Jump to content

కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి

వికీపీడియా నుండి

కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి కవి, సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు. కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో సంస్కృత పండితుడిగా 35 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. ఇతడు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో పాల్గొన్నాడు. పేరొందిన పండితుడు, విమర్శకుడు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ఇతని సోదరుడు.

జీవితం

[మార్చు]

సుబ్బయ్య శాస్త్రి పూర్వీకులు రాజోలు దగ్గర కడలి గ్రామంలో ఉండేవారు. వీరు తెలగాణ్యులు, గౌతమసగోత్రులు, ఆపస్థంభ సూత్రులు. తర్వాత ఇతని ముత్తాత కడలి నుండి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలోని జగన్నాథపురం వచ్చి స్వగృహం ఏర్పాటు చేసుకున్నారు. ఇతని తండ్రి బ్రహ్మావధాని వేద శాస్త్రాలలో నిష్ణాతుడు. తల్లి సుబ్బమ్మ. ఇతని అన్న కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా పేరొందిన పండితుడు.

రచనలు

[మార్చు]

వివిధ పత్రికలలో ఇతడు ప్రకటించిన వ్యాసాలు:

  • గుహుడు - ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1933-34)
  • శైలి విలాసిని (విమర్శ) - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక- 25వ సంపుటి 6వ సంచిక (1936)
  • కవిసామాన్య విభాగము - నన్నయ, తిక్కనల కవిత్వం (భారత విమర్శ) - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక- 26వ సంపుటి 4వ సంచిక (1937)
  • ఉత్తరా పరిణయము తిక్కన వైరాటము - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 26వ సంపుటి 6వ సంచిక (1937)
  • గగనవాణి - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 27వ సంపుటి 2వ సంచిక (1938)
  • మేఘసందేశము యక్షుని శాసనము - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 27వ సంపుటి 4వ సంచిక (1938)
  • శ్రీరామోత్తరేతివృత్తం (విమర్శ) - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 27వ సంపుటి 4-5-6 సంచికలు (1938) భవభూతి ఉత్తరరామచరిత్ర, దిజ్ఞాగుని కుందామాలలో సీతాపరిత్యాగ ఘట్టం ఈ వ్యాసంలో విమర్శించబడింది.[1]
  • సుభాషిత భూషణ యుగళము - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 28వ సంపుటి 1వ సంచిక (1939)
  • ఈ బొంకేలకొ? (విమర్శ) - ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక - 28వ సంపుటి 3వ సంచిక (1939)

గ్రంథాలు

[మార్చు]
  1. శ్రీరామవిజయం - పూర్వకాండం[2](కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తికి అంకితం చేశాడు.)
  2. శ్రీరామవిజయం - కళ్యాణకాండం[3]
  3. శ్రావణవిజయం
  4. సుకృతవిజయం
  5. సాహిత్యకల[4]
  6. శ్రీరామశతకం

బిరుదులు

[మార్చు]
  • సాహిత్యవిశారద

మూలాలు

[మార్చు]
  1. సి.కమలా అనార్కలి (1973). పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ (PDF). కాకినాడ: సి. కమలా అనార్కలి. pp. 394–395. Retrieved 9 April 2021.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో సాహిత్యకల పుస్తకప్రతి

వెలుపలి లంకెలు

[మార్చు]