Jump to content

కాలేజ్ కుమార్

వికీపీడియా నుండి
(కాలేజ్‌ కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)
కాలేజ్‌ కుమార్‌
దర్శకత్వంహరి సంతోష్
నిర్మాతఎల్.పద్మనాభ
తారాగణంరాజేంద్ర ప్రసాద్, మధుబాల, రాహుల్ విజయ్ , ప్రియా వడ్లమాని
ఛాయాగ్రహణంగురు ప్రశాంత్ రాయ్
కూర్పుగ్యారీ బిహెచ్, పవన్ కళ్యాణ్
సంగీతంకుతుబ్ ఇ క్రిప
నిర్మాణ
సంస్థ
లక్ష్మణ గౌడ -ఎం.ఆర్.పిక్చర్స్
విడుదల తేదీ
6 మార్చి 2020
సినిమా నిడివి
121 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కాలేజ్‌ కుమార్‌ 2020లో విడుదలైన తెలుగు సినిమా. 2017లో కన్నడలో విడుదలైన కాలేజ్‌ కుమార్‌ సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళంలో రీమేక్ చేశారు.కాలేజ్ కుమార్‌ ట్రైలర్‌ను 2021 ఫిబ్రవరి 21న విడుదల చేసి, [1] సినిమాను 2020 మార్చి 6న విడుదల చేశారు.

శశి కుమార్ (రాజేంద్ర ప్రసాద్) ప్యూన్ కావడం వలన తనకు ఎదురైన అవమానాల కారణంగా తన కొడుకు శివ కుమార్ (రాహుల్ విజయ్) ని బాగా చదివించి ఆడిటర్ ని చేయాలని సంకల్పం పెట్టుకుంటాడు. చదువు అంతగా వంటబట్టని శివ కుమార్ తండ్రిని మోసం చేస్తూ తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని నమ్మిస్తాడు. ఐతే ఎగ్జామ్స్ లో కాపీ కొడుకుతూ దొరికిపోయిన శివ కుమార్ కాలేజీ నుండి డిబార్ చేయబడతాడు. దీనితో కొడుకుని నిలదీసిన తండ్రితో చదవడం చాలా కష్టం అది నువ్వు చేసి చూపించు, నేను నిన్ను చదివించే బాధ్యత తీసుకుంటాను అని శివ కుమార్ ఛాలెంజ్ చేస్తాడు. అలా తండ్రిని చదివించే బాధ్యత కొడుకు, కొడుకులా చదివి పాసవ్వాల్సిన బాధ్యత తండ్రి తీసుకుంటాడు. మరి శశి కుమార్ చదివి పాసయ్యాడా? కుటుంబ పోషణ, తండ్రి చదువు బాధ్యత తలకెత్తుకున్న శివ కుమార్ నెరవేర్చడా? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత‌లు : ఎల్ పద్మనాభ
  • దర్శకత్వం : హరి సంతోష్
  • సంగీతం : కుతుబ్ ఇ క్రిప
  • సినిమాటోగ్రఫర్ : గురు ప్రశాంత్ రాయ్
  • ఎడిటర్ : గ్యారీ బిహెచ్, పవన్ కళ్యాణ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 February 2020). "'కాలేజ్ కుమార్‌.. లైఫే డమార్‌'". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.
  2. The Times of India (6 March 2020). "College Kumar Movie Review: A missed opportunity!". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.