కిరణ్ నగార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరణ్ నగార్కర్
Kiran Nagarkar - Leipziger Buchmesse 2013.jpg
కిరణ్ నగార్కర్
పుట్టిన తేదీ, స్థలం1942
ముంబై, మహారాష్ట్ర
వృత్తినవలా కారుడు, నాటక రచయిత

కిరణ్ నగార్కర్ (జననం 1942) ఒక భారతీయ నవలా రచయిత, నాటక రచయిత, సినిమా విమర్శకుడు. మరాఠీ, ఇంగ్లీషు భాషలలో నాటకాలను, నాటికలను రచించాడు.[1] సాత్ సక్కమ్‌ త్రెచాలీస్ (ఏడు ఆరులు నలభై మూడు) (1974), రావన్ అండ్ ఎడ్డి (1994),, సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న నవల కకోల్డ్ (1997) [1][2][3] మొదలైనవి ఇతని ప్రధాన రచనలు.

నవలలు[మార్చు]

ఒకటి కన్నా ఎక్కువ భాషలలో నవలరచన చేసిన భారతీయ రచయితలలో నగార్కర్ ఎన్నదగినవాడు. ఇతడి మొదటి నవల సాత్ సక్కమ్‌ ట్రెచాలీస్ (తరువాత ఇంగ్లీషులో Seven Sixes Are Forty Threeగా అనువదించబడింది.) మరాఠీ సాహిత్యంలో గొప్పదైన నవలలలో ఒకటిగా పరిగణించబడింది.[citation needed] ఇతడు రావన్ అండ్ ఎడ్డి అనే నవలను మొదట మరాఠీ భాషలో వ్రాయడం ప్రారంభించి తరువాత ఇంగ్లీషులో పూర్తి చేశాడు. ఇది 1994లో ప్రచురితమైంది.[4]

రావన్ అండ్ ఎడ్డి నవల నుండి ఇతడు ఆంగ్లంలో రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతడి మూడో నవల కకోల్డ్‌ 1997లో ప్రచురించ బడింది. ఈ నవల 2001లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. ఈ నవల పలు భాషలలో అనువదించబడింది. సమకాలీన భారతీయ నవలలలో అత్యంత ఆదరణ పొందిన నవలగా గుర్తించబడింది.[citation needed]. తరువాతి నవల గాడ్స్ లిటిల్ సోల్జర్ వెలువరించడానికి ఇతనికి తొమ్మిదేళ్లు పట్టింది. ఈ నవల 2006లో ప్రచురింపబడింది. ఈ నవలకు మిశ్రమమైన స్పందన లభించింది.[5][6][7] 2012లో ఇతడు రావన్ అండ్ ఎడ్డి నవలకు సీక్వెల్‌గా ది ఎక్స్‌ట్రాస్, 2015లో రెస్ట్ ఇన్ పీస్ నవలలను రచించాడు.

నాటకాలు[మార్చు]

నగార్కర్ మహాభారతాన్ని ఆధారం చేసుకొని బెడ్‌టైమ్‌ స్టోరీ అనే నాటకాన్ని 1978లో రచించాడు. ఈ నాటకం సుమారు 17 సంవత్సరాలు ఛాందసవాద పార్టీలు బహిష్కరించాయి.[citation needed] ఇతడు ఇంకా కబీరఛె కరైఛె, స్ట్రేంజర్ అమాంగెస్ట్ అజ్ అనే నాటకాలు ది బ్రోకెన్ సర్కిల్, ది విడో అండ్ హర్ ఫ్రెండ్స్, ది ఎలిఫెంట్ ఆన్ ది మౌస్ (బాలల చిత్రం) లకు స్క్రీన్‌ప్లే రచించాడు. ఇతడు స్ప్లిట్ వైడ్ ఓపన్ అనే సినిమాలో బ్రదర్ బోనో పాత్రను ధరించాడు.[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతడు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు ప్రార్థనా సమాజము అనే మహారాష్ట్ర లోని బ్రహ్మసమాజ శాఖకు చెందినవారు. వీరు హిందువులే అయినా వీరికి పాశ్చాత్య దృక్పథం ఉండేది. ఇతని తాత 1893 సంవత్సరంలో షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో పాల్గొన్నాడు. నగార్కర్ పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలోను, ముంబైలోని ఎస్.ఐ.ఇ.ఎస్ కాలేజీలోను చదివాడు. 2011లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్‌లో లిటరేచర్ హౌస్, పి.డబ్ల్యూ.జి. ఫౌండేషన్ వారు నిర్వహించిన "రైటర్ ఇన్ రెసిడెన్స్" కార్యక్రమంలో పాల్గొన్నాడు. [9]

