కార్పొరేట్ పాలన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక సంస్థ (లేదా కంపెనీ) నిర్వహణ, పరిపాలన లేదా నియంత్రణ మార్గాన్ని ప్రభావితం చేసే ప్రక్రియలు, పన్నులు, విధానాలు, చట్టాలు మరియు సంస్థల సమూహమే కార్పొరేట్ పాలన . కార్పొరేట్ పాలనలో పలువురు వాటాదారుల మధ్య సంబంధాలు మరియు సంస్థ పాలనకు ఉద్దేశించిన లక్ష్యాలు కూడా ఉంటాయి. వాటాదారులు/సభ్యులు, యాజమాన్యం మరియు బోర్డు డైరెక్టర్లు ప్రధాన వాటాదారులు. కార్మికులు (ఉద్యోగులు), వినియోగదారులు, రుణదాతలు (ఉదాహరణకు బ్యాంకులు, పెట్టుబడిదారులు), పంపిణీదారులు, నియంత్రణ సంస్థలు మరియు ప్రజలు ఇతర వాటాదారులుగా ఉంటారు. లాభాపేక్ష లేని సంస్థలు లేదా ఇతర సభ్యత్వ సంస్థలకు సంబంధించి "వాటాదారులు" అంటే దిగువ ఇవ్వబడిన పాఠంలో (వర్తిస్తే) "సభ్యులు" అని అని అర్థం.

కార్పొరేట్ పాలన అనేది బహుముఖ అంశం.[1] ప్రధాన ఏజెంట్ సమస్యను తగ్గించడం లేదా తొలగించడానికి ప్రయత్నించే యంత్రాంగాల ద్వారా ఒక సంస్థలోని వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేయడమే కార్పొరేట్ పాలన యొక్క ప్రధాన ఉద్దేశం. వాటాదారుల సంక్షేమం పట్ల దృఢచిత్తంతో ఆర్థిక సమర్థతపై కార్పొరేట్ పాలనా వ్యవస్థ యొక్క ప్రభావంపై ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. వాటాదారుని అభిప్రాయం మరియు ప్రపంచం మొత్తం మీద ఉన్న కార్పొరేట్ పాలనా నమూనాలు వంటి ఇంకా పలు కార్పొరేట్ పాలన అంశాలున్నాయి (దిగువ ఇచ్చిన సెక్షన్ 9ని చూడండి).

ప్రత్యేకించి ఎన్‌రాన్ కార్పొరేషన్ మరియు MCI Inc. (గతంలో వరల్డ్‌కామ్‌) వంటి పలు అతిపెద్ద U.S. సంస్థలు పతనమైన నేపథ్యంలో 2001 నుంచి ఆధునిక సంస్థల కార్పొరేట్ పాలనా విధానాలపై ఆసక్తి మళ్లీ మొదలైంది. కార్పొరేట్ పాలనపై ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని నింపే విధంగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 2002లో సర్బేన్స్-ఆక్సిలే చట్టమును ఆమోదించింది.

విషయ సూచిక

నిర్వచనం[మార్చు]

'కార్పొరేట్ పాలన అంటే, ఉత్తమ వ్యాపారం, ప్రమాణాత్మకత్వం, బాధ్యత మరియు సమగ్రతతో యాజమాన్య కార్యకలాపాలను నిర్దేశించించడం మరియు నియంత్రించడం ద్వారా వాటాదారులు మరియు ఇతర మధ్యవర్తుల అవసరాలను తీర్చే విధానాలు, ప్రక్రియలు మరియు ప్రజలు కలిగి ఉన్న ఒక అంతర్గత వ్యవస్థ' అని వాణిజ్య రచయిత గాబ్రియెల్లే ఒ'డొనోవన్ ఎ బోర్డు కల్చర్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్‌ లో పేర్కొన్నాడు. ప్రభావవంత కార్పొరేట్ పాలన అనేది బాహ్య విఫణి నిబద్ధత, శాసనం మరియు విధానాలు, కార్యకలాపాలను సంరక్షించే ఒక ఆరోగ్యవంతమైన బోర్డు సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది.

ఒక కంపెనీ కార్పొరేట్ పాలన యొక్క సంగ్రహిత నాణ్యత అనేది దాని వాటా ధర మరియు పెరుగుతున్న మూలధన వ్యయాన్ని ప్రభావితం చేయగలదని ఒ'డొనోవన్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక విఫణులు, శాసనం మరియు ఇతర బాహ్య విఫణి శక్తులతో పాటు విధానాలు మరియు ప్రక్రియలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలు ఎలా నడపబడుతున్నారనేవి కూడా నాణ్యతను నిర్ణయిస్తాయి. బాహ్య శక్తులనేవి ఏదైనా బోర్డు నియంత్రణా పరిధికి వెలుపల విస్తృతంగా వ్యాపించి ఉంటాయి. అంతర్గత వాతావరణం అనేది పూర్తిగా భిన్నమైనది. సంస్థలు తమ బోర్డు సంప్రదాయం ద్వారా పోటీదారుల నుంచి భిన్నంగా కనిపించే అవకాశాన్ని కల్పిస్తుంది. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి మరియు పారదర్శక విధానం కోసం ఇప్పటివరకు కార్పొరేట్ పాలనా చర్చ ఎక్కువగా శాసన విధానంపైనే దృష్టి సారించింది.[2]

వాటాదారులు, రుణదాతలు, ఉద్యోగులు, వినియోగదారులు మరియు పంపిణీదారులను సంతృప్తిపరిచే విధంగా దీర్ఘకాల వ్యూహాత్మక లక్ష్యాలను సాధన దిశగా ఒక కంపెనీని నిర్మించడం, నిర్వహించడం మరియు నియంత్రించే వ్యవస్థ ఇది. అలాగే పర్యావరణ సంబంధిత మరియు స్థానిక ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు చట్టపరమైన మరియు నియంత్రణా అవసరాలను కూడా ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.

సంస్థ యొక్క నిజమైన యజమానులుగా వాటాదారుల శాశ్వత హక్కులను మరియు వాటాదారుల తరపున ధర్మకర్తలుగా వారి పాత్రను యాజమాన్యం అంగీకరించడమే కార్పొరేట్ పాలన అని కార్పొరేట్ పాలనను SEBI కమిటీ (ఇండియా) నివేదిక నిర్వచించింది. అంటే విలువలకు కట్టుబడటం, నైతిక వ్యాపార నిర్వహణ మరియు కంపెనీ యాజమాన్యంలో వ్యక్తిగత & కార్పొరేట్ నిధులకు మధ్య వ్యత్యాసాన్ని తెలపడం గురించి. ధర్మకర్తృత్వ గాంధేయవాద సిద్ధాంతం మరియు భారత రాజ్యాంగ మార్గనిర్దేశిక సూత్రాల నుంచి ఈ నిర్వచనం తీసుకోబడింది. కార్పొరేట్ పాలన అనేది నైతిక విలువలు మరియు నైతిక బాధ్యతగా చూడబడుతుంది.

చరిత్ర[మార్చు]

కార్పొరేట్ పాలనను మరింత సమర్థవంతంగా మలిచే దిశగా 19వ శతాబ్దంలో హక్కుల మదింపు వంటి చట్టపరమైన ప్రయోజనాలకు బదులు వాటాదారుల ఏకగ్రీవ ఆమోదం లేకుండా పాలించేలా కార్పొరేట్ బోర్డుల హక్కులను ప్రభుత్వ కార్పొరేషన్ చట్టాలు మరింత విస్తరించాయి. అప్పటి నుంచి అమెరికాలోని పలు ప్రత్యక్ష వ్యాపార నిర్వహణ సంస్ధలను కార్పొరేట్ పాలనకు అనువుగా ఉండే డెలావేర్ చట్టం కింద సంస్థీకరించారు. అమెరికా సంపద పలు కార్పొరేట్ విభాగాలు మరియు సంస్థల్లో భద్రపరచడం ఎక్కవవడంతో వ్యక్తిగత యజమానుల, వాటాదారుల హక్కులు వ్యుత్పన్నం మరియు విచ్ఛిన్నమైన కారణంగా కంపెనీలను సంస్థీకరించారు. పరిపాలన చెల్లింపు మరియు వాటా నష్టాలపై వాటాదారుల ఆందోళనలు క్రమంగా పెరగడం వల్ల కార్పొరేట్ పాలన సంస్కరణలను కోరుతూ విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి.

20వ శతాబ్దంలో వాల్ స్ట్రీట్ పతనం 1929 తదనంతర తక్షణ పర్యవసానంగా అడాల్ఫ్ అగస్టస్ బెర్లీ, ఎడ్విన్ డాడ్, గార్డినర్ C. మీన్స్ వంటి న్యాయ నిపుణులు సమాజంలో మారుతున్న ఆధునిక కార్పొరేషన్ పాత్రపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బెర్లీ మరియు మీన్స్ రాసిన ఏకవిషయక రచన'ది మోడరన్ కార్పొరేషన్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ (1932 మెక్‌మిలన్)'నేటి మేథో చర్చల్లో కార్పొరేట్ పాలన భావనపై విపరీతమైన ప్రభావం చూపుతూనే ఉంది.

