కాల్గరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Calgary
City
City of Calgary
Calgary skyline
Calgary skyline
Flag of Calgary
Flag
ముద్దుపేరు(ర్లు): 
Cowtown, The Stampede City
Motto(s): 
Onward
Country కెనడా
Province Alberta
RegionCalgary Region
Census division6
Established1875
Incorporated1884 (town)
 1894 (city)
ప్రభుత్వం
 • MayorDave Bronconnier
(Past mayors)
 • Governing bodyCalgary City Council
 • ManagerOwen A. Tobert
 • MPs
 • MLAs
విస్తీర్ణం
 • City726.50 కి.మీ2 (280.50 చ. మై)
 • మెట్రో
5,107.43 కి.మీ2 (1,971.99 చ. మై)
సముద్రమట్టము నుండి ఎత్తు
1,048 మీ (3 అ.)
జనాభా
(2006)
 • City988
 • సాంద్రత1,435.5/కి.మీ2 (3,718/చ. మై.)
 • మెట్రో
1
 • Metro density227.5/కి.మీ2 (589/చ. మై.)
 [2][3]
ప్రామాణిక కాలమానంUTC−7 (MST)
 • Summer (DST)UTC−6 (MDT)
Postal code span
ప్రాంతీయ ఫోన్ కోడ్403 587
జాలస్థలిCity of Calgary

కాల్గరీ కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సులో అతి పెద్ద నగరం.pronounced /ˈkælɡri, ˈkælɡəri/ ప్రావిన్సులో దక్షిణంగా ప్రయరీల్లో (గడ్డి మైదానాలు), పర్వత పీఠభూమి సమీపంలో కెనేడియన్ రాకీ పర్వత శ్రేణుల ముందు వరుసలో తూర్పు దిశగా ఉంటుంది.80 km (50 mi) అల్బెర్టాలోని గడ్డిభూముల ప్రాంతంలో ఉన్న నగరమిది.

2006లో కాల్గరీ జనాభా 988,193. అలా చూస్తే దేశంలో ఇది మూడో అతి పెద్ద మున్సిపాలిటీ. ఆల్బెర్టా ప్రావిన్సులోకెల్లా అతి పెద్దది.[2] 2006లో మొత్తం 1,079,310 మెట్రోపాలిటన్‌ ప్రాంత జనాభాతో కెనడాలో ఐదో అతి పెద్ద సెన్సస్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా (సీఎంఏ)గా అవతరించింది.[3] ఇక 2009లో కాల్గరీ మెట్రోపాలిటన్‌ ప్రాంత జనాభా 1,230,248. దాంతో కెనడాలో నాలుగో అతి పెద్ద CMAగా మారింది.[4]

ఎడ్మాంటన్‌కు కాల్గరీ దక్షిణాన ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య చెదురుమదురుగా జనసమ్మర్ధంతో కూడిన ప్రాంతాన్ని కాల్గరీ-ఎడ్మాంటన్‌ కారిడార్‌గా పిలుస్తారు.[5]294 km (183 mi) కెనడాలో టోరంటో, వాంకోవర్‌ నగరాల మధ్య అతి పెద్ద మెట్రోపాలిటన్‌ ప్రాంతం కాల్గరీయే.

కాల్గరీ చలికాలపు ఆటలకు, ఎకో టూరిజానికి ప్రధాన కేంద్రం. నగరం, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల సమీపంలో పలు ప్రముఖ పర్వత విడిది కేంద్రాలున్నాయి. కాల్గరీలో ఆర్థిక కార్యకలాపాలన్నీ పెట్రోలియం పరిశ్రమ కేంద్రంగా సాగుతుంటాయి. వ్యవసాయం, పర్యాటకం, హైటెక్‌ పరిశ్రమల రంగాలు కూడా నగర ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయి. 1988లో వింటర్‌ ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన తొలి కెనడా నగరంగా కాల్గరీ నిలిచింది.

చరిత్ర[మార్చు]

తొలి ఆవాస ప్రాంతం[మార్చు]

కాల్గరీ ప్రాంతంలో ఐరోపా‌వాసులు స్థిరపడకముందు ఈ ప్రాంతంలో ప్రీ క్లోవిస్‌ ప్రజలు నివసించేవారు. ఇక్కడ వారి ఉనికి 11 వేల ఏళ్ల నాడే ఉన్నట్టు ఆధారాలున్నాయి.[6] 1787లో పైగాన్ సమూహాలతో కలిసి కార్టోగ్రాఫర్‌ డేవిడ్‌ థాంప్సన్‌ ఇక్కడి బోవ్‌ నదీ తీరంలో చలికాలం గడిపాడు. ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా నమోదైన తొలి ఐరోపా‌వాసి ఆయనే. కాల్గరీ ప్రాంతంలో స్థిరపడ్డట్టుగా డాక్యుమెంటరీ ఆధారాలున్న తొలి ఐరోపా‌వాసి జాన్‌ గ్లెన్‌ (1873).[7] 1870ల దాకా కాల్గరీలో స్థానిక తరహా జీవన విధానం పెద్దగా మార్పుల్లేకుండా సాగింది. ఆ రోజుల్లో స్థానికులతో కలిసి ఐరోపా‌వాసులు ఇక్కడి దున్నలను అవి దాదాపు అంతరించిపోయే స్థాయిలో వేటాడారు!

1885లో కన్పించిన ప్రకారం

ఈ ప్రాంతం నార్త్‌వెస్ట్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఇప్పుడు రాయల్‌ కెనేడియన్‌ మౌంటెడ్‌ పోలీస్ లేదా RCMP)కు పోస్టుగా మారింది. ఫర్‌ విక్రయాల పరిరక్షణకు, అమెరికాకు చెందిన విస్కీ వ్యాపారుల బారి నుంచి పశ్చిమ మైదానాలను కాపాడేందుకు 1875లో ఎన్‌డబ్య్లూఎంపీ డిటాచ్‌మెంట్‌పై సంతకం జరిగింది. తొలుత NWMP అధికారి యూఫ్రెం ఎ.బ్రిస్‌బోయిస్‌ పేరిట ఈ ప్రాంతాన్ని ఫోర్ట్‌ బ్రిస్‌బోయిస్‌గా పిలిచారు. కల్నల్‌ జేమ్స్‌ మెక్‌లాయిడ్ 1876లో దీనికి ఫోర్ట్‌ కాల్గరీగా పేరు మార్చాడు. స్కాట్లండ్‌లోని ఐజిల్‌ ఆఫ్‌ మల్‌లోని "కాల్గరీ" పేరిట దీనికి ఆ పేరు పెట్టారు. అయితే ఈ నగరానికి నామకరణం విషయంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. కాల్డ్‌, గార్ట్‌ రెండూ సారూప్యత ఉన్న పాత నోర్స్‌ పదానేలనని, 'చలి', 'తోట' అని వాటికి అర్థాలని ఐజిల్‌ ఆఫ్‌ మల్‌లోని మ్యూజియం చెబుతుంది. హెబ్రైడ్స్‌లోని లోపలి ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న వైకింగ్స్‌ పేరు పెట్టే సందర్భంలో బహూశా ఈ పదాలను వాడి ఉండొచ్చన్నది దాని అభిప్రాయం. 'మైదానం (పాశ్చర్‌)లోని బీచ్‌' అనే అర్థాన్నిచ్చే గెలిక్‌ (అంటే కాలా గెరైడ్‌ ) నుంచి ఈ పేరు వచ్చి ఉంటుందన్నది దీనికి పోటీ వాదన.

[8] 1885లో ఏర్పాటైన బాన్ఫ్‌ నేషనల్‌ పార్కు క్రమంగా విస్తరించి బాన్ఫ్‌ స్ప్రింగ్స్‌ హోటల్తో పాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక ఆకర్షణగా మారింది. తొలుత ఇక్కడికి వెళ్లేందుకు ప్రధాన సాధారణంగా కెనేడియన్‌ పసిఫిక్‌ రైల్వే ఉపయోపగపడేది. వారే ఇక్కడ బాన్ఫ్‌ స్ప్రింగ్స్‌ హెటల్‌ను నిర్మించారు. తర్వాత సీపీఆర్‌ ఇక్కడి పర్యాటకాన్ని బాగా ప్రచారం చేసింది. ఇప్పుడిక్కడ మంచి విమానాశ్రయం కూడా ఉందంటే అది ప్రధానంగా ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల కోసమే.

1886 నాటి కాల్గరీ అగ్నిప్రమాదం (నవంబరు 7 ఆదివారం రోజు) పెను ఉత్పాతం సృష్టించింది. 14 భవనాలు కాలి బూడిదయ్యాయి. దాదాపుగా 103,200 డాలర్ల దాకా నష్టం జరిగింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించడం, గాయపడటం జరగలేదు.[9] ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇక్కడి పెద్ద డౌన్‌టైన్‌ భవనాలన్నీ పాస్కపూ శాండ్‌స్టోన్‌ తోనే కట్టాలంటూ నగర అధికారులు ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు.[10]

కెనేడియన్‌ పసిఫిక్‌ రైల్వే 1883లో తొలిసారిగా ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. నాటి నుంచీ కాల్గరీ ముఖ్యమైన వాణిజ్య, వ్యవసాయ కేంద్రంగా ఎదగడం ప్రారంభించింది. ఇప్పుడు కెనేడియన్‌ పసిఫిక్‌ రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కాల్గరీలోనే ఉంది. 1884లో కాల్గరీని అధికారికంగా ఒక నగరంగా కెనడా గుర్తించింది. ఈ నగరానికి తొలి మేయర్‌గా 1893లో జార్డ్‌ మర్డోక్‌ ఎన్నికయ్యారు. ద సిటీ ఆఫ్‌ కాల్గరీ పేరుతో దీనికి ప్రాచుర్యం వచ్చింది. అప్పట్లో ఈ నగరం వాయవ్య ప్రాంతాల్లో ఉండేది.[11] రైల్వేలు వచ్చిన అనంతరం డొమీనియన్‌ ప్రభుత్వం ఇక్కడి గడ్డి భూములను కారుచౌకగా లీజుకివ్వడం ప్రారంభించింది. (ఎకరానికి ఏటా ఒక సెంటు లీజు చొప్పున 100,000 ఎకరాల దాకా ఇచ్చేది). ఫలితంగా కాల్గరీ పరిసరాల్లో, సమీపంలోని పల్లె ప్రాంతాల్లో భారీ రాంచింగ్‌ కార్యకలాపాలకు తెర లేచింది. అప్పటికే రవాణా, సరఫరా కేంద్రంగా ఉన్న కాల్గరీ చూస్తుండగానే కెనడాకు పశు వ్యాపార, మాంసం ప్యాకేజీ పేరిశ్రమల కేంద్రంగా కూడా మారిపోయింది.

ఉచిత "హోం స్టేడి" ఇస్తామన్న ప్రకటనకు ఆకర్షితులై 1896, 1914 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు కాల్గరీకి భారీగా వలస రావడం ప్రారంభించారు. స్థానిక ఆర్థిక వృద్ధిలో వ్యవసాయం, రాంచింగ్‌ కీలక పాత్ర పోషించడం మొదలు పెట్టాయి. భవిష్యత్తులో కాల్గరీ వికాసానికి అలా పునాది పడింది. ప్రంచ ప్రఖ్యాత కాల్గరీ స్తంపేడ్ అల్లర్లు ఇప్పటికీ ఏటా ఇక్కడ జూలైలో జరుగుతాయి. నలుగురు సంపన్న రాంచర్ల ఆలోచన ఫలితంగా 1912లో చిన్న వ్యవసాయ ప్రదర్శనగా మొదలైన ఇవి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద బహిరంగ ప్రదర్శనగా రూపాంతరం చెందాయి.

చమురు బూమ్‌[మార్చు]

దస్త్రం:69 Calgary.jpg
1969లో కాల్గరీ

[12] 1902లో ఆల్బెర్టాలో తొలిసారిగా చమురు నిక్షేపాలను నుగొన్నారు. కానీ 1947 దాకా ప్రావిన్సులో అది ప్రధాన పరిశ్రమగా ఎదగలేదు. ఆ సంవత్సరంలో భారీ నిక్షేపాలను వెలికి తీశారు. ఇక ఆ తర్వాత నుంచి కాల్గరీ శరవేగంగా చమురు బూమ్‌కు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. నగర ఆర్థిక వ్యవస్థ కూడా చమురు ధరలతో పాటే పెరిగిపోయింది. 1973లో అరబ్‌ దేశాలు చమురు ఎమర్జెన్సీ విధించుకోవడంతో కాల్గరీ దశ తిరిగింది. 1971 (403,000) నుంచి 1989 (675,000) మధ్య 18 ఏళ్లలోనే నగర జనాభా ఏకంగా 272,000 మేర పెరిగింది. ఆ తర్వాతి 18 ఏళ్లలో మరో 345,000 దాకా (2007 నాటికి 1,020,000కు) పెరిగింది. ఈ బూమ్‌ ఉన్న ఏళ్లలో నగరంలో ఆకాశహర్మ్యాలు పుట్టుకొచ్చాయి. అప్పటిదాకా డౌన్టౌన్ లతో కూడిన చిరు నగరంగా ఉన్నది కాస్తా ఒక్కసారిగా కిక్కిరిసిన నగరంగా మారింది. ఈ ధోరణి నేటికీ కొనసాగుతోంది.[13]

కాల్గరీ ఆర్థిక వ్యవస్థ నగర చమురు పరిశ్రమతో అవిభాజ్యంగా పెనవేసుకుపోయింది. సటగు వార్షిక చమురు ధరలతో పాటే నగర వృద్ధి కూడా 1981 నాటికే పతాక స్థాయిని చేరింది.[14] ఆ తర్వాత చమురు దరల్లో తగ్గుదల నగర చమురు పరిశ్రమ కుప్పకూలడానికి కారణమన్న అభిప్రాయం విన్పించింది. దాంతోపాటే కాల్గరీ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక్కసారిగా పడిపోయింది. అయితే 1990ల దాకా చమురు చౌక ధరలు నగర వృద్ధిని కుంటుపరిచాయి.

