కుందూరు జానారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కుందూరు జానారెడ్డి
కుందూరు జానారెడ్డి

కుందూరు జానారెడ్డి


మాజీ గృహమంత్రి, ఆంధ్ర ప్రదేశ్
పదవీ కాలం
మే 2004 – ఏప్రిల్ 2009
నియోజకవర్గం నాగార్జున సాగర్ (నల్గొండ జిల్లా)

వ్యక్తిగత వివరాలు

జననం 20 Jun 1946 (1946-06-20) 1946 జూన్ 20 (వయసు 77)
అనుమోలు, నల్గొండ, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
జీవిత భాగస్వామి సుమతి
సంతానం రఘువీర్, జైవీర్
నివాసం హైదరాబాద్
మతం హిందూ


కుందూరు జానారెడ్డి[1] ( 1946 జూన్ 20) 2004-09 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహశాఖా మంత్రిగా పనిచేసాడు.[2]

జానారెడ్డి నాగార్జున సాగరు సమీపంలోని నల్గొండ జిల్లా, అనుముల గ్రామంలో జన్మించాడు. జానారెడ్డి ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అదే నియోజకవర్గం నుండి ఆరు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, కొలతలు, తూనికలు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సదుపాయం, శుభ్రత మొదలైన వివిధ మంత్రిత్వ శాఖలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును అధిగమించి నిలిచాడు.

ఆధారాలు[మార్చు]

  1. "ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ" (PDF).[permanent dead link]
  2. "ఆంధ్ర ప్రదేశ్ ఆన్ లైన్ వెబ్ సైట్". Archived from the original on 2013-10-08. Retrieved 2009-02-23.

బయటి లంకెలు[మార్చు]

అంతకు ముందువారు
టి.దేవేందర్ గౌడ్
ఆంధ్ర ప్రదేశ్ గృహమంత్రి
2004 - 2009 |with16=
తరువాత వారు
సబిత ఇంద్రారెడ్డి