Jump to content

కార్ల్ థియోడర్ డ్రేయర్

వికీపీడియా నుండి
కార్ల్ థియోడర్ డ్రేయర్
కార్ల్ థియోడర్ డ్రేయర్ (1965)
జననం(1889-02-03)1889 ఫిబ్రవరి 3
కోపెన్‌హాగన్‌, డెన్మార్క్‌
మరణం1968 మార్చి 20(1968-03-20) (వయసు: 79)
కోపెన్‌హాగన్‌, డెన్మార్క్‌
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు1919–1968
జీవిత భాగస్వామి
ఎబ్బా లార్సెన్
(m. 1911)
పిల్లలు2
పురస్కారాలు1955 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ది వర్డ్ సినిమాకు గోల్డెన్ లయన్

కార్ల్ థియోడర్ డ్రేయర్ (1889, ఫిబ్రవరి 3 - 1968 మార్చి 20)[1] డానిష్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. గొప్ప దర్శకులలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతని సినిమాలు భావోద్వేగంతో, విధి-మరణాల ఇతివృత్తాలతో కూడి ఉంటాయి.[2][3][4][5][6]

జననం

[మార్చు]

కార్ల్ డ్రైయర్ 1889, ఫిబ్రవరి 3న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

కార్ల్ 1928తో తీసిన ది ప్యాషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్ అనే సినిమా గొప్ప సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇందులో సినిమాటోగ్రఫీ, క్లోజప్‌ ఫాట్ లు ఎక్కువగా ఉపయోగించారు. 2012లో నిర్వహించిన ఒక సర్వేలో సినీ విమర్శకులచే తొమ్మిదవ-ఉత్తమ చిత్రంగా, సినిమా దర్శకులచే 37వ స్థానంలో నిలిచింది.

మైఖేల్ (1924), వాంపిర్ (1932), డే ఆఫ్ వ్రాత్ (1943), ఆర్డెట్ ( ది వర్డ్ ) (1955), గెర్ట్రుడ్ (1964) మొదలైన సినిమాలు తీశాడు. 1955లో ది వర్డ్ సినిమాకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్నాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దేశం
1919 ది ప్రెసిడెంట్ డెన్మార్క్
1920 పార్సన్స్ విడో స్వీడన్
1921 లీవ్స్ ఫ్రంసాతాన్స్ బుక్ డెన్మార్క్
1922 లవ్ వన్ అనదర్ జర్మనీ
1922 ఒన్స్ అపాన్ ఏ టైమ్ డెన్మార్క్
1924 మైఖేల్ జర్మనీ
1925 మాస్టర్ ఆఫ్ హౌజ్ డెన్మార్క్
1926 ది బ్రైడ్ ఆఫ్ గ్లోమ్‌డాల్ నార్వే
1928 ది ప్యాషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రాన్స్
1932 వాంపైర్ ఫ్రాన్స్/జర్మనీ
1943 డే ఆఫ్ వ్రత్ డెన్మార్క్
1945 టు పీపుల్ స్వీడన్
1955 ది వర్డ్ డెన్మార్క్
1964 గెర్ట్రుడ్ డెన్మార్క్

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
  • గుడ్ మదర్స్ (మాడ్రెహ్జాల్పెన్, 12 నిమి, 1942)
  • వాటర్ ఫ్రం ది లాండ్ (వాండెట్ పా లాండెట్, 1946)
  • ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ క్యాన్సర్ (కంపెన్ మోడ్ క్రాఫ్టన్, 15 నిమి, 1947)
  • డానిష్ విలేజ్ చర్చి (లాండ్స్‌బైకిర్కెన్, 14 నిమి, 1947)
  • దే క్యాచ్ ది ఫెర్రీ (డి నెడ్ ఫెర్గెన్, 11 నిమి, 1948)
  • థోర్వాల్డ్‌సెన్ (10 నిమి, 1949)
  • ది స్టోర్‌స్ట్రోమ్ బ్రిడ్జ్ (స్టోర్‌స్ట్రోమ్స్‌బ్రోయెన్, 7 నిమి, 1950)
  • కోటలోని కోట (ఎట్ స్లాట్ ఐ ఎట్ స్లాట్, 1955)

మరణం

[మార్చు]

కార్ల్ డ్రైయర్ తన 79 సంవత్సరాల వయస్సులో 1968, మార్చి 20న న్యుమోనియాతో కోపెన్‌హాగన్‌లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. The Carl Th. Dreyer website Retrieved 12 March 2013
  2. "The 1,000 Greatest Films (Top 250 Directors)". They Shoot Pictures, Don't They. Archived from the original on 2 December 2016. Retrieved 2023-05-29.
  3. [1]Bright Lights Film Journal review of Day of Wrath, Order and Gertrud
  4. "kamera.co.uk - feature item - Carl Dreyer - Antonio Pasolini". www.kamera.co.uk. Retrieved 2023-05-29.
  5. "Carl Theodor Dreyer | Biography, Movie Highlights and Photos | AllMovie". AllMovie. Retrieved 2023-05-29.
  6. The Passion of Joan of Arc review Archived 2013-02-06 at the Wayback Machine by Roger Ebert

బయటి లింకులు

[మార్చు]