కిరీటి దామరాజు
కిరీటి దామరాజు | |
---|---|
జననం | [1] హైదరాబాదు | 1986 జనవరి 13
విద్య | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
వృత్తి | సాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు [2] |
కిరీటి దామరాజు ఒక తెలుగు నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. ఉన్నది ఒకటే జిందగీ, చల్ మోహన రంగ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.[3] బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.[4]
నేపథ్యం
[మార్చు]కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.[5] ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదు, బెంగళూరులో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
కెరీర్
[మార్చు]కిరీటి లఘు చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించాడు. ఒంటిగంట, అనుకోకుండా అతనికి మొదట్లో పేరు తెచ్చిన లఘుచిత్రాలు. అనుకోకుండా అనే లఘుచిత్రం కేన్స్ చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. నటుడిగా తన మొదటి చిత్రం సెకండ్ హ్యాండ్. 2013 లో వచ్చిన ఉయ్యాల జంపాల అనే చిత్రంలో తను పోషించిన మురళి పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది.
సినిమాలు
[మార్చు]- సెకండ్ హ్యాండ్
- ఉయ్యాల జంపాల (2013)
- ఎవడే సుబ్రహ్మణ్యం
- యుద్ధం శరణం
- ఉన్నది ఒకటే జిందగీ
- భం భోలేనాథ్
- మెనీ హ్యాపీ రిటర్న్స్
- మీకు మీరే మాకు మేమే[6][7]
- దెబ్బకు ఠా దొంగలముఠా
- సైజ్ జీరో
- మెంటల్ మదిలో
- చల్ మోహన రంగా
- టాక్సీవాలా
- భమ్ బోలేనాథ్ (2015)[8]
- రన్ (2020)
- వలయం (2020)
- 47 డేస్ (2020)
- పెళ్లిసందD (2022)
- డీజే టిల్లు (2022)
- అనుకున్నవన్నీ జరగవు కొన్ని (2023)
వివాదం
[మార్చు]కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Kireeti Damaraju Bio". Archived from the original on 2018-11-18. Retrieved 2018-07-29.
- ↑ "Kireeti Damaraju Wiki". Archived from the original on 2018-09-18. Retrieved 2018-09-15.
- ↑ Sangeetha Devi, Dundoo (8 November 2017). "Mr Nice Guy speaks up". The Hindu. The Hindu. Retrieved 29 July 2018.
- ↑ "Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house".
- ↑ "Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images". crazum.com. 19 June 2018. Archived from the original on 26 February 2019. Retrieved 23 February 2019.
- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
- ↑ Murali, Ravi (13 May 2018). "Kireeti Damaraju caught in drunk and drive case". tollywood.net. Retrieved 23 February 2019.[permanent dead link]