ఇటీవలి చరిత్ర[మార్చు]

2007లో డౌన్‌టౌన్‌ కాల్గరీ

కాల్గరీవాసుల్లో చాలా మందికి ఇంధన రంగమే ఉపాధి కల్పించిన నేపథ్యంలో 1980ల్లో ఆర్థిక మాంద్యం వల్ల భారీగా జరిగిన పతనం అర్థం చేసుకోదగినదే. దాంతో నిరుద్యోగ శాతం కూడా బాగా పెరిగిపోయింది.[15] దశాబ్ది చివరికల్లా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్టే కన్పించింది. కేవలం చమురు, సహజవాయువు రంగాలపైనే ఆధారపడితే కష్టమని కాల్గరీ అర్థం చేసుకుంది. నాటి నుంచీ వైవిధ్యం దిశగా సాగింది. ఇది ఆర్థికంగానూ, సాంస్కృతికంగానూ కొనసాగింది. ఈ దశలో ఓ సాదాసీదా ప్రయరీ నగరంగా మాత్రమే పెద్ద ప్రాముఖ్యత లేకుండా ఉన్న కాల్గరీ నెమ్మదిగా పెద్ద కాస్మోపాలిటన్‌ నగరంగా అవతరించింది. 1988 ఫిబ్రవరి నాటికి ఈ పరిణామం దాదాపుగా ముగింపుకు చేరుకుంది. ఆ ఏడాది నగరం 15వ శీతాకాలపు‌ ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది.[16] ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించడంతో ప్రపంచ యవనికపై నగరానికి సముచిత స్థానం కూడా లభించింది.[17]

ఆ తర్వాత నుంచి భారీగా పెరిగిన చమురు ధరలు కూడా కాల్గరీ, అల్బెర్టా అభివృద్ధికి దారి తీశాయి. ఈ ధోరణి 2008 చివరి దాకా కొనసాగింది. 11 లక్షల జనాభాతో కూడిన ఈ ప్రాంతం దేశంలోకెల్లా శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.[18] స్థానిక ఆర్థిక వ్యవస్థలో చమురు, సహజవాయువు పరిశ్రమలదే ప్రధాన భాగం అయినప్పటికీ పర్యాటకం, హైటెక్‌ నిర్మాణోత్పత్తుల వంటి పలు విభిన్న రంగాల్లో కాల్గరీ భారీగా పెట్టుబడులు పెట్టసాగింది.[19] ఫలితంగా ప్రస్తుతం ఏటా ఏకంగా 31 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడి ఉత్సవాలు, ఇతర ఆకర్షణలు వారిని ఇట్టే పట్టి లాగుతున్నాయి. ముఖ్యంగా కాల్గరీ స్టాంపేడ్‌ ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. సమీపంలోని కొండల్లో నెలకొన్న విడుదులు, బాన్ఫ్‌, లేక్‌ లూయిస్‌, కాన్మోర్‌ వంటి రిసార్ట్‌ పట్టణాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. పర్యాటకులను ఇవి కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. వాటి నుంచి వారు కాల్గరీకి కూడా సందర్శనకు వస్తున్నారు. తేలికపాటి నిర్మాణాలు, హైటెక్‌ నిర్మాణాలు, సినీ, ఇ-కామర&్స, రవాణా, సేవల వంటి అధునాతన రంగాల్లో కూడా కాల్గరీ నానాటికీ దూసుకెళ్తోంది.[20] జీవన నాణ్యత సర్వేల్లో కాల్గరీ అత్యుత్తమ స్థానాల్లో నిలుస్తోంది. మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ సర్వే[21]లో 2006లో 25, 2007లో 24, 2008లో 25, 2009లో 26, 2010లో 28వ స్థానాలను దక్కించుకుంది. ఎకానమిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) సర్వే ప్రకారం నివసించడానికి ప్రపంచంలోనే ఐదో అత్యుత్తమ నగరంగా నిలిచింది.[22] 2007లో ఫోర్బ్స్‌ మేగజైన్‌ కాల్గరీని ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తించింది.[23] మెర్సర్‌ కూడా 2010లో కాల్గరీని అత్యుత్తమ పర్యావరణ నగరంగా అభివర్ణించింది.[24]

భౌగోళిక స్థితి[మార్చు]

కాల్గరీ పటం పర్పుల్‌ రంగు పారిశ్రామిక ప్రాంతాలకు సూచిక

కెనేడియన్‌ రాకీ పర్వత పాద ప్రాంతాలు, కెనేడియన్‌ ప్రయరీల (గడ్డి మైదానాల) మధ్య ప్రాంతంలో కాల్గరీ నెలకొని ఉంది. దాంతో ఈ ప్రాంతం కాస్త కొండ ప్రాంతంగానే కన్పిస్తుంది. 1,048 m (3,438 ft)సముద్ర మట్టానికి కాస్త ఎత్తులో ఉంటుంది. విమానాశ్రయం మాత్రం సముద్రమట్టానికి దిగువన ఉంది.1,083 m (3,553 ft) నగర ప్రాపర్ ([25] 2006 తో పోలిస్తే) 726.5 kమీ2 (7.820×109 చ .అ)విస్తీర్ణంతో టరంటోను కూడా మించిపోయింది.

నగరం గుండారెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. బోవ్‌ నది వీటిలో పెద్దది. ఇది పశ్చిమం నుంచి దక్షిణానికి పారుతుంది. ఇక ఎల్బో నది దక్షిణం నుంచి ఉత్తరానికి పారుతూ డౌన్‌టౌన్‌ సమీపంలో బోవ్‌ నదితో సంగమిస్తుంది. ఇక్కడి వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. దాంతో సహజంగానే పచ్చదనం కేవలం నదీలోయలకు, కొన్ని ఉత్తర తీర పల్లపు ప్రాంతాలకు, ఫిష్‌ క్రీక్‌ ప్రొవిన్షియల్‌ పార్కుకు పరిమితమై కన్పిస్తుంది.

భౌగోళికంగా చాలా భారీ విస్తీర్ణంలో నగరం కన్పిస్తుంది. లోపలి నగరం, దాన్ని అల్లుకుని కమ్యూనిటీలు దట్టంగా ఉంటాయి. మెట్రోపాలిటన్‌ ప్రాంతమే చాలా ఎక్కువగా ఉండే అత్యధిక నగరాలకు భిన్నంగా కాల్గరీలో శివార్లు చాలా వరకు ప్రధాన నగరంలో విలీనమయ్యాయి. సిటీ ఆఫ్‌ ఎయిర్‌డ్రీ (ఉత్తరాన), కోక్రేన్‌ (వాయవ్యాన), స్ట్రాత్‌మోర్‌ (తూర్పున), స్ప్రింగ్‌బ్యాంక్‌, బేర్స్‌పా ఆక్రెజెస్‌ (పశ్చిమాన) మాత్రమే ఇందుకు కాస్త మినహాయింపులు. సాంకేతికంగా కాల్గరీ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో లేకపోయినా, నగరానికి దక్షిణంగా కొద్ది దూరంలోనే ఉండే ఒకోటోక్స్‌ పట్టణాన్ని కూడా కాల్గరీ శివారు నగరంగానే పరిగణిస్తారు. కాల్గరీ ఆర్థిక ప్రాంతం CMA కంటే కాస్త ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ఇందులో 2008 నాటికి 1,251,600[26] జనాభా ఉంది.

నానాటికీ పెరుగుతున్న వృద్ధికి అనుగుణంగా లెక్కలేనన్ని ప్రాంతాలను నగరం విలీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను ఇంకా చేపడుతూనే ఉంది. తాజా ప్రక్రియ 2007 జూలైలో పూర్తయింది. పొరుగున ఉన్న షెపర్డ్‌ పల్లెప్రాంతాన్ని కూడా నగరం ఎప్పుడో తనలో కలిపేసుకుంది. దానికి ఆనుకుని సమీపంలోనే ఉన్న బాల్జా పల్లె దాకా విస్తరించింది. చెస్టర్‌మోర్‌లోని ఎయిర్‌డ్రి నగరం సరిహద్దుల దాకా కాల్గరీ చొచ్చుకుపోయింది.[27] ఇంత సాన్నిహిత్యమున్నా ఎయిర్‌డ్రిని గానీ, చెస్టర్‌మోర్‌ను గానీ విలీనం చేసుకునే ప్రతిపాదనలైతే ఇప్పటిదాకా లేవు. నిజానికి చెస్టర్‌మోర్‌ యంత్రాంగం మరింత భారీగా విస్తరణ ప్రణాళిక చేపట్టింది. అందుకోసం కాల్గరీకి, చెస్టర్‌మోర్‌కు మధ్యనున్న ప్రాంతాన్ని విలీనం చేసుకునేందుకు ప్రతిపాదనలు కూడా రూపొందిస్తోంది.[28]

కాల్గరీ నగరం దాటుతూనే రాకీ వ్యూ కౌంటీ (ఉత్తం, తూర్పు, పశ్చిమాల్లో), ఫట్‌హిల్స్‌ నంబర్‌ 31 (దక్షిణాన) అనే రెండు మున్సిపల్‌ జిల్లాలుంటాయి.

కాల్గరీ పొరుగు ప్రాంతాలు[మార్చు]

న్యూ బ్రైటన్‌

నగర డౌన్‌టౌన్‌ ప్రాంతం ఐదు పొరుగు ప్రాంతాలతో కూడుకుని ఉంటుంది. అవి యూ క్లైరీ (ఫెస్టివల్‌ జిల్లాతో కలుపుకుని), డౌన్‌టౌన్‌ వెస్ట్‌ఎండ్‌, డౌన్‌టౌన్‌ కమర్షియల్‌ కోర్‌, చైనాటౌన్‌, డౌన్‌టౌన్‌ ఈస్ట్‌ విలేజ్‌ (4}రివర్స్‌ జిల్లా/4}లో కూడా కొంత భాగం). ఇక నగర వాణిజ్య ప్రధాన ప్రాంతం కూడా పలు జిల్లాలుగా విభజితమైంది. అవి స్టీఫెన్‌ అవెన్యూ రిటైల్‌ కోర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌, ఆర్ట్స్‌ డిస్ట్రిక్స్స్‌, గవర్నమెంట్‌ డిస్ట్రిక్ట్‌. కాల్గరీ పొరుగు ప్రాంతాల్లోకెల్లా జనసమ్మర్ధమైన బెల్ట్‌లైన్‌ డౌన్‌టౌన్‌కు, తొమ్మిదవ‌ అవెన్యూకు సమీపంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కన్నాట్‌, విక్టోరియా క్రాసింగ్‌లతో పాటు రివర్స్‌ జిల్లాలోని కొంత భాగం కూడా అందులో కలిసి ఉంటాయి. కాల్గరీ జనసమ్మర్ధాన్ని, జీవాన్ని పెంచేందుకు మున్సిపల్‌ ప్రభుత్వం[29] తలపెట్టిన భారీ ప్రణాళిక, పునరుద్దరణ పథకాల్లో బెల్ట్‌లైన్‌ భాగంగా ఉంది.

డౌన్‌టౌన్‌కు ఆనుకుని గానీ, సమీపంలోనే గానీ ఉన్న వాటితో ఇన్నర్‌సిటీ కమ్యూనిటీలది తొలి స్థానం. వీటిలో క్రిసెట్‌ హైట్స్‌, హాన్స్‌ఫీల్డ్‌ హైట్స్‌/బ్రయర్‌ హిల్‌, హిల్‌హర్స్ట్‌/సన్నీసైడ్‌ (కెన్సింగ్టన్‌ BRZ‌తో కలుపుకుని), బ్రిడ్జ్‌లాండ్‌, రెన్‌ఫ్రూ, మౌంట్‌ రాయల్‌ మిషన్‌, రాంసే, ఇంగిల్‌వుడ్‌, ఆల్బర్ట్‌ పార్క్‌/రాడిసన్‌ హైట్స్‌ వంటివి నేరుగా ఇన్నర్‌సిటీకి తూర్పుగా ఉన్నాయి. ప్రతిగా ఇన్నర్‌ సిటీ కూడా రాస్‌డేల్‌, ప్లజెంట్ పర్వతం‌ (ఉత్తరాన), బౌనెస్‌, పార్క్‌ డేల్‌, గ్లెండేల్‌ (పశ్చిమాన), పార్క్‌ హిల్‌, సౌత్‌ కాల్గరీ (మర్దా లూప్‌తో కలిపి), బ్యాంక్‌వ్యూ, అల్టాడోర్‌, కిలినరీ (దక్షిణాన), ఫారెస్ట్‌ లాన్‌/ఇంటర్నేషనల్‌ అవెన్యూ (తూర్పు) వంటి జనసమ్మర్ధంతో కూడిన పొరుగు ప్రాంతాల మధ్య ఉంది. వీటిని దాటుకుని పరస్పరం జాతీయ రహదారుల ద్వారా విడదీసిన శివారు కమ్యూనిటీలు అయిన సోమర్‌సెట్‌, కంట్రీ హిల్స్‌, సుండాన్స్‌, మెక్‌కెంజీ టౌన్‌ వంటివి కూడా ఉన్నాయి. మొత్తం మీద కాల్గరీ పరిధుల్లో 180 దాకా పొరుగు ప్రాంతాలున్నాయి.[30]

కాల్గరీ పొరుగు ప్రాంతాల్లో చాలా వరకు మొదట్లో ప్రత్యేక పట్టణాలుగానే ఉండేవి. నగరం విస్తురిస్తున్న కొద్దీ వాటిలో చాలా వరకు అందులో విలీనమయ్యాయి. బౌనెస్‌, ఓగ్డెన్‌, మాంట్‌గోమరీ, ఫారెస్ట్‌ లాన్‌, మిడ్నాపూర్‌, రాస్‌డేల్‌, తాజాగా 2007లో షెపర్డ్‌ వంటివి ఇందుకు ఉదాహరణ.[31]

శీతోష్ణస్థితి[మార్చు]

కాల్గరీ నగరం మీదుగా నార్తర్న్‌ లైట్స్‌

కూపన్‌ క్లైమేట్‌ క్లాసిఫికేషన్‌ వ్యవస్థ సమాచారం ప్రకారం కాల్గరీ వాతావరణం హA్యమిడ్‌ కాంటినెంటల్ ‌ తరహాలో ఉంటుంది. (కూపన్‌ క్లైమేట్‌ క్లాసిఫికేషన్‌ Dfb, USDA ప్లాంట్‌ హార్డినెస్‌ జోన్‌ 3a).[32][33][34] (అయితే నగర తేమ స్థాయిలు చాలా తక్కువే). మధ్య తరహా బంజరు మాదిరి వాతావరణం ఉంటుంది. సుదీర్ఘమైన పొడి, చల్లని, తరచూ మారే చలికాలాలు ఉంటాయి. వేసవి పరిమాణం చాలా తక్కువ. సమీపంలోని రాకీ కొండలుమరియు నగర ఔన్నత్యంతో ఇక్కడి వాతావరణం బాగా ప్రభావితమవుతుంది. కాల్గరీలో చలికాలాలు విపరీతమైన చలితో వణికిస్తాయి. కానీ కొండ ప్రాంతాల నుంచి తరచూ వీచే పొడి, వెచ్చని చినూక్ గాలులు ఈ చలి బారి నుంచి కాల్గరీవాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. ఈ గాలులు చలికాలాల్లో ఉష్ణోగ్రత స్థాయిలను కొద్దిమేర పెంచుతాయి. 15 °C (27 °F)ఈ ప్రభావం కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల దాకా ఉంటుంది. ఈ చినూక్ గాలులు కాల్గరీ చలికాలాల్లో చాలా సాధారమైన విషయం. గత 100 ఏళ్ల పై చిలుకు కాలంలో కేవలం ఒకే ఒక్క నెల (1950 జనవరి)లో మాత్రమే చలికాలంలో ఈ గాలులు వీచలేదు. చలికాలపు రోజుల్లో కూడా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత స్థాయిలు తరచూ పెరుగుతూ ఉంటాయి.0 °C (32 °F)

కాల్గరీని విపరీతాల నగరంగా చెప్పవచ్చు. ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయి తక్కువ −45 °C (−49 °F) (1893) నుంచి రికార్డు స్థాయి36 °C (97 °F) ఎక్కువ (1919)కి మారుతుంటాయి. ఏటా దాదాపు ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు−30 °C (−22 °F) కంటే తక్కువకు పడిపోతాయి. అయితే అతి శీతల వాతావరణం సాధారణంగా చాలా రోజుల పాటు కొనసాగదు. ఎన్విరాన్‌మెంట్‌ కెనడా గణాంకాల ప్రకారం కాల్గరీలో సగటు ఉష్ణోగ్రత జనవరిలో −9 °C (16 °F) నుంచి జూలై రోజువారీ సగటు ఉష్ణోగ్రత 16 °C (61 °F) మధ్య మారుతుంటుంది.[35]

కాల్గరీ మీదుగా చింకూ

కాల్గరీ కొండ ప్రాంతం కావడం, పొడి వాతావరణం ఉండటం వల్ల వేసవి కాలాల్లో కూడా సాయంత్రాలు చాలా చల్లగా ఉంటాయి. వేసవిలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 10 °C (50 °F)కు పడిపోతాయి. జూన్‌, జూలై, ఆగస్టులతో పాటు కొన్నిసార్లు సెప్టెంబరులలో కూడా కాల్గరీలో పగటి ఉష్ణోగ్రతలు 29 °C (84 °F) కంటే కూడా పెరుగుతాయి. ఒక్కోసారి మేలోనే ఈ పరిణామం జరుగుతుంది. సగటు ఆర్ద్రత చలికాలంలో 55 శాతం, వేసవిలో 45 శాతం ఉంటుంది. కెనేడియన్‌ ప్రయరీలు, పశ్చిమ పెను మైదానాల్లో మాదిరిగానే కాల్గరీ కూడా ఓ మాదిరి బంజరు వాతావరణమే. తూర్పున ఉండే టరంటో, మాంట్రియల్‌, ఒట్టావా, విన్‌పిగ్‌ వంటి నగరాల్లో మాదిరిగా కాల్గరీలో వేసవిలో ఆర్ద్రత పెద్దగా కనిపించదు.

