కీళ్ల వాత జ్వరం
| కీళ్ల వాత జ్వరం | |
|---|---|
| ఇతర పేర్లు | రుమాటిక్ ఫీవర్ |
| జ్వరం, అనేక కీళ్ళు నొప్పిగా మంటగా ఉండి, కండరాల కదలికలు అసంకల్పితంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎరిథెమా మార్జినేటమ్ అనే దద్దుర్లు లక్షణం ఉంటుంది, దురద ఉండదు. | |
| ప్రత్యేకత | కార్డియాలజీ |
| లక్షణాలు | జ్వరం, అనేక కీళ్ళు నొప్పిగా మంటగా ఉండి, కండరాల కదలికలు అసంకల్పితంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎరిథెమా మార్జినేటమ్ అనే దద్దుర్లు లక్షణం ఉంటుంది, దురద ఉండదు |
| సంక్లిష్టతలు | రుమాటిక్ గుండె జబ్బు, గుండె వైఫల్యం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, కవాటాల ఇన్‌ఫెక్షన్ |
| సాధారణ ప్రారంభం | ఈ వ్యాధి సాధారణంగా స్ట్రెప్టోకోకల్ గొంతు సంక్రమణ తర్వాత రెండు నుండి నాలుగు వారాల లో అభివృద్ధి చెందుతుంది. |
| కారణాలు | స్ట్రెప్టోకోకస్ పయోజెన్స్ అనే బ్యాక్టీరియా గొంతు సంక్రమణ (ఇన్ఫెక్షన్) కలుగచేస్తుంది. తరువాత కీళ్ళవాత జ్వరం సంభవించవచ్చు. ఈ సంక్రమణకు చికిత్స చేయకుండా వదిలేస్తే, మూడు శాతం మంది ప్రజలలో కీళ్ళవాత జ్వరం సంభవిస్తుంది |
| ప్రమాద కారకములు | వారసత్వంగా వచ్చే జన్యువులు, పోషకాహార లోపం, పేదరికం |
| రోగనిర్ధారణ పద్ధతి | స్ట్రెప్టోకోకల్ సంక్రమణ ఆధారాలతో కూడిన సంకేతాలు, లక్షణాలు |
| నివారణ | స్ట్రెప్ గొంతు ఉన్నవారికి పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ చికిత్స చేయడం పారిశుద్ధ్య వాతావరణం |
| చికిత్స | దీర్ఘకాలిక యాంటీబయాటిక్స్, గుండె సమస్యలు అభివృద్ధి చెందితే, గుండె కవాటాల మార్పు (వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ) లేదా వాల్వ్ మరమ్మత్తు |
| తరుచుదనము | 325,000 పిల్లలలో |
| మరణాలు | 319,400 (2015) |
కీళ్ల వాత జ్వరం లేదా రుమాటిక్ ఫీవర్ (RF), గుండె, కీళ్ళు, చర్మం, మెదడు మొదలగు అవయవాలు ప్రభావితం చేసే ఒక శోథ వ్యాధి. ఈ వ్యాధి సాధారణంగా స్ట్రెప్టోకోకల్ గొంతు సంక్రమణ తర్వాత రెండు నుండి నాలుగు వారాల లో అభివృద్ధి చెందుతుంది.
లక్షణాలు
[మార్చు]ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలలో ముఖ్యమైనవి, జ్వరం, అనేక కీళ్ళు నొప్పిగా మంటగా ఉండి, కండరాల కదలికలు అసంకల్పితంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎరిథెమా మార్జినేటమ్ అనే దద్దుర్ల లక్షణం ఉంటుంది, కానీ దురద ఉండదు.[1] ఈ కీళ్ళవాత జ్వరం కేసులలో దాదాపు సగం వరకు గుండె, కవాటాలు ప్రభావితమవుతాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్ (RHD) అనే గుండె కవాటాలకు నష్టం వాటిల్లే పరిస్థితి సంభవించవచ్చు. కవాటాలు దెబ్బతినడం వలన గుండె వైఫల్యం, కర్ణిక దడ, కవాటాల సంక్రమణ వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీయవచ్చు.[2]
కారణాలు
[మార్చు]స్ట్రెప్టోకోకస్ పయోజెన్స్ అనే బ్యాక్టీరియా గొంతు సంక్రమణ (ఇన్ఫెక్షన్) కలుగచేస్తుంది. తరువాత కీళ్ళవాత జ్వరం సంభవించవచ్చు.[1] ఈ సంక్రమణకు చికిత్స చేయకుండా వదిలేస్తే, మూడు శాతం మంది ప్రజలలో కీళ్ళవాత జ్వరం సంభవిస్తుంది.[3] ఎందుకంటే ఒక వ్యక్తిలో సొంత కణజాలాలకు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఉత్పత్తి అయి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వారసత్వంగా వచ్చే జన్యువుల కారణంగా, కొంతమందిలో, ఈ బ్యాక్టీరియాకు గురైనప్పుడు ఇతరులకన్నా వ్యాధి సోకే ఎక్కువగా అవకాశం ఉంది. పోషకాహార లోపం, పేదరికాన్ని ఇతర ప్రమాద కారకాలుగా పరిగణిస్తారు.[2] ఈ వ్యాధి రోగనిర్ధారణ తరచుగా ఇటీవలి స్ట్రెప్టోకోకల్ సంక్రమణ ఆధారాలతో కూడిన సంకేతాలు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.[4]
చికిత్స
