కిఫిరె
కిఫిరె | |
---|---|
పట్టణం | |
![]() | |
నిర్దేశాంకాలు: 25°53′57″N 94°46′51″E / 25.8992°N 94.7808°ECoordinates: 25°53′57″N 94°46′51″E / 25.8992°N 94.7808°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | కిఫెరె |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | పట్టణ కౌన్సిల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 9 km2 (3 sq mi) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 896 మీ (2,940 అ.) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 16,487 |
• ర్యాంకు | 17వ స్థానం (నాగాలాండ్ లో) |
• సాంద్రత | 100/km2 (300/sq mi) |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
కాలమానం | UTC+5:30 (భారత కాలమానం) |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | ఎన్ఎల్ |
జాలస్థలి | http://kiphire.nic.in |
కిఫిరె, నాగాలాండ్ రాష్ట్రంలోని కిఫిరె జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1][2]
భౌగోళికం[మార్చు]
కిఫిరె పట్టణం 25°53′57″N 94°46′51″E / 25.8992°N 94.7808°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. 9 చ.కి.మీ. (3 చ.మై.) విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్ర మట్టానికి 896 మీ. (2,940 అ.) ఎత్తులో ఉంది. నాగాలాండ్ రాజధాని కోహిమా నుండి సుమారు 254 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నాగ తెగల సాంగ్తం (తూర్పు), యిమ్‌చుంగర్, సెమా తెగలు కలుస్తాయి. నాగాలాండ్ లోని ఎత్తైన శిఖరం సారమతి (3841 మీ లేదా 12.602 అ.) ఇక్కడ ఉంది.
జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కిఫిరె పట్టణంలో 16,487 జనాభా ఉంది. ఇందులో 8,587 మంది పురుషులు, 7,900 మంది స్త్రీలు ఉన్నారు. ఈ జనాభాలో 2,924 (17.74%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. ఈ పట్టణ అక్షరాస్యత రేటు 87.33% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 90.41% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 83.95% గా ఉంది.[3]
పరిపాలన[మార్చు]
ఈ పట్టణం 11 వార్డులుగా విభజించబడింది. దీనిని ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 3,109 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించబడుతున్నాయి. పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, కమిటీ పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ అభివృద్ధి కమిటీకి అధికారం ఉంది.[3]
మూలాలు[మార్చు]
- ↑ "District Kiphire | The Land of Minerals | India". www.kiphire.nic.in/. Retrieved 2021-01-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kiphire Official Website". kiphire.nagaland.gov.in. Retrieved 2021-01-03.
- ↑ 3.0 3.1 "Kiphire Town Committee City Population Census 2011-2021 | Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-03.