కుంతల కుమారి సబత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంతల కుమారి సబత్
Portrait of Kuntala Kumari Sabat.jpg
పుట్టిన తేదీ, స్థలం(1901-02-08)1901 ఫిబ్రవరి 8 [1]
జగదల్‌పూర్, బస్తర్, కేంద్ర, బ్రిటీషు
మరణం1938 ఆగస్టు 23(1938-08-23) (వయస్సు 37)
వృత్తివైద్యురాలు, కవి, సామాజిక కార్యకర్త
భాషఒడియా
జాతీయతభారతీయ

సంతకం

కుంతల కుమారి సబత్, (1901-1938) భారతదేశం వలస ఒడియా కవి.భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒడిషా నుండి ప్రాచుర్యం పొందిన బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళాకవులలో ఆమె ఒకరు. ఆమె ఒక వైద్యురాలు, రచయిత, కవి, సంపాదకురాలు, జాతీయవాద ఉద్యమనాయకురాలు, సామాజిక కార్యకర్త.[2] [3]1925లో ఆమెను ఉత్కళ భారతితో సత్కరించారు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె 1900 ఫిబ్రవరి 8 న పూర్వపు బస్తర్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో జన్మించింది.[4] ఆమె తండ్రి డేనియల్ సబత్ ఒక వైద్యుడు. ఆమె తల్లి మోనికాసబత్. ఆమె తల్లి తాత పుారి జిల్లాకు చెందిన దండముకుందపూర్.[5] ఆమె పుట్టకముందే ఆమె తండ్రి బస్తర్‌కు వెళ్లి క్రైస్తవ మతంలోకి మారాడు. కుంతలకుమారి పుట్టిన వెంటనే ఆమె తల్లి తన కుటుంబంతో బర్మాకు వెళ్లింది.కుంతలకుమారి తన బాల్యాన్ని బర్మాలో గడిపింది.బర్మాలో వారు ఉన్నప్పుడు తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. కుంతల తిరిగి తన తల్లితో ఒడిశాకు వచ్చింది. బర్మానుండి తిరిగి వచ్చిన తర్వాత తనతల్లితో ఖుర్దా జిల్లాలో స్థిరపడింది.ఆ కాలంలో మహిళా విద్యలేనప్పటికీ,ఆమె పట్టుదలతో మొత్తం మీద ఆమెకు మంచివిద్యను అందించడానికి తల్లి అనుమతించింది.ఆమె రావెన్‌షా బాలికల ఉన్నత పాఠశాలలో చదివి, ఆ తరువాత కటక్‌లోని ఒరిస్సా వైద్య పాఠశాలలో (ఇప్పుడు శ్రీరామ చంద్ర భంజా వైద్య కళాశాల, హస్పటల్ ) తన విద్యను కొనసాగించింది. ఆమె 1921లో ఎల్ఎంపి (లైసెన్షియేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్) డిగ్రీని బంగారుపతకంతో సంపాదించింది. ఆమె ఒడియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాష, బర్మీస్ భాషలలో నిష్ణాతురాలు.[6]

వృత్తి జీవితం[మార్చు]

ఆమె వైద్యపట్టా పొందిన తరువాత, డాక్టర్ కైలాష్ చంద్రరావు సంరక్షకత్వంలో శిక్షణ పొందింది.1921 నుండి 1928 వరకు ఆమె వైద్య శిక్షణ తీసుకుంది.ఆ తర్వాత ఆమె కటక్‌లో సొంతంగా వైద్య వృత్తిని ప్రారంభించింది.ఆమె 1925లో కటక్‌లో రెడ్ క్రాస్ మహిళా సంక్షేమ సొసైటీని ప్రారంభించింది.[7] ఆమె 1928 లో న్యూఢిల్లీకి వెళ్లి, అదే సంవత్సరం తన గురువు కృష్ణ ప్రసాద్ బ్రహ్మచారిని వివాహం చేసుకుంది.[8]

ప్రజా జీవితం[మార్చు]

ఆమె కుల వివక్ష నిర్మూలనకు కృషి చేసింది. బాల్య వివాహం, మహిళల పట్ల వివక్ష, తెరకు (ముసుగు) వ్యతిరేకంగా ఆమె రచనలు రాసింది.వితంతు పునర్వివాహం, మహిళా విముక్తి కోసం ఆమె పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒడిశా నుంచి వచ్చిన కీలక వ్యక్తులలో ఆమె ఒకరు.[9] [10] [11] ఆమె ప్రధానంగా ఒడియా భాషలో ఎక్కువుగా రాసింది. అయితే హిందీలో కూడా రాసింది.ఆమె మహావీర్, జీవన, నారీ భారతి వంటి అనేక సమాచారపత్రికలకు సంకలనం చేసింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాట్లాడటానికి ఆమెను ఆహ్వానించారు.ఆమె భారతీ తపోవన్ సంఘ అనే సంస్థను స్థాపించింది.అది ఒడియాభాష అభివృద్ధికి చాలా కృషి చేసింది.కుంతల కుమారి సాహిత్య పనిలో, ప్రజా జీవితంలో ఆమె పాత్ర సరోజినీ నాయుడు పాత్రలతో పోల్చవచ్చు.[12]