చికాగో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన రొనాల్డ్ కోయసీ రాసిన "ది నేచర్ ఆఫ్ ది ఫర్మ్" (1937) సంస్థలు ఎందుకు స్థాపించబడుతున్నాయి మరియు అవి ఎలా ముందుకు సాగుతున్నాయనే వాటిని అవగతం చేసుకోవడంలో బదిలీ వ్యయాల భావనను ఆవిష్కరించింది. యాభై ఏళ్ల తర్వాత యుగెనీ ఫమా మరియు మైఖేల్ జెన్సెన్ రాసిన "ది సెపరేషన్ ఆఫ్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్" (1938, జర్నల్ ఆఫ్ లా అండ్ ఎకనామిక్స్) కార్పొరేట్ పాలనను అర్థం చేసుకోవడానికి ఒక ఏజెన్సీ సిద్ధాంతమును ఆవిష్కరించింది. సంస్థ అనేది వరుస ఒప్పందాలుగా భావించబడుతుంది. ఏజెన్సీ సిద్ధాంతం యొక్క ప్రాబల్యాన్ని 1989లో కత్లీన్ ఐసెన్‌హార్డ్ రాసిన ("ఏజెన్సీ థియరీ : ఎన్ అసెస్‌మెంట్ అండ్ రివ్యూ", అకడెమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ రివ్యూ) కథనం మరింతగా వివరించింది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బహుళజాతి సంస్థల ఆవిర్భావం వల్ల అమెరికా విస్తరణ సంస్థాగత పరిపాలనా సంబంధిత తరగతిని స్థాపించింది. దీని ప్రకారం, వాటి ప్రాముఖ్యతను అధ్యయనం చేసి, ప్రభావంతమైన ఏకవిషయక రచనలును క్రింది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్లు ప్రచురించారు: మైల్స్ మేస్ (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), ఆల్ఫ్రెడ్ D.చంద్లెర్, Jr. (బిజినెస్ హిస్టరీ), జయ్ లార్చ్ (ఆర్గనైజేషనల్ బిహేవియర్) మరియు ఎలిజబెత్ మాక్లెవర్ (ఆర్గనైజేషనల్ బిహేవియర్). లార్చ్ మరియు మాక్లెవర్ ప్రకారం, "పలు పెద్ద సంస్థలు తమ బోర్డు డైరెక్టర్లు తగినంత బాధ్యత లేదా పర్యవేక్షణ చూపకపోయినా వ్యాపార కార్యకలాపాలపై ప్రభావవంతమైన పట్టు కలిగి ఉంటాయి".

1970 ఆఖర్లో కార్పొరేట్ పాలన అంశం అమెరికా మరియు ప్రపంచమంతటా విశిష్టమైన చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి, వాటాయజమానుల అవసరాలు మరియు కోరికల దృష్ట్యా వారి కార్పొరేట్ యాజమాన్య హక్కుల సాధన మరియు వారి వాటాల విలువను తద్వారా సంపదను పెంచే దిశగా కార్పొరేట్ పాలన సంస్కరణకు సాహసోపేత మరియు విస్తృత చర్యలు తీసుకున్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా సంస్థ మరియు దాని వాటాయజమానుల పట్ల కార్పొరేట్ డైరెక్టర్ల సంప్రదాయ చట్టపరమైన కర్తవ్య బాధ్యతలే కాకుండా వారి విధులను మరింతగా విస్తరించారు.[3]

1990 ప్రథమార్థంలో తమ బోర్డుల చేత CEO (ఉదాహరణకు IBM, కొడాక్, హనీవెల్)ల తొలగింపుల కారణంగా అమెరికాలో తలెత్తిన కార్పొరేట్ పాలన వివాదం పత్రికల దృష్టిని తనవైపు సారించేలా చేసింది. CEO మరియు బోర్డు డైరెక్టర్ల మధ్య ప్రస్తుత సంప్రదాయ సంబంధాల వల్ల (ఉదాహరణకు అసాధారణ వెనుకటి తేదీలతో అనియంత్రిత వాటాల కేటాయింపు చేత) కార్పొరేట్ విలువ నాశనం కాకుండా చూడాలని కాలిఫోర్నియా ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వ్యవస్థ (CalPERS) సంస్థాగత వాటాదారు ఆచరణతత్వాన్ని (మునుపటిలో చాలా అరుదుగా కనిపించిన) ఆవిష్కరించింది.

1997లో తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఆస్తిపాస్తులు నష్టపోయిన తర్వాత విదేశీ మూలధన ఉపసంహరణ వల్ల థాయ్‌లాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దేశాల్లోని కార్పొరేట్ పాలనా యంత్రాగాల కొరత వల్ల అక్కడ సంస్థల ఆర్థిక బలహీనతలను బహిర్గతమయ్యాయి.

2000 మొదట్లో ఎన్‌రాన్, వరల్డ్‌కామ్ కంపెనీల భారీ దివాళాలు (మరియు నేర దుష్కృత్యం) మరియు అడెల్ఫియా కమ్యూనికేషన్స్, AOL, ఆర్థర్ అండర్సన్, గ్లోబల్ క్రాసింగ్, టైకో వంటి కంపెనీల కార్పొరేట్ ఓటములు తక్కువకావడం వల్ల కార్పొరేట్ పాలనపై వాటాదారుల మరియు ప్రభుత్వ ఆసక్తి పెరిగింది. సర్బేన్స్-ఆక్సిలే చట్టం 2002లోని ఒక భాగంలో ఇది చూపబడింది. [3]

కార్పొరేట్ పాలన ప్రభావం[మార్చు]

వివిధ మధ్యవర్తులపై కార్పొరేట్ పాలన సానుకూల ప్రభావం ఎట్టకేలకు ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. తద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉత్తమ కార్పొరేట్ పాలన అనేది ఒక ఆయుధంలా పనిచేస్తుంది.[4]

సంస్థాగత పెట్టుబడిదారుల పాత్ర[మార్చు]

చాలా ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంస్థ వాటాల క్రయవిక్రయదారులు సంపన్న వ్యాపారవేత్తలు లేదా కుటుంబాలు వంటి వ్యక్తిగత పెట్టుబడిదారులు. వారు వాటాలను కలిగి ఉన్న సంస్థలపై వీరికి తరచూ వ్యక్తిగత, స్వార్థ మరియు ఆవేశపూరిత ఆసక్తి ఉంటుంది. కాలక్రమంలో విఫణులు భారీగా వ్యవస్థీకరించబడ్డాయి : క్రయవిక్రయదారులు ఎక్కువగా (ఉదాహరణకు పింఛను జారీ ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, అదృఢ పెట్టుబడి కంపెనీలు, స్టాక్ ఎక్స్ఛేంజిలోని మ్యూచువల్ ఫండ్స్, భీమా సంస్థలు, బ్యాంకులు, మధ్యవర్తిత్వ సంస్థలు వంటి ఇతర పెట్టుబడి సమూహాలు మరియు ఇతర ఆర్థిక సంస్థలు) సంస్థలుగా మారాయి.

సంస్థాగత పెట్టుబడిదారులు పెరగడం దానితో పాటు స్టాక్ మార్కెట్ యొక్క నియంత్రణను మరింత పెంచడానికి వృత్తిపరమైన జాగ్రత్త కూడా పెరిగింది (అయితే చిన్న పెట్టుబడిదారుల లేదా అధికంగా ఉండే అనుభవలేమి సంస్థల ప్రయోజనాన్ని గుర్తించి కాదు). మార్కెట్‌లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తిగత పెట్టుబడిదారుల ప్రత్యక్ష అభివృద్ధితో పాటే ఈ ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుందని గమనించాలి (ఉదాహరణకు వ్యక్తిగత పెట్టుబడిదారులకు తమ బ్యాంకు ఖాతాల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు రెండింతలవుతుంది). అయితే ఈ అభివృద్ధి ప్రాథమికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో మాదిరిగా వ్యక్తిగత పెట్టుబడిదారులు తమ నిధుల నిర్వహణను వృత్తి నిపుణులకు అప్పగించడం ద్వారా జరుగుతుంది. ఈ క్రమంలో, నిధుల్లో అగ్ర భాగం వ్యక్తిగత పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే అయినప్పటికీ, మెజారిటీ పెట్టుబడిని "సంస్థాగత పెట్టుబడి"గా ప్రస్తుతం పిలుస్తున్నారు.

సంస్థాగత వ్యాపారానికి ప్రధాన లక్షణమైన ప్రోగ్రామ్ ట్రేడింగ్ 2007లోని కొన్ని నెలల్లో NYSE వ్యాపారానికి 80%పైగా సగటును నమోదు చేసుకుంది. [4] (అంతేకాక, 'ఐస్‌బర్గ్' ఆదేశాల కారణంగా ఈ గణాంకాలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయలేదు. చివరి సూచన కింద పొందుపరిచిన పరిమాణ మరియు ప్రదర్శిత గమనికలు చూడండి.)

దురదృష్టవశాత్తు, ప్రస్తుతం భారీ సంస్థలచే దాదాపు సొంతం చేసుకోబడిన పెద్ద కంపెనీల ఉపేక్ష వల్ల సమకాలీన లోపం తలెత్తింది. పెద్ద పెద్ద సంస్థల బోర్డు డైరెక్టర్లు సాధారణంగా కంపెనీ (ఫోర్డ్‌ గురించి)లో భావభరిత మరియు ద్రవ్య సంబంధ పెట్టుబడిని కలిగిన ప్రధాన వాటాదారుల చేత ఎంపికకాబడుతుంటారు. కంపెనీ మరియు దాని ప్రధాన కార్యనిర్వాహక అధికారుల( సాధారణంగా వారు అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యవర్గ అధికారి-CEOను నియమించడం మరియు తొలగించడం చేస్తారు)పై బోర్డు జాగ్రత్తగా ఒక కన్ను వేసి ఉంచుతుంది.

"సంస్థ యొక్క మూలధన పెట్టుబడిలో స్థాపిత కుటుంబాలు 10% పైగా వాటాను కలిగి ఉన్న సంస్థలు సాటి రంగానికి చెందిన వారిపై అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నట్లు" క్రెడిట్ సుయ్‌స్సే ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 1996 నుంచి ఈ అత్యుత్తమ పనితీరు ఏటా 8% నమోదవుతోంది.[5] ప్రముఖ CEOను మరిచిపొండి." సిక్స్ సిగ్మా మరియు తాజా సాంకేతిక విజ్ఞానం మోజు దాటి చూడండి. కంపెనీకి ఉండే అతిపెద్ద వ్యూహాత్మక ప్రయోజనాల్లో [BusinessWeek కనుగొన్నది] ఒకటి వారసత్వం" [6] ఆ చివరి అధ్యయనంలో, "ఉత్తమ పనితీరుకు ఐదు ప్రధాన అంశాలను BW గుర్తించింది.'' కుటుంబ ప్రయోజనాలను కొనసాగించే వ్యాపార సంస్థలకు అన్ని లక్షణాలు ఒకేలా ఉండవు. సాధారణ వేతనచెక్కు కంటే కొంచెం ఎక్కువ ఆదాయం మరియు అనుకూల పదవీవిరమణ అవకాశం కలిగివున్న ఒక వ్యక్తిని నాయకత్వ స్థాయిలో ఉంచేందుకు లేదా ఘట్టాల వెనుక క్రియాశీలంగా పెట్టేందుకు అవి ఎందుకు సహాయపడతాయో- వివరణలు కూడా వీటిలో ఉంటాయి." అలాన్ ముర్రే రాసిన "రివోల్ట్ ఇన్ ది బోర్డ్‌రూమ్"ను కూడా చూడండి.

