కార్టోశాట్-2 ఉపగ్రహం

వికీపీడియా నుండి
(కార్టోశాట్-2 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Cartosat-2
మిషన్ రకం5 years Earth observation
ఆపరేటర్ISRO
COSPAR ID2007-001B Edit this at Wikidata
SATCAT no.29710Edit this on Wikidata
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి680 kilograms (1,500 lb)
శక్తి900 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ10 January 2007, 03:45 (2007-01-10UTC03:45Z) UTC
రాకెట్PSLV C7[1]
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP[2]
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Sun-synchronous
Perigee altitude630 kilometres (390 mi)
Apogee altitude630 kilometres (390 mi)
వాలు97.91 degrees
వ్యవధి~90 minutes
పునరావృత వ్యవధి4 days
Main camera
తరంగ దైర్ఘ్యములు0.5 μm - 0.85 μm
రిజల్యూషన్Less than 1 metre
 

కార్టోశాట్-2 ఉపగ్రహాన్ని భారతదేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO తయారు చేసి అంతరిక్షంలో ప్రవేశపెట్టినది. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో సూర్య సమకాలిక కక్ష్య (sun synchronous orbit) లో ప్రదక్షిణలుచేయు లాగున ప్రయోగించారు. ఈ ఉపగ్రహం భూఉపరితల పరిస్థితులను విశ్లేషణ చేసి సమాచారాన్ని తిరిగి భూ నియంత్రణ కేంద్రానికి చేరవేసెటందుకు నిర్మించారు. కార్టోశాట్ శ్రేణి ఉపగ్రహ వరుసలో తయారు చేసిన రెండవ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహన్ని ముఖ్యంగా భారతదేశ భూభాగం యొక్క పటాలను (cartography) చిత్రీకరించుటకై ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని జనవరి 12,2018 లో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట లోని సతీష్ థవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి, పిఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక శ్రేణికి చెందిన PSLV-C7 అను ఉపగ్రహ వాహక నౌక సహాయముతో ఇస్రో వారి ఆధ్వర్యంలో విజయవంతంగా ప్రయోగించారు.

ఉపగ్రహ సమాచారం[మార్చు]

ఈ ఉపగ్రహం యొక్క పనిచేయు జీవితకాలం 5 సంవత్సరాలు. ప్రయోగ సమయంలో ఉపగ్రహం యొక్క బరువు 680 కిలోలు. ఉపగ్రహాన్నిఅంతరిక్షములో ధ్రువ సూర్యసమస్థితి కక్ష్యలో (polar sun synchronous orbit) ప్రవేశపెట్టారు. ఉపగ్రహం యొక్క అన్‌బోర్డ్ పవర్ 900 Watts. ఉపగ్రహం యొక్క కక్ష్య యొక్క పెరిజీ,, అపోజీ 630 కిలోమీటర్లు. కార్టో శాట్ -2 ఉపగ్రహంలో పాన్ క్రోమాటిక్ కెమారాను అమర్చారు. ఈ పాన్‌క్రోమాటిక్ కెమెరా విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క కనిపించే ప్రాంతంలో భూమి యొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రీకరించగలదు. హై రిజల్యూషన్ కలిగిన ఈ కెమెరాతో కవరు చెయ్యబడు స్వాత్ (swath)9.6 కి.మీ.అంతరిక్ష రిజల్యూషన్ ఒక మీటరుకన్న తక్కువ. ఈ ఉపగ్రహాన్ని 45 డిగ్రీల కోణంలో త్రిప్పవచ్చును. కార్టో శాట్-2 ఉపగ్రహం అదునాతమైన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని భూమియొక్క వివరణాత్మక పటరచన/నిర్మాణానికి సంబంధించిన సమాచార సేకరణకు, పటరచన (mapping) కు ఉపయోగించారు.

మొట్టమొదటి చిత్రాన్ని 2007 జనవరి 12 ఉపగ్రహంనుండి అందుకున్నారు. ఈ పట చిత్రం శివాలిక్ ప్రాంతంలోని పానోటసాహిబ్ నుండి డిల్లీవరకు 24౦కి.మీ పొడవును కవరు చేస్తూ చిత్రించింది. మరొక సెట్ పట చిత్రాలను గోవా లోని రాధానగరి నుండి సాగోన్ వరకు 50 కి.మీ దూరాన్ని చిత్రించి పంపినది. ఈ చిత్రాలను హైదరాబాదు (ప్రస్తుతం తెలంగాణ) లోని షాద్‌నగర్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి వారు అందుకొని, విశ్లేషించి, మంచి క్వాలిటి ఉన్నపట చిత్రాలుగా అభివర్ణించారు. కార్టోశాట్-2 ఉపగ్రహం 100 సెం.మీ. రిజల్యూషన్ కలిగిన నలుపు తెలుపు పటచిత్రాలను తీయు సామర్ధ్యం కలిగి ఉన్నది.[3]

కార్టోశాట్-2 ఉపగ్రహం యొక్క సాంకేతిక సమాచార పట్టిక[4]

ప్రయోగ ఉద్దేశం రిమోట్ సెన్సింగ్
బరువు 650 కిలోలు
పవర్ 900 Watts
స్థిరీకరణ 3 - axis body stabilised using high torque reaction wheels,
magnetic torquers and thrusters
పేలోడ్ Panchromatic కెమెరా
ప్రయోగ తేది 2007 జనవరి 10
ప్రయోగ వేదిక షార్ కేంద్రం, శ్రీహరికోట
ఉపగ్రహ వాహకం PSLV-C7
కక్ష్య ధ్రువ సూర్యసమస్థితి కక్ష్య
Polar Sun Synchronous
ఉపగ్రహం (పని చెయవలసిన) జీవితకాలం 5సంవత్సరాలు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "PSLV C7". Archived from the original on 2009-07-10. Retrieved 2015-09-03.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-04-03. Retrieved 2015-09-03.
  3. "Cartosat-2:Optical Satellite". pasco.co.jp. Archived from the original on 2013-02-11. Retrieved 2013-02-26.
  4. "CARTOSAT-2". isro.gov.in. Archived from the original on 2017-07-30. Retrieved 2015-09-03.