కిర్పాల్ సింగ్
కిర్పాల్ సింగ్ | |
|---|---|
1972 లో కిర్పాల్ సింగ్ | |
| శీర్షిక | Sant |
| ఇతర పేర్లు | కిర్పాల్ సింగ్ దుగ్గల్ |
| వ్యక్తిగతం | |
| జననం | 1894 ఫిబ్రవరి 6 సయ్యద్ కస్రాన్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం |
| మరణం | 1974 ఆగస్టు 21 (వయసు: 80) |
| మతం | సిక్కు మతం |
| జాతీయత | భారతీయుడు |
| పౌరసత్వం | బ్రిటిషు భారతదేశం |
| జాతి | ఉత్తరీ భారత్ కీ సంత్ పరంపరా |
| ప్రముఖ కృషి |
|
| దీనికి ప్రసిద్ధి |
|
| ఇతర పేర్లు | కిర్పాల్ సింగ్ దుగ్గల్ |
| వృత్తి | ఎకౌంటెంట్, మిలిటరీ ఎక్కౌంట్స్ విభాగం |
| Philosophy | నిర్గుణ భక్తి |
| Senior posting | |
| Based in | ఢిల్లీ |
| Predecessor | బాబా సావన్ సింగ్ |
| Initiation | సూరత్ శబ్ద యోగా, సంత్ మత్ 1924 దేరా బాబా జైమల్ సింగ్, బియాస్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం by బాబా సావన్ సింగ్ |
కిర్పాల్ సింగ్ ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని సయ్యద్ కస్రాన్‌లో జన్మించాడు. శిష్యరికం చేసే సమయంలో ఆయన లాహోర్‌లో ఉండేవాడు. డిప్యూటీ కంప్ట్రోలర్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్‌గా ఉన్నత పదవిని పొందాడు.
ఆయన యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ రెలిజియన్స్ సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ సంస్థలో ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాల ప్రతినిధులు ఉండేవారు. 1930ల చివరలో ఆయన రచించిన గుర్మత్ సిద్ధాంత్ ప్రచురణతో ప్రారంభించి, ఆయన గురువు పేరుతో ప్రచురించబడిన అనేక పుస్తకాలు, సర్క్యులర్‌లను ఆయన తన పరిచర్య కాలంలో ప్రచురించాడు. అవి అనేక భాషలలోకి అనువాదమయ్యాయి.
సూరత్ శబ్ద యోగా బోధన అనేది జీవించి ఉన్న ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వంలో వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన చేసే ఒక మార్గం. అంతర్గత కాంతి, అంతర్గత ధ్వనులను చూసే దృష్టిని సాధించేందుకు మూడవ కన్ను తెరవడం దీని ప్రాథమిక బోధనలలో ఉంటుంది. ఇది వ్యక్తీకరించబడని భగవంతుని శక్తిగా పరిగణించబడుతుంది. బైబిల్‌లో దీన్ని వర్డ్ అని పిలుస్తారు. ఇతర గ్రంథాలలో నామ్, శబ్ద్, ఓం, కల్మా, తదితర పేర్లతో పిలుస్తారు. దైవిక పదంపై ధ్యానం చేయడం లేదా ధ్వని ప్రవాహ యోగా (సూరత్ శబ్ద యోగా) అన్ని మతాల ఆధ్యాత్మికతల్లోనూ ఉందని కిర్పాల్ సింగ్ బోధించాడు.