కెనడాలోకెల్లా అత్యంత ఎక్కువ సూర్యరశ్మి ఉండే నగరాల్లో కాల్గరీ ఒకటి. ఇక్కడ 2,400 గంటల వార్షిక సూర్యరశ్మి నమోదవుతుంది. ఇక కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయం నగర ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. అది ఏటా సగటున 412.6 mm (16.24 in) అవక్షేపణాన్ని చవిచూస్తుంది. ఇందులో 320.6 mm (12.62 in)శాతం మేర వర్షం రూపంలో జరుగుతుంది. మరో 126.7 mm (5.0 in)శాతం మంచు రూపాన ఉంటుంది.[35] అవక్షేపణంలో అత్యధిక శాతం సాధారణంగా మే నుంచి ఆగస్టు మధ్యలో ఉంటుంది. జూన్‌లో అత్యధిక నెలవారీ వర్షపాతం నమోదవుతుంది. 2005 జూన్‌లో కాల్గరీలో 248 mm (9.76 in) అవక్షేపణం జరిగింది. నగర లిఖిత చరిత్రలోకెల్లా అత్యంత తడిమయమైన నెలగా ఇది నిలిచిపోయింది.[36] కరువులు కూడా కాల్గరీకి కొత్త కాదు. ఏడాదిలో ఏ సమయంలోనైనా కరువులు సంభవించేందుకు ఇక్కడ అవకాశముంటుంది. కొన్నిసార్లు నెలల తరబడి, మరికొన్నిసార్లు ఏకంగా ఏళ్ల తరబడి ఈ పరిస్థితులు కొనసాగుతాయి. పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్లే కొద్దీ అవక్షేపణం కాస్త తగ్గుతుంది. ఫలితంగా పశ్చిమ ప్రాంతంలోని పొదలు, చెట్ల వంటి వాటి స్థానంలో ఖాళీ గడ్డి భూములు, చెట్లూ చేమలూ లేని ప్రాంతాలు తూర్పు నగర సరిహద్దుల్లో కన్పిస్తాయి.

దక్షిణ ఆల్బెర్టాలో ఉన్న కాల్గరీ చలికాలాల్లో చాలా తరచుగా అతి శీతల పవనాల బారిన పడుతుంది (వీటిలో చాలా వరకు వెచ్చని గాలుల వల్ల ప్రభావం కోల్పోతాయి). కాల్గరీలో ఏటా 88 రోజుల పాటు సెంటీమీటరుకు మించిన మందంతో మంచు పేరుకు పోతుంది. టరంటోలో ఇది 74 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే హిమపాతం (ఉష్ణోగ్రతలు కూడా) కాల్గరీ ప్రాంతంలో ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. ప్రధానంగా భూ ఉపరితలం ఎత్తులో మార్పులు, సమీపంలోని పర్వత శ్రేణులు ఇందుకు కారణం. కాల్గరీకి దక్షిణాన ఉండే హై రివర్‌ పట్టణం సగటున ఏటా కాల్గరీ కంటే 14 నుంచి 15 డిగ్రీ సెంటీమీటర్ల మేర తక్కువ హిమపాతాన్ని చవిచూస్తుంది. (1971 - 200 ఎన్విరాన్‌మెంట్‌ కెనడా సగటుల ఆధారంగా) టరంటో ప్రాంతం కంటే కూడా ఇది తక్కువ. కాల్గరీలో కూడా దక్షణి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కాస్త హెచ్చుగా ఉంటాయి.

ఏటా కాల్గరీలో సగటున 22 రోజుల పాటు గాలి తుఫానులు నమోదవుతాయి. వాటిలో చాలా వరకు వేసవి నెలల్లోనే చోటుచేసుకుంటాయి. ఆల్బెర్టాలో కాల్గరీ హెయిల్ గాలి తుఫానుల ప్రాంతపు‌ అంచున ఉంటుంది. అందుకే ప్రతి కొన్నేళ్లకోసారి ఇలాంటి తుఫాన్ల బారిన పడుతూ ఉంటుంది. 1991 సెప్టెంబరు 7న కాల్గరీని ఒక తుఫాను అతలాకుతలం చేసింది. కెనడా చరిత్రలోకెల్లా అతి భయంకరమైన, ప్రాకృతిక విపత్తులలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. దాదాపు 40 కోట్ల డాలర్ల దాకా నష్టం వాటిల్లింది.[37] ఇక పొడి ప్రాంతానికి పశ్చిమాన ఉన్న కారణంగా కాల్గరీకి టోర్నడోల బెడద చాలా అరుదు.

సాధారణ సీజన్లు (కచ్చితం కాదు. కాల్గరీలోని చంచల వాతావరణ స్వభావమే ఇందుకు కారణం)
 • చలికాలం: నవంబరు నుంచి మార్చి దాకా
 • వసంతం: ఏప్రిల్ నుంచ మే దాకా
 • వేసవి: జూన్‌ నుంచి ఆగస్టు దాకా
 • ఆకురాల్చు కాలం: సెప్టెంబరు నుంచి అక్టోబరు దాకా
Climate data for Calgary International Airport
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Record high °C (°F) 16.5 22.6 22.8 29.4 32.4 35 36.1 35.6 33.3 29.4 22.8 19.5 36.1
(nil)
Average high °C (°F) −2.8 −0.1 4.0 11.3 16.4 20.2 22.9 22.5 17.6 12.1 2.8 −1.3 10.5
Daily mean °C (°F) −8.9 −6.1 −1.9 4.6 9.8 13.8 16.2 15.6 10.8 5.4 −3.1 −7.4 4.1
Average low °C (°F) −15.1 −12 −7.8 −2.1 3.1 7.3 9.4 8.6 4 −1.4 −8.9 −13.4 −2.4
Record low °C (°F) −44.4 −45 −37.2 −30 −16.7 −3.3 −0.6 −3.2 −13.3 −25.7 −35 −42.8 −45
(nil)
Precipitation mm (inches) 11.6 8.8 17.4 23.9 60.3 79.8 67.9 58.8 45.7 13.9 12.3 12.2 412.6
Rainfall mm (inches) 0.2 0.1 1.7 11.5 51.4 79.8 67.9 58.7 41.7 6.2 1.2 0.3 320.6
Snowfall cm (inches) 17.7 13.4 21.9 15.4 9.7 0 0 0 4.8 9.9 16.4 17.6 126.7
Avg. precipitation days 9 6.9 9.3 9 11.3 13.4 13 11 9.3 6.3 7.6 7.4
Avg. rainy days 0.2 0.2 1.1 4.4 10.5 13.4 13.0 11.0 8.7 3.6 1.0 0.4
Avg. snowy days 9.7 7.6 9.4 6.3 2.2 0 0 0 1.6 3.8 7.8 8.2
Mean monthly sunshine hours 117.4 141.4 177.6 218.8 253.7 280.3 314.9 281.9 207.7 180.5 123.9 107.4 2405.3
Source: Environment Canada[38]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

కాల్గరీ, పరిసర ప్రాంతాల్లో పలు వృక్ష, జంతు జాతులు కనువిందు చేస్తాయి. రాకీ మౌంటేన్‌ డగ్లస్‌ ఫర్‌ (సూడోసుగా మెంజెయ్‌సీ వర్‌ గ్లాకా ) శ్రేణుల వరుస కాల్గరీ వద్ద ఉత్తర సరిహద్దు సమీపం దాకా విస్తరించి ఉంటుంది. కాల్గరీ ప్రాంతంలో ఎక్కువగా కన్పించే మరో దృగ్విషయం వైట్‌ స్ప్రూస్‌ (పైకా గ్లాకా ).

సంస్కృతి[మార్చు]

దస్త్రం:Olympic Plaza.jpg
ఆర్ట్స్‌ డిస్ట్రిక్స్‌లో ఒలింపిక్‌ ప్లాజా

హెటల్‌ సలూన్ల వంటి పాత, సంప్రదాయిక సంస్కృతులతో పాటు పాశ్చాత్య బార్లు, నైట్‌ క్లబ్బులు, ఫుట్‌బాల్‌, హాకీ వంటి వాటిని ఇప్పటికీ నిలుపుకున్న ఆధునిక నగరం కాల్గరీ.[ఆధారం కోరబడింది] కెనడాకు జానపద సంగీత రాజధానిగా కాల్గరీని చెప్పవచ్చు. కొందరు దీన్ని "నాష్‌విల్లే ఆఫ్‌ ద నార్త్‌" అని కూడా అంటుంటారు.[ఆధారం కోరబడింది]

కాల్గరీలో పలు బహూళ సంస్కృతుల ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీటిలో అత్యంత వైవిధ్యంతో కూడినవిగా ఫారెస్ట్‌ లాన్‌ను చెప్పవచ్చు. దీంతో పాటు నగరంలో 17 అవెన్యూ ఎస్‌ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చును. వీటన్నింటినీ అంతర్జాతీయ ఆవాసాలుగా చెబుతారు. పలు జాతులపరమైన రెస్టారెంట్లు, స్టోర్లకు ఈ జిల్లా నిలయం.

కాల్గరీవాసుల్లో చాలా మంది నగర శివార్లలో నివసిస్తుంటారు. 17 అవెన్యూ, కెన్సింగ్టన్‌, ఇంగిల్‌వుడ్‌, ఫారెస్ట్‌ లాన్‌, మార్డా లూప్‌, మిషన్‌ డిస్ట్రిక్ట్ వంటి పలు కేంద్ర‌ జిల్లాలు విపరీతమైన జనసమ్మర్ధంతో కిటకిటలాడుతుంటాయి. ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి.[ఆధారం కోరబడింది] ఇక నగరంలో రాత్రి జీవనం జీవకళతో కూడి ఉంటుంది. పలు సాంస్కృతిక కేంద్రాలు అందుబాటులో ఉండటంతో నగరం ఈ విషయంలో కూడా నానాటికీ వికాసం చెందుతోంది.[ఆధారం కోరబడింది]

కాల్గరీ ప్రజా గ్రంథాలయం నగర వ్యాప్తంగా 17కు పైగా శాఖలతో విస్తరించిన పెద్ద గ్రంథాలయం. ఇందులో దిగువ పట్టణం ‌సమీపంలో ఒక అతి పెద్ద కేంద్ర గ్రంథాలయం కూడా ఉంది.

సదరన్‌ ఆల్బర్టా జూబ్లీ ఆడిటోరియానికి కాల్గరీయే వేదిక. ఇందులో 4 లక్షల చదరపు అడుగు3లతో (113,000 మీటర్లు3) కూడిన పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, సంస్కృతి, కమ్యూనిటీ సదుపాయాలున్నాయి. ఇది ప్రావిన్సులోని రెండు "జంట" సదుపాయాల్లో ఒకటి. రెండోది ఎడ్మాంటిన్లో ఉంది. వీటిని స్థానికంగా "జూబ్‌" అని పిలుస్తారు. వీటితో పాటు 2,538 సీట్లతో కూడిన ఆడిటోరియాన్ని కూడా 1957లోనే ప్రారంభించారు.[39] ఇది వందలాది బ్రాడ్వే సంగీత, నాటక కళారూపాల ప్రదర్శనకు కేంద్రంగా నిలుస్తూ వస్తోంది. ఇక కాల్గరీ జూబ్‌ అయితే ఆల్బర్టా బ్యాలే, కాల్గరీ ఒపేరా, కివనీస్‌ సంగీతోత్సవం, వార్షిక సివిక్‌ రిమంబరెన్స్‌ డే ఉత్సవాల వంటి వాటికి వేదిక. రెండు ఆడిటోరియాలూ సంవత్సరం పొడవునా తెరిచే ఉంటాయి. పలు కార్యకలాపాలతో బిజీగా కన్పిస్తుంటాయి. వీటిని ప్రోవిన్షియల్‌ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ రెంటింటికీ 2005లో ప్రొవిన్షియల్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవసరమైన మరమ్మతులు జరిగాయి.

పలు నాటక కంపెనీలకు కాల్గరీ కేంద్రం. వాన్ ఎల్లో రాబిట్‌ వీటిలో ప్రఖ్యాతమైనది. ఇది EPCOR సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో కాల్గరీ ఫిల్‌హార్మొనిక్‌ ఆర్కెస్ట్రా, థియేటర్‌ కాల్గరీ, ఆల్టెర్టా థియేటర్‌ ప్రొజెక్ట్‌సాండ్‌లతో కలిపి EPCOR‌ కేంద్రాన్ని పంచుకుంటుంది. థియేటర్‌ జంక్షన్‌ గ్రాండ్‌, కల్చర్‌ హస్‌లను సమకాలీన సజీవ కళకు అంకితం చేశారు. థియేటర్‌ స్పోర్ట్స్‌గా ప్రఖ్యాతి చెందిన ఇంప్రువైజేషనల్‌ థియేటర్‌ కళారూపాలకు కల్గరీయే జన్మస్థానం. ఏటా నగరంలో కాల్గరీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం‌ కూడా జరుగుతుంది. దాంతో పాటు యానిమేటెడ్‌ కళారూపాల పై కూడా అంతర్జాతీయ ఉత్సవం‌ను ఇక్కడ నిర్వహిస్తారు.

ఆర్ట్‌ కలెక్టివ్‌ యునైటెడ్‌ కాంగ్రెస్‌ వంటి పలు విజువల్‌, కాన్సెప్ట్యువల్‌ కళాకారులు నగరంలో చాలా చురుగ్గా ఉన్నారు. డౌన్‌టౌన్‌లో పలు ఆర్ట్‌ గ్యాలరీలున్నాయి. వీటిలో చాలా వరకు స్టీఫెన్‌ అవెన్యూ, 17 అవెన్యూ కారిడార్ల వెంట కేంద్రీకృతమయ్యాయి.[40] వీటిలో అతి గొప్ప ఆర్ట్‌ గ్యాలరీగా కాల్గరీ ఆర్ట్‌ గ్యాలరీ (AGC)ని చెప్పవచ్చు. ఆల్టెర్టా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌కు కూడా కాల్గరీయే కేంద్రం.

