కీసర జితేందర్ రెడ్డి
కీసర జితేందర్‌రెడ్డి | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1972 - 1977 | |||
ముందు | అక్కిరాజు వాసుదేవరావు , కాంగ్రెస్ పార్టీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హుజూర్‌నగర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 రత్నవరం, నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ ప్రజా సమితి | ||
జీవిత భాగస్వామి | లలితా రెడ్డి | ||
సంతానం | శ్రీకళా రెడ్డి [1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కీసర జితేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కీసర జితేందర్‌రెడ్డి 1940లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రత్నవరం గ్రామంలో జన్మించాడు. ఆయనకు భార్య లలితారెడ్డి, కుమార్తె శ్రీకళారెడ్డి ఉన్నారు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]కీసర జితేందర్‌రెడ్డి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ, ఆంధ్రా గోబ్యాక్ ఉద్యమంలో °క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కిరాజు వాసుదేవరావు (మాజీ సమాచార శాఖ మంత్రి) పై 14,308 ఓట్ల మెజారిటీతో గెలిచి, అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాడు.[3] కీసర జితేందర్‌రెడ్డి 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రజా సమితి నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఎం అభ్యర్థి భీమిరెడ్డి నరసింహారెడ్డి చేతిలో 7684 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (5 July 2021). "ఉత్తర్‌ప్రదేశ్‌లో జడ్పీ ఛైర్మన్‌గా తెలుగు మహిళ శ్రీకళా రెడ్డి". BBC News తెలుగు. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (6 July 2021). "మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Sakshi (28 August 2013). "తెలంగాణ కేసరి: కీసర జితేందర్‌రెడ్డి". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ Result University (2019). "Miryalguda Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.