కాశీరాం షింపీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీరాం షింపీ

కాశీరాం షింపీ బట్టల వ్యాపారి . అతనికి బాబా గురించి మహల్సాపతి ద్వారా తెలిసి ఆయనపై భక్తి శ్రద్ధలు కలిగాయి . సాయికి అతడు పొగాకు, చిలిమ్ గొట్టాలు, ధునికి కట్టెలూ సమర్పించుకునేవాడు . బాబా కొంత ధనం తీసుకుని తిరిగిచ్చినా ఆయనను ఇంకా దక్షిణ తీసుకోమని బ్రతిమాలేవాడు కాశీరాం . బాబా కొంతకాలానికి ధనం తీసుకోవడం మొదలుపెట్టాక అతనికి బాబాకు తానూ ధనసహాయం చేస్తున్నాననే గర్వం వచ్చింది . అప్పటి నుంచి అతని సంపాదన పూర్తిగా తగ్గిపోయింది . కాశీరాం తన తప్పు గ్రహించి బాబాను క్షమించమని ప్రార్థించాడు . అప్పటినుంచి అతని సంపాదన మెరుగుపడింది .

ఒకసారి అతడు వేరే ఊరికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే కొందరు దొంగలు దాడిచేసి అతని డబ్బంతా లాక్కొన్నారు. ఆ పెనుగులాటలో ఒక దొంగ కాశీరాం తలపై గొడ్డలితో కొట్టాడు . అతడు స్పృహ కోల్పోయాడు . కొంతసేపటికి అతనికి స్పృహ వచ్చింది . వెంటనే అతడు తన తలకొక గుడ్డ కట్టుకొని బాబా దగ్గరకు వచ్చాడు . బాబా శ్యామా చేత ఆ గాయానికి చికిత్స చేయించారు . త్వరలో అతడు పూర్తిగా కోలుకున్నాడు . అతడు దొంగలతో పోరాడుతున్న సమయంలో మసీదులో బాబా కోపంగా, "కొట్టు, చంపు "అంటూ ఎవరినో కొడుతున్నట్లు ప్రవర్తించారు . కనుక తనను రక్షించినది బాబాయేనని కాశీరాంకు అర్ధమైంది . అతడెంతో శ్రద్ధతో బాబాను సేవించి తరించాడు .