కార్బన్ టెట్రాఅయొడైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్బన్ టెట్రాఅయొడైడ్
Stereo, skeletal formula of carbon tetraiodide
Ball and stick model of carbon tetraiodide
Ball and stick model of carbon tetraiodide
Spacefill model of carbon tetraiodide
Spacefill model of carbon tetraiodide
పేర్లు
IUPAC నామము
Tetraiodomethane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [507-25-5]
పబ్ కెమ్ 10487
యూరోపియన్ కమిషన్ సంఖ్య 208-068-5
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FG4960000
SMILES IC(I)(I)I
బైల్ స్టెయిన్ సూచిక 1733108
ధర్మములు
CI4
మోలార్ ద్రవ్యరాశి 519.63 g·mol−1
స్వరూపం Dark violet crystals
సాంద్రత 4.32 g mL−1
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal
Tetrahedral
ద్విధృవ చలనం
0 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
384.0–400.4 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−794.4–−778.4 kJ mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 0.500 J K−1 g−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదం WARNING
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H315, H319, H335
GHS precautionary statements P261, P305+351+338
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R36/37/38
S-పదబంధాలు S26, S36
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కార్బన్ టెట్రాఅయొడైడ్ ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక కర్బన సంయోగ పదార్థం. కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క IUPAC నామం టెట్రాఅయోడోమిథేన్ (Tetraiodomethane). కార్బన్ టెట్రా అయొడైడ్‌ సా పేక్షముగా మిగతా మిథేన్ ఉత్పాదకాలకన్న ప్రకాశమైన ఎరుపురంగు రంగు కలిగిన అరుదైన సంయోగ పదార్థం. కార్బన్ అయొడైడ్‌లో కార్బన్ యొక్క శాతం 2%మాత్రమే.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సాంకేత పదం CI4.

భౌతిక ధర్మాలు[మార్చు]

ఘన కార్బన్ టెట్రాఅయొడైడ్‌ ముదురు వైలెట్ రంగు స్పటికంగా ఉండును. కార్బన్ టెట్రా అయొడైడ్‌స్పటికం త్రికోణాకారంలో ఉండును. కార్బన్ టెట్రా అయొడైడ్ అణుసౌష్టవం చతుర్భుజంగా (నాలుగు ఫలకాలు) ఉండును [2].కార్బన్-అయోడిన్ పరమాణుల మధ్య బంధదూరం 2.12 ± 0.02 Å.కార్బన్ టెట్రా అయొడైడ్అణువు లోని అయోడిన్-అయోడిన్ బంధం 3.459 ± 0.03 Åతో ఉండును. బహుశా ఈ కారణం వలననే ఈ సమ్మేళనం ఉష్ణతాత్మకముగాను, కాంతిరసాయనకంగాను (photochemically) అస్థిరమైనది.

కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క చతుర్భుజ అణువుసౌష్టవం వలన, అణువు శూన్య ద్విధ్రువచలనం కలిగి ఉంది. కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క అణుభారం 513.63 గ్రాములు/మోల్. ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత (25°Cవద్ద) 4.32 గ్రాములు/సెం.మీ 3.కార్బన్ టెట్రాఅయొడైడ్‌ మిగతా అధ్రువ (non polar ) సేంద్రియ ద్రావణులలో కరుగుతుంది.

రసాయన చర్యలు-సంశ్లేషణ-ఉపయోగాలు[మార్చు]

కార్బన్ టెట్రాఅయొడైడ్ స్వల్పంగా నీటితో చర్య జరుపును.చర్యవలన అయోడో ఫార్మ్, అయోడిన్ (I2) ఏర్పడును.ఈ సమ్మేళనం ఉష్ణతాత్మకముగాను, కాంతిరసాయనకంగా వియోగం/విచ్చెదన చెందటంవలన టెట్రా అయోడో ఇథైలిన్ (I2C=CI2) ఏర్పడుతుంది.

కార్బన్ టెట్రాఅయొడైడ్‌ను తరచుగా క్షారకాలతో చర్య సమయంలో అయోడినేసన్ కారకంగా ఉపయోగిస్తారు (iodination reagent) [3].కీటోనులను PPh3, కార్బన్ టెట్రాఅయొడైడ్‌లతో చర్య జరిపించడంవలన 1,1-డై అయోడో ఇథెన్ లుగా పరివర్తన చెందును.

రక్షణ[మార్చు]

కార్బన్ టెట్రాఅయొడైడ్ ఉత్పత్తిదారుల సూచనమేరకు ఈసంయోగ పదార్థాన్ని °C (3 °F) వద్ద భద్రపరచ వలెను.అయోడిన్‌ను తయారికి వనరుగా పనిచేయు ఈ సంయోగ పదార్థం ఇరిటేసన్ కల్గించు లక్షణాన్నికలిగి ఉంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Tetraiodomethane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 27 March 2005. Identification and Related Records. Retrieved 29 February 2012.
  2. Finbak, Chr.; Hassel, O. "Kristallstruktur und Molekülbau von CI4 und CBr4" Zeitschrift für Physikalische Chemie (1937), volume B36, page 301-8
  3. P. R. Schreiner, A. A. Fokin, “Carbon Tetraiodide” in Encyclopedia of Reagents for Organic Synthesis (Ed: L. Paquette) 2005; John Wiley & Sons, Ltd