సాంకర్‌ ఎనర్జీ సెంటర్‌

పలు మార్చింగ్‌ బ్యాండ్‌ బృందాలకు కూడా కాల్గరీయే కేంద్రం. వీటిలో కాల్గరీ రౌండప్ బ్యాండ్‌, ద కాల్గరీ స్టెస్టన్‌ షో బ్యాండ్‌, ద టూటైమ్‌ వరల్డ్‌ అసోసియేసన్‌ ఫర్‌ మార్చింగ్‌ షో బ్యాండ్స్‌ చాంపియన్స్‌, ద కాల్గరీ స్టాంపేడ్‌ షోబ్యాండ్‌లతో పాటు బ్యాండ్‌ ఆఫ్‌ HMCS‌ టెకుంష్‌, ద రెజిమెంటల్‌ బ్యాండ్‌ ఆఫ&ద కింగ్స్‌ ఓన్‌ కాల్గరీ రెజిమెంట్‌, ద రెజిమెంటల్‌ పైప్స్‌ అండ్‌ డ్రమ్స్‌ ఆఫ్‌ ద కాల్గరీ హైలాండర్స్‌ వంటి మిలటరీ బ్యాండ్స్‌ కూడా ఉన్నాయి. వీటిలో పాటు పలు ఇతర పౌర పైప్ ‌బ్యాండ్లు కూడా నగరంలో బాగా ఉన్నాయి. వీటిలో కాల్గరీ పోలీస్‌ సర్వీస్‌ పైప్‌ బ్యాండ్‌ ప్రధానమైనది.[41]

పలు వార్షిక ఉత్సవాలకు, సదస్సులకు కాల్గరీ వేదికగా నిలుస్తుంది. కాల్గరీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, ద కాల్గరీ ఫోక్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌, ఫన్నీ ఫెస్ట్‌ కాల్గరీ కామెడీ ఫెస్టివల్‌, ద ఫోక్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌, ద గ్రీక్‌ ఫెస్టివల్‌, క్యారీఫెస్ట్‌, వరల్డ్‌ ఫెస్ట్‌, బెన్ఫ్‌ కాల్గరీ ఇంటర్నేషనల్‌ రైటర్స్‌ ఫెస్టివల్‌, ద లియాక్‌ ఫెస్టివల్‌, గ్లోబల్ ఫెస్టివల్‌, ద కాల్గరీ ఫ్రింజ్‌ ఫెస్టివల్‌, సమ్మర్‌స్టాక్‌ ఎక్స్‌పో లాటినో, కాల్గరీ గే ప్రైడ్‌, కాల్గరీ ఇంటర్నేషనల్‌ స్పోకెన్‌ వర్డ్‌ ఫెస్టివల్‌, ఇంకా పలు ఇతర సాంస్కృతిక, జాతులపరమైన ఉత్సవాలు వీటిలో ముఖ్యమైనవి. కాల్గరీ స్టాంపేడ్‌ను కాల్గరీలో చాలా ప్రఖ్యాతి పొందిన వేడుకగా చెప్పవచ్చు. 1912 నుంచి ఏటా జూలైలో ఇది జరుగుతోంది. కెనడాలోకెల్లా అత్యంత భారీ ఉత్సవాల్లో ఇదొకటి. 2005లో ఈ 10 రోజుల రోడో, ప్రదర్శనలో ఏకంగా 1,242,928 మంది పాల్గన్నారు.[42]

ఇక కాల్గరీలో పలు మ్యూజియాలు కూడా ఉన్నాయి. ద గ్లెన్‌బో మ్యూజియం పశ్చిమ కెనడాలోకెల్లా అతి పెద్దది. ఇందులోని ఆర్ట్‌ గ్యాలరీ దేశంలో మొదటి ఆర్ట్‌ గ్యాలరీ. ఇక ఇతర పెద్ద మ్యూజియంలలో చైనీస్‌ సాంస్కృతిక కేంద్రం‌70,000 చ .అ (6,500 మీ2) చాలా పెద్దది. ఇది కెనడా[43] లోకెల్లా ఏకైక సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. ఇక కెనేడియన్‌ ఒలింపిక్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, మ్యూజియం (కెనడాలోని ఒలింపిక్‌ పార్కు వద్ద), ద మిలిటరీ మ్యూజియమ్స్‌, ద కాంటోస్‌ మ్యూజిక్‌ మ్యూజియం, ద ఏరోస్పేస్‌ మ్యూజియం వంటివి కూడా ఉన్నాయి.

ఇక కాల్గరీ ప్రాంతం సినీ దర్శకులను కూడా బాగా ఆకర్షిస్తోంది. పలు సినిమాలు ఇక్కడి ప్రాంతాల్లో రూపుదిద్దుకున్నాయి. టామ్‌ సెలెక్‌ సినిమా 'క్రాస్‌ఫైర్‌ ట్రయల్ ‌'ను ఇక్కడే కాల్గరీ సమీపంలోని ఒక రాంచ్‌లో నిర్మించారు. కానీ సినిమాలో మాత్రం ఆ ప్రాంతాన్ని వ్యోమింగ్‌గా చూపిస్తారు.

కాల్గరీ హెరాల్డ్‌, కాల్గరీ సన్ ‌ కాల్గరీలోని ప్రధాన వార్తా పత్రికలు. గ్లోబల్‌ సిటీటీవీ, CTV, CBC టెలివిజన్‌ నెట్‌వర్కులకు నగరంలో స్థానికంగా స్టూడియోలున్నాయి.

క్రీడలు మరియు వినోదం[మార్చు]

కెనడా ఒలింపిక్‌ పార్క్‌

రాకీ పర్వతాలకు సమీపంలో ఉన్న కారణంగా కాల్గరీ సంప్రదాయికంగా పలు ప్రఖ్యాత వింటర్‌ క్రీడలకు కేంద్రంగా నిలుస్తోంది. 1988 వింటర్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన నాటి నుంచీ పలు అతి పెద్ద వింటర్‌ క్రీడలకు నగరం కేంద్రంగా మారుతోంది. కెనడా ఒలింపిక్‌ పార్క్‌ (లూజ్‌, క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌, స్కీ జంపింగ్‌, డౌన్‌హిల్‌ స్కీయింగ్‌, స్నోబోర్డింగ్‌, వంటి పలు వేసవి క్రీడలకు ఇది కేంద్రం), ఒలింపిక్‌ ఓవల్‌ (స్పీడ్‌ స్కేటింగ్‌, హాకీ)లకు కూడా ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇక్కడి సదుపాయాలు పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులకి శిక్షణ కేంద్రాలుగా మారుతున్నాయి. వీటితో పాటు కెనడా ఒలింపిక్‌ పార్కు మౌంటేన్‌ బైకింగ్‌ సన్నాహకాలకు కూడా వేసవి నెలల్లో ఉపయోగపడుతుంది.

వేసవిలో బోవ్‌ నది ఫ్లై ఫిషర్‌మెన్‌ లకు చాలా ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు కాల్గరీవాసులకు గోల్ఫ్‌ అంటే ప్రాణం. ఈ ప్రాంతంలో దీన్ని నేర్పేందుకు లెక్కలేనన్ని కోర్సులున్నాయి.

2009 ఆగస్టులో వరల్డ్‌ వాటర్‌ స్కీయింగ్‌ చాంపియన్‌షిప్‌ ఫెస్టివల్‌కు కాల్గరీ ఆతిథ్యమిచ్చింది. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని స్థానిక రపిడేటర్‌ బే లోని వాటర్‌ స్కీ క్లబ్‌లో ఈ క్రీడలు జరిగాయి.

పెన్‌గ్రోత్‌ సాడిల్‌డోమ్‌

ఇక క్రీడా స్పర్ధలకూ ఇక్కడ కొదవ లేదు. బ్యాటిల్‌ ఆఫ్‌ ఆల్బెర్టాలో భాగంగా నగర క్రీడా బృందాలు ఎడ్మాంటన్‌ క్రీడా బృందాలతో నిత్యం పోటీ పడుతూ ఉంటాయి. కాల్గరీ ఫ్లేమ్స్‌, ఎడ్మాంటన్‌ ఓలియర్స్‌ మధ్య జరిగే నేషనల్‌ హాకీ లీగ్స్‌, కెనేడియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్స్‌, కాల్గరీ స్టాంపేడ్స్‌, ఎడ్మాంటన్‌ ఎస్కిమోస్‌ వంటివి వీటిలో ప్రఖ్యాతమైనవి.

ఫిష్‌ క్రీక్‌ ప్రొఫెషనల్‌ పార్క్‌, నోస్‌ హిల్‌ పార్క్‌, బోనెస్‌ పార్క్‌, ఎడ్వర్థీ పార్క్‌, ఇంగిల్‌వుడ్‌ బర్డ్‌ అభయారణ్యం, కాన్ఫెడరేషన్‌ పార్క్‌, ప్రిన్స్‌స్‌ ఐలాండ్‌ పార్క్‌ వంటి పలు పబ్లిక్‌ పార్కులు నగరంలో ఉన్నాయి. నోస్‌ హిల్‌ పార్క్‌ కెనడాలోనే అతి పెద్ద జాతీయ‌ పార్కు. ఈ పార్కులను కలుపుతూ నగరపు పొరుగు ప్రాంతాల వారు పలు మార్గాల్లో (నడచి, సైకిళ్లపై, రోలర్‌బ్లేడింగ్‌ ద్వారా) ఇక్కడి వస్తుంటారు. ఉత్తర అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచీ ఇక్కడికి రవాణా సదుపాయాలున్నాయి.[44]

నగర ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌ సంప్రదాయ స్థాపకుడు స్టూహార్ట్‌.ఈ రంగంలో చరిత్రలోకెల్లా అత్యంత ప్రఖ్యాతి పొందిన కుటుంబాల్లో వీరిది కూడా ఒకటి.

వృత్తి నైపుణ్యం ఉన్న క్రీడా జట్లు
క్లబ్ లీగ్ వేదిక స్థాపించిన సంవత్సరం చాంపియన్‌షిప్‌లు
కాల్గరీ స్టాంపేడర్స్‌ కెనేడియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ మెక్‌మోహన్‌ స్టేడియం 1945 6
కాల్గరీ ఫ్లేమ్స్‌ నేషనల్‌ హాకీ లీగ్‌ పెన్‌గ్రోత్‌ సాడిల్‌హెమ్‌ 1980 1
కాల్గరీ రోగ్‌నెక్స్‌ నేషనల్‌ లాక్రోసెస్‌ లీగ్‌ పెన్‌గ్రోత్‌ సాడిల్‌డోమ్‌ 2001 2
కాల్గరీ వైపర్స్ గోల్డెన్‌ బేస్‌బాల్‌ లీగ్‌ ఫుట్‌హిల్స్‌ స్టేడియం 2004 1
ప్రారంభ దశలో ఉన్న మరియు జూనియర్‌ క్లబ్‌లు
క్లబ్ లీగ్ వేదిక స్థాపించిన సంవత్సరం చాంపియన్‌షిప్‌లు
కాల్గరీ కాంక్స్‌ ఆల్బెర్టా జూనియర్‌ హాకీ లీగ్‌ మాక్స్‌ బెల్‌ సెంటర్‌ 1971 9
కాల్గరీ ముస్టాంగ్స్‌ ఆల్బెర్టా జూనియర్‌ హాకీ లీగ్‌ ఫాదర్‌ డేవిడ్‌ బాయెర్‌ ఒలింపిక్‌ ఎరీనా 1990 1
కాల్గరీ స్పీడ్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ కెనడా ఒలింపిక్‌ ఓవల్‌ 1990 10
కాల్గరీ హిట్‌మెన్‌ వెస్టర్న్‌ హాకీ లీగ్‌ పెన్‌గ్రోత్‌ సాడిల్‌డోమ్‌ 1995 2
కాల్గరీ ఓవల్‌ ఎక్స్‌ ట్రీమ్‌ వెస్టర్న్‌ విమెన్స్‌ హాకీ లీగ్‌ ఒలింపిక్‌ ఓవల్‌ 1995 4
కాల్గరీ మావెరిక్స్‌ రగ్బీ కెనడా సూపర్‌లీగ్‌ కాల్గరీ రగ్బీ పార్క్‌ 1998 1
కాల్గరీ యునైటెడ్‌ ఎఫ్‌సీ కెనేడియన్‌ మేజర్‌ ఇండోర్‌ సాకర్‌ లీగ్‌ స్టాంపేడ్‌ కారల్ 2007 0

ఆకర్షణలు[మార్చు]

ప్రిన్స్‌స్‌ ఐలాండ్‌ నుంచి డౌన్‌టౌన్‌ కాల్గరీ వీక్షణం

దిగువ పట్టణంలో రెస్టారెంట్లు, బార్లు, సాంస్కృతిక కేంద్రాలు, పబ్లిక్ స్క్వేర్లు (ఒలింపిక్‌ ప్లాజా), షాపింగ్‌లతో కూడిన మిశ్రమాలుంటాయి. ద కోర్‌ షాపింగ్‌ సెంటర్‌ (గతంలో కాల్గరీ ఏటన్‌ సెంటర్‌/టీడీ స్క్వేర్‌), స్టీఫెన్‌ అవెన్యూ, యూ క్లారీ మార్కెట్‌ వంటివి ప్రముఖ షాపింగ్‌ కేంద్రాల్లో కొన్ని. ఇక దిగువ పట్టణం‌ యొక్క పర్యాటక ఆకర్షణల్లో కాల్గరీ జూపార్కు, ద టెలుస్‌ వరల్డ్‌ ఆఫ్‌ సైన్స్‌, ద టెలుస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, ద చైనాటౌన్‌ డిస్ట్రిక్ట్‌, ద గ్లెన్‌బో మ్యూజియం, ద కాల్గరీ టవర్‌, ద ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ కాల్గరీ (ఏజీసీ), ద EPCOR సెంటర్‌ ఫర్‌ ద పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ వంటివి ముఖ్యమైనవి. రెండున్నరెకరాల్లో (1.01 హ హెక్టార్లలో) నిర్మించిన డివోనియన్‌ గార్డెన్స్‌ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పట్టణ ఇండోర్‌ గార్డెన్లలో ఒకటి. ఇది టీడీ స్క్వేర్‌ (షాపింగ్‌కు పైన)లో నాలుగో అంతస్తులో ఉంది.[45] ఇక దిగువ పట్టణ ప్రాంతం ప్రిన్స్‌స్‌ ఐలాండ్‌ పార్కుకు ప్రసిద్ధి చెందింది. యూ క్లారీ డిస్ట్రిక్ట్‌కు ఉత్తరంగా కొద్ది దూరంలో ఒక అర్బన్‌ పార్కుంది. డౌన్‌టౌన్‌కు నేరుగా దక్షిణాన మిడ్‌టౌన్‌, ద బెల్ట్‌లైన్‌ ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా వేగంగా నగరంలోకెల్లా అత్యంత జనసమ్మర్ధ ప్రాంతంగా, అత్యంత చురుకైన కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. డిస్ట్రిక్ట్‌ మధ్య ప్రాంతంలో ప్రఖ్యాత "17 అవెన్యూ" ఉంది. ఇక్కడి బార్లు, నైట్‌క్టబ్బులు, రెస్టారెంట్లు, షాపింగ్‌ అవెన్యూలు చాలా ప్రసిద్ధమైనవి. కాల్గరీ ఫ్లేమ్స్‌ ప్లే ఆఫ్‌ (2004) సందర్భంగా ఈ 17 అవెన్యూను కనీసం ఒక్కో గేమ్‌ నైట్‌కు 50 వేల మంది చొప్పున అభిమానులు, మద్దతుదారులు సందర్శించారు. రెడ్‌ జెర్సీ ధరించిన అభిమానుల కోలామలం కాస్తా వీధుల్లోని ప్లేఆఫ్‌ మాంకీయర్‌ "రెడ్‌ మైల్‌"కు దారి తీసింది. దిగువ పట్టణం‌కు నగర సీ ట్రెయిన్‌ లైట్‌ రైల్‌ (LRT) రవాణా వ్యవస్థ ద్వారా చాలా సులువుగా చేరుకోవచ్చు.

నగరపు పశ్చిమ భాగంలోని ప్రధాన ఆకర్షణల్లో హెరిటేజ్‌ పార్క్, చారిత్రక గ్రామం‌, చారిత్రక పార్కు వంటివి ఉన్నాయి. ఇవన్నీ 1914 నాటి అల్బెర్టాను కళ్లకు కడతాయి. స్టీమ్‌ రైల్‌, పెడల్‌ వీల్‌ బోటు, ఎలక్ట్రిక్‌ స్ట్రీట్‌ కారు వంటి పలు చారిత్రక వాహనాలు కూడా ఇక్కడ కొలువుదీరాయి. ఈ గ్రామం అనేకానేక భవనాలు, నిర్మాణాలతో దక్షిణ ఆల్బెర్టాను తలపిస్తూ దానికి అచ్చం నకలుగా కన్పిస్తుంది. కాల్గరీలోని ఇతర పెద్ద ఆకర్షణల్లో కెనడా ఒలింపిక్‌ పార్క్‌, స్ప్రూస్‌ మిడోస్‌ కూడా ఉంటాయి. ఇవేగాక సిటీ సెంటర్‌లో పలు షాపింగ్‌ సెంటర్లున్నాయి. నగరంలో పలు చాలా పెద్ద శివారు షాపింగ్‌ కాంప్లెక్సులూ కొలువుదీరాయి. వీటిలో అతి పెద్దవిగా చినూక్‌ సెంటర్‌, సౌట్‌ సెంటర్‌ మాల్‌ (దక్షిణాన), వెస్ట్‌హిల్స్‌, సిగ్నల్‌ హిల్‌ (నైరుతి), సౌత్‌ ట్రయల్‌ క్రాసింగ్‌, డీర్‌ఫుట్‌ మిడోస్‌ (ఆగ్నేయం), మార్కెట్‌ మాల్‌ (వాయవ్యం), సన్‌రిడ్జ్‌ మాల్‌ (ఈశాన్యం), కొత్తగా కట్టిన క్రాస్‌ ఐరన్‌ మిల్స్‌ (కాల్గరీ నగర సరిహద్దులకు కొద్దిగా ఉత్తరాన, ఎయిర్‌డ్రి నగరానికి దక్షిణాన) వంటివాటిని చెప్పుకోవచ్చు.