అధ్యక్షుడు/CEO చేస్తున్నది నచ్చకుంటే మరియు వారి తొలగింపు లాభం చేకూరుస్తుందని ("ఉద్యోగ విచ్ఛేద ఒప్పందం") మరియు/లేదా కాలహరణమవుతుందని గుత్త సంస్థలు భావిస్తే అవి తమ వాటాను విక్రయించుకోవచ్చు. తర్వాత అధ్యక్షుడు/CEO ద్వారానే బోర్డు ఎంపిక జరుగుతుంది. వారిని ప్రాథమికంగా సంస్థ అధికారులు లేదా వ్యాపార భాగస్వాములు వలే తమ మిత్రులుగా, సహచరులుగా చేస్తుండటం ఈ రోజుల్లో జరుగుతోంది. (సంస్థాగత) వాటాదారులు అరుదుగా మారినప్పుడు అధ్యక్షుడు/CEO సాధారణంగా బోర్డు అధ్యక్ష పదవిని ఆమె/అతను అలంకరిస్తారు(అలాంటప్పుడు సంస్థాగత యజమానులకు ఆమె/అతన్ని తొలగించడం చాలా కష్టమవుతుంది). అధికారుల చెల్లింపు, హస్తగత వ్యతిరేక లేదా "విష గుళిక" చర్యలపై వాటాదారు తీర్మానాలకు సంస్థాగత పెట్టుబడిదారులు సందర్భోచితంగా మద్దతిస్తారు.

చివరగా, పెట్టుబడి చేసిన భారీ మొత్తాలను (మ్యూచువల్ ఫండ్ 'వాన్‌గార్డ్ 500', లేదా State Street Corp. వంటి సంస్థల అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థ వంటివి) మామూలుగా తగిన ద్రవ్యత్వం కలిగిన వివిధ రకాలైన పలు కంపెనీల్లో పెట్టుబడి చేసే విధంగా రూపకల్పన చేశారు. వ్యక్తిగత కంపెనీ ఆర్థిక లేదా ఇతర సమస్యను చాలా వరకు ఈ విధానం తొలగిస్తుందనే ఆలోచన ఆధారంగా అలా చేశారు. ఫలితంగా ఇలాంటి పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన కంపెనీ పాలనపై ఆసక్తి తక్కువగా ఉంటుంది.

1990ల నుంచి ఇంటర్నెట్ లావాదేవీల వినియోగం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్టాక్ పెట్టుబడిదారులు సంస్థల ప్రత్యక్ష లేదా పరోక్ష యాజమాన్యం మరియు విఫణుల్లో శక్తివంతమైన సరికొత్త భారీ (స్వల్ప కాలిక) శక్తిగా అవతరించారు: మామూలు భాగస్వామి. వ్యక్తిగత పెట్టుబడిదారులచే ఏదైనా ఒక సంస్థలోని వ్యక్తిగత వాటాల కొనుగోలు తగ్గినప్పటికీ, స్టాక్ వ్యుత్పన్నాల (ఉదాహరణకు స్టాక్ ఎక్స్ఛేంజిలోని మ్యూచువల్ ఫండ్స్ (ETFs), స్టాక్ మార్కెట్ సూచీ ప్రత్యామ్నాయాలు, మొదలైనవి) అమ్మకం మాత్రం పెరిగింది.[7] కావున పలువురు పెట్టుబడిదారుల ప్రయోజనాలు అరుదుగా వ్యక్తిగత సంస్థల అదృష్టాలతో ప్రస్తుతం ఎక్కువగా ముడిపడి ఉన్నాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విఫణుల్లోని వాటాల యాజమాన్యం మారుతోంది. ఉదాహరణకు జపాన్ మార్కెట్‌లోని అత్యధిక వాటాలను ఎక్కువగా ఆర్థిక సంస్థలు మరియు పారిశ్రామిక సంస్థలు ఆక్రమించాయి. (జపాన్ కీరెట్సు సంస్థలు మరియు దక్షిణ కొరియా కేయెబల్ 'గ్రూపుల'[8] మధ్య పరస్పర ఆక్రమిత వాటాలు న్నాయి). అదే విధంగా USA లేదా UK మరియు ఐరోపాలోని వాటాలు చాలా వరకు అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడిదారులచే ఆక్రమించబడ్డాయి.

కార్పొరేట్ పాలన భాగస్వాములు[మార్చు]

నియంత్రణ విభాగం (ఉదాహరణకు ప్రధాన కార్యనిర్వాహక అధికారి, బోర్డు డైరెక్టర్లు, యాజమాన్యం, వాటాదారులు మరియు ఆడిటర్లు) వంటివి కార్పొరేట్ పాలనలో భాగస్వాములుగా ఉంటాయి. పంపిణీదారులు, ఉద్యోగులు, రుణదాతలు, వినియోగదారులు మరియు ప్రజలు ఇతర భాగస్వాములుగా ఉంటారు.

పెద్ద సంస్థల్లో, ప్రధానమైన ఉత్తమ ప్రయోజనాల దిశగా మేనేజర్‌ నిర్ణయ హక్కులను వాటాదారు నియోగిస్తాడు. నియంత్రణ నుంచి యాజమాన్యాన్ని వేరు చేయడం వల్ల సంస్థాగత పరిపాలనా సంబంధిత నిర్ణయాలపై ప్రభావవంతమైన నియంత్రణను వాటాదారులు కోల్పోయేలా చేస్తుంది. ఇరు పక్షాల మధ్య ఈ రకమైన విభజన ఫలితంగా వాటాదారులతో మేనేజర్ల ప్రోత్సాహకాలను క్రమపరచడానికి ఒక కార్పొరేట్ పాలనా నియంత్రణల వ్యవస్థను అమలు చేస్తారు. పెట్టుబడిదారుల వాటాలు క్రమంగా పెరగడంతో యాజమాన్యం చాలా విస్తారమైంది కాకపోవడం వల్ల యాజమాన్య విభజన మరియు నియంత్రణ సమస్యలు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది.

కార్పొరేట్ పాలనలో బోర్డు డైరెక్టర్లు తరచుగా కీలక పాత్ర పోషిస్తుంటారు. సంస్థ యొక్క ప్రణాళికను వివరించడం, నిర్ధేశిత విధానాన్ని అభివృద్ధి పరచడం, ఉన్నతాధికారుల నియామకం, పర్యవేక్షణ మరియు జీతాలు చెల్లింపుతో పాటు యజమానులకు మరియు నియమాల పట్ల సంస్థ బాధ్యతాయుతంగా ఉండేలా చేయడం డైరెక్టర్ల బాధ్యత.

అమెరికాలో కార్పొరేట్ సెక్రెటరీగా తరచూ చార్టర్డ్ సెక్రెటరీగా పిలవబడే సంస్థ కార్యదర్శి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ సెక్రెటరీస్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ (ICSA) చేత అర్హత పొందిన ఉన్నత హోదా ఉద్యోగి. కార్పొరేట్ పాలన అత్యున్నత ప్రమాణాలు, సమర్థవంతమైన కార్యకలాపాలు, ఆమోదం మరియు పరిపాలనపై అతను విస్తృతంగా శిక్షణ పొంది ఉంటాడు.

సంస్థ సమర్థవంతమైన పనితీరు ద్వారా కార్పొరేట్ పాలన భాగస్వాములందరూ ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రయోజనం పొందుతారు. డైరెక్టర్లు, ఉద్యోగులు, యాజమాన్యం జీతాలు, ప్రయోజనాలు మరియు పేరుప్రతిష్ఠలు సంపాదించగా, వాటాదారులు మూలధన రాబడి అందుకుంటారు. వినియోగదారులు వస్తువులు మరియు సేవలు పొందుతారు. పంపిణీదారులు తమ వస్తువులు లేదా సేవలకు పరిహారం అందుకుంటారు. అందుకు ప్రతిగా వ్యక్తిగత ప్రయోజనం పొందే వీరంతా సహజ, మానవ, సామాజిక మరియు ఇతర రూపాల్లో మూలధనాన్ని సమకూరుస్తారు.

సంస్థలో భాగస్వామి కావాలని వ్యక్తులు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు మూలధన పెట్టుబడిని సమకూర్చడం ద్వారా సంస్థాగత రాబడుల్లో ఆశాజనక వాటాను అందుకోగలమని వారు విశ్వాసం కలిగి ఉండటం. ఒకవేళ కొన్ని భాగస్వామ్య విభాగాలు తాము ఆశించిన రాబడి కన్నా ఎక్కువగా అందుకుంటే భాగస్వాములు తమ భాగస్వామ్యాన్ని కొనసాగించరాదని భావించవచ్చు. ఫలితంగా అది సంస్థ నాశనానికి దారితీస్తుంది.

మూల సూత్రాలు[మార్చు]

చిత్తశుద్ధి, విశ్వాసం మరియు సమగ్రత, నిష్కాపట్యత, పనితీరు దిక్సాధన, బాధ్యత మరియు జవాబుదారీతనం, పరస్పర గౌరవం మరియు సంస్థ పట్ల అంకితభావం కలిగి ఉండటం ఉత్తమ కార్పొరేట్ పాలనకు ప్రధానాంశాలు.