జీవితం
[మార్చు]చిన్నప్పటి నుంచి కిర్పాల్ సింగ్ కు దివ్యదృష్టి అనుభవాలు, సంఘటనల ముందస్తు జ్ఞానం ఉండేవి. అతను వివిధ సూఫీలు, యోగులు, ఆధ్యాత్మికవేత్తల నుండి మార్గదర్శకత్వం కోరాడు. కానీ వారిలో ఎవరినీ ఎప్పుడూ గురువుగా అంగీకరించలేదు. జీవించి ఉన్న గురువు మార్గదర్శకత్వం కోసం తన ఆధ్యాత్మిక సాధన ప్రార్థనలను కొనసాగించాడు. 1917 లో అతను ఒక ఆధ్యాత్మిక రూపాన్ని సిక్కు మత స్థాపకుడైన గురునానక్ అని విశ్వసిస్తూ చూడటం ప్రారంభించాడు. 1924లో, అతను బియాస్ నది ఒడ్డున ఉన్న తన ఆశ్రమంలో బియాస్ ప్రసిద్ధ సాధువైన హజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీని కలిశాడు. అతనిలో కిర్పాల్, గత ఏడు సంవత్సరాలుగా తాను చూస్తూ ఉన్న ప్రకాశవంతమైన రూపాన్ని గుర్తించాడు. హజూర్ అతన్ని సూరత్ శబ్ద యోగాలో ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కిర్పాల్ సింగ్, పెళ్ళై, పిల్లలతో, బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉంటూనే తన జీవితాన్ని తన ఆధ్యాత్మిక గురువు లక్ష్యానికి, అభ్యాసాలకు అంకితం చేశాడు. బాబా సావన్ సింగ్ జీ మహారాజ్ అతన్ని ప్రతిరోజూ ఆరు గంటలు ధ్యానం చేయమని ఆదేశించగా, ఐహిక బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తన శిష్యరికం కాలమంతా ఈ అభ్యాసాన్ని కొనసాగించాడు.
1930 ల ప్రారంభం నుండి, హజుర్‌ను గొప్ప పురోగతి సాధించిన శిష్యుడు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడల్లా, అతను కిర్పాల్ సింగ్‌ను ఉదహరించేవాడు. అదే సంవత్సరాల్లో, తన గురువు నుండి ప్రేరణ పొంది కిర్పాల్, పంజాబీ ఉర్దూ భాషలలో రెండు సంపుటాల ఆధ్యాత్మిక రచన "గుర్మత్ సిద్ధాంత్" ("ది ఫిలాసఫీ ఆఫ్ ది మాస్టర్స్") రాయడం ప్రారంభించాడు. ఇది కిర్పాల్ అభ్యర్థన మేరకు హజుర్ మహారాజ్ సావన్ సింగ్ జీ పేరుతో ప్రచురించబడింది. 1960 లలో ఇది ఆంగ్లంలో ఐదు సంపుటాలుగా ప్రచురించబడింది. రుహాని సత్సంగ్ కిర్పాల్ సింగ్ పేరుతో అనేక పుస్తకాలను ప్రచురించాడు. అవి గుర్మత్ సిద్ధాంత్ లోని భాగాలే.
1947 అక్టోబరు 12 ఉదయం, హజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీ తన శిష్యుడు కిర్పాల్ సింగ్ కు తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని కొనసాగించే పనిని అప్పగించాడు. మరుసటి నెలలో, హజూర్ కిర్పాల్ తనకు సమర్పించిన "రుహానీ సత్సంగ్" (ఆధ్యాత్మికత లేదా ఆత్మ శాస్త్రం) ప్రాజెక్టును ఆమోదించాడు. హజూర్ మహారాజ్ సావన్ సింగ్ జీ 1948 ఏప్రిల్ 2న స్వల్ప అనారోగ్యంతో మరణించాడు.
తన గురువు మరణించిన తర్వాత కిర్పాల్, హిమాలయ పర్వతాల దిగువన ఉన్న రిషికేశ్‌కు వెళ్లాడు, అక్కడ అతను తదుపరి ఐదు నెలలు దాదాపు నిరంతర సమాధి స్థితిలో లేదా దేవునిలో నిమగ్నమై ఉన్నాడు.
