కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం శివ స్వరూపమైన కాలభైరవుడిని స్తుతిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రం.
కాలభైరవుడి వైశిష్ట్యం
[మార్చు]శివుని ఉగ్రరూపములో ప్రధానమైన రూపము కాలభైరవుడు శివుని హూంకారం నుండి పుట్టిన రూపమే కాలభైరవుడు.ఈయన కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు. ఇతని వాహనం కుక్క. పుర్రెలదండ ధరించి ఉంటాడు.
కాలభైరవునికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. వీటిని అష్టభైరవులు అని అంటారు. కాలభైరవుని దర్శనంతో మరణ భయం తొలిగిపోతుందని నమ్ముతారు.[1]
కాలభైరవునికి గారెలు సమర్పించడం వలన ఆయుష్షు పెరుగుతుందని భక్తుల నమ్మకం.
ప్రాముఖ్యత
[మార్చు]
కాలభైరవాష్టకము ప్రాముఖ్యత చాలా గొప్పది.దీని గురించి ఎందరో ఎన్నో విధాలుగా తెలిపారు.ఫలశృతిలోని సాక్షాత్తు శంకరులే తెలియజేశారు.ఉగ్రరూపముగానున్న కాలభైరవుడు భయాన్ని పొగొడతారని స్త్రోత్రములో తెలుపుతారు.ఎమైనా దోషాలు ఉంటే పొగొడతారని వివరిస్తారు.
శ్లోకాలు
[మార్చు]ఇందులో మొదటి శ్లోకం ఇలా ఉంటుంది.[2][3]
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
కాలభైరవాష్టక ఫలశృతి
[మార్చు]కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి-సాధకం విచిత్ర-పుణ్య-వర్ధనమ్ ।
శోకమోహ-లోభదైన్య-కోపతాప-నాశనం [దైన్యలోభ]
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి-సన్నిధిం ధ్రువమ్ ॥
కాలభైరవాష్టకం చదవడం వలన జ్ఞానము సిద్ధించటం.కష్టాలు,కోపము,తాపము వంటి గుణాలు నశిస్తాయి.
మరికొన్ని విశేషాలు
[మార్చు]వీరి దేవాలయాలు దేశమంతటా ఉన్నాయి.సింహాచలానికి అతి దగ్గర్లో కూడా కాలభైరవస్వామి గుడి ఉంది.
అమావాస్యరోజున అష్టకం పఠించి దర్శిస్తే దోషాలు పోతాయని ప్రజలు నమ్ముతారు
మూలాలు
[మార్చు]- ↑ "కాలభైరవుడు ఎవరు?? అతని వృత్తాంతమేమి??". TeluguOne Devotional (in ఇంగ్లీష్). 2025-12-04. Retrieved 2025-12-05.[permanent dead link]
- ↑ SUVRATSUT (2017-09-02). Kala Bhairava Ashtakam Eng.
- ↑ Woodroffe, Sir John (2014-01-01). Hymns to the Goddess and Hymns to Kali: Karpuradi Stotra (in ఇంగ్లీష్). Motilal Banarsidass. p. 15. ISBN 978-81-7822-448-0.