సంస్థ భాగస్వాముల విలువలను క్రమపరిచే విధంగా డైరెక్టర్లు మరియు యాజమాన్యం ఒక పాలనా నమూనాను ఎలా రూపొందిస్తారు మరియు నిర్ణీతకాలంలో నమూనా సమర్థతను అంచనా వేయడం చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి, వాస్తవ లేదా కచ్చితమైన ప్రయోజన వివాదాలు మరియు ఆర్థిక నివేదికల వెల్లడి పరంగా ఉన్నతాధికారులు ఎంతో నిజాయితీగా, నైతికంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కార్పొరేట్ పాలనకు సాధారణ ఆమోదిత సూత్రాలు :

 • హక్కులు మరియు వాటాదారుల పట్ల నిష్పక్షపాత వైఖరి : వాటాదారుల హక్కులను సంస్థలు గౌరవించాలి. అంతేకాక హక్కుల సాధనకు వాటాదారులకు సాయపడాలి. అర్థవంతమైన మరియు సులభమైన సమాచారాన్ని సమర్థవంతంగా అందించడం ద్వారా వాటాదారులు తమ హక్కులను సాధించుకునేందుకు సంస్థలు సాయపడగలవు. అంతేకాక సాధారణ సమావేశాల్లో వారు పాల్గొనే విధంగానూ ప్రోత్సహించగలవు.
 • ఇతర మధ్యవర్తుల ప్రయోజనాలు : చట్టపరమైన మధ్యవర్తులందరికి న్యాయమైన మరియు ఇతర బాధ్యతలు ఉంటాయని సంస్థలు గుర్తించాలి.
 • బోర్డు పాత్ర మరియు బాధ్యతలు : బోర్డుకు పలు రకాల నైపుణ్యాలతో పాటు వివిధ వ్యాపార సమస్యలను పరిష్కరించే అవగాహన ఉండాలి. అలాగే యాజమాన్య పనితీరును సమీక్షించడం మరియు అవసరమైతే సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. బోర్డు తగినంత పరిమాణం కలిగి ఉండటంతో పాటు తన బాధ్యతలు మరియు విధులను సక్రమంగా నెరవేర్చేలా కచ్చితమైన రీతిలో అంకితభావం ఉండాలి. కార్యనిర్వాహక మరియు కార్యనిర్వాహకేతర డైరెక్టర్ల కచ్చితమైన కలయికపై వివాదాలున్నాయి.
 • సమగ్రత మరియు నైతిక ప్రవర్తన : నైతిక మరియు బాధ్యతాయుత నిర్ణయాలు ప్రజా సంబంధాలకు మాత్రమే కాక విపత్కర నిర్వహణ పరిస్థితులు మరియు చట్టపరమైన దావాలను నివారించడంలోనూ చాలా ముఖ్యం. నైతిక మరియు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునే విధంగా డైరెక్టర్లు మరియు అధికారులకు బోర్డులు ఒక ప్రత్యేక నియమావళిని రూపొందించాలి. వ్యక్తుల సమగ్రత మరియు నైతికతలపై సంస్థ పెట్టుకున్న నమ్మకం చివరకు వమ్ము అవుతున్నప్పటికీ, దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల, ఒక సంస్థ నైతిక మరియు చట్టపరమైన హద్దులను అతిక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి అంగీకార మరియు నైతిక కార్యక్రమాలను పలు సంస్థలు రూపొందిస్తున్నాయి.
 • బహిర్గతం మరియు పారదర్శకత : వాటాదారుల పట్ల కచ్చితమైన జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా బోర్డు మరియు యాజమాన్యం యొక్క పాత్రలు, బాధ్యతలను విశదీకరించడంతో పాటు వాటిని బహిర్గతం చేయాలి. కంపెనీ ఆర్థిక నివేదికల సమగ్రతను కాపాడటం మరియు స్వతంత్రంగా పరిశీలించడం కోసం పలు నియమాలను కూడా సంస్థలు అమలుచేయాలి. సంస్థకు సంబంధించిన స్థూల విషయాలను సకాలంలో బహిర్గతం చేయడం మరియు స్పష్టమైన, వాస్తవిక సమాచారాన్ని పెట్టుబడిదారులందరూ పొందేలా సమతుల్యత సాధించాలి.

కార్పొరేట్ పాలన మూలసూత్రాలకు సంబంధించిన సమస్యలు :

 • అంతర్గత నియంత్రణలు మరియు అంతర్గత ఆడిటర్లు
 • సంస్థ బాహ్య ఆడిటర్ల స్వతంత్రత మరియు వారి గణాంకాల నాణ్యత
 • పర్యవేక్షణ మరియు ప్రమాద నిర్వహణ
 • సంస్థ ఆర్థిక నివేదికల రూపకల్పనపై పర్యవేక్షణ
 • ప్రధాన కార్యనిర్వాహక అధికారి మరియు ఇతర ఉన్నతాధికారుల నష్టపరిహార ప్రక్రియల ఏర్పాట్లపై సమీక్ష
 • డైరెక్టర్లు తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా వనరులను అందుబాటులో ఉంచడం
 • బోర్డు పదవులకు వ్యక్తులు ఎంపికయ్యే తీరు
 • డివిడెండ్ విధానం

పలు వర్గాల నుంచి కొన్ని బలహీన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, "కార్పొరేట్ పాలన" అనేది సందిగ్ధమైనది గానూ మరియు తరచూ అపార్థమైన వాక్యంగా నిలిచింది. కొంతకాలంగా అది సంస్థ యాజమాన్యానికి మాత్రమే పరిమితమయింది. కానీ అలా ఉండరాదు. అది మరింత విస్తృతమైనదిగా ఉండాలి. అది న్యాయమైన, సమర్థతవంతమైన మరియు పారదర్శకమైన పరిపాలనను అందించాలి. అలాగే కొన్ని వివరణాత్మక, లిఖిత అంశాలను సైతం పరిష్కరించే దిశగా పనిచేయాలి. కార్పొరేట్ పాలన అనేది తప్పక చట్టాన్ని అతిశయించాలి. పరిమాణం, నాణ్యత మరియు ఆర్థిక, సంస్థాగత పరిపాలనా సంబంధిత బహిర్గతం యొక్క తరచుదనం, హోదా మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (BOD) తమ ధర్మకర్తల బాధ్యతల సాధన (చాలా వరకు నైతిక పరమైన అంకితభావం). అలాగే పారదర్శకమైన సంస్థ నిర్వహణకు కట్టుబడి ఉండటం-ఇవి కార్పొరేట్ రంగం పరిధిలోని పలు అంశాల పరస్పర చర్యలు మరియు ప్రగతిశీల/బాధ్యతాయుత అంశాలు పోషించిన పాత్రల వల్ల తరచూ సంభవిస్తుంటాయి. భారతదేశంలో సంస్థ ద్వారా ఉత్తమ విధానాల నియమావళి రూపకల్పనకు డిమాండ్ మరియు ప్రతి సంస్థ యాజమాన్యం చేస్తున్న లిఖిత విజ్ఞాపనలు పెరుగుతున్నాయి.[ఉల్లేఖన అవసరం]

యంత్రాంగాలు మరియు నియంత్రణలు[మార్చు]

నైతిక పరమైన విపత్తు మరియు ప్రతికూల ఎంపిక ద్వారా ఉత్పన్నమయ్యే అసమర్థతలను నివారించే విధంగా కార్పొరేట్ పాలన యంత్రాంగాలు మరియు నియంత్రణలను రూపొందిస్తారు. ఉదాహరణకు, మేనేజర్ ప్రవర్తనను పర్యవేక్షించడానికి పెట్టుబడిదారులకు యాజమాన్యం సమకూర్చిన సమాచారం యొక్క కచ్చితత్వాన్ని ఒక స్వతంత్ర మూడో పక్షం (బాహ్య ఆడిటర్) ధ్రువీకరిస్తుంది. ప్రేరణ మరియు సామర్థ్యం రెండింటిని శ్రేష్టమైన నియంత్రణ వ్యవస్థ తప్పక నియంత్రించాలి.

అంతర్గత కార్పొరేట్ పాలనా నియంత్రణలు[మార్చు]

అంతర్గత కార్పొరేట్ పాలనా నియంత్రణలు కార్యకలాపాల పర్యవేక్షణ మరియు సంస్థాగత లక్ష్యాల సాధనకు దిద్దుబాటు చర్యను తీసుకుంటాయి. ఉదాహరణలు :

 • బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ : డైరెక్టర్ల బోర్డు తనకున్న చట్టపరమైన అధికారంతో నియామకం మరియు ఉద్వాసనలు, ఉత్తమ యాజమాన్యానికి నష్టపరిహారం మరియు మూలధన పెట్టుబడి సంరక్షణ చేపడుతుంది. సాధారణ బోర్డు సమావేశాల్లో సంభావ్య సమస్యలను గుర్తించి, వాటిపై చర్చలు జరపడం ద్వారా వాటిని పరిష్కరిస్తారు. కార్యనిర్వాహకేతర డైరెక్టర్లు చాలా వరకు స్వతంత్రులని భావించవచ్చు. అయితే అత్యంత సమర్థవంతమైన కార్పొరేట్ పాలన దిశగా వారు ఎల్లప్పుడూ సఫలీకృతులు కాకపోవచ్చు. అలాగే పనితీరును కూడా వారు మెరుగుపరుచుకోకపోవచ్చు.[5] వివిధ సంస్థలకు వివిధ బోర్డు నిర్మాణాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాక, సంస్థ కార్యనిర్వాహక అధికారుల పర్యవేక్షణకు సంబంధించి బోర్డు సామర్థ్యం అనేది తన యొక్క సమాచార సేకరణ పనిగా భావించవచ్చు. నిర్ణాయక ప్రక్రియపై కార్యనిర్వాహక డైరెక్టర్లు అత్యుత్తమ పరిజ్ఞానం కలిగి ఉంటారు. అగ్ర యాజమాన్యం తీసుకునే క్రియాశీల నిర్ణయాలను బట్టి దానిని డైరెక్టర్లు తీర్మానించడం ద్వారా అంచనాల ఆధారంగా ఆర్థికపరమైన పనితీరు మరింత మెరుగవుతుంది. అది భిన్నవాదనలకు దారితీయొచ్చు. ఫలితంగా కార్యనిర్వాహక డైరెక్టర్లు ఆర్థిక ప్రమాణం అవల దృష్టి సారించాల్సి వస్తుంది.
 • అంతర్గత నియంత్రణ ప్రక్రియలు మరియు అంతర్గత ఆడిటర్లు : అంతర్గత నియంత్రణ ప్రక్రియలనేవి ఒక సంస్థ డైరెక్టర్ల బోర్డు, లెక్కల తనిఖీ కమిటీ, యాజమాన్యం మరియు ఇతర వ్యక్తులు అమలు చేసే విధానాలు. విశ్వసనీయ ఆర్థిక నివేదికల వెల్లడి, నిర్వహణ సామర్థ్యం, చట్టాలు మరియు నియంత్రణల అనుసరణకు సంబంధించిన అంశాలను సంస్థ సాధిస్తుందని సమంజసమైన హామీ ఇవ్వడం. అంతర్గత ఆడిటర్లు ఒక సంస్థ పరిధిలోని వ్యక్తులు. సంస్థ యొక్క అంతర్గత నియంత్రణ ప్రక్రియల రూపకల్పన మరియు అమలు తీరుతో పాటు ఆర్థిక నివేదికల విశ్వసనీయతను వారు పరీక్షిస్తారు.
 • అధికార తుల్యత : సర్వ సాధారణమైన అధికార తుల్యత ప్రకారం, కోశాధికారి కన్నా అధ్యక్షుడు భిన్నమైన వ్యక్తిగా ఉండాలి. ఈ విధమైన అధికార విభజన యొక్క ప్రయోజనం వేర్వేరు విభాగాలు తమ చర్యల పరస్పర తనిఖీ మరియు సమతుల్యం చేసే సంస్థల్లో మరింత అభివృద్ధి చెందుతుంది. సంస్థవ్యాప్త పరిపాలనా మార్పులను ఒక బృందం ప్రతిపాదిస్తే మరో బృందం సమీక్షించడం మరియు మార్పులను రద్దు చేయగలదు. మూడు బృందాల వెలుపల ప్రజల (వినియోగదారులు, వాటాదారులు, ఉద్యోగులు) ప్రయోజనాలను మూడో బృందం తనిఖీ చేస్తుంది.
 • చెల్లింపు : జీతంలో కొంతభాగం వ్యక్తిగత పనితీరుకు సంబంధించి ఉండే విధంగా పనితీరు ఆధారిత చెల్లింపును రూపొందిస్తారు. అది నగదు రూపంలో గానీ లేదా వాటాలు మరియు వాటా ప్రత్యామ్నాయములు, వార్థక్యం లేదా ఇతర ప్రయోజనాలు నగదుయేతర చెల్లింపులుగా ఉంటుంది. అయితే పొరపాట్లు లేదా అవకాశావాద వ్యవహారశైలిని అరికట్టడంలో ఎలాంటి యంత్రాంగాన్ని సమకూర్చలేకపోవడం మరియు హ్రస్వదృష్టి ప్రవర్తనను బహిర్గతం చేయగలగడంలో అలాంటి ప్రోత్సాహక పథకాలు ప్రతిక్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.