ఈ తీవ్రమైన ధ్యాన కాలం ముగింపులో, కిర్పాల్ సింగ్ తన గురువు నుండి "లోకానికి తిరిగి వెళ్లి నా పిల్లలను నా దగ్గరకు తీసుకురా" అనే ఒక అంతర్గత ఆదేశాన్ని అందుకున్నాడు. ఆ పని మీద ఢిల్లీ వెళ్లాడు, అక్కడ పాకిస్తాన్ విభజన కారణంగా పంజాబ్ నుండి ప్రజలు ఆశ్రయం కోసం చూస్తున్నారు. అక్కడే అతని ఆధ్యాత్మిక, మానవతా లక్ష్యం ప్రారంభమైంది.
కిర్పాల్ కు 80,000 మందికి పైగా అనుచరులు ఉండేవారు.[1]
రుహాని సత్సంగ్
[మార్చు]ఢిల్లీలో, కిర్పాల్ సింగ్ తన కొత్త ఆధ్యాత్మిక పరిశోధన, సాక్షాత్కార పాఠశాలను రుహాని సత్సంగ్ (ఆధ్యాత్మికత లేదా ఆత్మ శాస్త్రం) అని స్థాపించారు. దీనికి ప్రపంచంలోని అనేక దేశాలలో శాఖలున్నాయి. 1951లో అతను నగర శివార్లలోని శక్తి నగర్ పరిసరాల్లో సావన్ ఆశ్రమాన్ని నిర్మించాడు. అనతికాలం లోనే అక్కడ అతని ఆధ్యాత్మిక ప్రసంగాలను (సత్సంగాలు) వేలాది మంది అనుసరించారు.
పాశ్చాత్య శిష్యులు ఆయనను సందర్శించడం ప్రారంభించారు. వారిలో మొదటవచ్చిన వారు రుసెల్ జాక్వే, 1959లో ఆశ్రమంలో తాను గడిపిన ఆరు నెలల గురించి ఆయన చెప్పిన కథనం (గురుదేవ్: కరుణామయుడు) ఇతరులను ప్రోత్సహించింది. అరవైల ప్రారంభంలో, సగటున 40 నుండి 50 మంది శిష్యులు మూడు వారాల నుండి ఆరు నెలల వరకు ఆశ్రమంలో బస చేసేవారు.
శాకాహారం
[మార్చు]సింగ్ బోధనలలో సాత్వికాహారం ఒక ముఖ్యమైన భాగం. ఆధ్యాత్మిక కారణాల దృష్ట్యా పండ్లు, ధాన్యాలు, గింజలు, కూరగాయలతో కూడిన సాధారణ లాక్టో-వెజిటేరియన్ ఆహారం తినాలని ఆయన బోధించేవాడు.[2] మాంసం, గుడ్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి రాజసిక, తామసిక ఆహారాలు కాబట్టి వాటిని తినరాదని ఖచ్చితంగా చెప్పేవాడు. అతిగా తినడానికి వ్యతిరేకంగా ఆయన బోధించేవాడు.[2]
ప్రపంచ మతాల సమాఖ్య
[మార్చు]1957 లో సింగ్, యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ రిలిజియన్స్ సంస్థకు మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ సంస్థలో అన్ని ప్రధాన ప్రపంచ మతాల ప్రతినిధులు ఉన్నారు. ఆయన 1971 వరకు ఆ పదవిలో ఉన్నాడు. నాలుగు ప్రపంచ సమావేశాలకు అధ్యక్షత వహించాడు.
1962 లో ఆయన తన ఆధ్యాత్మిక, మానవతా కృషికి ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ ఆఫ్ జెరూసలేం (నైట్స్ ఆఫ్ మాల్టా) అందుకున్న మొదటి క్రైస్తవేతర వ్యక్తి అయ్యాడు.[3][4] [5] ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అభినందనలు అందుకున్నాడు. ప్రధాన మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలతో ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు.
