కాలేయ క్యాన్సర్
| కాలేయ క్యాన్సర్ | |
|---|---|
| ఇతర పేర్లు | కాలేయ క్యాన్సర్, ప్రాథమిక కాలేయ మాలిగ్నన్సీ, ప్రాథమిక కాలేయ క్యాన్సర్, హెపటోమా |
| కోలాంగియోకార్సినోమాతో కూడిన కాలేయం CT స్కాన్ | |
| ప్రత్యేకత | ఆంకాలజి |
| లక్షణాలు | పక్కటెముకల గూడు కింద కుడి వైపున గడ్డ లేదా నొప్పి, పొత్తికడుపు వాపు, చర్మం పసుపు రంగులోకి మారడం, సులభంగా కమిలిపోవడం, బరువు తగ్గడం, బలహీనత |
| సాధారణ ప్రారంభం | 55 to 65 సంవత్సరాల మధ్య |
| కారణాలు | హెపటైటిస్ బి, హెపటైసిస్ సి, ఇంకా మద్యం కారణంగా సిర్రోసిస్. ఇతర కారణాలు అఫ్లాటాక్సిన్, ఆల్కహాలిక్ కాని కొవ్వు కాలేయ వ్యాధి, కాలేయ పురుగులు |
| రోగనిర్ధారణ పద్ధతి | కణజాల బయాప్సీ, రక్త పరీక్షలు, వైద్య చిత్రాలు |
| నివారణ | హెపటైటిస్ బి రోగనిరోధకత టీకాలు హెపటైసిస్ బి లేదా సి సోకిన వారికి చికిత్స చేయడం |
| చికిత్స | శస్త్రచికిత్స, లక్షిత చికిత్స, రేడియేషన్ థెరపీ, అబ్లేషన్ థెరపీ, ఎంబోలైజేషన్ థెరఫీ లేదా కాలేయ మార్పిడి |
| రోగ నిరూపణ | యునైటెడ్ స్టేట్స్లో 18.4% మనుగడ రేటు ఐదు సంవత్సరాలు , జపాన్లో 40.4%. |
| తరుచుదనము | 2018 లో ఇది 841,000 మందికి సంభవించింది, దాంట్లో 782,000 మంది మరణించారు.[5] 2015 లో కాలేయ క్యాన్సర్ వలన మరణించిన 263,000 మందికి కారణం హెపటైటిస్ బి. అయితే 245,000 మంది మద్యం వలన, 167,000 హెపటైసిస్ సి వలన మరణించారు. |
| మరణాలు | 782,000 (2018) |
కాలేయ క్యాన్సర్, దీనిని హెపాటిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు, ఇది కాలేయంలో ప్రారంభమవుతుంది.[1] కాలేయానికి ఇతర ప్రాంతాల నుండి వ్యాపించిన క్యాన్సర్ ను, కాలేయ మెటాస్టాసిస్ అని పిలుస్తారు.[2]
లక్షణాలు, కారణాలు
[మార్చు]కాలేయ క్యాన్సర్ లక్షణాలు పక్కటెముక క్రింద కుడి వైపున గెడ్డ లేదా నొప్పి, ఉదరం వాపు, చర్మం పసుపు రంగులో ఉండడం, సులభంగా గాయపడటం, బరువు తగ్గడం, శరీర బలహీనత అనిపించడం వంటివి ఉండవచ్చు.[1]
కాలేయ క్యాన్సర్ కు ప్రధాన కారణం హెపటైటిస్ బి, హెపటైసిస్ సి, ఇంకా మద్యం కారణంగా సిర్రోసిస్. ఇతర కారణాలు అఫ్లాటాక్సిన్, ఆల్కహాలిక్ కాని కొవ్వు కాలేయ వ్యాధి, కాలేయ పురుగులు (లివర్ ఫ్లూక్ లు). కాలేయ క్యాన్సర్ లలో అత్యంత సాధారణ రకాలు 80% వరకు హెపాటోసెల్యులార్ కార్సినోమా (హెచ్. సి. సి.) ఇంకా కోలాంగియోకార్సినోమా. మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజమ్ ఇంకా ఇంట్రాడక్టల్ పాపిల్లరీ బిలియరీ నియోప్లాజం వంటివి తక్కువగా సంభవించే రకాలు.[2]
రోగ నిర్ధారణ, చికిత్స
[మార్చు]కణజాల బయాప్సీ, రక్త పరీక్షలు, వైద్య చిత్రాలు మొదలగునవి రోగ నిర్ధారణలో సాయపడతాయి.[1]