బాహ్య కార్పొరేట్ పాలనా నియంత్రణలు[మార్చు]

సంస్థపై బాహ్య మధ్యవర్తులు కార్యకలాపాల నియంత్రణలు బాహ్య కార్పొరేట్ పాలన నియంత్రణల పరిధిలో ఉంటాయి. ఉదాహరణలు :

 • పోటీ
 • రుణ ఒప్పందాలు
 • పనితీరు సమాచారం అంచనా మరియు గిరాకీ (ప్రత్యేకంగా ఆర్థిక నివేదికలు)
 • ప్రభుత్వ నియంత్రణలు
 • సంస్థాగత పరిపాలనా సంబంధిత కార్మిక విఫణి
 • మాద్యమాల ఒత్తిడి
 • హస్తగతాలు

కార్పొరేట్ పాలన దైహిక సమస్యలు[మార్చు]

 • సమాచారానికి గిరాకీ : వాటాదారులు ప్రత్యేకించి చిన్న వాటాదారుడు ఉత్తమ సమాచారాన్ని ఉపయోగించుకోవడంలో ఖర్చు ఎక్కువవడం అవరోధంగా మారుతుంది. ఈ సమస్యకు సంప్రదాయ సమాధానం సమర్థ విఫణి ప్రతిపాదన (ఆర్థికపరంగా, సమర్థ విఫణి ప్రతిపాదన (EMH) అంటే ఆర్థిక విఫణులు అనేవి సమర్థవంతమైనవి అని అర్థం). అంటే చిన్న వాటాదారు భారీ వృత్తిపరమైన పెట్టుబడిదారుల తీర్పులపై యధేచ్ఛగా ముందుకు సాగుతాడని తెలుపుతుంది.
 • పర్యవేక్షక మూల్యాలు : డైరెక్టర్లను ప్రభావితం చేసేలా విశిష్ట ఓటింగ్ బృందమును ఏర్పాటు చేయడానికి వాటాదారులు ఇతరులతో కలవాలి. సాధారణ సమావేశంలో తీర్మానాలు ప్రవేశపెట్టడం లేదా డైరెక్టర్లను నియమించడంలో ఇది పెను హెచ్చరికగా పరిణమిస్తుంది.
 • గణన సమాచార పంపిణీ : డైరెక్టర్లను పర్యవేక్షించడానికి ఆర్థిక సరఫరాదారులకు సమర్థత కల్పించేలా ఆర్థిక ఖాతాలు ఒక కీలక లంకెను ఏర్పాటు చేస్తాయి. ఆర్థిక నివేదికల ప్రక్రియల్లో చోటు చేసుకునే లోపాలు కార్పొరేట్ పాలన సమర్థతా లోపాలను కలిగిస్తాయి. బాహ్య లెక్కల తనిఖీ ప్రక్రియ ద్వారా దీనిని వ్యూహాత్మకంగా సరిదిద్దాలి.

అకౌంటెంట్ పాత్ర[మార్చు]

కార్పొరేట్ పాలనా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఆర్థిక నివేదికల వెల్లడి కీలకమైనది.[ఉల్లేఖన అవసరం] అకౌంటెంట్‌లు మరియు ఆడిటర్‌లు మూలధన మార్కెట్ భాగస్వాములకు సమాచారం అందించే ప్రాథమిక సరఫరాదారులు. విద్యుక్త మరియు నైతిక బాధ్యతలను అనుసరించి మరియు ఆడిటర్ల సమర్థతపై ఆధారపడి ఆర్థిక సమాచారాన్ని యాజమాన్యం సిద్ధం చేయగలదని ఆశించే విధంగా సంస్థ డైరెక్టర్లు అర్హులై ఉండాలి.

ప్రమాణ పద్ధతి, గుర్తింపు ప్రమాణంతో పాటు ఆర్థిక గణాంక విభాగం నిర్వచనాన్ని చెప్పడంలో ఏదైనా ఒక విధానాన్ని ఎంచుకునేందుకు ప్రస్తుత గణాంక విధానం అవకాశం కల్పిస్తుంది. కచ్చితమైన పనితీరు (సృజనాత్మక గణన అని ఎక్కువగా పిలుస్తారు)ను మెరుగుపరచడానికి ఈ ఎంపిక సాధన వినియోగదారులపై అదనపు సమాచార వ్యయాన్ని మోపుతుంది. గరిష్ఠంగా ఇది సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం కూడా ఈ విధానం పరిధిలో ఉంటుంది.

లెక్కల తనిఖీ నిర్వహిస్తున్న సంస్థకు స్వతంత్ర ఆడిటర్ మరియు యాజమాన్య సలహాదారుగా గణాంక సంస్థ వ్యవహరిస్తుందా అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది. ఫలితంగా యాజమాన్యాన్ని బుజ్జగించమంటూ సేవాగ్రహీత నుంచి వచ్చే ఒత్తిడి వల్ల ఆర్థిక నివేదికల సమగ్రతను అనుమానించే విధంగా ప్రయోజన సంఘర్షణ తలెత్తుంది. యాజమాన్య సంప్రతింపు సేవలను ప్రారంభించడం మరియు రద్దు చేయడం. అలాగే ఒక స్వతంత్ర ఆడిటర్ భావంతో వ్యతిరేకించే గణాంక సంస్థలను ఎంపిక చేయడం మరియు తొలగించడానికి కార్పొరేట్ సేవాగ్రహీతకు అధికారముంటుంది. లెక్కల తనిఖీ మరియు యాజమాన్య సంప్రతింపు సేవలు రెండింటిని అందివ్వకుండా గణాంక సంస్థలను నిషేధానికి సర్బేన్స్-ఆక్సిలే చట్టం (ఎన్‌రాన్ పరిస్థితిని దిగువ తెలిపిన విధంగా) రూపంలో అమెరికాలో మార్పులను అనుశాసనం చేశారు. అదే విధమైన అంశాలను భారత్‌లోని SEBI చట్టం యొక్క 49వ ఉప నిబంధన కింద చేర్చారు.

ఆర్థిక నివేదికల అవకతవకలకు ఎన్‌రాన్ పతనం ఒక ఉదాహరణ. ఎంత భారీ నష్టాలనైనా చెల్లిస్తామని మూడో పక్షం ఒప్పందపూర్వకంగా అంగీకరించిందంటూ వంచనలకు పాల్పడటం ద్వారా ఎన్‌రాన్ తన నష్టాలను కప్పిపుచ్చుకుంది. అయితే మూడో పక్షం అనేది ఎన్‌రాన్ అధిక ఆర్థిక వాటా కలిగిన ఒక విభాగం మాత్రమే. లెక్కల తనిఖీ భాగస్వామి బాధ్యుడు ఆర్థర్ అండర్సన్‌తో జరిపిన గణాంక విధానాల సమాలోచనల్లో అభిప్రాయాలు అనివార్యంగా సేవాగ్రహీత ప్రాబల్యానికి దారితీశాయి.

అయితే ఉత్తమ ఆర్థిక గణాంకాల నివేదనను వినియోగదారులు అనుసరించకపోయినా లేదా అధిక వ్యయాల (పైన తెలిపిన కార్పొరేట్ పాలన దైహిక సమస్యలు చూడండి)[ఉల్లేఖన అవసరం] కారణంగా వినియోగదారుడు పర్యవేక్షక పాత్రను చేపట్టలేకపోయినా కార్పొరేట్ పాలన సమర్థతకు అది ప్రయోజనకరంగా ఉండదు.

నియంత్రణ[మార్చు]

మూస:BusinessLaw

నిబంధనలు x మూల సూత్రాలు[మార్చు]

మూల సూత్రాల కన్నా సమ్మతమైన మరియు అసమ్మతమైన వ్యవహార శైలి మధ్య స్పష్టమైన రేఖను గుర్తించే నిబంధనలను అనుసరించడం చాలా సులభతరమనిపిస్తుంది. వ్యక్తిగత మేనేజర్లు లేదా ఆడిటర్ల పక్షాన విచక్షణను కూడా నిబంధనలు తగ్గిస్తాయి.

