కావలి పురపాలక సంఘం
కావలి | |
స్థాపన | 1967 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | కావలి |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
కావలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరుకు చెందిన మున్సిపాలిటీ. ఇది కావలి పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. ఈ పురపాలక సంఘం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, కావలి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]కావలి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 215 కి.మీ దూరంలో ఉంది.కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము.ఉదయగిరి రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. చెన్నై నుంచి కలకత్తా ప్రధాన రహదారి, రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అభివృద్ధికి దోహదపడ్డాయి. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది.1967 న 3 వ గ్రేడ్ పురపాలక సంఘంగా స్థాపించబడింది. ప్రస్తుత గ్రేడ్ 2 వ గ్రేడ్ కొనసాగుతుంది.ఈ పురపాలక సంఘంలో 40 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి. కానీ దీనికి గత పది సంవత్సరాలకి పైనుండి ఎన్నిక జరగలేదు.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 97053 ఉన్నారు.
దశాబ్దాల జనాభా కాలక్రమం
- 1971 జనాభా లెక్కల ప్రకారం 29616
- 1981 జనాభా లెక్కల ప్రకారం 48119
- 1991 జనాభా లెక్కల ప్రకారం 65910
- 2001 జనాభా లెక్కల ప్రకారం 79682
- 2011 జనాభా లెక్కల ప్రకారం 97053
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పోతుగంటి అలేఖ్య పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా జి. భారతి కుమారి.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- భ్రమరాంబ సమేత మల్లీశ్వరస్వామి దేవాలయం.
- లక్ష్మీకాంతస్వామి దేవాలయం
- వీరాంజనేయస్వామివారి దేవాలయం
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘంలో 21064 గృహాల ఉన్నారు.40 ఎన్నికల వార్డులు ఉన్నాయి.1 ప్రభుత్వ ఆసుపత్రి, 28 ప్రభుత్వ పాఠశాలు, 6 ఉన్నత పాఠశాలలు, 4 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 18 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2 కూరగాయల మార్కెట్లు, 5 పబ్లిక్ పార్కులు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-28.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.