కింగ్ కాంగ్ (1933 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కింగ్ కాంగ్
కింగ్ కాంగ్ సినిమా పోస్టర్
దర్శకత్వంమేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్
స్క్రీన్ ప్లేజేమ్స్ క్రీల్మాన్, రూత్ రోజ్
కథఎడ్గార్ వాలెస్, మేరియన్ సి. కూపర్
నిర్మాతమేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్, డేవిడ్ ఓ. సెల్జ్నిక్
తారాగణంఫే వ్రే, బ్రూస్ కాబోట్, రాబర్ట్ ఆర్మ్‌స్ట్రాంగ్
ఛాయాగ్రహణంఎడ్డీ లిండెన్, వెర్నాన్ వాకర్, జె.ఓ. టేలర్
కూర్పుటెడ్ చీస్ మాన్
సంగీతంమాక్స్ స్టీనర్
నిర్మాణ
సంస్థ
రేడియో పిక్చర్స్
పంపిణీదార్లురేడియో పిక్చర్స్
విడుదల తేదీs
మార్చి 2, 1933 (1933-03-02)(న్యూయార్క్)
మార్చి 24, 1933 (లాస్ ఏంజలెస్)
ఏప్రిల్ 7, 1933 (యు.ఎస్)
సినిమా నిడివి
100 నిముషాలు (104 నిముషాలు)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$672,000
బాక్సాఫీసు$5.3 మిలియన్

కింగ్ కాంగ్ 1933లో విడుదలైన అమెరికా సాహస చలనచిత్రం.[1] మేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫే వ్రే, బ్రూస్ కాబోట్, రాబర్ట్ ఆర్మ్‌స్ట్రాంగ్ తదితరులు నటించారు.[2] ఈ చిత్రం, ప్రపంచ సినీచరిత్రలో ఒకేసారి రెండు థియేటర్స్ లో విడుదలైన తొలి చిత్రంగా నమోదయింది.[3]

ఈ చిత్రం ఆల్ టైం గొప్ప చిత్రంగా,[4] ఆల్ టైం హర్రర్ చిత్రంగా[5] రొట్టెన్ టమాటోస్ వారిచే ధ్రువీకరించబడింది. 1991లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.[6]

ప్రముఖ నిర్మాత ఒక సాహస చిత్రాన్ని తీయాలనుకుంటాడు. అందుకోసం తన యూనిట్ తో కలిసి సమత్రా ద్వీపాల దగ్గరలోవున్న స్కల్ ఐలాండ్ కు వెలుతాడు. అక్కడున్న ఆదిమవాసులు జంతువుల భయానికి గోడ కట్టుకొని ఉంటారు. హీరోయిన్ ను చూసిన ఆదిమవాసులు ఆమెను కింగ్ కాంగ్ కు బహుమతిగా ఇవ్వమంటారు. అందుకు చిత్ర యూనిట్ ఒప్పుకోకపోవడంతో ఆదిమవాసులు హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తారు. అక్కడినుండి ఆమెను కాంగ్ ఎత్తుకొనిపోతాడు. హీరోయిన్ ను రక్షించి, కాంగ్ ను బంధించి న్యూయార్క్ నగరానికి తీసుకొస్తారు. అక్కడ హీరోయిన్ ను చూసిన కాంగ్, ఆమెను తీసుకొని ఎంపైర్ స్టేట్ భవనంపైకి ఎక్కుతాడు. అప్పుడు ఎయిర్ ఫోర్స్ విమానాలు వచ్చి కాంగ్ ను చంపేస్తాయి. చనిపోయేముందు ఈ నాగరిక ప్రపంచాన్ని జాలీగా చూస్తూ కాంగ్ ఆ భవనం నుండి కిందికి పడిపోతాడు.

నటవర్గం

[మార్చు]
  • ఫే వ్రే
  • బ్రూస్ కాబోట్
  • రాబర్ట్ ఆర్మ్‌స్ట్రాంగ్
  • ఫ్రాంక్ రిచెర్
  • సామ్ హార్డీ
  • నోబెల్ జాన్సన్
  • స్టీవ్ క్లెమెంట్
  • జేమ్స్ ఫ్లావిన్
  • విక్టర్ వాంగ్
  • ఎవెరెట్ బ్రౌన్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్
  • నిర్మాత: మేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్, డేవిడ్ ఓ. సెల్జ్నిక్
  • స్క్రీన్ ప్లే: జేమ్స్ క్రీల్మాన్, రూత్ రోజ్
  • కథ: ఎడ్గార్ వాలెస్, మేరియన్ సి. కూపర్
  • నటులు: ఫే వ్రే, బ్రూస్ కాబోట్,రాబర్ట్ ఆర్మ్‌స్ట్రాంగ్
  • సంగీతం: మాక్స్ స్టీనర్
  • ఛాయాగ్రహణం: ఎడ్డీ లిండెన్, వెర్నాన్ వాకర్, జె.ఓ. టేలర్
  • కూర్పు: టెడ్ చీస్ మాన్
  • నిర్మాణ సంస్థ, పంపిణీదారు: రేడియో పిక్చర్స్