స్టీఫెన్‌ అవెన్యూk

అక్కడి లెక్కలేనన్ని ఆకాశహర్మ్యాలను బట్టి దిగువ పట్టణం‌ను ఇట్టే గుర్తు పట్టవచ్చు. వీటిలో కాల్గరీ టవర్‌, పెన్‌గ్రోత్‌ సాడిల్‌డోమ్‌ వంటి కొన్ని నిర్మాణాలైతే కాల్గరీకి కొండ గుర్తులని చెప్పవచ్చు. అధికారిక భవనాలు నగర వానిజ్య ప్రాంతం లోపలే ఉంటాయి. నివాస భవనాలు దాదాపుగా దిగువ పట్టణం‌కు పశ్చిమ చివర, దక్షిణం దిశగా, బెల్ట్‌లైన్‌ వైపు ఉంటాయి. ఈ భవనాలు నగరం శరవేగంగా వృద్ధి చెందిన రోజులతో పాటు దాని యొక్క పతనాలకు కూడా ప్రతీకలు. దిగువ పట్టణం‌ వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన పలు ఉదంతాలను, కాలాలను ఈ భవనాలను బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. 1950ల్లో ఇక్కడ ఆకాశహర్మ్యాల నిర్మాణ ఉధృతి‌ మొదలైంది. 1970ల దాకా ఇది కొనసాగింది. 1980 తర్వాత మాంద్యం సమయంలో నిర్మాణంలో ఉన్న పలు ఎత్తైన భవనాల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 1890ల చివరికి, 1990ల తొలి నాళ్లకు గానీ వీటిలో భారీ నిర్మాణ పనులు పున: ప్రారంభం కాలేదు. వీటికి కూడా 1988 నాటి శీతాకాలపు‌ ఒలింపిక్‌ క్రీడల ఆతిథ్యమే ఒకరకంగా కారణం అని చెప్పవచ్చు. నగర ఆర్థిక వ్యవస్థను అదే మరోసారి ఉత్తేజితం చేసింది.

మొత్తమీద నగరంలో 10 ఆఫీస్‌ టవర్లు 150 మీటర్ల (500 అడుగులు) కంటే ఎత్తున్నాయి. ఇవన్నీ సాధారణంగా 40 అంతస్తులు, ఆపై చిలుకున్న నిర్మాణాలే. వీటిలో అతి ఎత్తయిన నిర్మాణం సన్‌కర్‌ ఎనర్జీ సెంటర్‌ (గతంలో పెట్రో కెనడా సెంటర్‌). ఇది టరంటోను మినహాయిస్తే మిగతా కెనడా అంతటిలోనూ అత్యంత ఎత్తయిన నిర్మాణం.[46] కాల్గరీ బ్యాంకర్స్‌ హాల్‌ టవర్స్‌ కూడా కెనడాలోని అత్యంత ఎత్తయిన జంట టవర్ల కోవకు చెందుతాయి. దిగువ పట్టణం లోపల ఎత్తయిన కార్యాలయ టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ది బోవ్,‌ జేమీసన్‌ ప్లేస్‌, ఎయిత్‌ అవెన్యూ ప్లేస్‌ (రెండు టవర్లు), సెంటినల్‌ ప్లేస్‌ (రెండు టవర్లు), సిటీ సెంటర్‌ (రెండు టవర్లు), భారీ అంచనాలున్న (కేవలం పుకార్లు మాత్రమే అయినా) ఇంపీరియల్‌ ఆయిల్‌ అండ్‌ ఫస్ట్‌ కెనేడియన్‌ సెంటర్‌ II టవర్లు వాటిలో కొన్ని. 2008 నాటికి నగరంలో పూర్తయిన ఎత్తయిన భవనాలు 264 ఉన్నాయి. మరో 42 నిర్మాణంలో ఉండగా, ఇంకో 13 నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ఇంకో 63 భవనాలు కట్టాలన్న ప్రతిపాదనలున్నాయి.

దిగువ పట్టణం‌లోని కార్యాలయ భవనాలను చేరుకోవడానికి ప్రపంచంలోకెల్లా అత్యంత విస్తృతమైన స్కై వే నెట్‌వర్క్‌ (డోర్‌ పాదచారుల బ్రిడ్జిల మీదుగా కట్టినది) అందుబాటులో ఉంది. దీన్ని అధికారికంగా + 15 అని పిలుస్తారు. ఇలాంటి వంతెనలన్నీ సాధారణంగా15 feet (4.6 m) ఎక్కువ గ్రేడ్‌కు చెందినవనే కారణంగా ఆ పేరు పెట్టారు.[47]

జనాభా[మార్చు]

జాతులపరమైన మూలం[48]
జాతి సమూహం జనాభా శాతం
కెనడియన్లు 237,740 25.64%
ఆంగ్లేయులు 214,500 23.13%
స్కాట్లాండ్ వాసులు 164,665 17.76%
జర్మనలు 164,420 17.73%
ఐరిష్ 140,030 15.10%
ఉక్రైయిన్ వాసులు 125,720 13.56%
ఫ్రెంచివారు 113,005 12.19%
చైనీయులు 65,365 6.7%
కాల్గరీ స్టాంపేడ్‌ మైదానాలు

2010 మున్సిపల్‌ జనాభా లెక్కల ప్రకారం కాల్గరీ నగర జనాభా 1,071,515[49]. 2009 లెక్కల్లో తేలిన 1,06,455[50]తో పోలిస్తే ఇది 0.57 శాతం, అంటే 6,060 మందిని ఎక్కువగా కలిగి ఉంది.

2006 [25] స్టాటిస్టిక్స్ కెనడా[25] ఫెడరల్‌ జనాభా లెక్కల ప్రకారం కాల్గరీ నగర సరిహద్దుల లోపల 988,193 మంది నివసిస్తున్నారు. ఈ జనాభాలో 49.9 శాతం మంది పురుషులు, 50.1 శాతం మంది స్త్రీలు. మొత్తం జనాభాలో ఐదేళ్ల పిల్లలు 6 శాతం దాకా ఉన్నారని అంచనా వేశారు. ఈ వయసున్న పిల్లలు ఆల్టెర్టా జనాభాలో 6.2 శాతం, కెనడా మొత్తం జనాభాలో దాదాపు 5.6 శాతం ఉన్నారు.

2006లో నగర సగటు వయసు 35.7 ఏళ్లు. ఆల్టెర్టాలో ఇది 36 ఏళ్లు, కెనడా సగటు 39.5 ఏళ్లు.

2001లో ఆల్గర్టా జనాభా 878,866. 1996లో ఇది 768,082.[51]

2001, 2006 మధ్య కాల్గరీ జనాభా 12.4 శాతం మేర పెరిగింది. ఈ సమయంలో ఆల్బర్టా జనాభా 10.6 శాతం, కెనడా జనాభా 5.4 శాతం పెరిగాయి. ఇక ఆల్గర్టా జనసాంద్రతను ప్రావిన్సు సాంద్రత5.1 inhabitants per square kilometer (13.2/చ.మై)తో పోలిస్తే నగర సగటు 1,360.2 inhabitants per square kilometer (3,522.9/చ.మై)గా ఉంది.

ప్రొవిన్షియల్‌, దేశ ప్రభుత్వాలతో ఆర్థిక ఒప్పందాలు తదితర కుదుర్చుకోవడంలో సహకరించే సౌలభ్యాల కోసం ఏటా నగర పాలక సంస్థ చేపట్టే జనాభా లెక్కలు కూడా ఉంటాయి. వీటి ప్రకారం 2006లో కాల్గరీ జనాభా 991,000 కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉంది. కాల్గరీ సెన్సస్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం జనాభా అయితే మరీ 11 లక్షలుగా మాత్రమే నమోదైంది. ఇక కాల్గరీ ఎకనమిక్‌ రీజియన్‌ జనాభా 2006లో కేవలం 11.7 లక్షలుగా తేలింది. 2006 జూలై 5న మున్సిపల్‌ ప్రభుత్వం నగరంలో 10 లక్షల నివాసి జననాన్ని అధికారికంగా నమోదు చేసింది. ఆ సమయంలో నగర జనాభా రోజుకు దాదాపు 98 మంది చొప్పున వృద్ధి చెందుతున్నట్టు తేలింది.[52] ఇది కేవలం అంచనాలు, గణాంకాల ఆధారంగా వేసిన లెక్కల వల్ల తేలిన విషయమే. అది కూడా కేవలం కాల్గరీవాసులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలను మాత్రమే ఈ విషయంలో పరిగణనలోకి తీసుకున్నారు. 2006లో నికరంగా 25,794 మంది జన్మించారు. 2005లోని సంఖ్య అయిన 12,117తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే.[53]

మైనారిటీలు, మూలవాసులు

మైనారిటీల పరంగా చూస్తే టరంటో, వాంకోవర్‌ల తర్వాత కాల్గరీ CMA కెనడాలో మూడో అత్యంత వైవిధ్యభరితమైన నగరం. 2 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలను లెక్కలోకి తీసుకుని ఈ విషయాన్ని నిర్ధారించారు.[54]

కాల్గరీ నగరం 2006
ఆధారం: స్టాటిస్టిక్స్‌ కెనడా 2006[55]
జనాభా సమూహ శాతం మొత్తం జనాభా శాతం
మైనారిటీ గ్రూపులు చైనీయులు 65,365 28.1 6.7
నల్ల జాతీయులు 20,540 8.8 2.1
ఫిలిప్పీన్‌వాసులు 24,915 10.7 2.5
దక్షిణాసియన్లు 56,210 24.2 5.7
పశ్చిమ ఆసియన్లు 5,930 2.6 0.6
అరబ్బులు 11,245 4.8 1.2
లాటిన్ అమెరికన్ 13,120 5.6 1.3
ఆగ్నేయాసియా వాసులు 15,410 6.6 1.6
కొరియన్లు 6,710 2.9 0.7
జపనీయులు 4,490 1.9 0.5
బహూళ మైనారిటీలు 6,605 2.8 0.7
వేటిలోనూ చేరని వారు 1,920 0.8 0.2
మొత్తం మైనారిటీలు 232,465 100 రోజులు 23.7
మొత్తం మూలవాసులు 24,425 2.5
మైనారిటీలు, మూలవాసులు కానివారు 722,600 73.8
మొత్తం జనాభా 979,485 100 రోజులు
జనాభా చరిత్ర
సంవత్సరం జనాభా మార్పు (శాతంలో)
1901 4,091
1911 43,704 968.3
1921 63,305 44.8
1931 81,636 29.0
1941 87,267 6.9
1951 129,060 47.9
1961 249,641 93.4
1971 403,320 61.6
1981 591,857 46.7
1991 708,593 19.7
2001 879,003 24.0
2006 988,193 12.4
2010 (జనాభా లెక్కలు) 1,071,515 (8.4)

ప్రభుత్వం మరియు రాజకీయాలు[మార్చు]

కాల్గరీ కొత్త సిటీ హాల్‌, పాత సిటీ హాల్‌

కాల్గరీని సంప్రదాయబద్ధమైన నగరంగా పరిగణిస్తారు. సంప్రదాయ చిన్న సాంఘిక సంప్రదాయవాదులు, ఆర్థిక సంప్రదాయవాదుల ఆధిపత్యమే ఎక్కువ.[56] నగరం కార్పొరేట్‌ అధికార కేంద్రం కావడం వల్ల ఇక్కడి కార్మిక శక్తిలో చాలా మంది వైట్‌కాలర్‌ ఉద్యోగాల్లోనే చేరారు. ఇక్కడి చమురు, సహజవాయు రంగాల్లో పుట్టుకొచ్చిన అత్యధిక శాతం ఉద్యోగాలు కాస్తా 1971లో పీటర్‌ లాహీడ్‌ తాలూకు ప్రోగ్రెసివ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ఆవిర్భావానికి దారితీశాయి.[57] 1990ల్లో నగర ప్రధాన స్రవంతి రాజకీయ సంస్కృతిని రైట్‌వింగ్‌కు చెందిన రిఫార్మ్‌ పార్టీ ఆఫ్‌ కెనడా సమాఖ్య స్థాయిలో, ప్రోగ్రెసివ్‌ కన్జర్వేటివ్‌లు ప్రొవిన్షియల్‌ స్థాయిలో శాసిస్తూ వచ్చాయి.

కాలక్రమాన గ్రీన్‌ పార్టీ ఆఫ్‌ కెనడా కూడా కాల్గరీ రాజకీయల్లోకి చొచ్చుకొచ్చింది. 2004 సమాక్య ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ధోరణి మరీ ఎక్కువైంది. ఆ ఎన్నికల్లో కాల్గరీ నగరంలో 7.5 శాతం, కాల్గారి నార్త్‌ సెంటర్‌లో ఆ పార్టీకి 11.3 శాతం ఓట్లు లభించాయి. రైట్‌వింగ్‌కు చెందిన ఆల్బెర్టా కూటమి 26వ ఆల్బర్టా సాధారణ ఎన్నికల సమయంలో చురుగ్గా పనిచేసింది. ఆర్థిక, సామాజిక సంరక్షణ‌ సంస్కరణలు కావాలంటూ విపరీతంగా ప్రచారం చేసింది. అయితే ఆల్బర్టా కూటమి, దాని వారసునిగా చెప్పదగ్గ వైల్డ్‌రోజ్‌ కూటమి 2008 ప్రొవిన్షియల్‌ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

అయితే కాల్గరీ జనాభా పెరుగుతున్న కొద్దీ రాజకీయల్లో వైవిధ్యం కూడా పెరుగుతూ వచ్చింది. 2000 ప్రపంచ పెట్రోలియం కాంగ్రెస్‌, J26, G8 (2002) ప్రదర్శనల సందర్భంగా మరో ప్రత్యామ్నాయ ఉద్యమం కూడా చురుగ్గా సాగింది. వీటిలో పాల్గన్న నిరసనకారులు స్థానికులు మరియు బయటి వారి మిశ్రమంగా ఉన్నారు. నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. వాటితో పాటు పెట్టుబడిదారీ కలయిక వ్యతిరేక ఉద్యమాలూ సాగాయి.