ప్రపంచ పర్యటన
[మార్చు]మొదటి పర్యటన
[మార్చు]సింగ్ లక్ష్యం వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. 1955 లో ఆయన తన బోధనలను వ్యాప్తి చేయడానికి తొలిసారి విదేశాలకు వెళ్లాడు. అమెరికా, యూరప్‌లలో నెలల తరబడి గడిపాడు. ఆ రోజుల్లో, ప్రాచ్య ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధారణంగా పశ్చిమ దేశాలకు తెలియనివి. సింగ్ వందలాది మంది పాశ్చాత్యులను ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లి, వారికి ధ్యానం నేర్పించారు. అది దైవిక కాంతి, సామరస్యంతో సంబంధంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
1963 లో సింగ్ తన రెండవ ప్రపంచ పర్యటన చేసాడు. ఈసారి వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ రిలిజియన్స్ అధ్యక్షుడిగా ఈ పర్యటనలు చేసాడు. ఆయన రాజకీయ నాయకులు, ఇతర మత నాయకులను కలిశాడు. వారిలో పోప్ పాల్ VI, తూర్పు ఆర్థోడాక్స్ చర్చిల పాట్రియార్క్ అటెనాగోరా I ఉన్నారు. అదే సమయంలో, ఆయన కొత్త అన్వేషకులకు మాస్టర్స్ మార్గం (సంత్ మత్) మార్గంలో బోధన కొనసాగించాడు.
1972 ఆగస్టు 26 న కిర్పాల్ సింగ్ తన మూడవ, చివరి పశ్చిమ దేశ పర్యటన చేసాడు. అక్కడ ఆయన 2000 మందికి పైగా కొత్త శిష్యులను స్వీకరించి ఆధ్యాత్మిక మార్గం గురించి వారికి బోధించాడు.
చివరి సంవత్సరం
[మార్చు]1974 ఫిబ్రవరిలో సింగ్, ఢిల్లీలో ప్రపంచ మానవ ఐక్యత సదస్సును నిర్వహించారు. భారతదేశం లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న మత, రాజకీయ నాయకులతో సహా 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 1,00,000 మందికి పైగా ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అదే సంవత్సరం ఏప్రిల్ 2న హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా (మతాల పండుగ)లో, సహకారాన్ని ప్రోత్సహించడం, మతపరమైన అడ్డంకులను తొలగించడం, భారతదేశంలోని పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం అనే లక్ష్యాలతో సింగ్ జాతీయ ఐక్యత సమావేశంలో "సాధువులను" సమావేశపరిచాడు.
1974లో కిర్పాల్ సింగ్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కాన్ఫరెన్స్‌ను స్థాపించాడు. మత, రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడానికీ, సంబంధాలను మెరుగుపరచడానికీ ఒక వేదికగా ఉండాలని దీన్ని ఉద్దేశించాడు. ఈ సమావేశం, హ్యూమన్ యూనిటీ కాన్ఫరెన్స్ పేరుతో నేటికీ కొనసాగుతోంది.
వారసత్వం
[మార్చు]కిర్పాల్ సింగ్ 1974 ఆగస్టు 21న ఎనభై సంవత్సరాల వయసులో మరణించాడు.[6] అతని మరణం అతని అనుచరులలో వారసత్వ వివాదానికి కారణమైంది.[1][7]
1968 జనవరిలో దీక్ష తీసుకున్న తర్వాత, ఇటలీలోని మిలన్‌లో గ్రూప్ లీడరుగా, ప్రతినిధిగా ఉన్న పియర్ ఫ్రాంకో మార్సెనారో ఒకడు. "ది స్కూల్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ" అనే సంఘంలో భాగంగా ఉన్న అనేక మంది శిష్యులు అతన్ని గుర్తింపు పొందిన వారసుడిగా భావిస్తారు.[8]
1963 లో, కిర్పాల్ సింగ్ తన వారసుడు కావడానికి సమర్థుడు ఎవరూ లేరని ప్రకటించాడు. తరువాత అతను చాలా గట్టిగా ఇలా అన్నాడు: "భవిష్యత్తులో ఎవరైనా నాయకుడు కావచ్చు, కానీ నా కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా కారని నేను మీకు చెబుతున్నాను!"[9]
ఈ వారసత్వ వివాదాలు చివరికి సింగ్ సంప్రదాయపు ఏ వారసుడితో సంబంధం లేకుండా సత్సంగ్‌ల విస్తరణకు దారితీశాయి.[7] 2002 నాటికి, కిర్పాల్ సింగ్‌కు సంబంధించిన సమూహాలకు సుమారు 2,00,000 మంది అనుచరులు ఉన్నారు.[1]
1968 లో కిర్పాల్ సింగ్‌కు పద్మవిభూషణ పురస్కారం లభించింది.[10]
గమనికలు
[మార్చు]- 1 2 3 Lewis 2002, p. 591.
