కార్మొరాంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్మొరాంట్

సముద్ర పక్షుల కుటుంబానికి చెందిన పక్షి కార్మొరాంట్. దీనిని జలకాకి, నీటికాకి, చెరువుకాకి అని పలు పేర్లతో పిలుస్తారు. కార్మొరాంట్ లలో 40 వేర్వేరు జాతులు ఉన్నాయి.

వర్ణన

[మార్చు]

కోర్మోరంట్స్ చిన్నవి 45 సెం.మీ. (18 అంగుళాలు) పొడవుతో 340 గ్రాముల బరువుతో ఉంటాయి, పెద్దవి 100 సెం.మీ. (40 అంగుళాలు) పొడవుతో 5 కిలోల బరువుతో ఉంటాయి. అత్యధిక కోర్మోరంట్స్ దాదాపు అన్ని ఉత్తర అర్ధగోళంలోని జాతులతో పాటు ప్రధానంగా డార్క్ ఈకలు కలిగి ఉంటాయి. కొన్ని దక్షిణ అర్థగోళంలోని జాతులు నలుపు, తెలుపులలో ఉంటాయి. కొన్ని జాతులు రంగులురంగులుగా ఉంటాయి. అనేక జాతులు ముఖం మీద రంగు చర్మాన్ని కలిగి ఉంటాయి. ఈ చర్మ ప్రాంతాలు ప్రకాశవంతమైన నీలం, ఆరెంజ్, ఎరుపు లేదా పసుపు రంగులలో ఉండవచ్చు.

హ్యాబిటాట్

[మార్చు]

కోర్మోరంట్స్ రాతి అగ్రముల మీద, దీవులలో అలాగే లోతట్టు సరస్సులు, చిత్తడి నేలలు, జలాశయాల సమీపంలో నివసిస్తాయి. ఈ పక్షులు శీతాకాలంలో తీరప్రాంతాలు, కయ్యలు, రిజర్వాయర్లు, సరస్సుల వద్ద గడుపుతాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

కార్మోరాంట్ ఫిషింగ్