మున్సిపల్‌ రాజకీయాలు[మార్చు]

కాల్గరీలో అల్టెర్టా మున్సిపల్‌ ప్రభుత్వ చట్టం (1995) ప్రకారం పాలన సాగుతుంది.[58] కాల్గరీ నగర కౌన్సిల్‌ సభ్యులను ఓటర్లు మూడేళ్లకోసారి ఎన్నుకుంటారు. తర్వాత ఎన్నికలు 2010 అక్టోబరు 18న జరగనున్నాయి. నగర కౌన్సిల్లో దాదాపు 14 వార్డు పెద్దలుంటారు. 2001లో తొలిసారి ఎన్నికైన మేయర్‌ డేవ్‌ బ్రాంకొనీర్‌ ప్రస్తుతం నగర మేయర్‌గా ఉన్నారు.[1]

2007లో కాల్గరీ నిర్వహణ బడ్జెట్‌ 201 కోట్ల డాలర్లు. ఇందులో 41 శాతం ఆస్తి పన్నుల ద్వారా వసూలవుతుంది. ఏటా 75.7 కోట్ల ఆస్తి పన్ను రూపంలో వస్తుంది. ఇందులో 38.6 కోట్లు నివాస, 37.1 కోట్లు నివాసేతర ఆస్తుల నుంచి వసూలవుతుంది. ఖర్చుల్లో 54 శాతం దాకా ఉద్యోగుల వేతనాలు, జీతాలు, ఇతర బెనిఫిట్స్‌కు పోతాయి.[59]

ప్రాంతీయ రాజకీయాలు[మార్చు]

కాల్గరీలో 23 మంది ప్రాంతీయ‌ శాసన సభ్యులులున్నారు. వీరిలో 16 మంది ప్రోగ్రెసివ్‌ కన్జర్వేటివ్‌లు, నలుగురు ఆల్బర్టా లిబరల్స్‌, ఇద్దరు వైల్డ్‌రోజ్‌ కూటమి సభ్యులు, ఒక స్వతంత్రుడు ఉన్నారు. సరిగ్గా 14 ఏళ్ల (1992 డిసెంబరు 14 నుంచి 2006 డిసెంబరు 14 మధ్య) పాటు ఆల్బర్టా ప్రాంతీయ‌ ప్రధాని, ప్రోగ్రెసివ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ ఆఫ్‌ ఆల్బర్టా నేత రాల్ఫ్‌ క్లెయిన్‌ కాల్గరీ ఎల్బో స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1989లో ఆల్బర్టా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2006 సెప్టెంబరు 20న రాజీనామా చేశారు.[60] ఆయన స్థానంలో ప్రోగ్రెసివ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రొవిన్షియల్‌ ప్రధానిగా ఎడ్‌ స్టెమాక్‌ ఎన్నికయ్యారు. ఆయన ఫోర్ట్‌ సస్కాచ్వాన్‌ వెగ్రెలీ శాసన సభ్యులు. ఈ నాయకత్వ మార్పు నేపథ్యంలో కాల్గరీకి ప్రాంతీయ అంశాల్లో ఆధిపత్యం, ప్రాతినిధ్యం కాస్త తగ్గాయి. ఎందుకంటే ప్రాంతీయ‌ అసెంబ్లీలో నగర మంత్రుల సంఖ్య ఎనిమిది నుంచి మూడుకు తగ్గింది. కాల్గరీ నుంచి జార్గ్‌ మెక్‌లీన్‌ రూపంలో మంతివర్గంలో ఇప్పుడు ఒకే సభ్యుడు తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.[61] రాల్ఫ్‌ క్లెయిన్‌కు చెందిన ఓల్డ్‌ రైడింగ్‌ స్థానం 2007 జూన్ ఉప ఎన్నికలో అల్బెర్టా లిబరల్స్‌కు చెందిన క్రెయిగ్‌ షెఫిన్స్‌ ఖాతాలో పడింది. ఈ స్థానాన్ని పీసీ పార్టీ 1971 నుంచీ తమ అధీనంలో ఉంచుకుంటూ వచ్చింది.[62] 2008 సాధారణ ఎన్నికల్లో టోరీలకు వాళ్ల కంచుకోటల వంటి పలు స్థానాలతో సహా భారీ ఓటమి తథ్యమని పలువురు పరిశీలకులు జోస్యం చెప్పారు. దీన్ని వారు ముందే ఒప్పుకుని పెద్దగా పట్టించుకోలేదన్న భావన వ్యక్తమైంది.

2008 సాధారణ ఎన్నికల్లో లిబరల్స్‌ బలం పెరిగిపోయింది. కాల్గరీ నగరంలో కూడా వారి స్థానాల సంఖ్య ఒకటి నుంచి 5కు పెరిగింది. స్టెల్మాక్‌ యంత్రాంగం పెద్దగా పని చేయకపోవడంతో నగరవాసులు బాధలు పడుతున్న నేపథ్యంలో కాల్గరీలో ఈ ఫలితాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కాకపోతే ఎడ్మాంటన్‌లో పీసీ పార్టీ మంచి విజయం సాధించినా కాల్గరీలో మాత్రం ఓటమి పాలవడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. మొత్తం మీద లిబరల్స్‌ స్థానాల సంఖ్య 9కి పరిమితమైంది. దాంతో చరిత్రలో తొలిసారిగా కాకస్‌లో వారి మెజారిటీ కాల్గరీ విజయాల పైనే ఆధారపడింది.

సమాఖ్య రాజకీయాలు[మార్చు]

కాల్గరీలోని మొత్తం 8 సమాఖ్య ఎంపీ స్థానాల్లోనూ కన్జర్వేటివ్‌ పార్టీ ఆఫ్‌ కెనడా (CPC)యే పాతుకుపోయింది.[63] CPCకి ముందు ఆ స్థానాల్లో కొనసాగిన వారు నగరంలోని సమాఖ్య స్థానాల పై సంప్రదాయికంగా ఆధిపత్యం చలాయించారు. కాల్గరీలోని ఫెడరల్‌ ఎలక్టరేట్‌ డిస్ట్రిక్ట్ ‌నుంచి ప్రధాని, సీపీసీ నేత స్టీఫెన్‌ హార్పర్‌ ప్రాతినిధ్యం వహించారు. గమ్మత్తుగా అదే స్థానానికి CPCకి ముందున్న రిఫార్మ్‌ పార్టీ ఆఫ్‌ కెనడాకు చెందిన నేత ప్రెస్టన్‌ మానింగ్‌ ప్రాతినిధ్యం వహించారు. ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్‌ పార్టీ ఆఫ్‌ కెనడా మాజీ నేత, మాజీ ప్రధని క్లార్క్‌ (ఈయన కూడా CPC మాజీ నేతే) రైడింగ్‌ ఆఫ్‌ కాల్గరీ సెంటర్‌ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. కెనడాకు చెందిన 22 మంది ప్రధానుల్లో ఇద్దరు, కాల్గరీ ఎంపీలుగా ఉంటూ ఆ పదవి చేపట్టిన వారే. వీరిలో తొలి వ్యక్తి ఆర్‌బీ బెన్నెట్‌. ఆయన కాల్గరీ వెస్ట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1930 నుంచి 1935 దాకా ప్రధానిగా చేశారు.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

వెస్ట్‌జెట్‌ ప్రధాన కార్యాలయం
పరిశ్రమ ద్వారా ఉపాధి
పరిశ్రమ కాల్గరీ అల్బెర్టా
వ్యవసాయం (6.1) 10.9%
నిర్మాణం 15.8% 15.8%
వర్తకం 15.9% 15.8%
విత్తం 6.4% 5.0%
ఆరోగ్యం, విద్య 25.1% 18.8%
వ్యాపారం, సేవలు 25.1% 18.8%
ఇతర సేవలు 16.5 18.7%

కాల్గరీ ఆర్థిక వ్యవస్థ పై చమురు, సహజవాయువు పరిశ్రమల ఆధిపత్యం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అయితే నగర స్థూల దేశీయోత్పత్తిలో ఏకైక పెద్ద వాటా మాత్రం ఇప్పటికీ ఆ పరిశ్రమదే. 2006లో కాల్గరీ వాస్తవ జీడీపీ (1997 డాలర్ల లెక్కలో) C$5,238.6 కెనడా డాలర్లు. ఇందులో సహజవాయువు, గనుల వాటా 12 శాతం.[64] ఇక్కడి అతి పెద్ద చమురు, సహజవాయువు కంపెనీల్లో బీపీ, ఎన్‌కనా, ఇంపీరియల్‌ ఆయిల్‌, సంకర్‌ ఎనర్జీ, షెల్‌ కెనడా, ట్రాన్స్‌ కెనడా వంటివి ఉన్నాయి. ఇలా కెనడాలోని చమురు, సహజవాయువు ఉత్పత్తిదారుల్లో 87 శాతం, బోగ్గు ఉత్పత్తిదారుల్లో 66 శాతం మంది కాల్గరీలోనే కొలువయ్యారు.[65]

కార్మిక శక్తి (2006)
రేటింగులు కాల్గరీ అల్బెర్టా కెనడా
ఉద్యోగిత 72.3% 70.9% 62.4%
నిరుద్యోగం 4.1% 4.3% 6.6%
భాగస్వామ్యం 75.4% 70.9% 66.8%

1996లో కెనేడియన్‌ పసిఫిక్‌ రైల్వే తన ప్రధాన కార్యాలయాన్ని మాంట్రియల్‌ నుంచి కాల్గరీకి మార్చింది. దాంతోపాటే అక్కడి 3,100 ఉద్యోగాలు కూడా నగరానికి తరలివచ్చాయి.[ఆధారం కోరబడింది] ఇప్పుడిది నగరంలోని అతి పెద్ద ఉద్యోగ కల్పన సంస్థల్లో ఒకటి. ఆల్బర్టాలోని సానుకూల కార్పొరేట్‌ పన్నుల నుంచి పూర్తిస్థాయిలో లబ్ధి పొందేందుకు, తన చమురు కార్యకలాపాలకు సమీపంగా ఉండేందుకు ఇంపీరియల్‌ ఆయిల్‌ కూడా తన ప్రధాన కార్యాలయాన్ని టరంటో నుంచి కాల్గరీకి 2005లో మార్చింది.[66] దీంతోపాటే దాదాపు 400 కుటుంబాలు ఇక్కడికి మకాం మార్చాయి.

కాల్గరీలోని ఇతర పెద్ద కంపెనీల్లో షా కమ్యూనికేషన్స్‌ (7,500 ఉద్యోగులు), నోవా కెమికల్స్‌ (4,900 ఉద్యోగులు), టెలుస్‌ (4,500 ఉద్యోగులు), నెక్సెన్‌ (3,200 ఉద్యోగులు), CNRL‌ (2,500 ఉద్యోగులు), షెల్‌ కెనడా (2,200 ఉద్యోగులు), డౌ కెమికల్స్‌ కెనడా (2,000 ఉద్యోగులు) వంటివి ఉన్నాయి.[ఆధారం కోరబడింది]

నగరంలో దిగువ పట్టణం‌ మధ్యలో 58 అంతస్తులతో కూడిన ఆకాశ హర్మ్యం బో నిర్మాణాన్ని ఎన్‌కనా కంపెనీ 2006 అక్టోబరులో ప్రకటించింది. ఇది కంపెనీకి కొత్త కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయంగా మారనుంది. అంతేగాక టరంటోను మినహాయిస్తే దేశంలోకెల్లా అత్యంత ఎత్తయిన భవనం కూడా ఇదే అవుతుంది.[67]

2005 నాటికి కాల్గరీలో మొత్తం 649,300 మంది కార్మికులున్నారు (పాల్గొనే శాతం 76.3%‌).[68] 2006లో నగరంలో నిరుద్యోగత కెనడలోని పెద్ద నగరాలన్నింట్లోనూ అతి తక్కువగా నమోదైంది (3.2 శాతం)[69]. దాంతో నగరంలో సాధారణ, నిపుణులైన కార్మికుల కొరత మరీ తీవ్రంగా మారింది.[70] దాంతో కార్మికులకు బోనస్‌లివ్వడం ఇక్కడి సేవా పరిశ్రమలకు ఆనవాయితీ. ఇక్కడ గ్రేడ్‌ స్కూల్‌ విద్యార్థులకే స్థానిక రెస్టారెంట్లలో సగటున గంటకు 15 కెనడా డాలర్ల వేతనం లభిస్తుంది.[71][72] దిగువ పట్టణం‌లో పలు హోటళ్లయితే కార్మికుల లేమితో అంతస్తులకు అంతస్తులనే మూసేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడి నివాస గృహాల బూమ్‌, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు, చమురు రంగంలోని డిమాండ్‌ వంటివన్నీ కలిసి కార్మిక శక్తిపై బాగా ఒత్తిడి పెంచాయి.

వెస్ట్‌జెట్‌ కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి[73] సమీపంలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఎనర్జెట్‌ కూడా విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.[74] కెనేడియన్‌ ఎయిర్‌లైన్స్‌కు[75] (ఇది ఎయిర్‌ కెనడా అనుబంధ సంస్థ) కూడా మూసివేతకు ముందు దాకా నగర సమీపంలోనే ప్రధాన కార్యాలయం ఉండేది.[76]

విద్య[మార్చు]

ఎస్‌ఏఐటీ హెరిటేజ్‌ హాల్‌

2005లో దాదాపు 97,000 మంది విద్యార్థులు నగరంలోని 251 పాఠశాలల్లో K-12 దాకా చదువుతున్నారు. వీరంతా కాల్గరీ విద్యా సంస్థ నడిపే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు.[77] మరో 43 వేల మంది కల్టరీ క్యాథలిక్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ బోర్డు నడిపే దాదాపు 95 ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్నారు.[78] ఇక చిన్నదయిన ఫ్రాంకోఫోన్‌ కమ్యూనిటీకి తమకంటూ సొంతగా ఫ్రెంచి భాషా స్కూల్‌ బోర్డులు (ప్రభుత్వ, క్యాథలిక్‌) ఉన్నాయి. ఇవి కాల్గరలోనే ఉన్నాయి. అయితే స్థానిక జిల్లా విద్యార్థులను కూడా ఇవి చేర్చుకుంటాయి. నగరంలో మరికొన్ని ప్రభుత్వ చార్టర్‌ స్కూళ్లు కూడా ఉన్నాయి. కాల్గరీలో దేశంలోనే తొలి హైస్కూలుతో సహా పలు ప్రఖ్యాత పాఠశాలలున్నాయి. వీటిలో చాలా వాటిని ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించగల అథ్లెట్లను తయారు చేసేందుకు నిర్మించారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ వంటివి ఇందుకు ఉదాహరణ. వీటితో పాటు మౌంటేన్‌ వ్యూ అకాడెమీ, రాన్‌డేల్‌ కాలేజ్‌, రాన్‌డేల్‌ అకాడెమీ, క్లియర్‌ వాటర్‌ అకాడెమీ, చింకూ విండ్స్‌ అడ్వెంటిస్ట్‌ అకాడెమీ, వెబర్‌ అకాడెమీ, డెల్టా వెస్ట్‌ అకాడెమీ, మాస్టర్స్ అకాడెమీ, మెన్నో సైమన్స్‌ క్రిస్టియన్‌ స్కూల్‌, వెస్ట్‌ ఐలాండ్‌ కాలేజీ, ఎడ్జ్‌ స్కూల్‌ వంటి పలు ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా కాల్గరీ నిలయం.

పశ్చిమ కెనడాలోకెల్లా అతి పెద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల లార్డ్‌ బెవర్‌బ్రూక్‌ హైస్కూలుకు కాల్గరీ నిలయం. ఇందులో 2005-2006 విద్యా సంవత్సరంలో 2,241 మంది విద్యార్థులు చదివారు.[79]

ఐదు అతి పెద్ద ప్రభుత్వ సెకండరీ విద్యా సంస్థలకు కాల్గరీ నిలయం. యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గరీ నగరంలో ప్రథమ డిగ్రీ ప్రదాన సంస్థ. ఇందులో 2006లో 28,807 మంది విద్యార్థులు చదివారు.[80] ఇతర సెకండరీ విద్యా సంస్థల్లో మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయంలో 13,000 మంది విద్యార్థులున్నారు, ఇది పలు రంగాల్లో డిగ్రీలు ప్రదానం చేస్తుంది, SAIT పాలిటెక్నిక్‌ సంస్థలో 14 వేల మంది విద్యార్థులున్నారు, ఇది పాలిటెక్నిక్‌, అప్రెంటిస్‌ విద్య నేర్పుతుంది. సర్టిఫికెట్లు, డిప్లొమాలు, అప్లైడ్‌ డిగ్రీలు ప్రదానం చేస్తుంది. వీటితో పాటు SAIT ప్రధాన క్యాంపస్‌ (వాయవ్య దిక్కుగా దిగువ పట్టణము‌కు కాస్త ఉత్తరాన) వంటివి కూడా ఉన్నాయి.

బో వ్యాలీ కాలేజ్‌, ఆల్బెర్టా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ వంటి చిన్న పోస్ట్‌ సెకండరీ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.

