కాల్షియం క్లోరేట్

వికీపీడియా నుండి
(కాల్సియం క్లోరేట్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాల్సియం క్లోరేట్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10017-74-3]
పబ్ కెమ్ 24978
యూరోపియన్ కమిషన్ సంఖ్య 233-378-2
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FN9800000
SMILES [Ca+2].[O-]Cl(=O)=O.[O-]Cl(=O)=O
  • InChI=1/Ca.2ClHO3/c;2*2-1(3)4/h;2*(H,2,3,4)/q+2;;/p-2

ధర్మములు
Ca(ClO3)2
మోలార్ ద్రవ్యరాశి 206.98 g/mol
స్వరూపం white solid
deliquescent
వాసన odorless
సాంద్రత 2.71 g/cm3
ద్రవీభవన స్థానం 150°C (dihydrate, decomp)
325°C
209 g/100mL (20 °C)
197 g/100mL (25 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic
ప్రమాదాలు
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
potassium chlorate
sodium chlorate
barium chlorate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం క్లోరేట్అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం.కాల్సియం లవణం, క్లోరిక్ ఆమ్లాల సంయోగం వలన కాల్సియం క్లోరేట్ సమ్మేళన పదార్థం ఏర్పడినది. కాల్సియం, క్లోరిన్, ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన కాల్సియం కార్బోనేట్ రసాయన పదార్థం ఏర్పడినది. కాల్సియం క్లోరేట్ రసాయన సంకేత పదం Ca (ClO3) 2. మిగతా క్లోరేట్ పదార్థాలవలె కాల్సియం క్లోరేట్ కూడా బలమైన ఆక్సీకరణి.

భౌతిక లక్షణాలు[మార్చు]

కాల్సియం క్లోరేట్ తెల్లని ఘనపదార్థం.కాల్సియం క్లోరేట్ వాసన లేని రసాయన సమ్మేళనపదార్థం. కాల్సియం క్లోరేట్ అణుభారం 206.98గ్రాములు/మోల్.[1] సాధారణ ఉష్ణోగ్రత (25 °C) వద్ద కాల్సియం క్లోరేట్ సాంద్రత 2.71 గ్రాములు.సెం.మీ3.నిర్జల కాల్సియం క్లోరేట్ ద్రవీభవన స్థానం 325 °C.రెండు జలాణువులు (dehydrate) ఉన్న కాల్సియం క్లోరేట్ 150 °C వద్ద వియోగం చెందును.[2] స్పటిక సౌష్టవం మొనోక్లినిక్ నిర్మాణం

ద్రావణియత[మార్చు]

కాల్సియం క్లోరేట్ నీటిలో కరుగుతుంది.[3] 100 మి.లీ.నీటిలో 20 °C వద్ద 209 గ్రాములు.25 °C వద్ద 197 గ్రాములు కరుగును.

ఉత్పత్తి[మార్చు]

వేడినీటిలో వ్రేలాడఁగట్టి ఉంచిన/ఉన్న కాల్సియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్‌వాయువును ప్రసరింప చెయ్యడం ద్వారా పొటాషియం హైపో క్లోరైట్ ఏర్పడును.ఇలా ఏర్పడిన పొటాషియం హైపోక్లోరైట్ రసాయన పదార్థాన్ని అధికమొత్తంలో క్లోరిన్ వాయువుతో వేడి చెయ్యడం వలన క్షయికరన, ఆక్సీకరణ చర్య (disproportionate లేదా redox action.అనగా క్షయికరణ, ఆక్సీకరణ చర్యలు జరిగి భిన్న సమ్మేళనపదార్థాలు ఏర్పడు చర్య) వలన కాల్సియం క్లోరేట్, క్లోరిన్ వాయువు ఏర్పడును.

