కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్ | |
|---|---|
| జననం | 1998 జూలై 20 |
| జాతీయత | భారతీయురాలు |
| ఇతర పేర్లు | కావ్య కళ్యాణ్‌రామ్ |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2001 - 2008 2021 – ప్రస్తుతం |
కావ్య కళ్యాణ్‌రామ్ (జననం 1998 జూలై 20) దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.[1]
కెరీర్
[మార్చు]
కావ్య కళ్యాణ్ రామ్ తెలంగాణలోని కొత్తగూడెంలో కళ్యాణ్‌రామ్, భవానీ పెద్దిభొట్ల దంపతులకు ఏకైక సంతానంగా 1998 జూలై 20న జన్మించింది. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రిలో బాలనటిగా కీలక పాత్ర పోషించి ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత చదువుపై దృష్టి సారించిన ఆమె అడపాదడపా లఘు చిత్రాలతోపాటు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది.
కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో ఆమె ప్రధాన పాత్రతో తెలుగు సినిమాలోకి పునరాగమనం చేసింది.[2] అలాగే సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ నిర్మాణంలో ఉంది.[3]
| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2001 | స్నేహమంటే ఇదేరా | చిన్నపిల్ల | తొలిచిత్రం |
| 2003 | గంగోత్రి | యువ గంగోత్రి | [4] |
| ఠాగూర్ | ఠాగూర్ దత్తపుత్రిక | ||
| 2004 | అడవి రాముడు | యువకుడు మధు | |
| లేత మనసులు | రాజు కూతురు | ||
| విజయేంద్ర వర్మ | అమ్ములు | ||
| 2005 | బాలు | లిల్లీ | |
| బన్నీ | యువ మహాలక్ష్మి | ||
| సుభాష్ చంద్రబోస్ | స్వాతంత్ర్య పోరాటంలో చిన్నపిల్ల | ||
| 2008 | పాండురంగడు | పుండరీక మేనకోడలు | |
| ఉల్లాసంగ ఉత్సాహంగా | యువతి ధనలక్ష్మి |
| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2022 | మసూద | మినీ | ప్రధాన నటిగా అరంగేట్రం |
| 2023 | బలగం | సంధ్య | |
| ఉస్తాద్ | మేఘన |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 July 2021). "'వల్లంకి పిట్టా' బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?". ఒరిజినల్ నుండి 19 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2021.
- ↑ "Masooda: భయపెట్టే 'మసూద'". web.archive.org. 2022-11-23. ఒరిజినల్ నుండి 2022-11-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-23.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Wayback Machine". web.archive.org. 2022-11-23. ఒరిజినల్ నుండి 2022-11-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-23.
{{cite web}}: Cite uses generic title (help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (19 November 2022). "'గంగోత్రి'లోని 'వల్లంకి పిట్ట'పాప ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?". the original నుండి 3 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 March 2023.