[మార్చు]స్ట్రెప్ గొంతు ఉన్నవారికి పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ చికిత్స చేయడం వల్ల రుమాటిక్ జ్వరం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.[5] యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని నివారించడానికి గొంతు నొప్పి ఉన్న వ్యక్తులకు సంక్రమణ ఉందా అని పరీక్షించడం అవసరం ఉంటుంది, అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరీక్ష అందుబాటులో ఉండకపోవచ్చు. ఇతర నివారణ చర్యలో పారిశుద్ధ్య వాతావరణం కూడా ఉండాలి. రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బులు ఉన్నవారిలో, కొన్నిసార్లు దీర్ఘకాలిక యాంటీబయాటిక్స్ సిఫార్సు చేస్తారు. క్రమంగా సాధారణ కార్యకలాపాలకు తిరిగిరావచ్చు. ఒకసారి దీనివలన గుండె సమస్యలు అభివృద్ధి చెందితే, చికిత్స మరింత కష్టం అవుతుంది. అప్పుడప్పుడు గుండె కవాటాల మార్పు (వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ) లేదా వాల్వ్ మరమ్మత్తు అవసరం పడుతుంది. లేకపోతే లక్షణాలకు, సంక్లిష్టతలకు చికిత్స చేస్తారు.[2]
ప్రాబల్యం
[మార్చు]రుమాటిక్ జ్వరం ప్రతి సంవత్సరం సుమారు 325,000 మంది పిల్లలను ప్రభావితం చేస్తోంది. సుమారు 33.4 మిలియన్ల మంది రుమాటిక్ గుండె జబ్బుతో బాధపడుతున్నారు.[2][6] వీరిలో తరచుగా 5, 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ప్రభావితమయ్యారు, 20% పెద్దవారిలో సంభవిస్తున్నాయి.[1][7] ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్న దేశాలలో,అభివృద్ధి చెందిన దేశాలలో స్థానిక ప్రజలలో సర్వసాధారణంగా కనపడుతోంది.[2]1990లో 374,000 మరణాలు సంభవించగా, 2015లో అవి 319,400 కి తగ్గాయి.[8][9] చాలా మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవిస్తున్నాయి, ఇక్కడ ప్రతి సంవత్సరం 12.5% మంది ప్రజలు మరణిస్తున్నారు.[2] క్రీ.పూ. 5 వ శతాబ్దంలో హిప్పోక్రేట్స్ తన రచనలలో ఈ వ్యాధి గురించి వివరించాడు.[10] ఈ వ్యాధి లక్షణాలు కొన్ని రుమాటిక్ రుగ్మతల మాదిరిగానే ఉన్నందున దీనికి ఈ పేరు పెట్టారు.[11]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Stevens, Dennis L.; Bryant, Amy E.; Hagman, Melissa M. (2020). "274. Nonpneumococcal streptococcal infections and rheumatic fever". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 2 (26th ed.). Philadelphia: Elsevier. p. 1875-1876. ISBN 978-0-323-55087-1.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Marijon, E; Mirabel, M; Celermajer, DS; Jouven, X (10 March 2012). "Rheumatic heart disease". Lancet. 379 (9819): 953–64. doi:10.1016/S0140-6736(11)61171-9. PMID 22405798. S2CID 20197628.
- ↑ Ashby, Carol Turkington, Bonnie Lee (2007). The encyclopedia of infectious diseases (3rd ed.). New York: Facts On File. p. 292. ISBN 9780816075072. Archived from the original on 21 నవంబరు 2015.
The risk of severe complications is the primary concern with strep throat, and the reason why it is so important to be properly diagnosed and treated. One of the most serious complications is rheumatic fever, a disease that affects up to 3 percent of those with untreated strep infection. Rheumatic fever can lead to rheumatic heart disease.
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Rheumatic Fever 1997 Case Definition". cdc.gov. 3 February 2015. Archived from the original on 19 February 2015. Retrieved 19 February 2015. Archived 19 ఫిబ్రవరి 2015 at the Wayback Machine
- ↑ (5 November 2013). "Antibiotics for sore throat.".
- ↑ GBD 2015 Disease and Injury Incidence and Prevalence (8 October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015.".
- ↑ Kumar, Vinay; Abbas, Abul K; Fausto, Nelson; Mitchell, Richard N (2007). Robbins Basic Pathology (8th ed.). Saunders Elsevier. pp. 403–6. ISBN 978-1-4160-2973-1.
- ↑ GBD 2015 Mortality and Causes of Death (8 October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015.".
- ↑ GBD 2013 Mortality and Causes of Death (17 December 2014). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.".
- ↑ Quinn (1991). "Did scarlet fever and rheumatic fever exist in Hippocrates' time?".
- ↑ "rheumatic fever" at Dorland's Medical Dictionary