అవార్డులు[మార్చు]

 • ది హిందూ పత్రిక ప్రదానం చేసే సాహిత్య బహుమతికి 2013లో ఇతని నవల "ది ఎక్స్‌ట్ర్ర్రాస్" తుది పరిశీలనకు వచ్చింది.[10]
 • 2012 రిపబ్లిక్ ఫెడరల్ ఆఫ్ జర్మనీ వారి ఆర్డర్ ఆఫ్ మెరిట్.[11]
 • 2001 కకొల్డ్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.[1]

రచనలు[మార్చు]

నవలలు

 • 1974 సెవెన్ సిక్సస్ ఆర్ ఫార్టీ త్రీ ( సాత్ సక్కం త్రెచాలీస్కు అనువాదం.) ISBN 0-435-95088-6.
 • 1994 రావన్ అండ్ ఎడ్డి
 • 1997 కకోల్డ్
 • 2006 గాడ్స్ లిటిల్ సోల్జర్
 • 2012 ది ఎక్స్‌ట్రాస్
 • 2015 రెస్ట్ ఇన్ పీస్

నాటకాలు, చిత్రానువాదాలు

 • బెడ్ టైమ్‌ స్టోరూ
 • కబీరఛే కరైఛె
 • స్ట్రేంజర్ అమాంగెస్ట్ అజ్
 • ది బ్రోకెన్ సర్కిల్
 • ది విడో అండ్ హర్ ఫ్రెండ్స్
 • ది ఎలిఫెంట్ ఆన్ ది మౌస్
 • బ్లాక్ తులిప్

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 సంగా, పే. 177
 2. Sahitya Akademi Awards 1955–2007: English Archived 2009-03-31 at the Wayback Machine కేంద్ర సాహిత్య అకాడమీ అధికారిక వెబ్‌సైట్.
 3. "ఇన్ కాన్వర్‌జేషన్: ది ఆర్ట్‌ఫుల్ స్టోరీటెల్లర్". ది హిందూ. 5 March 2006. Archived from the original on 14 మార్చి 2006. Retrieved 7 నవంబర్ 2016. Check date values in: |access-date= (help)
 4. "'ది టెర్రరిస్ట్ ఈజ్ ఇన్‌సైడ్ అజ్'". ది ట్రిభ్యూన్. 15 April 2006.
 5. "The Soldier Reads". ఔట్‌లుక్. 24 April 2006.
 6. "లిటరేచర్: ది లైట్ అండ్ ది టన్నెల్". The Hindu. 13 April 2006. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 7 నవంబర్ 2016. Check date values in: |access-date= (help)
 7. శశి థరూర్ (8 May 2006). "Review:ఎ ఫాన్సీ బర్డ్ టూ హెవీ టు ఫ్లై". ఔట్‌లుక్.
 8. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కిరణ్ నగార్కర్ పేజీ
 9. Angela Schader (20 June 2011). "Der indische Romancier Kiran Nagarkar ist Zürichs neuer "writer in residence"" (in German). Neue Zürcher Zeitung. Retrieved 20 June 2011.CS1 maint: unrecognized language (link)
 10. స్టాఫ్ రిపోర్టర్ (17 February 2013). "ది హిందూ లిటరరీ ప్రైజ్ గోస్ టు జెర్రీ పింటో". ది హిందూ. Retrieved 18 February 2013.
 11. Staff writer (7 November 2012). "Germany confers Cross of Order of Merit,to Babasaheb Kalyani, Kiran Nagarkar". ANI. Archived from the original on 9 నవంబర్ 2012. Retrieved 18 February 2013. Check date values in: |archive-date= (help)

References[మార్చు]

బయటిలింకులు[మార్చు]