ఆంబ్రోస్‌ యూనివర్సిటీ కాలేజ్‌, అఫీషియల్‌ కెఏడియన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ద చర్చ్‌ ఆఫ్‌ ద నజరేన్‌, ద క్రిస్టియన్‌ అండ్‌ మిషినరీ అలయన్స్‌, సెయింట్‌ మేరీ యూనివర్సిటీ కాలేజ్‌ వంటి పలు ప్రైవేట్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ సంస్థలు కూడా కాల్గరీలో ఉన్నాయి. వీటితో పాటు డీవ్రై కెరీర్‌ కాలేజీకి కెనడాలో ఏకైక క్యాంపస్‌ కూడా కాల్గరీ నగరంలోనే ఉంది.

మీడియా[మార్చు]

రవాణా[మార్చు]

దస్త్రం:CT SD160 2.jpg
కాల్గరీ సీ ట్రెయిన్‌ వ్యవస్థ

కేంద్ర, పశ్చిమ కెనడాలోని పలు ప్రధాన భాగాలకు కాల్గరీయే రవాణా కేంద్రం. కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయం (YYC) నగరానికి ఈశాన్య దిక్కున ఉంది. విమానాల రాకపోకల పరంగా కెనడాలో ఇది మూడో అతి పెద్ద విమానాశ్రయం. ఇక్కడి నుంచి భారీ పరిమాణంలో సరుకులు రవాణా అవుతుంటాయి. ఇక్కడి నుంచి కెనడాలోని అన్ని నగరాలతో పాటు అమెరికా, ఐరోపా‌, మధ్య అమెరికా, ఆసియా దేశాల నగరాలకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులున్నాయి. ట్రాన్స్‌ కెనడా హైవే, ద కెనేడియన్‌ పసిఫిక్‌ రైల్వే (CPR) ప్రధాన లైన్‌ (CPR అలిత్‌ యార్డ్‌ను కూడా కలుపుకుని)ల్లో కూడా కాల్గరీకి ప్రధాన భాగస్వామ్యముంది. ఇది నగరాన్ని సరుకు రవాణాకు కూడా ప్రధాన కేంద్రంగా మార్చింది. రాకీ మౌంటెనీర్‌, రాయల్‌ కెనేడియన్‌ పసిఫక్‌ ఆపరేషన్స్‌ రైల్‌ టూర్‌ వంటి సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి. VIA రైల్‌ మాత్రం కాల్గరీకి అంతర నగర సేవలను ఇప్పుడు అందించడం లేదు.

కాల్గరీలో వీధుల నెట్‌వర్క్‌, ఫ్రీవే వ్యవస్థ పకడ్బందీగా ఉంటాయి. ఇందులో చాలావరకు గ్రిడ్‌ పద్ధతిన ఉంటుంది. ఇందులో రోడ్లకు అవెన్యూలతో పాటుగా నంబర్లుంటాయి. ఇవన్నీ సాధారణంగా తూర్పు-పడమరలుగా సాగుతుంటాయి. వీధులేమో ఉత్తర దక్షిణాలుగా ఉంటాయి. 1904 దాకా ఇక్కడి వీధులకు ఆయా సంవత్సరాలనే పేర్లుగా పెట్టారు. సిటీ సెంటర్‌ నుంచి అన్ని వైపులా ఉండే వీధులకు అలాగే నామకరణం జరిగింది.[81] ఆ తర్వాత నుంచీ వీధులకు నంబర్లివ్వడం మొదలైంది. ఇక నివాస ప్రాంతాలు, ఫ్రీవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలలోని రోడ్లు గ్రిడ్‌ పద్ధతిలో ఉండవు. అందుకే సాధారణంగా వీటికి నంబర్లు కూడా ఇవ్వరు. అయితే అభివృద్ధి, నగర నియమావళి ప్రకారం ఇలా నంబర్లు లేని వీధులను, వాటి కమ్యూనిటీ పేరును ముందు చేర్చి పిలుస్తారు. అలా వాటిని గుర్తించడం సులువుగా ఉంటుంది.

కాల్గరీ ట్రాన్సిట్‌ బస్సులు, లైట్‌ రైళ్ల ద్వారా నగరంలో రవాణా సేవలను అందిస్తుంది. C-ట్రెయిన్‌గా పిలిచే కాల్గరీ రైల్వే వ్యవస్థ ఉత్తర అమెరికా మొత్తంలో ఇలాంటి వ్యవస్థల్లో తొలి వరుసలో నిలుస్తుంది (ఎడ్మాంటన్‌ LRT, శాన్‌డీగో ట్రాలీల తర్వాత)48.8 kilometres (30.3 mi). ఇందులో మూడు లైన్ల (రెండు రూట్లు) పట్టాలుంటాయి. (ఇవి చాలా వరకు దిగువ పట్టణం‌లోని 42 శాతం జనాభా రవాణా అవసరాలు తీర్చేలా గ్రేడ్లవారీగా ఉంటాయి). 2009 చివర్లో సీ ట్రెయిన్‌ వ్యవస్థ ఒక్కో పనిదినంలో సగటున 266,100 మందిని చేరవేస్తూ మాంటెరీ మెట్రో[82], టరంటో స్ట్రీట్‌కార్‌ వ్యవస్థల తర్వాత ఉత్తర అమెరికా మొత్తంలో అత్యంత బిజీ లైట్‌ ట్రెయిన్‌ వ్యవస్థగా రికార్డులకెక్కింది.[83] ఇక బస్‌ వ్యవస్థలో నగరంలో 160కి పైగా రూట్లు,800 వాహనాలున్నాయి.[84][85]

దాదాపు 260 kilometres (162 mi)కు ప్రత్యామ్నాయంగా షేర్డ్‌ బైక్‌వేలు కూడా వీధుల్లో కన్పిస్తాయి. వీటిలో (సైకిల్‌, నడక, రోలర్‌బ్లేడింగ్‌ వంటివి ఉంటాయి). ఇవన్నీ దాదాపు 635 kilometres (395 mi)కు పైగా దూరంలో ఉంటాయి.[44]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

వైద్య కేంద్రాలు మరియు ఆస్పత్రులు
అల్బెర్టా పిల్లల ఆస్పత్రి
టామ్‌ బేకర్‌ క్యాన్సర్‌ కేంద్రం, స్పెషల్‌ సర్వీసెస్‌ భవనం (ఎస్‌ఎస్‌బీ)

కాల్గరీలో మూడు పెద్ద అడల్ట్‌ కేర్‌ ఆస్పత్రులు, ఒక పెద్ద పీడియాట్రిక్‌ అక్యూట్‌ కేర్‌ సైట్‌ (ద ఫుట్‌హిల్స్ మెడికల్‌ సెంటర్‌) ఉన్నాయి. ఇది ఆల్బెర్టాలోకెల్లా అతి పెద్దది. పీటర్‌ లీడ్‌ సెంటర్‌, రాకీవ్యూ జనరల్‌ హాస్పిటల్‌, ఆల్బెర్టా పిల్లల ఆస్పత్రి, (ఇది ప్రయరీ ప్రాంతాలలో కెల్లా అతి పెద్దది) వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ ఆల్బెర్టా వైద్య సేవల విభాగంలో కాల్గరీ ఆరోగ్య ప్రాంత విభాగం పర్యవేక్షిస్తుంది. టామ్‌ బేకర్ ‌క్యాన్సర్‌ సెంటర్‌కు కూడా కాల్గరీ వేదిక. ఇది ఆల్బెర్టాలోకెల్లా చాలా పెద్ద క్యాన్సర్‌ కేంద్రం (ఫుట్‌హిల్స్‌ మెడికల్‌ సెంటర్‌ సమీపంలో ఉంది). గ్రేస్‌ విమెన్స్‌ వైద్య సేవల కేంద్రం పలు రకాల సేవలందిస్తుంది. లిబిన్‌ కార్డియోవాస్క్యులర్‌ సంస్థ కూడా ఉంది. షెల్డన్‌ ఎం.చుమిర్‌ సెంటర్‌ (ఇది నిరంతర సేవలందించే పెద్ద క్లినిక్‌), రిచ్‌మండ్‌ రోడ్‌ డయాగనస్టిక్‌, ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (RRDTC), వీటితో పాటు మరికొన్ని వందలాది చిన్న వైద్య, దంత క్లినిక్‌లు కాల్గరీలో ఉన్నాయి. కాల్గరీ విశ్వవిద్యాలయ వడియ కేంద్రం‌ కూడా కాల్గరీ ఆరోగ్య సంస్థతో కలిసి క్యాన్సర్‌, కార్డియోవాస్క్యులర్‌, మధుమేహం, జాయింట్‌ గాయాలు, మోకాళ్ల నొప్పులు, జన్యుసంబంధ వ్యాధులకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నది.[86]

కాల్గరీలోని నాలుగు అతిపెద్ద ఆస్పత్రుల్లో కలిపి 2,100 కంటే ఎక్కువ పడకలున్నాయి. ఇవి 11,500 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.[87]

పీటర్‌ లాయిడ్‌ కేంద్రం దక్షిణ ద్వారం
గ్లెన్‌మోర్‌ రిజర్వాయర్‌ ఎదురుగా సెంటర్‌ రాకీవ్యూ జనరల్‌ హాస్పిటల్‌
అల్బెర్టాలోకెల్లా అతి పెద్ద ఆస్పత్రి ఫుట్‌హిల్స్‌ మెడికల్‌ సెంటర్‌ప్రధాన భవనం

సైన్యం[మార్చు]

కెనేడియన్‌ మిలిటరీ ఉనికి స్థానిక ఆర్థికవ్యవస్థ, సంస్కృతుల్లో 20వ శతాబ్ది తొలి నాళ్ల నుంచీ మమేకమైపోయింది. స్వాడ్రన్‌ ఆఫ్‌ స్ట్రాత్‌కోనా హార్స్‌ విధులతో ఇది మొదలైంది. నగరానికి సొంత యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు విఫల యత్నాలు చాలాకాలం పాటు జరిగాయి. అనంతరం 103వ రెజిమెంట్‌ (కాల్గరీ రైఫిల్స్‌)ను ఎట్టకేలకు 1910 ఏప్రిల్‌లో ఏర్పాటు చేశారు. కెనేడియన్‌ ఫోర్సెస్‌ బేస్‌ (CFB) కాల్గరీని క్యూరీ బ్యారక్స్‌, హార్వీ బ్యారక్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటు చేవారు. ఈ బేస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌నేషనల్‌ డిఫెన్స్‌ (DND) సంస్థ నగర యూనిట్‌లో ప్రధాన పాత్ర పోషించింది. చివరికి 1998లో దీన్ని రద్దు చేశారు. ఆ తర్వాత చాలా యనిట్లు CFB ఎడ్మాంటన్‌కు తరలివెళ్లాయి. మూసివేత తర్వాత కూడా కెనేడియన్‌ ఫోర్సెస్‌లోని రిజర్వ్‌ దళాల్లో చాలా వరకు, క్యాడెట్‌ యూనిట్లలో కొన్ని కాల్గరీ అంతటా కన్పిస్తాయి. వీటిలో HMCS టెక్‌మెష్‌ నావల్‌ రిజర్వ్‌ యూనిట్‌, ద కింగ్స్‌ ఓన్‌ కాల్గరీ రెజిమెంట్‌ (RCAC), ద కాల్గరీ హైలాండర్స్‌ (మరియు బ్యాండ్‌), 746 కమ్యూనికేషన్‌ స్క్వాడ్రన్‌, 14 (కాల్గరీ) సర్వీస్‌ బెటాలియన్‌, 15 (ఎడ్మాంటన్‌) ఫీల్డ్‌ అంబులెన్స్‌ డిటాచ్‌మెంట్‌ కాల్గరీ, 41 CER‌ డిటాచ్‌మెంట్‌ కాల్గరీ (33-ఇంజనీర్స్‌ స్క్వాడ్రన్‌)లతో పాటు పలు చిన్న క్యాడర్లున్నాయి.

సమకాలీన అంశాలు[మార్చు]

ఇటీవలి ఆర్థిక వృద్ది‌, శరవేగంగా సాగిన పెరుగుదల కాల్గరీలో పట్టణీకరణ, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలకు కూడా దారితీశాయి. సూ టినా ఫస్ట్‌ నేషన్‌ మినహా భౌగోళ వ్యాప్తికి మరే ఇతర అడ్డంకీ లేని కారణంగా కాల్గరీ నగర శివార్లు నానాటికీ పెరుగుతూ పోయాయి. ఇది వారికి రవాణా మౌలిక వసతులను కల్పించడంలో సమస్యలకు కారణమైంది.

డౌన్‌టౌన్‌ వెస్ట్‌ ఎండ్‌లో కండోమినియమ్స్‌

బెల్ట్‌లైన్‌ పునరభివృద్ధి, దిగువ పట్టణ తూర్పు గ్రామం‌ల అభివృద్ధి పనులు ఇంకా సాగుతుండగానే అంతర నగరములో విపరీతముగా ఉన్న జనానికి కూడా వసతుల కల్పన నగరానికి సవాలుగా మారింది. ఇవేవి చేసినా విస్తరణ మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది.[88] 2003లో దిగువ పట్టణం‌, పొరుగు ప్రాంతాలైన (దిగువ పట్టణ‌ వాణిజ్య కేంద్రం‌, దిగువ పట్టణ తూర్పు గ్రామం‌, దిగువ పట్టణ పశ్చిమ కొన, యూ క్లెయిరీ, చైనాటౌన్‌) కలిపి 12,600 దాకా మాత్రమే లెక్క తేలాయి. వీటికి తోడు దిగువ పట్టణమున‌కు దక్షిణాన బెల్ట్‌లైన్‌లో మొత్తం 30 వేల జనాభాలో 17,200[89] దాకా ఉంది.