మూల సూత్రాల కన్నా నిబంధనలను ఆచరించడం చాలా కష్టం. సంకేత భాషతో మరుగుపరచని కొత్త రకాల లావాదేవీలు జరిపడానికి అవి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. అంతేకాక, స్పష్టమైన నిబంధనలను అనుసరించినప్పటికీ, తమ మూలాధార కార్యక్రమం నుంచి తప్పించుకునే మార్గాన్ని ఇంకా అన్వేషిస్తూనే ఉంటారు. అయితే విస్తృత మూల సూత్రానికి బద్ధులైతే ఇది సాధ్యమవడం కష్టం.

మూల సూత్రాలనేవి స్వీయ నియంత్రణ రూపంగా కూడా చెప్పొచ్చు. సమ్మతించదగ్గ లేదా అసమ్మతించదగ్గ ప్రమాణాలను తీర్మానించేటప్పుడు సంబంధిత రంగానికి ఇది దోహదపడుతుంది. ఆచరణ సాధ్యంకాని అభినివేశ చట్టాలను ఇది తప్పిస్తుంది.

అమలు[మార్చు]

నియంత్రణ వ్యవస్థ యొక్క సమగ్ర విశ్వసనీయతను ఆచరణ ప్రభావితం చేయగలదు. అవి రెండు దుష్ట పాత్రధారులను అడ్డగించడం మరియు పోటీయుత ప్రదర్శనా రంగాన్ని తుల్యం చేస్తాయి. అయినప్పటికీ, అత్యధిక అమలు ఎప్పుడూ మంచిది కాదు. దీర్ఘకాలం కొనసాగిస్తే అది విలువైన సమస్యలను నిరుత్సాహపరచగలదు. ఆచరణ పరంగా వాస్తవ విరుద్ధంగా ఉండే ఇది చాలా వరకు సిద్ధాంతపరమైనది.

బాధ్యత ఆవల చర్య[మార్చు]

మేధో బోర్డులు తమ పనికి సంబంధించి సహకార యాజమాన్యం వలే సంస్థను ముందుకు నడిపిస్తాయి. ఉన్నత యాజమాన్య బృందానికి అవి చాలా వరకు మద్దతుగా నిలుస్తాయి. సంస్థ భవిష్యత్‌పై జరిగే మేధో విశ్లేషణలో భాగస్వాములు కావడం తమ కర్తవ్యమని అనుభవ డైరెక్టర్లు గట్టిగా విశ్వసిస్తారు. చాలా వరకు మేధో బోర్డు సంస్థ ఎదుర్కొనే కీలకమైన ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తుంది.

సంప్రదాయ బోర్డుల మాదిరిగా కాక మేధో బోర్డులు సర్బేన్స్-ఆక్సిలే చట్టం యొక్క నియమనిబంధనలు తమకు ప్రతిబంధకాలుగా ఉన్నాయని భావించవు. నియంత్రణలకు కట్టుబడే ఉద్దేశమున్న ప్రామాణిక బోర్డుల మాదిరిగా కాక మేధో బోర్డులు నియంత్రణల అంగీకారానికి సంబంధించి బోర్డు పనితీరుకు మూలాధారంగా నిలుస్తాయి. అనుభవ డైరెక్టర్లు ప్రాథమిక సూచికలోని అవసరాలను చేరుకోవడంలో వెనుకబడి ఉంటారు. విలువలు మరియు నైతికతలు లేదా CEO పనితీరు పర్యవేక్షణ దిశగా వారికి సర్బేన్స్-ఆక్సిలే చట్టం తప్పనిసరిగా అవసరముండదు.

అదే సమయంలో సంస్థ యొక్క దినవారీ కార్యకలాపాల్లో తాము పాత్ర పోషించాల్సిన అవసరం లేదని మేధో డైరెక్టర్లు గుర్తిస్తారు. ఉదాహరణలతో వారి బాధ్యతల విశ్లేషణ. మొత్తంమీద, సంప్రదాయ మరియు ప్రామాణిక డైరెక్టర్లకు భిన్నంగా సంస్థ దినవారీ సవాళ్లు మరియు వ్యూహరచనలో తమది ఉద్వేగభరిత బాధ్యత అని మేధో డైరెక్టర్లు భావిస్తారు. మేధో బోర్డులు భారీ, పెద్ద సంస్థలతో పాటు చాలా చిన్న సంస్థల్లోనూ కనిపిస్తాయి.[6]

ప్రపంచంలోని కార్పొరేట్ పాలనా నమూనాలు[మార్చు]

US కార్పొరేట్ పాలనా నమూనా బాగా గుర్తింపు పొందినప్పటికీ, ప్రపంచంలోని కార్పొరేట్ పాలనా నమూనాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది. జపాన్‌లోని సంకటమైన కీరెట్సుల వాటాదారు వ్యవస్థలు, జర్మనీ సంస్థల [9] వాటాలో అత్యధిక ఉనికి ఉన్న బ్యాంకులు, దక్షిణకొరియాలోని చాయెబల్స్ మరియు ఇతర వ్యవస్థలు USలో మాదిరి కార్పొరేట్ పాలనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న వ్యవస్థలకు ఉదాహరణలు.

విస్తృతంగా ఉన్న వాటాదారులు మరియు శక్తివంతమైన మేనేజర్ల మధ్య ప్రయోజన వివాదం అమెరికాలో ప్రధాన సమస్య. పిరమిడ్ ఆకృతి యాజమాన్యం ద్వారా కుటుంబాలు ఓటింగ్ యాజమాన్యాన్ని తమ వద్ద దృఢంగా ఉంచుకోవడం మరియు ద్వంద్వ వాటాలు (ఓటింగ్ మరియు ఓటింగేతర) ఐరోపాలో ప్రధాన సమస్య. అత్యధిక నగదు ప్రవాహ హక్కులు ఉండే నియంత్రణ కుటుంబాలు అనుబంధ సంస్థల పట్ల మక్కువతో వ్యవహరించేలా ఇది "స్వీయ లావాదేవీ"లకు దారితీస్తుంది.[7]

ఆంగ్లో-అమెరికన్ నమూనా[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలైన కార్పొరేట్ పాలనా నమూనాలు ఉన్నాయి. భిన్నమైన పెట్టుబడిదారీవ్యవస్థలకు అనుగుణంగా ఇవి మారుతుంటాయి. ఆంగ్లో-అమెరికన్‌ దేశాల్లో సాధారణమైన స్వతంత్ర నమూనా ముఖ్యంగా వాటాదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఐరోపా ఖండం మరియు జపాన్‌లలో కనిపించే సమన్వయ నమూనా కూడా కార్మికుల, మేనేజర్ల, పంపిణీదారుల, వినియోగదారుల మరియు సామాజికవర్గం యొక్క ప్రయోజనాలను గుర్తిస్తుంది. ప్రతి నమూనాకు తన యొక్క సొంత స్పష్టమైన పోటీయుత ప్రయోజనం ఉంటుంది. కార్పొరేట్ పాలన స్వతంత్ర నమూనా సంపూర్ణ నవీకరణం మరియు వ్యయ పోటీని ప్రోత్సహిస్తే, కార్పొరేట్ పాలన సమన్వయ నమూనా నవీకరణ వృద్ధి మరియు నాణ్యతాయుతమైన పోటీని సులభతరం చేస్తుంది. అయితే పాలనా పరమైన సమస్యలపై U.S. ఇటీవల స్పందించిన తీరు మరియు UKలో జరిగిన దానికి మధ్య ముఖ్యమైన తేడాలున్నాయి. అమెరికాలో బోర్డు డైరెక్టర్ల చేత ఒక సంస్థ పాలించబడుతుంది. సాధారణంగా ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా పిలిచే ఒక నిర్వాహక అధికారిని ఎంపిక చేసుకునే అధికారం దానికి ఉంటుంది. సంస్థ నిర్వహణ పరంగా CEOకు రోజు వారీగా విశిష్టమైన అధికారముంటుంది. అయితే అతడు/ఆమెకు కిందిస్థాయి ఉద్యోగుల సత్వర నియామకం, నగదు పెంపు, వేరే కంపెనీ కొనుగోలు, భారీ మూలధన విస్తరణ లేదా ఇతర విలువైన ప్రాజెక్టులు వంటి కొన్ని భారీ చర్యలు తీసుకునేటప్పుడు బోర్డు ఆమోదం తప్పనిసరిగా పొందాలి. విధాన రూపకల్పన, నిర్ణయాలు తీసుకోవడం, యాజమాన్యం యొక్క పనితీరు లేదా కార్పొరేట్ నియంత్రణ పర్యవేక్షణ వంటివి ఇతర బోర్డు విధులు.

బోర్డు డైరెక్టర్లు సాధారణంగా వాటాదారుల చేత ఎంపికకాబడి వారి పట్ల బాధ్యతాయుతంగా ఉంటారు. అయితే పలు సంస్థల ఉపనియమావళి అందరికీ ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ బోర్డు కూర్పు పరంగా అతిపెద్ద వాటాదారులు ఎంతోకొంత ప్రభావం కలిగి ఉంటారు. సాధారణంగా బోర్డు నియోజితుల ఎంపిక అవకాశం వ్యక్తిగత వాటాదారులకు ఉండదు. అయితే బోర్డును అధిష్టించాల్సిన నియుక్తులను ఎన్నుకునే అవకాశం మాత్రమే వారికి ఉంటుంది. బోర్డు సభ్యులు ప్రధాన కార్యనిర్వాహక అధికారి పట్ల ఉపకారబద్ధులుగా ఉంటూ ఆయన చర్యలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల్లోని పలు కార్పొరేట్ బోర్డులను ప్రతికూల ప్రోత్సాహకాలు విస్తరించే విధంగా చేశాయి. తరచుగా డైరెక్టర్ల బోర్డుల సభ్యులు ఇతర సంస్థల CEOలుగా ఉండటం వల్ల ప్రయోజన వివాదం తలెత్తవచ్చని కొందరు [8] భావిస్తారు.

నిబంధనలు మరియు మార్గదర్శకాలు[మార్చు]

కార్పొరేట్ పాలన మార్గదర్శకాలు మరియు నిబంధనలు వివిధ దేశాల్లో అభివృద్ధి చెందాయి. ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థల మద్దతుతో స్టాక్ ఎక్స్ఛేంజ‌్‌లు, సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు లేదా (సంస్థల) డైరెక్టర్ల మరియు మేనేజర్ల సంఘాల నుంచి అవి జారీ అయ్యాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌ జాబితా నమోదు అవసరాలకు సంబంధించిన నిబంధనలు బలవంతమైన ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, నిబంధనగా, పాలనా సిఫారసుల పట్ల ఆమోదం కలిగి ఉండటం చట్టపరంగా తప్పనిసరేమీ కాదు.