- 1 2 "The Spiritual and Karmic Aspects of the Vegetarian Diet". ruhanisatsangusa.org. Retrieved 12 March 2023.
- ↑ Sena 1976, p. xiv,353,364.
- ↑ Jones & Ryan 2006, p. 417-418.
- ↑ Singh 1993, p. 146.
- ↑ Lane 2015.
- 1 2 Diem-Lane 2015.
- ↑ Marcenaro 1995.
- ↑ Sat Sandesh USA (1974). "Sat Sandesh, the Magazine of the Master. page 26 - right column" (PDF).
- ↑ "Padma Awards: Year wise list of recipients (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 మే 2014. p. 26. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 18 అక్టోబరు 2015.
మూలాలు
[మార్చు]- Chryssides, G.D. (2012). Historical Dictionary of New Religious Movements. Scarecrow Press. ISBN 978-0-8108-6194-7.
- Chryssides, G.D. (2006). The A to Z of New Religious Movements. A to Z guides. Scarecrow Press. ISBN 978-0-8108-5588-5.
- Diem-Lane, Andrea Grace (2015). "The History Of Radhasoami In The United States". The Guru in America: The Influence of Radhasoami on New Religions in America. Mount San Antonio College. ISBN 978-1-56543-287-1. Archived from the original on 7 జనవరి 2019. Retrieved 24 August 2017., also published as The History Of Radhasoami In The United States. Lulu.com. 2015. ISBN 978-1-329-75562-8.
- Jones, C.; Ryan, J.D. (2006). "Singh, Kirpal". Encyclopedia of Hinduism. Encyclopedia of World Religions. Facts On File, Incorporated. ISBN 978-0-8160-7564-5. Retrieved 28 August 2017.
- Lane, David Christopher (1992). The Radhasoami Tradition: A Critical History of Guru Successorship. Garland bibliographies on sects and cults. Garland. ISBN 978-0-8240-5247-8.
- Lane, David Christopher (2015). Radhasoami: A Critical History of Guru Succession. Mount San Antonio College/Philosophy Group. ISBN 978-1-56543-351-9.
- Lewis, J.R. (2002). "The Radhasoami tradition". The Encyclopedia of Cults, Sects, and New Religions. Prometheus Books, Publishers. ISBN 978-1-61592-738-8.
- Melton, J.G. (2003). Encyclopedia of American Religions. Gale. ISBN 978-0-7876-6384-1.
- Sena, B. (1976). The Ocean of Grace Divine: Sant Kirpal Singh Ji Maharaj. Ruhani Satsang. Retrieved 28 August 2017.
- Singh, K. (1993). The wheel of life & The mystery of death. Kirpal Light Satsang. ISBN 978-0-942735-80-2. Retrieved 28 August 2017.
- Marcenaro, Pier Franco (1995). The School Of Spirituality. Man Center. ISBN 978-88-86604-13-0. Retrieved 7 August 2019.
- AAVV, AAVV (2010). The never ending tale. The Master of our time. Man Center Edition. ISBN 978-1-936510-27-6. Retrieved 31 August 2019.
- Nuvoli, Roberto (March 2013). "A Visit to the Sawan Ashram in 1972". The Source (in ఇంగ్లీష్). 21 Mauri Court - Danville, CA 94526 USA: Man Center Edition. Retrieved 2019-08-31.
{{cite magazine}}: CS1 maint: location (link)