కుంతల కుమారి రచనలు[మార్చు]

 • సబత్, కుంతల కుమారి (1924). ఉచ్వాస (in ఒడియా). OCLC 1046986353.
 • స్ఫులింగ, 1927 [13]
 • అర్చన, 1927 [13]
 • సబత్, కుంతల కుమారి (1936). ఒడియంక కందన (in ఒడియా). OCLC 1046986123.
 • భ్రాంతి [14]
 • ప్రేమ సింతామణి, 1931 [13] [15]
 • అంజలి [16]
 • కాళీ బోహు [17]
 • సబత్, కుంతల కుమారి; దాస్, కుంజాబిహారీ (1968). ఉత్కల భారతి కుంతల కుమారి గ్రంథమాల (in ఒడియా). కటక్ ష్టూడెంట్స్ ష్టోర్. OCLC 30883708.
 • సబత్, కుంతల కుమారి; దాస, హేమంత్ కుమార్ (2004). కుంతలకుమారి గ్రంథబలి: కభ్యఖండ (in ఒడియా and హిందీ). Praci Sahitya Pratishthana. OCLC 124032043.

మూలాలు[మార్చు]

 1. "Naveen pays tribute to writer Kuntala Kumari Sabat on her birth anniversary". Archived from the original on 2020-04-13. Retrieved 2021-09-08.
 2. "5 women freedom fighters of Odisha". Odisha Sun Times. 2019-08-15. Retrieved 2020-02-12.
 3. "5 women freedom fighters of Odisha | Sambad English". 2019-08-15. Retrieved 2021-09-11.
 4. "KUNTALA KUMARI SABAT". Archived from the original on 2016-11-12. Retrieved 2021-09-08.
 5. "Kuntala Kumari Sabat". odisha.360.batoi.com. Retrieved 15 November 2012. Her grandfather was from a Brahmin family of Danda Mukundpur a village of Puri district
 6. Lal, M.; Kumar, S.P.; Indian Institute of Advanced Study (2002). Women's studies in India: contours of change. Women's Studies in India: Contours of Change. Indian Institute of Advanced Study. Retrieved 2020-02-17.
 7. Singh, N.K. (2001). Encyclopaedia of women biography: India, Pakistan, Bangladesh. Encyclopaedia of Women Biography: India, Pakistan, Bangladesh. A.P.H. Pub. Corp. ISBN 978-81-7648-261-5. Retrieved 2020-02-14.
 8. Mohanty, S. (2005). Early Women's Writings in Orissa, 1898-1950: A Lost Tradition. SAGE Publications. p. 130. ISBN 978-0-7619-3308-3. Retrieved 2020-03-05.
 9. Orissa (India). Home Department; Orissa, India. Home Dept (1998). Orissa Review. Home Department, Government of Orissa. pp. 12, 17–18. Retrieved 2020-02-17.
 10. Choudhury, Janmejay. "Kuntala Kumari Sabat : A True Patriotic Litterateur and Reflection of Her Literary Works on Gandhian Movement" (PDF). Orissa Review.
 11. "Nightingale or BulBul of Orissa Kuntala Kumari Sabat". Orissa Spider. 2011-11-22. Archived from the original on 2020-02-17. Retrieved 2020-02-14.
 12. "Kuntala Kumari Sabat". odiya.org. Retrieved 15 November 2012. Kuntala Kumari's literary gifts and role in the public life of her time are comparable to those of Sarojini Naidu
 13. 13.0 13.1 13.2 Lal, M.; Kumar, S.P.; Indian Institute of Advanced Study (2002). Women's studies in India: contours of change. Women's Studies in India: Contours of Change. Indian Institute of Advanced Study. p. 184. Retrieved 2020-02-17.
 14. Das, S.K. (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. A History of Indian Literature 1911-1956. Sahitya Akademi. p. 576. ISBN 978-81-7201-798-9. Retrieved 2020-02-17.
 15. Das, S.K. (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. A History of Indian Literature 1911-1956. Sahitya Akademi. p. 640. ISBN 978-81-7201-798-9. Retrieved 2020-02-17.
 16. Das, S.K. (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. A History of Indian Literature 1911-1956. Sahitya Akademi. p. 565. ISBN 978-81-7201-798-9. Retrieved 2020-02-17.
 17. Das, S.K. (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. A History of Indian Literature 1911-1956. Sahitya Akademi. p. 594. ISBN 978-81-7201-798-9. Retrieved 2020-02-17.

వెలుపలి లంకెలు[మార్చు]