విడుదల

[మార్చు]
  1. ఈ చిత్రం 1933, మార్చి 2న న్యూయార్క్ లో, మార్చి 24న లాస్ ఏంజలెస్లో ఏప్రిల్ 7న యునైటెడ్ స్టేట్స్లో విడుదల అయింది.
  2. ఈ చిత్రంయొక్క అధికారిక ప్రపంచ ప్రీమియర్ 1933, మార్చి 23న హాలీవుడ్ లోని గ్రామన్స్ చైనీస్ థియేటర్ లో ప్రదర్శించబడింది.
  3. 1933 ఏప్రిల్ 10న ఈస్టర్ దినోత్సవం రోజుగా లండన్ దేశవ్యాప్తంగా ప్రదర్శన ప్రారంభించుకుంది.[7]
  4. 1938, 1942, 1946, 1952, 1956 సంవత్సారాలలో మళ్ళీ ఈ చిత్రం విడుదలచేయబడింది.[8]

చిత్ర విశేషాలు

[మార్చు]
  1. ఈ చిత్రం 1933, ఏప్రిల్ 7న (గురువారం) న్యూయార్క్ లోని 6,200 సీట్లు ఉన్న రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో, 3,700 సీట్లు ఉన్న రాక్సీలో ఒకేసారి విడుదలై ప్రపంచ సినీచరిత్రలో ఒకేసారి రెండు థియేటర్స్ లో విడుదలైన తొలి చిత్రంగా నమోదయింది.[3]
  2. దక్షిణాఫ్రికాలోని ఒక థియేటర్లో ఈ చిత్రం 20ఏళ్ళపాటు వరుసగా ప్రదర్శించబడింది.[3]
  3. తెరమీద మనిషికి ఐదింతలు కనిపించే కింగ్ కాంగ్ మోడల్ సైజ్ 18 అంగుళాలే. ఖాళీ బ్యాగ్రౌండ్ ముందు ఆ మోడల్ ను పెట్టి షూట్ చేశారు.[2]
  4. రబ్బరు, స్పాంజీలతో తయారుచేసిన కింగ్ కాంగ్ మోడల్ లోపల మోటారు ఫ్రేములను పెట్టి, కదలికలు వచ్చేలా చేసేవారు. కింగ్ కాంగ్ ఒక్క అడుగు వేయాలంటే 12సార్లు వేర్వేరు షాట్స్ తీసేవారు. ఇలా రోజంతా చేస్తే తెరమీద అరనిముషం కనిపించే 25 అడుగుల ఫిల్మ్ సిద్ధమయ్యేది.[2]
  5. మనుషుల షాట్స్, అడవి షాట్స్, విమానంతో ఉన్న కింగ్ కాంగ్ షాట్స్ ను కలిపి కాంపోజిట్ షాట్స్ సిద్ధంచేసేవారు. 1970ల వరకు ఇలాంటి ఎఫెక్టులతో మరో సినిమా రాలేదు.[2]

మూలాలు

[మార్చు]
  1. Miller, Frank (January 5, 2015). "King Kong (1933) Awards and Honors". Turner Classic Movies. Retrieved 13 February 2019.
  2. 2.0 2.1 2.2 2.3 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 23.
  3. 3.0 3.1 3.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 22.
  4. "Top 100 Movies of All Time – Rotten Tomatoes". www.rottentomatoes.com. Archived from the original on 1 ఫిబ్రవరి 2018. Retrieved 13 February 2019.
  5. "Best Horror Movies – King Kong (1933)". Rotten Tomatoes. Archived from the original on April 1, 2010. Retrieved 13 February 2019.
  6. Daniel Eagan, (2010). America's Film Legacy: The Authoritative Guide to the Landmark Movies in the National Film Registry. The Continuum International Publishing Group Inc, New York, NY p.22
  7. https://web.archive.org/web/20071027120655/http://retrocrush.buzznet.com/archive2005/kong/
  8. "Archived copy". Archived from the original on జనవరి 26, 2008. Retrieved ఫిబ్రవరి 13, 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]