ఉదాహరణకు, లండన్ మరియు టొరంటో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు తమ దేశీయ నిబంధనలకు సంబంధించిన సిఫారసులను అనుసరించాల్సిన పనిలేదు. అయితే ఆ నివేదికల్లో అవి సిఫారసులను అనుసరిస్తే దానిని తప్పక బహిర్గతం చేయాలి. అలా లేకుంటే అపసారి విధానాలకు సంబంధించి తగు వివరణలను సమర్పించుకోవాల్సి ఉంటుంది. అలాంటి బహిర్గత అవసరాలకు అంగీకారం కోసం జాబితాలోని కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది.

అమెరికాలోని సంస్థలు ఫెడరల్ ప్రభుత్వం చేత కూడా నియంత్రించబడినప్పటికీ, అవి సంస్థీకరణ ద్వారా ప్రభుత్వం చేత ప్రాథమికంగా నియంత్రించబడుతాయి. ఒకవేళ ప్రభుత్వ సంస్థలైతే అవి తమ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల చేత నియంత్రించబడుతాయి. సగానికి పైగా ఫార్చ్యూన్ 500 సహా డెలావేర్‌లో సంస్థలను భారీగా సంస్థీకరించబడ్డాయి. సాధారణంగా డెలావేర్ యొక్క వ్యాపార అనుకూల కార్పొరేట్ చట్టపరమైన వాతావరణం వల్లనే ఇది సాధ్యమయింది. అలాగే వ్యాపార సమస్యల పరిష్కారం కోసమే ఒక ప్రభుత్వ కోర్టు (డెలావేర్ కోర్ట్ ఆఫ్ చాన్సరీ) ఏర్పాటు చేయబడింది.

పలు ప్రభుత్వాల కార్పొరేట్ చట్టం సాధారణంగా అమెరికన్ బార్ అసోసియేషన్ యొక్క మోడల్ బిజినెస్ కార్పొరేషన్ చట్టమును అనుసరిస్తుంది. అయితే డెలావేర్ మాత్రం అలా కాకుండా ఇప్పటికీ అది తనకు సంబంధించిన మరియు ABA సంఘాల భాగస్వామి, డెలావేర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి E. నార్మన్ వీసే సహా పలువురు ప్రముఖ డెలావేర్ న్యాయవాదుల నిబంధనలను మాత్రమే అనుసరిస్తోంది.

2005లో డిస్నీ నిర్ణయం[9] తర్వాత ఏ సంస్థలు తమ పాలనా బాధ్యతలను నిర్వహిస్తాయనే అంశం వివాదాస్పదమైంది. మరో విధంగా చెప్పాలంటే, చట్టపరమైన ప్రవేశమార్గాన్ని రద్దు చేయడానికి అవి ప్రయత్నిస్తున్నాయా లేక ఉత్తమ విధాన స్థాయికి సమానమైన పాలనా మార్గదర్శకాలను అవి తయారు చేయాలా అనే వివాదం తలెత్తింది. ఉదాహరణకు డైరెక్టర్ల సంఘం (సెక్షన్ 3 పైన చూడండి), కార్పొరేట్ మేనేజర్లు మరియు వ్యక్తిగత సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలు పూర్తిగా స్వచ్ఛందమైనవి. ఉదాహరణకు, తన సొంత పాలనా సమర్థతను మెరుగుపరుచుకునే దిశగా సంస్థ యొక్క ప్రయత్నాలను GM బోర్డు మార్గదర్శకాలు తెలియజేస్తాయి. అయితే ఒకే రకమైన నివేదికలు మరియు ఉత్తమ విధాన ప్రమాణాలను స్వీకరించే విధంగా ఇతర సంస్థలను ప్రేరేపించే రీతిలో అలాంటి నివేదికలు గుణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

1999 OECD ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అత్యంత ప్రభావశీల మార్గదర్శకాల్లో ఒకటి. 2004లో దానిని సవరించారు. OECD ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పాలన మార్గదర్శకాల ప్రతిపాదనగా నిలిచింది.

OECD పనితీరు ఆధారంగా ఇతర అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగ సంఘాలు మరియు 20కి పైగా జాతీయ కార్పొరేట్ పాలనా నిబంధనలు, గణాంక మరియు నివేదికల అంతర్జాతీయ ప్రమాణాల (ISAR)కు సంబంధించిన ఐక్యరాజ్యసమితి అంతర్‌ప్రభుత్వ నిపుణుల కార్యవర్గ బృందం స్వచ్ఛందంగా కార్పొరేట్ పాలన బహిర్గతంలో ఉత్తమ విధానాలపై సూచన చేశాయి. అంతర్జాతీయంగా అంగీకరించిన[10] ఈ సూచీ ఐదు విస్తృత వర్గీకరణలకు సంబంధించిన యాభైకి పైగా ప్రత్యేక బహిర్గత అంశాలను కలిగి ఉంటుంది.[11]

 • లెక్కల తనిఖీ
 • బోర్డు మరియు యాజమాన్య నిర్మాణం మరియు ప్రక్రియ
 • కార్పొరేట్ బాధ్యత మరియు ఆమోదం
 • ఆర్థిక పారదర్శకత మరియు సమాచార బహిర్గతం
 • యాజమాన్య నిర్మాణం మరియు నియంత్రణ హక్కుల సాధన

ప్రపంచ స్థిరాభివృద్ధి వాణిజ్య మండలి (WBCSD) కార్పొరేట్ పాలనపై ప్రత్యేకించి జవాబుదారీతనం మరియు నివేదన పై అధ్యయనం చేసింది. 2004లో కార్పొరేట్ బాధ్యత నిబంధనలు, ప్రమాణాలు మరియు ముసాయిదాల ఉపయోగం పట్ల వ్యాపారం ఎదుర్కొనే వ్యూహాత్మక సవాళ్లు అనే ఒక వివాద నిర్వహణ పరికరము అనే ఇష్యూ మేనేజ్‌మెంట్ టూల్‌ను ఆవిష్కరించింది. సాధారణ సమాచారాన్ని అందించడం ఈ నివేదిక ఉద్దేశం. ఏదైనా ఒక ప్రకృతి దృశ్యం యొక్క "క్షణచిత్రం" మరియు స్ధిర ప్రణాళికకు సంబంధించిన కొన్ని కీలక నిబంధనలు, ప్రమాణాలు మరియు ముసాయిదాలపై మేధావుల బృందం/నిపుణుల సంఘం యొక్క దృక్పధాన్ని అందించడం ఈ నివేదిక ఉద్దేశం.

యాజమాన్య నిర్మాణాలు[మార్చు]

కచ్చితమైన సంస్థల సమూహానికి సంబంధించిన వాటాదారులు ఒక సమూహంగా ఏర్పడే పలు నమూనాలను యాజమాన్య నిర్మాణాలు తెలియజేస్తాయి. ఒక దేశం లేదా వ్యాపార సమూహం పరిధిలో కార్పొరేట్ పాలనపై తమ విశ్లేషణకు విధాన రూపకర్తలు మరియు పరిశోధకులు దీనిని ఒక సాధనంగా ఉపయోగిస్తారు.

సాధారణంగా, యాజమాన్య నిర్మాణాలను యాజమాన్య ఏకాగ్రత (అంటే ఏకాగ్రత నిష్పత్తులు) యొక్క కొన్ని పరిశీలనాత్మక ప్రమాణాలను ఉపయోగించి గుర్తించవచ్చు. తద్వారా దాని దృశ్య చిత్తరువును చూపుతూ ఒక నమూనా తయారు చేయాలి. సంస్థలతో వాటాదారులు ఎలా ప్రతిస్పందిస్తారో అర్థం చేసుకోవడం యాజమాన్య నిర్మాణాల విధానం యొక్క ఆలోచన. అంతేకాక ఏదైనా ఒక సంస్థల సమూహం యొక్క విశిష్ట యజమానిని గుర్తించడం కూడా సాధ్యమవుతుంది. పిరమిడ్స్, క్రాస్-షేర్ హోల్డింగ్స్, రింగ్స్ మరియు వెబ్స్ యాజమాన్య నిర్మాణాలకు కొన్ని ఉదాహరణలు.

కార్పొరేట్ పాలన మరియు సంస్థ పనితీరు[మార్చు]

తొలుత 2000లో కార్యకలాపాలు మొదలుపెట్టి, 2002లో అభివృద్ధి చెందిన సుమారు 200కి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు నిర్వహించిన 'గ్లోబల్ ఇన్వెస్టర్ ఒపీనియన్ సర్వే'లో ఉత్తమ నిర్వహణ సంస్థలకు 80% మంది ప్రతివాదులు ఎక్కువ మొత్తంలో చెల్లించగలరని మెక్‌కిన్సీ కనుగొన్నాడు. యాజమాన్య సంబంధాలు లేని వెలుపల డైరెక్టర్లను ఎక్కువగా కలిగి ఉండేది ఉత్తమ పాలన సంస్థ అని వారు నిర్వచించారు. అలాంటి సంస్థ తన డైరెక్టర్ల లాంఛనప్రాయ మూల్యంకనాన్ని చేపడుతుంది. అంతేకాక పెట్టుబడిదారులకు, పాలనకు సంబంధించిన సమస్యల సమాచారం కోసం వచ్చే విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తుంది. విఫణి పరిస్థితిని బట్టి అధిక చెల్లింపుల పరిమాణం మారుతుంటుంది. ఉదాహరణకు కెనడా సంస్థల చెల్లింపులు 11% ఉంటే అదే నియంత్రణ వ్యవస్థ నేపథ్యం తక్కువగా (మొరాకో, ఈజిప్ట్ మరియు రష్యాలలో) ఉండే సంస్థలకు సుమారు 40% వరకు ఉంటుంది.

