కుంకుడు
కుంకుడు | |
---|---|
![]() | |
సపిండస్ మార్జినేటస్ | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | సపిండస్ |
కుంకుడు (Sapindus) ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. సపిండస్ ప్రజాతిలోని 13 జాతులలో దక్షిణ భారతదేశంలో సా.లారిఫోలియస్, సా.ఎమర్జినేటస్ లను మనం ఉపయోగిస్తున్నాము.ఇవి చలికాలంలో కాస్తాయి
లక్షణాలు[మార్చు]
- మధ్యరకంగా పెరిగే వృక్షం.
- ఉపాంతరహిత అగ్రంతో దీర్ఘవృత్తాకార పరకాలున్న సమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
- అగ్రస్థ శాఖయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న గోధుమరంగుతో ఉన్న పసుపురంగు పుష్పాలు.
- మూడు నొక్కులు గల టెంకగల ఫలం.
ఉపయోగాలు[మార్చు]
- కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది.
- కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూ గా పనిచేస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీ ఇంకా స్మూత్ గా తయారవుతుంది.
- కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
- కుంకుడు కర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగా ఉపయోగపడుతుంది.
- పట్టు, సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
- తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
తల స్నానానికి[మార్చు]
కుంకుడుకాయలను వాడాలంటే కొంత శ్రమ ఉంటుంది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి... ఆ రసంతో తలరుద్దుకునేవారు. ఆ తర్వాత శీకాకాయపొడి మార్కెట్లో లభించడం ఆరంభమయింది. ఆ పొడిని నీటిలో తడిపి, ఆ ముద్దతో తలరుద్దుకునేవారు. అయితే, ఈ రోజుల్లో శీకాకాయపొడి కాకుండా కుంకుడుపొడి కూడా లభిస్తోంది. చాలామంది, కుంకుడుకాయలను ఈ రోజుల్లో వాడటం లేదు. నిజానికి తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెండ్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. వేసవిలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెండ్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. బిరుసెక్కకుండా మెత్తగా ఉంటుంది. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల కేశాలు జిడ్డులేకుండా శుభ్రపడతాయి. పైగా వీటిలో ఎటువంటి రసాయనికాలు కలువవు. కనుక జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. కుంకుళ్ళు తలస్నానానికి కాక, చర్మ సౌందర్యానికీ, మృదుత్వానికీ, చర్మ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. చర్మానికి ఏర్పడే దురదలను ఎలర్జీలను పోగొడ్తాయి. కుంకుడు రసంలో ఖరీదయిన పట్టుచీరలను నానపెట్టి ఉతికితే అవి ఎంతో మెరుస్తాయి. కుంకుడురసంలో బంగారు ఆభరణాలను నానబెట్టి, మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే... అవి శుభ్రపడి ధగధగా మెరుస్తుంటాయి. బాణాలి, పెనం వంటి జిడ్డు పాత్రలను కుంకుడు పిప్పితో శుభ్రపరచవచ్చు. కుంకుడు కాయలే శ్రేష్ఠమని తెలుసుకోవాలి. మన సాంప్రదాయపు అలవాట్లలో కూడా కుంకుడు కాయలను వాడతారు. ప్రసవమయిన బాలింతరాలికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించబోయేముందురోజు ఇరుగుపొరుగు వారికి కుంకుడుకాయలు, నూనె, సున్నిపిండి పసుపు, కుంకుమతో పాటు మిఠాయిని పంచుతారు. పూర్వపు రోజులలో పెళ్ళికి వచ్చిన వియ్యాలవారి విడిదిలో కుంకుడుకాయలు, కొబ్బరి నూనె, పౌడరు, అద్దం ఉంచడం సాంప్రదాయం. అందువల్ల, కుంకుడు కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.[1]
జాతులు[మార్చు]
The number of species is disputed between different authors, particularly in North America where between one and three species are accepted.
- Sapindus delavayi (China, India)
- Sapindus detergens (syn. var. Soapnut, Ritha)
- Sapindus emarginatus Vahl (Southern Asia)
- Sapindus laurifolius Vahl – కుంకుడు
- Sapindus marginatus Willd. – Florida Soapberry (Florida to South Carolina); included in S. saponaria by some authors.
- Sapindus mukorossi Gaertn. – Indian Soapberry (Northern భారత దేశము east to the Himalayas)
- Sapindus oahuensis Hillebr. ex Radlk. – Lonomea (Kauaʻ i and Oʻ ahu, Hawaii)
- Sapindus rarak DC. (Southeast Asia)
- Sapindus saponaria L.
- S. s. var. drummondii (Hook. & Arn.) L.D.Benson – Western Soapberry (southwestern United States, Mexico)
- S. s. var. saponaria – Wingleaf Soapberry (southeastern United States, Caribbean, island of Hawaiʻ i, Central and South America)
- Sapindus tomentosus (China)
- Sapindus trifoliatus L. – South India Soapnut or Three-leaf Soapberry (Southern భారత దేశము, Pakistan)
- Sapindus vitiensis A.Gray (American Samoa, Samoa, Fiji)[2][3][4]
మూలాలు[మార్చు]
- ↑ https://www.wemedia.co.in/article/wm/95fd4e4216f245d9b806a3a3d98daded
- ↑ "Taxon: Sapindus vitiensis A. Gray". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-04-30. Archived from the original on 2009-06-25. Retrieved 2009-03-23.
- ↑ "GRIN Species Records of Sapindus". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-04-30. Archived from the original on 2015-09-24. Retrieved 2010-11-01.
- ↑ "Sapindus". Integrated Taxonomic Information System. Retrieved 2010-11-01.
బయటి లింకులు[మార్చు]
- Maggie's Soap NutsTM, the laundry soap that Grows on TreesTM! Free information at Maggie's Pure Land:
- Pureindia: Company involved in sustained harvesting , processing and exports of soapnuts: Archived 2020-09-19 at the Wayback Machine
- Flora of Pakistan: Sapindus
- Flora of China: Sapindus species list
- :Organic Laundry Soap Nuts available at "New Hampshire All Natural"
- :Simply Soap Nuts available at "www.stopforbreath.co.uk." Great prices. Lots of info.