కీర్తి జ‌ల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీర్తి జల్లి
జననం
కీర్తి జల్లి

1989
వృత్తిక‌చార్ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్
జీవిత భాగస్వామిఆదిత్య శశికాంత్
తల్లిదండ్రులు
  • జెల్లి కనకయ్య (తండ్రి)
  • వసంత (తల్లి)

కీర్తి జ‌ల్లి 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె ప్రస్తుతం అసోం రాష్ట్రం లోని క‌చార్ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది.[1]ఆమె 2019-20 సంవత్సరానికి గాను ‘హైలాకండి’ జిల్లా డెప్యూటి కమిషనర్‌గా విధుల నిర్వహణలో సమయంలో ఉత్తమ అధికారిగా ముఖ్యమంత్రి అవార్డును అందుకుంది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కీర్తి జెల్లి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, తరిగొప్పుల గ్రామంలో జెల్లి కనకయ్య, వసంత దంపతులకు జన్మించింది. ఆమెకు చెల్లి ఐశ్వర్య ఉంది.[3] కీర్తి హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని రోసరీ కాన్వెంట్‌ హైస్కూల్‌లో పదవ తరగతి, నల్లకుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి శ్రీనిధి కాలేజీలో 2011లో బి.టెక్‌ పూర్తి చేసి ఐఏఎస్‌ కావాలనుకున్న ఆమె ఢిల్లీలో ఐ.ఏ.ఎస్‌ కోచింగ్‌ తీసుకొని 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది.[4][5]

వివాహం

[మార్చు]

కీర్తి జెల్లి కొవిడ్‌ సమయంలో అతికొద్ది మంది సమక్షంలో సెప్టెంబర్ 2020లో పూణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్ ను వివాహం చేసుకుంది.[6][7]

వృత్తి జీవితం

[మార్చు]

కీర్తి ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయ్యాక అసోం కేడర్ ఐఏఎస్ అధికారిగా నియమితురాలై అస్సాంలో వివిధ బాధ్యతల్లో పనిచేసి మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు అమలు చేసింది. ఆమె జోర్‌హట్‌ జిల్లాలోని తితబార్‌ ప్రాంతానికి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు సమయంలో 2016 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఆమె చేసిన కృషికిగాను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎలక్టొరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డ్‌’ ను అందుకుంది.

కీర్తి 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించే సమయంలో టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధపడడం, పిల్లల్లో పౌష్టికాహారలోపలను గ్రహించి స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడం, అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కార్యక్రమం ‘డిబ్బీ ఆదాన్‌ ప్రధాన్‌’ ద్వారా మంచి ఫలితాలు సాధించింది.[8] ఆమె 2020 మే నెల నుండి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుంది.[9][10]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (27 May 2022). "భ‌ళా ఐఏఎస్‌.. భ‌ళా.. మన తెలంగాణ బిడ్డ‌ నిబ‌ద్ధ‌త‌కు ప్ర‌జ‌ల హ్యాట్సాఫ్‌". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  2. The Times of India (29 January 2022). "Cachar Dc Awarded With Cm's Karmashree Award" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  3. Namasthe Telangana (28 April 2021). "పట్టుచీరకంటే.. పెద్ద బహుమతి!". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  4. Sakshi (20 April 2022). "నా పని మాట్లాడాలి.. నేను కాదు." Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  5. Andhra Jyothy (30 May 2022). "అసోంలో మన కీర్తి" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  6. News18 Telugu (10 September 2020). "తెలుగు ఐఏఎస్ అధికారిణి సింపుల్ పెళ్లి, అందరికీ ఆదర్శంగా". Retrieved 30 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  7. Hindustan Times (10 September 2020). "Assam IAS officer ties knot in simple ceremony amid pandemic, joins duty the day after" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  8. The Better India (18 October 2019). "The Tiffin Box is Transforming a Remote Assam District, Thanks to this IAS Officer" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  9. Sakshi (27 May 2022). "నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  10. BBC News తెలుగు. "అస్సాం వరద ప్రాంతాల్లో బురదలో నడిచి వెళ్తున్న ఈ తెలుగు ఐఏఎస్ అధికారిణి ఎవరో తెలుసా". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.