Jump to content

కీసరగుట్ట

వికీపీడియా నుండి
కీసరగుట్ట
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ప్రదేశంకీసర, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
సంస్కృతి
దైవంశివుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడన్ శైలీ
చరిత్ర, నిర్వహణ
వెబ్‌సైట్keesaragutta.org

కీసరగుట్ట, (కేసరిగిరి) తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ, శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 30 కి.మీ.ల దూరంలో, ఇసిఐఎల్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో ఉంది. మహాశివరాత్రి, కార్తీకమాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులను ఇక్కడికి వస్తారు.

చరిత్ర

[మార్చు]

రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెపుతున్నాయి. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకొని, వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యమవడంతో, శుభ ఘడియలు సమీపిస్తున్న సమయంలో, శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభు లింగం అంటారు. శ్రీ రాముడు ప్రతిష్ఠించినందు వల్ల ఈ దేవుడిని రామలింగేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు.

కొంత సమయం తరువాత, వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్నిచోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

హనుమంతుడిని బాధను చూసిన శ్రీరాముడు, ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరిగిరి (కేసరి కుమారుడు హనుమంతుడు) అని అన్నాడు. కాలక్రమేణా, ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్ట గా మారింది.

పురావస్తు త్రవ్వకాలు

[మార్చు]

ఈ ఆలయ పరిసరాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది.[1] ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న కొండపై ఇటుక నిర్మాణాలు, శివలింగాల అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు చాళుక్య సామ్రాజ్య పాలనకు చెందినవి. కోట గోడలు, యాగశాల, ప్రార్థన మందిరాలు ఇక్కడ బయటపడ్డాయి. జైన మతం, బౌద్ధమతం సమకాలీనంగా అభివృద్ధి చెందాయనడానికి సూచనగా కొండలపై కొన్ని వెస్టిజ్ అవశేషాలు, రాక్ కట్ సిస్టెర్న్లు లభించాయి. 2014, అక్టోబరు 18న, 4వ -5వ శతాబ్దం నాటి జైన తీర్థంకరుడి పన్నెండు విగ్రహాలు ఆలయ మెట్ల దగ్గర ఒక అడుగు లోతులో కనుగొనబడ్డాయి. ఇది 4-5వ శతాబ్దంలో విష్ణు కుండినీల కాలంలో కీసరగుట్ట వద్ద హిందూమతంతోపాటు జైనమతం కూడా ఉన్నదని ఇది రుజువు చేస్తోంది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Archaeological Survey of India". asi.nic.in. Retrieved 2021-02-10.
  2. "Idols of Jain Tirthankaras belonging to 4th century unearthed - Times of India". Archived from the original on 2014-10-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-21. Retrieved 2021-02-10.

బయటి లింకులు

[మార్చు]