6Ca(OH)2 + 6Cl2 → Ca(ClO3)2 + 5CaCl2 + 6H2O

పైన పేర్కొన్న రసాయన చర్యను లిబిగ్ ప్రాసెస్‌లో మొదటి రసాయన చర్య. ఈ రకపు లిబిగ్ రసాయన చర్యవలన పొటాషియం క్లోరేట్ రసాయనాన్ని ఉత్పత్తి కావించెదరు. సైద్ధాంతికంగా కాల్సియం క్లోరేట్ ద్రవాలను విద్యుద్విశ్లేషణ కావించడం వలన క్లోరేట్‌లను, సోడియం క్లోరేట్‌లను ఉత్పత్తి చేసినట్లుగా ఉత్పత్తి చెయ్యవచ్చును. కాని ఆచరణలో విద్యుద్విశ్లేషణ సమయంలో కాల్సియం హైడ్రాక్సైడ్ కాథోడ్ ధ్రువంపై పేరుకు పోవడం వలన రసాయన విద్యుత్తు ప్రసారానికి అంతరాయం ఏర్పడును. అందువలన ఈ చర్య అంతగా ఆమోదయోగ్యం కాదు.

రసాయన చర్యలు[మార్చు]

గాఢ కాల్సియం క్లోరేట్, పొటాషియం క్లోరైడ్ ద్రావణాలను కలిపినపుడు, పొటాషియం క్లోరెట్ అవక్షేపంగా ఏర్పడును.

Ca(ClO3)2 + 2 KCl → 2 KClO3 + CaCl2

పైన పేర్కొన్న ఈ రసాయన చర్య పొటాషియం క్లోరేట్‌లను ఉత్పత్తి చెయ్యుటకు లిబిగ్ ప్రాసెస్ లోని రెండవ రసాయన ప్రక్రియ. కాల్సియం క్లోరేట్ ద్రవాలు, క్షారకార్బోనేట్ ద్రవాలతో చర్య జరపడం వలన, కాల్సియం కార్బోనేట్ అవక్షేపంగా ఏర్పడగా, క్షారక్లోరేట్‌లు ద్రవరూపంలో ఏర్పడును.

Ca(ClO3)2 + Na2CO3 → 2 NaClO3 + CaCO3

బాగా కాల్సియం క్లోరేట్‌ను వేడిచెయ్యడం వలన, కాల్సియం క్లోరైడ్, ఆక్సిజన్ (వాయువు) గా వియోగం చెందును.

2 Ca(ClO3)2 → 2 CaCl2 + 3 O2

చల్లని, విలీన (dilute) కాల్సియం క్లోరేట్,, సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రవాల రసాయనచర్య ఫలితంగా అవక్షేపంగా కాల్సియం సల్ఫేట్ ను, ద్రవంలో క్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.

Ca(ClO3)2 + H2SO4 → 2 HClO3 + CaSO4

కాల్సియం క్లోరేట్ తో గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లం చర్య ఫలితంగా, ఏర్పడు గాఢ క్లోరిక ఆమ్ల అస్థిరత్వంవలన విస్పొటన జరుగును.అలాగే అమ్మోనియం సంయోగ పదార్థాలతో కాల్సియం క్లోరేట్ చర్యవలన, అస్థిర అమ్మోనియం క్లోరెట్ల ఉత్పత్తి ఆవలన తీవ్రస్థాయిలో విఘటన చెందును.

ఉపయోగాలు[మార్చు]

  • కాల్సియం క్లోరేట్ ను, సోడియం క్లోరేట్ వలె గుల్మ నాశిని (herbicide) గా ఉపయోగిస్తారు
  • కాల్సియం క్లోరేట్ ను అరుదుగా బాణసంచు/టపాసులు/అగ్ని ద్రవ్యకళ (pyrotechnics) తయారిలో వాడెదరు.బాణసంచు/టపాసులలో ఆక్సీకరణ పదార్థంగా, పింకురంగు మంట/జ్వాలను ఇచ్చుటకు ఉపయోగిస్తారు.అయితే కాల్సియం క్లోరేట్ యొక్క ఆర్ద్రతాకర్షణస్వభావం వలన, దీనిని పరిమితంగా బాణసంచు తయారీలో వాడెదరు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "Calcium chlorate". chemspider.com. Retrieved 2016-02-28.
  2. "CALCIUM CHLORATE". cameochemicals.noaa.gov. Retrieved 2016-02-28.
  3. "CALCIUM CHLORATE, AQUEOUS SOLUTION". cameochemicals.noaa.gov. Retrieved 2016-02-28.