ఈ వృద్ధి కారణంగా కాల్గరీ నగర నైరుతీ సరిహద్దులు ప్రస్తుతం సూ తినా నేషన్‌ ఇండియన్‌ రిజర్వ్‌కు దాదాపుగా ఆనుకునేలా విస్తరించాయి. నగరంలోని నైరుతి మూలల్లో ఇటీవల జరిగిన నివాస ప్రాంతాల అభివృద్ధి పనుల వల్ల నగరం లోపలి వైపుకు [90] భారీ రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా దారి తీసింది. కానీ ఈ నిర్మాణాల విషయంలో సూ తినాతో చర్చల్లో ఏర్పడ్డ సంక్లిష్టత కారణంగా నిర్మాణ పనులు ఇంకా మొదలవలేదు.[91]

నివాసాలు లేకపోవటంతో పాటు కాల్గరీ నగరంలో పలు సామాజిక, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి.[92] దిగువ పట్టణ కేంద్రం మరియు నగర అంతర్భాగంలో నిర్దిష్ట భాగాలు, అదే విధంగా నగరానికి తూర్పున ఉన్న కొన్ని పొరుగు ప్రాంతాలలో అధిక శాతంలో ఉన్న ప్రతికూల నివాసితులకి ఆవాసాలుగా మారాయి. నగరం తూర్పు దిశల్లో 1980లో 6.4 శాతంగా ఉన్న పొరుగు నిరుపేదల సంఖ్య కాస్తా 1990 నాటికి ఏకంగా 20 శాతానికి పెరిగిపోయింది.[93]

కాల్గరీ, ఆల్బెర్టా ప్రాంతాలు సంప్రదాయికంగా నివాసానికి చౌకగా ఉండే ప్రాంతాలే అయినప్పటికీ అనంతర కాలంలో ఇక్కడ జరిగే భారీ అభివృద్ధి (ఇంధన రంగం, ఉత్తరాదిన చమురు ఇసుక ప్రాజెక్టుల్లో అభివృద్ధే ఇందుకు చాలావరకు కారణం) రియల్‌ఎస్టేట్‌ బూమ్‌కు దారి తీసింది. ఫలితంగా కాల్గరీలో ఇళ్ల ధరలు ఇటీవలి సంవత్సరాలలో బాగా పెరిగిపోయాయి. కానీ 2007 రెండో అర్ధ భాగం నుంచీ ఇవి స్తంభించిపోయాయని చెప్పవచ్చు.[94] వాణిజ్య దిగువ పట్టణ కార్యాలయ‌ స్థలాల పరంగా కాల్గరీ 2006 నవంబరులో కెనడాలోకెల్లా అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. నివాస ప్రాంత రియల్‌ ఎస్టేట్‌ ధరల్లో వాంకోవర్‌ తర్వాత దేశంలో రెండో స్థానం దక్కించుకుంది.[95] జీవన వ్యయం, ద్రోవ్యోల్బణాలు దేశంలోకెల్లా కాల్గరీలోనే అత్యధికం. 2007 ఏప్రిల్‌ నాటికి నగరంలో ద్రవ్యోల్బణం 6 శాతమని ఇటీవలి గణాంకాలు తేల్చాయి.[96]

నేరాలు

క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీ నిఘా కెమెరాలను నగర వ్యాప్తంగా ప్రయోగాత్మ్కకంగా ఏర్పాటు చేయాలని 2008 మార్చిలో నగర కౌన్సిల్‌ తీర్మానించింది. ఈ మేరకు నగరంలోని 3 దిగువ పట్టణ‌ ప్రాంతాల్లో 16 CCTV కెమెరాలను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని ఈస్ట్‌ విలేజీ, స్టీఫెన్‌ అవెన్యూ మాల్‌ల వెంబడి వాటి ఏర్పాటు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు 2009 మొదట్లో ప్రారంభమైంది. ఇది ప్రాథమికంగా జంతు, సంబందిత నిర్దేశకాల సేవల కోసం ఉద్దేశించింది.[97]

ఇతర ఉత్తర అమెరికా నగరాలతో పోలిస్తే కాల్గరీలో నేరాల రేటు బాగా తక్కువే అయినా నేరగాళ్ల ముటాలు, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు ఇటీవలి కాలంలో జరగుతున్న ఆర్థిక వృద్ధితో పాటే పెరిగిపోతున్నాయి. 2009లో దిగువ పట్టణ ప్రాంతాలను మరింతగా నిఘామయం చేసేందుకు 62 మంది అదనపు పోలీసు అధికారులను ఏర్పాటు చేశారు.[98]

జంటనగరాలు[మార్చు]

కాల్గరీ నగరం మొత్తం ఆరు నగరాలతో వర్తకాభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక, జంట విద్యా భాగస్వామ్యాలను ఏర్పాటు చేస్తుంటుంది.[99][100]

నగరం ప్రాంతం/రాష్ట్రం దేశం తేదీ
క్యూబెక్‌ సిటీ క్యూబెక్  Canada 1956
జైపూర్ రాజస్థాన్  India 1973
నౌకాప్లాన్‌ మెక్సికోస్టేట్‌  Mexico 1994
డాకింగ్‌ హెలాంగ్‌జియాంగ్‌  People's Republic of China 1995
డాజీన్‌ చుంగ్‌నామ్‌  South Korea 1996
ఫీనిక్స్‌ ఆరిజోనా  USA 1997

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/a' not found.

 • కాల్గరీ ప్రాంతం
 • డౌన్‌టౌన్‌ కాల్గరీ
 • ఆల్బెర్టాలోని సమూహాల జాబితా
 • ఆల్బెర్టాలోని నగరాల జాబితా
 • ప్రముఖ కాల్గరీవాసుల జాబితా
 • కాల్గరీలోని మీడియా

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 City of Calgary. "Municipal Government". Retrieved June 22, 2007.
 2. 2.0 2.1 2.2 "Population and dwelling counts, for Canada and census subdivisions (municipalities), 2006 and 2001 censuses – 100% data". Statistics Canada. Retrieved February 10, 2010.
 3. 3.0 3.1 "Population and dwelling counts, for census metropolitan areas and census agglomerations, 2006 and 2001 censuses – 100% data". Statistics Canada. Retrieved February 10, 2010.
 4. "Annual population estimates and demographic factors of growth by census metropolitan area, Canada, from July to June — Population estimates and factors of growth". Statistics Canada. July 1, 2009. Retrieved February 10, 2010.
 5. Statistics Canada. "Calgary-Edmonton Corridor". Retrieved January 6, 2006.
 6. University of Calgary. "Archaeology Timeline of Alberta". Retrieved May 10, 2007.
 7. Alberta Tourism, Parks, Recreation and Culture. "The Glenns". Archived from the original on September 27, 2007. Retrieved August 24, 2007.CS1 maint: Multiple names: authors list (link)
 8. "Parks Canada - Cave and Basin National Historic Site". Pc.gc.ca. May 21, 2010. Retrieved July 27, 2010.
 9. "The Great Fire of 1886". Retrieved December 17, 2008.[dead link]
 10. "The Sandstone City". Retrieved December 17, 2008.
 11. City of Calgary. "Historical Information". Retrieved September 23, 2007.
 12. CBC Article. "Oil and Gas in Alberta". Archived from the original on May 23, 2007. Retrieved January 6, 2006.
 13. కాల్గరీ వాస్తు నిర్మాణం, వృద్ధి ఉన్న సంవత్సరాలు 1972ా1982 , పియెరీ ఎస్‌ గైమండ్‌, బ్రయాన్‌ ఆర్‌ సింక్లెయిర్‌, డెట్సెలిగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, 1984, ఐఎస్‌బీఎన్‌ 0-920490-38-7
 14. Inflation Data. "Historical oil prices". Retrieved January 6, 2006.
 15. University of Calgary (1998). "Calgary's History 1971–1991". Retrieved June 28, 2007.
 16. Calgary Public Library. "Calgary Timeline". Archived from the original on August 20, 2007. Retrieved June 28, 2007.
 17. CBC Article. "The Winter of '88: Calgary's Olympic Games". Retrieved January 5, 2006.
 18. The Conference Board of Canada (2005). "Western cities enjoy fastest growing economies". Archived from the original on October 12, 2007. Retrieved March 7, 2007.
 19. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).[dead link]
 20. Calgary Economic Development (2005). "Quality of life". Retrieved December 31, 2006.
 21. Mercer Human Resource Consulting (2006). Mercer "Quality of Living Survey" Check |url= value (help). Retrieved February 27, 2007.
 22. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 23. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 24. ఎకో సిటీ ర్యాంకింగ్స్‌ బై మెర్సెర్‌ ఫర్‌ 2010 2010 మార్చి 27న సంపాదించినవి
 25. 25.0 25.1 25.2 స్టాటిస్టిక్స్‌ కెనడా 2006 జనాభా లెక్కలు (2007 మార్చి 13) కాల్గరీ 2006 కమ్యూనిటీ ప్రొఫైల్‌ క్యాటలాగ్‌ నంబర్‌ 92-591-XWE. ఒట్టావా మార్చి 4, 2009న తిరిగి పొందబడింది.
 26. కాల్గరీ ఆర్థికాభివృద్ధి
 27. City of Calgary. "Annexation Information". Retrieved August 28, 2009.
 28. టౌన్‌ ఆఫ్‌ చెస్టర్‌మేర్‌ వృద్ధి అధ్యయనం 2007 మార్చి పేజీ 26 ఆగస్టు 28న సంపాదించినవి ఆగష్టు 2, 2007 సేకరించెను.
 29. City of Cagary. "Beltline—Area Redevelopment Plan" (PDF). Retrieved September 28, 2007.
 30. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 31. City of Calgary. "Annexation Information". Retrieved September 28, 2007.
 32. "The Atlas of Canada". Natural Resources Canada. Retrieved April 2, 2010.
 33. వ్యవసాయ వాతావరణం అల్బెర్టా అట్లాస్‌ అల్బెర్టా వాతావరణం
 34. పటం 1వ్యవసాయ వాతావరణం అల్బెర్టా అట్లాస్‌ రిఫరెన్స్‌ పటం
 35. 35.0 35.1 ఎన్విరాన్‌మెంట్‌ కెనడా కెనేడియన్‌ క్లైమేట్‌ నార్మల్స్‌ 1971 - 2001 మార్చి 20, 2009న తిరిగి పొందబడింది.
 36. City of Calgary. "The City of Calgary: 2005 Flood Report". Archived from the original on October 4, 2006. Retrieved November 17, 2008.
 37. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 38. tyName=&ParkName=&LatitudeDegrees=&LatitudeMinutes=&LongitudeDegrees=&LongitudeMinutes=&NormalsClass=A&SelNormals=&StnId=2205& "Canadian Climate Normals 1971–2000" Check |url= value (help). Environment Canada. Retrieved May 29, 2009.
 39. Southern Alberta Jubilee Auditorium. "Auditoria History". Retrieved September 25, 2007.
 40. 17 Avenue Business Revitalisation Zone. "Hip to Haute". Retrieved May 22, 2007.
 41. కాల్గరీ మార్చింగ్‌ బ్యాండ్స్‌ రౌండ్‌ అప్‌ బ్యాండ్‌ స్టెస్టన్‌ షో బ్యాంగ్‌ కాల్గరీ స్టాంపేడ్‌ షోబ్యాండ్‌ వరల్డ్‌ అసోసియేసణ్‌ ఫర్‌ మార్చింగ్‌ షోబ్యాండ్స్‌
 42. Calgary Stampede (2006). "History of the Stampede". Archived from the original on June 13, 2006. Retrieved May 8, 2006.
 43. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 44. 44.0 44.1 City of Calgary. "Pathway map" (PDF). Archived from the original (PDF) on June 22, 2006. Retrieved June 15, 2006.
 45. City of Calgary. "Devonian Gardens". Archived from the original on October 13, 2007. Retrieved September 25, 2007.
 46. Emporis (2007). "Petro-Canada Centre—West Tower". Retrieved April 12, 2007.
 47. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 48. Statistics Canada. "2001 Census—Ethnic Origins for Calgary". Retrieved January 6, 2006.
 49. City of Calgary. "2010 Civic Census Results" (PDF). Retrieved July 22, 2010.
 50. Alberta Municipal Affairs. "Alberta 2009 Official Population List" (PDF). Archived from the original (PDF) on February 18, 2012. Retrieved December 12, 2009.
 51. కాల్గరీ కమ్యూనిటీ ప్రొఫైల్‌ స్టాటిస్టిక్స్‌ కెనడా 2002 2001 కమ్యూనిటీ ప్రొఫైల్స్‌ 202 జూన్‌ 27న విడుదలైనవి. చివరిసారిగా సరిచేసినది 2005 నవంబర్‌ 30న స్టాటిస్టిక్స్‌ కెనడా క్యాటలాగ్‌ నంబర్‌ 93F0053XIE
 52. Calgary Herald (July 24, 2006). "Calgary's population hits one million". Retrieved January 7, 2007.
 53. City of Calgary (2006). "2006 Civic Census Summary" (PDF). Retrieved May 9, 2007.
 54. ఎత్నోకల్చరల్‌ పోర్ట్రెయిట్‌ ఆఫ& కెనడా హైలైట్‌ టేబుల్స్‌ 200 జనాభా లెక్కలు 2006[dead link]
 55. 2006 కమ్యూనిటీ ప్రొఫైల్స్‌ జనాభా లెక్కల ఉప వర్గీకరణ
 56. University of Calgary (1997). "Calgary's Politics 1895–1946". Retrieved June 28, 2007.
 57. University of Calgary (1997). "Calgary's Politics 1971–1991". Retrieved June 28, 2007.
 58. Alberta Queen's Printer (1994–2000). "Municipal Government Act". Retrieved December 18, 2006.CS1 maint: Date format (link)[dead link]
 59. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).[dead link]
 60. "Klein takes devastating blow to leadership". Globe & Mail. Retrieved April 1, 2006.
 61. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 62. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 63. Elections Canada (2006). "Voting results by electoral district". Retrieved September 25, 2007.
 64. Calgary Economic Development (2006). "Real GDP by Industry: Calgary Economic Region, 2006". Retrieved March 12, 2007.
 65. Alberta First (2007). "Calgary". Retrieved March 12, 2007.
 66. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 67. CBC Article. "EnCana unveils plans for downtown Calgary office tower". Archived from the original on October 12, 2007. Retrieved January 6, 2006.
 68. Calgary Economic Development (2006). "Labour Force / Employment". Retrieved March 12, 2007.
 69. Statistics Canada (2006). "Labour force characteristics, population 15 years and older, by census metropolitan area". Retrieved March 9, 2007.
 70. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 71. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).[dead link]
 72. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).[dead link]
 73. మమ్మల్ని సంప్రదించండి[dead link] వెస్ట్‌జెట్‌ 18 మే 2009న పునరుద్ధరించబడింది.
 74. కస్టమర్‌ సర్వీస్‌ ఎనర్జెట్‌ మార్చి 27, 2010న తిరిగి పొందబడింది.
 75. ఇన్వెస్టర్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ కెనేడియన్‌ ఎయిర్‌లైన్స్‌ 15 మార్చి 2006 18 మే 2009న పునరుద్ధరించబడింది.
 76. పిగ్‌ సుసాన్‌ జిప్‌ వెస్ట్‌జెట్‌ ధరల పోటీకి దిగింది. అది వారిద్దరికీ నష్టం చేకూర్చవచ్చు. కాంపిటీషన్‌ బ్యూరో రూలింగ్‌ను అనుసరిస్తోంది. జిప్‌ తూర్పు దిశగా వెళ్లిన కొద్దీ ఇది మరింత తీవ్రతరం కావచ్చు టరంటో స్టార్‌ జనవరి 22,1930 బిజినెస్‌ 30 సెప్టెంబరు 2009న తిరిగి పొందబడింది.
 77. Calgary Board of Education. "Student attendance". Retrieved January 7, 2006.
 78. Calgary Catholic School District board. "Calgary Schools". Archived from the original on January 11, 2006. Retrieved January 7, 2006.
 79. Calgary Board of Education (2007). "Lord Beaverbrook High School". Retrieved May 10, 2007.
 80. University of Calgary (2006–2007). "U of C fact book—page 15" (PDF). Archived from the original (PDF) on September 26, 2007. Retrieved September 25, 2007.
 81. "The Odd History of Calgary's City Streets". SmartCalgaryHomes.com. Retrieved June 23, 2009.
 82. "Principales características del sistema de transporte colectivo metrorrey". INEGI. Retrieved June 16, 2009.
 83. "APTA Ridership Report – Light Rail" (PDF). American Public Transportation Association. Fourth Quarter 2009. Retrieved March 19, 2010. Check date values in: |date= (help)
 84. Calgary Transit. "About Calgary Transit". Retrieved December 1, 2006.
 85. Calgary Transit (2006). "Calgary's CTrain – Effective Capital Utilization" (PDF). City of Calgary. p. page 1. Archived from the original (PDF) on February 27, 2008. Retrieved February 11, 2008.CS1 maint: Extra text (link)
 86. Calgary Economic Development (2006). "Medical Research". Retrieved March 13, 2007.
 87. Calgary Economic Development (2006). economicdevelopment.com/liveWorkPlay/Live/health/calgaryHospitals.cfm "Calgary Hospitals" Check |url= value (help). Retrieved March 13, 2007.
 88. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 89. City of Calgary (2006). "Community Population Comparison" (PDF). Retrieved July 3, 2007.
 90. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 91. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 92. City of Calgary (2006). "Count of Homeless Persons in Calgary" (PDF). Retrieved February 27, 2007.
 93. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 94. Calgary Real Estate Board (2008). "Summary Listings & Sales, Average Price Graphs". Retrieved May 1, 2008.
 95. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 96. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 97. "Citybeat – City of Calgary Press Release". Press Release. City of Calgary. January 13, 2009. Retrieved February 1, 2009.
 98. "Beat cops hit the streets". CTV. Retrieved June 6, 2009.
 99. Calgary Economic Development. "Sister Cities". Retrieved January 6, 2007.
 100. City of Calgary. "Welcome to Calgary". Archived from the original on June 1, 2008. Retrieved July 4, 2009.

మూలం[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కాల్గరీ&oldid=2434825" నుండి వెలికితీశారు