వ భీమా సంస్థలో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు.
కార్టూనిస్టుగా
[మార్చు]కార్టూన్లు గీయాలని అలోచన బాగుంది కానీ... ఎలా వేయాలి? ఎలా పంపాలి? ఈ విషయాలేం తెలీదు. కార్టూనిస్టు మిత్రులు శేఖర్, సుకేష్, వేణు గార్ల పరిచయంతో కార్టూన్లు గీయడం, పత్రికలకు పంపడం, పోటీల్లో పాల్గొనడం ఇలాంటి విషయాలు తెలుసుకోగలిగాడు. అప్పట్లో వీరందరూ జయదేవ్ గారి శిష్యరికం (పోస్ట్లో) చేశారు. అప్పటికే జయదేవ్ గారు పేరొందిన కార్టూనిస్టు. కార్టూన్లలో మెళుకువల కోసం ఉత్తరాలు వ్రాసి తెలుసుకునేవారు. 1976 లో వీరి మొదటి కార్టూన్ అనామిక అనే మాసపత్రికలో అచ్చయింది. అప్పట్లో తెలుగులో చిన్న పెద్ద కలిపి సుమారు ఓ ఏభై పత్రికలు వుండేవి. దాదాపు అన్ని పత్రికల్లోనూ విరివిగా కార్టూన్లు ప్రచురించేవారు. అలాగే వీరి కార్టూన్లు కూడా విరామం లేకుండా అన్ని పత్రికల్లోనూ వచ్చేవి.
తెలుగులో వందల కార్టూన్లు వేశాక, ఇతర భాషల వారికి, ఇతర రాష్ట్రాల వారికి తన కార్టూన్లని పరిచయం చేయవచ్చునన్న అలోచనతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ,ఇంగ్లీషు, మళయాళం పత్రికలు కూడా కార్టూన్లు గీశారు. అప్పట్లో అమెరికా నుంచి వెలువడే ఓ ప్రముఖ తెలుగు పత్రిక "తెలుగు అమెరికా"లో కూడా ఈయన కార్టూన్లు చాలా అచ్చయినాయి.
నవోదయ రామమోహనరావు, ఎమ్వీఎల్ గార్ల ప్రోత్సహంతో విజయవాడ నగరంలో కార్టూనిస్టుమిత్రులందరూ కలిసి 'విజయవాడ కారూనిస్టుల సంఘం' (వికాసం) 1980 ప్రాంతంలో ప్రారంభించారు. వికాసం తరుపున ప్రతి సంవత్సరం కార్టూన్ల పోటీలు నిర్వహించేవారు.
బహుమతులు-అవార్డులు
[మార్చు]- 'తానా' కార్టూన్ల పోటీలో బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్ 2023[1]
- విజయవాడ రోటరీ క్లబ్ కార్టూన్ల పోటీలో
- విశాఖపట్నం రోటరీ క్లబ్ కార్టూన్ల పోటీలో బహుమతి
- హైదరాబాద్, వెంకట్ అవార్డు బహుమతి
- ఆంధ్రప్రదేశ్ కుటుంబ నియంత్రణాసాధికార సంస్థ అవార్డు
- ఆంధ్రప్రదేశ్ క్రోక్విల్ అకాడమీ కార్టూన్ల పోటీలో ఉత్తమ కార్టూన్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-01-16). "TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే." Andhrajyothy Telugu News. Retrieved 2026-01-24.
ఇతర లింకులు
[మార్చు]- ↑ కళాసాగర్. కొంటె బొమ్మల బ్రహ్మలు. విజయవాడ: 64 కళలు. p. 128.