కాశీభట్ల వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీభట్ల వేణుగోపాల్ ఒక ప్రముఖ కవి, రచయిత. ఆయనకు సంగీతంతో కూడా పరిచయం ఉంది. ఆయన స్వస్థలం కర్నూలు.

కాశీభట్ల వేణుగోపాల్
Kasibhatla Venugopal.png
జననంజనవరి 2, 1954
కర్నూలు.
ప్రసిద్ధితెలుగు కవి , రచయిత
తండ్రికాశీభట్ల యల్లప్ప శాస్త్రి
తల్లికాశీభట్ల హనుమాంబ

జీవిత విశేషాలు[మార్చు]

కాశీభట్ల వేణుగోపాల్ జనవరి 2, 1954 కర్నూలులో కాశీభట్ల యల్లప్ప శాస్త్రి, హనుమాంబ దంపతులకు పుత్రిడిగా జన్మించారు. వీరిది శుద్ధ శ్రోత్రియ కుటుంబం. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలూ. అందరికన్నా ఆఖర్న ఈయన జన్మించారు. తొమ్మిది నెలల బిడ్డగా వున్నప్పుడే నేను స్పష్టంగా మాట్లాడుతుంటే ముచ్చటపడి నాకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాల్ని నేర్పించింది అమ్మ అని, అన్నలూ, అక్కలూ అంతా వెళుతుంటే వాళ్ళ వెంటపడి గ్రంథాలయానికి వెళ్తూ చదవడాన్ని అలవాటు చేసుకున్నాను అని, అమ్మకూ అక్కలకూ సాహిత్యం యిష్టం కాబట్టి నాకుకూడా వెళ్ళి కవి కావాలనుకున్నారు అని చెబుతారు. [1]

వేణుగోపాల్ మొదటి గురువు హనుమాంబ అని చెప్పుకుంటారు. కాలీజీల చదువు అబద్ధం అని నమ్మి కాసింత చదువులు చదివి వచ్చిన ధృవ పత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు. ఏవో నాలుగు అక్షరాలు పట్టుబడింది పాతికేళ్ళ తర్వాతే అని, డెబ్బైల నుండీ అతని అసలు సాహితీ ప్రస్థానం మొదలైంది. శ్రోత్రియ నియమాలను వ్యతిరేకించినట్టే అన్ని మానవ నిర్మితాలైన విలువల్నీ ఒప్పుకోలేను అందుకేనేమో మనసుకు దగ్గరగా వచ్చిన స్నేహితులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు అని చెప్పుకుంటారు. ఎవ్వరితోనీ పోల్చదగ్గ వాడిని కాను అని, ఈ చిన్న జీవిత ప్రస్థానంలో బాగా తెలుసుకున్నదొకటే నాకేమీ తెలియదు అంటారు. ఈయనకి వేణువు ప్రియమైన వాయిద్యం.

మల్లాది, బుచ్చిబాబు, ల ప్రభావం ఈయన మీద బాగా ఉంది.కానీ శ్రీశ్రీ ప్రభావం అంతగా లేదు చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మకి వీరు అభిమాని. మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలుకు ఆకర్షించినా, విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుండి బయటపడ్డాను అని చెబుతారు. వీరు బ్రహ్మచారి అని, మంచి పద్యం, మద్యం రెండూ నాకు ప్రీతి అని చెబుతారు. కీర్తిశేషులు అమ్మ చిన్నప్పుడే వల్లె వేయించిన అమరకోశం, చదివించిన రఘువంశం ఈ రోజుకీ నాకు ఉపయోగపడుతాయి అంటారు. ఫ్రాంజ్ కాఫ్కా, గోగే, హరిప్రసాద్ చౌరాసియా వీరికి ఇష్టులు.

దేశాటన చేయడం వీరికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే మూడుసార్లు దేశాటన చేశారు. చదివే అలవాటుతో పాటు, అలా దేశాటన చేయడం వల్ల కూడా నాలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని వొడిసి పట్టుకోగలిగాడనుకుంటారు. నేను రచయిత కావడానికి అదే కారణమైందని అంటారు. యవ్వన ప్రాయంలో ఉండగా సైకిల్‌ మీదా, స్కూటర్‌ మీదా మూడుసార్లు దేశాటన చేశారు. జీవితాన్వేషణలో వారణాసిలోనూ, లక్నోలోనూ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే సంగీత సాధన చేశారు.

రచన శైలి[మార్చు]

గందరగోళమైపోయిన సమకాలీన జీవితంలోని అస్థిరత్వాన్ని అంతే గందరగోళంగా ఆవిష్కరించి, సాదా సీదా క్లియర్ కట్ ఆలోచనలను ధ్వంసం చేసే రచనలు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు. ఆయన భాష చాలా పదునైంది. ఆయన ఒక్కోసారి ప్రశ్నిస్తాడు, ఒక్కోసారి సమాధానపరుస్తాడు. ఆయన వాక్యాలు ఒక ఇమేజే మీద మరొక ఇమేజ్ ఏర్పడి form అయ్యే మాంటేజ్ లు. ఇంగ్లీషూ, తెలుగు కలగలిసిపోయి ఒక కొత్త భాషగా morph అవుతుంది. కథ ముందుకు సాగుతూండగా పాఠకుడు ఏర్పరుచుకునే అభిప్రాయాల్ని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తుంటాడు. [2]

అతని అనేక పాత్రలు ఆధునిక మానవుని అంతరంగ కల్లోలాలను కదిలిస్తాయి. అంతగా ఎవరూ స్రృశించడానికి సాహసించని స్త్రీ పురుష సంబంధాల్నీ, పురుషుని చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాల్నీ (ఇన్‌సిస్ట్‌) తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటూ ఒక ప్రత్యేకత (సిగ్నేచర్‌ ట్యూన్‌)ను ఏర్పాటు చేసుకున్న రచయిత.[3]


రచనలు[మార్చు]

1974 లో ఆంధ్ర పత్రికలో రంగనాయకి లేచిపోయిందీ అనే కథతో వీరి సాహితీ ప్రయాణం ప్రారంభమైంది. ఒక పడుచు వితంతువు. ఆమె కష్టాల్లో వుంది. అకస్మాత్తుగా కనిపించకుండా పోతే లోకం ఆమె గురించి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో అన్నది ఈ కథలో కథావిశేషం. తర్వాత వీరు విస్తృతంగా కవిత్వం రాసినా, వైయుక్తికం అనుకుని అచ్చేసుకోలేకపోయారు. ‘నేను-చీకటి’ నవల చిత్తు ప్రతిగా వున్నప్పుడు దాన్ని చదివి, ఎత్తి రాసిన కథా రచయిత వెంకట కృష్ణ. అది అచ్చయ్యేంతదాకా వెంటపడటమే యిప్పటి నా సాహితీస్థితికి కారణం అని చెబుతారు. [4]

 • ఘోష - కథల సంపుటి
 • నేనూ - చీకటి నవల [5]
 • దిగంతం - నవల
 • నేనూ- చీకటి - నవల
 • తపన - నవల
 • రంగుల - నవలిక
 • మంచు -పూవు - నవల
 • తెరవని తలుపులు - నవల
 • నికషం - నవల
 • అసత్యానికి ఆవల - నవల
 • అసంగత (త్వరలో) - నవల
 • నాలుగు కథా సంకలనాలు
 • మూడు కవిత్వం పుస్తకాలు
 • నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు


ములాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]