ఉత్తమ వాటా ధర నిర్వహణకు సంస్థల నాణ్యతకు సంబంధించిన విశేష జ్ఞానాన్ని ఇతర అధ్యయనాలు వెల్లడించాయి. 'మోస్ట్ అడ్మైర్డ్ ఫర్మ్స్' పేరుతో అత్యంత ప్రశంసా కంపెనీల ఐదేళ్ల రాబడులపై ఫార్చ్యూన్ సంచిక నిర్వహించిన అధ్యయనంలో బాగా పేరు గడించిన సంస్థల రాబడులు సగటున 125% ఉండగా, అతి తక్కువ ప్రశంసలు పొందిన సంస్థల రాబడులు 80% ఉంటాయని అన్తునోవిచ్ మరియు ఇతరులు కనుగొన్నారు. ఉత్తమ మరియు దుర్లభ పాలన బోర్డుల మధ్య వ్యత్యాసాన్ని తెలిపేందుకు సాయపడే విధంగా సంస్థాగత పెట్టుబడిదారులు మరియు 'నిపుణుల'ను బిజినెస్ వీక్ మరో విడి అధ్యయనంలో పొందుపరిచింది. అలాగే అత్యున్నత స్థాయిలు కలిగిన సంస్థలు అత్యధిక ఆర్థిక రాబడులు కలిగి ఉన్నాయని కూడా కనుగొంది.

అంతేకాక విశిష్ట కార్పొరేట్ పాలన నియంత్రణలు మరియు సంస్థ పనితీరు మధ్య సంబంధంపై పరిశోధన మిళితంగా మరియు తరచూ బలహీనంగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు దిగువ విశదీకరించబడ్డాయి.

బోర్డు కూర్పు[మార్చు]

సమావేశాల బాహుళ్యం మరియు ప్రయోజకత్వం మధ్య సంబంధానికి మద్దతును కొందరు పరిశోధకులు కనుగొన్నారు. బాహ్య డైరెక్టర్లు మరియు సంస్థ పనితీరు నిష్పత్తికి మధ్య ప్రతికూల సంబంధాన్ని ఇతరులు కనుగొన్నారు. అలాగే మరికొందరైతే బాహ్య బోర్డు సభ్యత్వం మరియు పనితీరు మధ్య ఎలాంటి సంబంధాన్ని గుర్తించ లేదు. అత్యధిక స్వతంత్ర బోర్డులను కలిగిన సంస్థలు ఇతర సంస్థల కంటే ఉత్తమ పనితీరును కనబరచలేవని ఇటీవలి పత్రికలో భగత్ మరియు బ్లాక్ కనుగొన్నారు. సంస్థ పనితీరుపై బోర్డు కూర్పు ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉండకపోవచ్చు.

చెల్లింపు/నష్టపరిహారం[మార్చు]

సంస్థ పనితీరు మరియు కార్యనిర్వహక అధికారి నష్టపరిహారం మధ్య సంబంధంపై గత పరిశోధన యొక్క ఫలితం కార్యనిర్వహక అధికారుల చెల్లింపు మరియు సంస్థ పనితీరు మధ్య స్థిరమైన మరియు విశిష్ట సంబంధాలను అన్వేషించడంలో విఫలమైంది. చెల్లింపు-పనితీరు సంకరణం తక్కువ సగటు స్థాయిలు ఈ రకమైన పాలనా నియంత్రణ అసమర్థంగా ఉంటుందనే అర్థాన్ని కల్గించదు. అన్ని సంస్థలు ఒకే విధమైన ఏజెన్సీ సమస్య స్థాయిలను ఎదుర్కొనవు. బాహ్య మరియు అంతర్గత పర్యవేక్షక పరికరాలు ఇతర వాటి కంటే కొన్నింటికి అత్యంత సమర్థవంతంగా ఉండొచ్చు.

భారీ CEO పనితీరు ప్రోత్సాహకాలు సంస్థ యొక్క వాటాల యాజమాన్యం నుంచి లభిస్తాయని కొందరు పరిశోధకులు కనుగొన్నారు. అదే వాటా యాజమాన్యం మరియు సంస్థ పనితీరు మధ్య సంబంధం యాజమాన్య స్థాయిపై ఆధారపడి ఉంటుందని ఇతర పరిశోధకులు కనుగొన్నారు. యాజమాన్యం 20% పైగా పెరిగితే నిర్వహణ మరింత కుంటుపడటంతో పాటు తమ వాటాదారుల సంక్షేమం పట్ల ఆసక్తి తగ్గుతుందని ఫలితాలు చెబుతున్నాయి.

సంస్థ పనితీరు అనేది వాటా ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సానుకూల సంబంధం కలిగి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఈ ప్రణాళికలు మేనేజర్ల బలాలను మరియు వారి నిర్ణయ పరిధులు స్వల్పకాలం కన్నా దీర్ఘకాలం ఉండేలా ఆదేశిస్తాయి. మ్యూచువల్ ఫండ్ కాలపరిమితి ఉదంతాలు మరియు ప్రత్యేకించి లోవా యూనివర్శిటీ పుస్తకజ్ఞాని ఎరిక్ లీ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన జేమ్స్ బ్లాండర్, చార్లెస్ ఫోరెల్లె‌లు నివేదించిన వెనుకటి తేదీల ప్రత్యామ్నాయ ఆర్థిక సాయాలు సహా వివిధ భద్రతా పరమైన అభియోగాలు తలెత్తడంతో ఏర్పడిన బలమైన విమర్శ వల్ల ఆ ఆలోచన ధోరణి కలిగింది.

2006 వెనుకటి తేదీల అభియోగం వల్ల ప్రజాభిప్రాయంపై ఏర్పడిన ప్రతికూల ప్రభావానికి ముందే ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం పలు విమర్శలకు దారితీసింది. ఒక ప్రత్యేకమైన బలవంత మరియు సుదీర్ఘ వాదన కార్పొరేట్ వాటా పునర్ కొనుగోలు కార్యకలాపాలతో కార్యనిర్వాహక ప్రత్యామ్నాయాల ప్రతిస్పందనకు ఆందోళన కలిగించింది. వాటాదారు ప్రయోజనాలకు విరుద్ధంగా వాటాల పునర్ కొనుగోలుతో సంయుక్తంగా ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చని అసంఖ్యాక మేధావులు (U.S. ఫెడరల్ రిజర్వు బోర్డు ఆర్థికవేత్త వీస్‌బెన్నర్ సహా) తీర్మానించారు. ప్రత్యామ్నాయాల ప్రభావం వల్ల ప్రత్యేకించి U.S. స్టాండర్డ్ & పూర్స్ 500 కంపెనీల కార్పొరేట్ వాటా పునర్ కొనుగోళ్లు 2006 ఆఖర్లో $500 బిలియన్ల వార్షిక రేటుకు పెరిగాయని వీరంతా స్పష్టం చేశారు. 2006లో కళంకం పేరుతో రచయిత M. గమ్‌పోర్ట్ విడుదల చేసిన అధ్యయనంలో ప్రత్యామ్నాయ/పునర్ కొనుగోలు సమస్యపై విద్యా సంబంధిత కార్యక్రమాల సంకలనమును చేర్చారు.

2006లో పురోగమించిన చెల్లింపు తగ్గడం మరియు వాటా పునర్ కొనుగోలు ప్రణాళిక అమలుకు ఉద్దేశించిన "బహిరంగ విఫణి" నగదు పునర్ వసూళ్ల ప్రభావాన్ని సవాలు చేయడానికి అనేక పునర్ కొనుగోళ్ల ప్రత్యామ్నాయ ఆచరణలు వంటి ప్రత్యామ్నాయాలకు గణాంక మార్పులు మరియు పాలనా సమస్యల సంయోగం అవకాశం కల్పిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. కార్పొరేట్ పాలనపై వివిధ సిద్ధాంతపరమైన దృక్కోణాల ఉత్తమ పర్యావలోకానికి దీనిని చూడండి. చాప్టర్ 15 ఆఫ్ డిగ్నామ్, A అండ్ లోరీ, J (2006) కంపెనీ లా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ISBN 978-0-19-928936-3
 2. కార్పొరేట్ పాలన అంతర్జాతీయ పత్రిక, "ఎ బోర్డ్ కల్చర్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్, వాల్యూమ్ 6 ఇష్యూ 3 (2003)
 3. క్రాఫోర్డ్, కర్టిస్ J. (2007 ది రిఫార్మ్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్: మేజర్ ట్రెండ్స్ ఇన్ ది U.S. కార్పొరేట్ బోర్డ్‌రూమ్, 1977-1997. డాక్టోరల్ డిసర్టేషన్, కేపెల్లా యూనివర్శిటీ. [1] Archived 2017-06-02 at the Wayback Machine.
 4. SSRN-గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్: ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ వెల్త్ మేగ్జిమైజేషన్ బై రాజ్‌లాల్ సపోవాడియా
 5. భగత్ & బ్లాక్, "ది అన్‌సర్టెన్ రిలేషన్‌షిప్ బిట్వీన్ బోర్డ్ కంపోజిషన్ అండ్ ఫర్మ్ పెర్ఫార్మెన్స్", 54 Business Lawyer)
 6. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ డైరెక్టర్స్ (NACD) – డైరెక్టర్స్ మంత్లీ, “ఎన్‌లైటెన్డ్ బోర్డ్స్: యాక్షన్ బియాండ్ ఆబ్లిగేషన్ ”, వాల్యూమ్ 31 నెం. 12 (2007), పేజీ 13. [2] Archived 2012-01-13 at the Wayback Machine.
 7. Enriques L, Volpin P. (2007). "Corporate governance reforms in Continental Europe" (PDF). Journal of Economic Perspectives. 21 (1): 117–140. Retrieved 2009-08-13.[permanent dead link]
 8. Theyrule.net
 9. "ది డిస్నీ డెసిషన్ ఆఫ్ 2005 అండ్ ది ప్రిసీడెంట్ ఇట్ సెట్స్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఫిడుసియరీ రెస్పాన్సిబిలిటీ, కుక్రేజా, అకిన్ గంప్, ఆగస్ట్ 2005" (PDF). మూలం (PDF) నుండి 2005-12-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-12-22. Cite web requires |website= (help)
 10. TD/B/COM.2/ISAR/31
 11. "International Standards of Accounting and Reporting, Corporate Governance Disclosure". UNCTAD. మూలం నుండి 2008-11-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-09.

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య వలయాలు[మార్చు]

మూస:Corporate titles