వ్యాధి నివారించడానికి 'హెపటైటిస్ బి' రోగనిరోధకత టీకాలు, హెపటైసిస్ బి లేదా సి సోకిన వారికి చికిత్స చేయడం ఉన్నాయి. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నవారికి స్క్రీనింగ్ సిఫార్సు చేస్తారు.[2] శస్త్రచికిత్స, లక్షిత చికిత్స, రేడియేషన్ థెరపీ వంటివి సిఫారసు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, అబ్లేషన్ థెరపీ, ఎంబోలైజేషన్ థెరఫీ లేదా కాలేయ మార్పిడి వంటి ఉపయోగిస్తారు. కాలేయంలో చిన్న గడ్డలను దగ్గరగా పరిశీలిస్తూఉంటారు.[1]
వ్యాధి ప్రాబల్యం
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా అత్యంత తరచుగా సంభవించే క్యాన్సర్ లలో కాలేయ క్యాన్సర్ ఆరవది (6%). క్యాన్సర్ వలన సంభవించే మరణాలకి ఇది రెండవ ప్రధాన కారణం (9%).[2][3] 2018 లో ఇది 841,000 మందికి సంభవించింది, దాంట్లో 782,000 మంది మరణించారు. 2015 లో కాలేయ క్యాన్సర్ వలన మరణించిన 263,000 మందికి కారణం 'హెపటైటిస్ బి'. అయితే 245,000 మంది మద్యం వలన, 167,000 'హెపటైసిస్ సి' వలన మరణించారు. ఆసియా, ఉప-సహారా ఆఫ్రికాలలో హెపటైటిస్ బి ఇంకా సి సాధారణం. ఇలాంటి చోట కాలేయ క్యాన్సర్ అధికంగా కనపడుతోంది. మహిళల కంటే పురుషులు ఎక్కువగా హెచ్.సి.సి. తో బాధపడుతున్నారు.[2] 55 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ రోగం నిర్ధారణ అవుతోంది.[4] యునైటెడ్ స్టేట్స్లో 18.4% లో మనుగడ రేటు ఐదు సంవత్సరాలు, జపాన్లో 40.4%.[4][5] "హెపాటిక్" అనే పదం గ్రీకు పదం 'హెపర్' నుండి వచ్చింది, దీని అర్థం "కాలేయం".[6]
మూలాలు
[మార్చు]- 1 2 3 4 "Adult Primary Liver Cancer Treatment (PDQ®)–Patient Version". NCI. 6 July 2016. ఒరిజినల్ నుండి 2 October 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 September 2016.
- 1 2 3 4 5 World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 5.6. ISBN 978-9283204299.
- ↑ World Cancer Report 2014. World Health Organization. 2014. pp. Chapter 1.1. ISBN 978-9283204299.
- 1 2 "SEER Stat Fact Sheets: Liver and Intrahepatic Bile Duct Cancer". NCI. ఒరిజినల్ నుండి 2017-07-28 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "がん診療連携拠点病院等院内がん登録生存率集計:[国立がん研究センター がん登録・統計]". ganjoho.jp. ఒరిజినల్ నుండి 16 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2020.
- ↑ "Hepato- Etymology". dictionary.com. ఒరిజినల్ నుండి 10 October 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2015.