కార్తవరాయని కథ
స్వరూపం
| కార్తవరాయని కథ (1958 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | టి. ఆర్. రామన్న |
|---|---|
| కథ | మద్దిపట్ల సూరి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, పి.కన్నాంబ |
| సంగీతం | అశ్వత్థామ |
| గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లాది రామకృష్ణశాస్త్రి |
| సంభాషణలు | మద్దిపట్ల సూరి |
| నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్.పిక్చర్స్ |
| భాష | తెలుగు |
కార్తవరాయని కథ ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై నిర్మించబడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1958, అక్టోబర్ 18న విడుదలయ్యింది.నందమూరి తారక రామారావు, సావిత్రి, పసుపులేటి కన్నాంబ మున్నగు వారు నటించిన పౌరాణిక, జానపద చిత్రం. ఈ చిత్రానికి టి. ఆర్. రామన్న దర్శకుడు . సంగీతం గుడిమెట్ల అశ్వద్ధామ సమకూర్చారు .
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు_కార్తవరాయ
- సావిత్రి_ఆర్యమాల
- పి.కన్నాంబ_పార్వతీదేవి/కామాక్షి
- రాజనాల_ట్రైబల్ రాజు
- పద్మనాభం_చీఫ్ కమాండర్
- రమణారెడ్డి_చిన్నప్ప
- ముక్కామల_ఆర్యరాజు
- బాలకృష్ణ
- గిరిజ
- కె.వి ఎస్.శర్మ
- సురభి బాలసరస్వతి_ఆరవల్లి
- ఇ.వి.సరోజ_మోహిని .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు; టి.ఆర్.రామన్న
- కధ: మద్దిపట్ల సూరి
- సంగీతం: అశ్వద్ధామ - జి.రామనాథన్
- గీత రచయితలు:మల్లాది రామకృష్ణశాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మాటలు: మద్ధిపట్ల సూరి
- నేపథ్య గానం: పి.బి.శ్రీనివాస్,ఘంటసాల , ఎస్ జానకి, ఎ.జి.రత్నమాల, పి.లీల, ఎ.పి.కోమల, పిఠాపురం, కె.రాణి,మాధవపెద్ది , సత్యవతి, ఎం.ఎస్.రామారావు
- కెమెరా : టి. కె. రాజా బాదర్
- కళ: గంగ
- సంయుక్త దర్శకుడు: ఐ.ఎన్.మూర్తి
- నిర్మాణ సంస్థ: ఆర్.ఆర్.పిక్చర్స్
- విడుదల:18:10:1958.
పాటలు
[మార్చు]వెల్వెట్ వాయిస్ గా ప్రసిద్ధిగాంచిన గాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ (పి.బి.శ్రీనివాస్) ఆలపించిన 'ఆనంద మోహనా ఖగరాజ వాహనా' అనే పాట ఈ సినిమాలోనిదే. ఈ పాట రచన మల్లాది రామకృష్ణశాస్త్రి. ఈ పాటలో వచ్చే 'దైవరాయ', 'పాపపానుపు' వంటి పదాలు మల్లాది శైలిని తెలుపుతాయని ఒక సందర్భంలో 'పాడుతా తీయగా' అనే ఈ-టీవీ వారి కార్యక్రమంలో పి.బి.శ్రీనివాస్ అన్నారు.
- ఆనంద మోహనా ఖగరాజ వాహనా - రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి; గానం : పి.బి.శ్రీనివాస్
- కలువ రేకులలోన - కలలు మూగేనే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి . ఘంటసాల.
- గాజులమ్మా గాజులు కన్నియ చేతుల మోజులు - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : ఎస్.జానకి
- పూసే మల్లిరెమ్మ కాసే మావికొమ్మ ఏ పూల తేనె తెచ్చి పూజ చేసిరమ్మ - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం:ఎ. జి. రత్నమాల
- మూగే చీకటి ముసుగులో దాగే బంగారు తారా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నా మనసేమోనే సఖియా నను విడిపోయేనే - గానం : పి.లీల
- శంగిలి గింగిలి జిలిబిలి గలిబిలి . ఘంటసాల . రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.
- ఒకసారి దిగిరావా (పద్యం). ఘంటసాల రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.
- ఓ ఒకసారి చూడవా...నీపైన మనసoటినే నా ప్రేయసి - పి.బి.శ్రీనివాస్
- కావాలి కావాలి దేవీ దర్శనం కావాలి- పి.బి.శ్రీనివాస్
- తేనేసొనల లోకము గులాబి - ఎ.పి.కోమల, పిఠాపురం, పి.లీల , ఘంటసాల
- కొండమీద చందమామ కోరితే కొక్కిరాయి కాలు విరిగెను- కె.రాణి బృందం
- ప్రభో శూలపాణీ విభో విశ్వనాధా మహాదేవ - మాధవపెద్ది, సత్యవతి బృందం
- మిగిలింది మరొక్క ఒక్క క్షణం ఒక్క క్షణం- ఎం.ఎస్.రామారావు బృందం
- మీసాల రోసయ్యో రోసాల ముసలయ్యా - మాధవపెద్ది, రత్నమాల బృందం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.