కాసె సర్వప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాసె సర్వప్ప ప్రముఖ తెలుగు కవి.[1][2]

ఇతడు సిద్ధేశ్వరచరిత్రము అను నామాంతరముగల ప్రతాపచరిత్రమును ద్విపద కావ్యముగా రచించెను. ఈకవి జీవితకాలమెప్పుడో నిశ్చయముగా దెలియదు; గాని యితని గ్రంథము మిక్కిలి పురాతన మైనదనుటకు సందేహము లేదు. ఇతడు ప్రతాపరుద్రుని రాజ్యపాలన తర్వాత నుండినవాడు. ఈతని కవిత్వమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగము లనేకములు గానబడుచున్నను, చరిత్రముగా నీగ్రంథము మిక్కిలి యుపయుక్త మయినది. ఈతని గ్రంథము నుండియే కూచిమంచి జగ్గకవి తన సోమదేవరాజీయము నందు విశేష భాగము గ్రహించి యున్నాడు. తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంథమునుండి కొంతభాగ ముదాహరింపబడినందున, ఇందుండి యిప్పుడు గొన్నిపంక్తులు మాత్రమే గ్రహింపబడును.

ద్విపద.
గణపప్రసాదత గలిగినసుతుని
గణపతినామంబు ఘనముగా బెట్టి
తూర్పుదేశం బేగి తూర్పురాజులను
నేర్పుతో సాధించి యోర్పుమీరంగ
బాండుదేశాధీశు బాహుబలాడ్యు
గాండంబులనుగొని గం డడగించి
చండవిక్రమకళాసారదుర్వార
పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు

ఇది శ్రీసకలవిద్వదిభపాదకమల
సదమలసేవన సభ్యసంస్మరణ
భాసురసాధుభావనగుణానూన
భూసురాశీర్వాద పూజనీయుండు
కాసె మల్లనమంత్రి ఘనకుమారుండు
వాసిగా జెప్పె సర్వప్పనునతడు.

మూలాలు[మార్చు]

  1. ద్వానా శాస్త్రి. "తెలుగు సృజన దీప్తులు". eenadu.net. ఈనాడు. Retrieved 11 December 2017.
  2. ఆంధ్ర కవుల చరిత్రము, కందుకూరి వీరేశలింగం పంతులు, హితకారిణీ సమాజం, రాజమండ్రి, 1949, పేజీలు: 74-5.