కుంసి సిడిసోవ్
| కుంసి సిడిసోవ్ | |||
| పదవీ కాలం 2009 – 2024 జూన్ 2 | |||
| ముందు | నరేష్ గ్లో | ||
|---|---|---|---|
| తరువాత | టెన్జిన్ నైమా గ్లో | ||
| నియోజకవర్గం | త్రిజినో-బురగావ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కుంసి సిడిసోవ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు త్రిజినో-బురగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]కుంసి సిడిసోవ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో త్రిజినో-బురగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి పిపిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి నరేష్ గ్లోను 4,998 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గాంధీ సక్రిన్సోవ్ ను 5,083 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
కుంసి సిడిసోవ్ 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో త్రిజినో-బురగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి కాలో డుసుసోవ్ ను 7,135 ఓట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి టెన్జిన్ నైమా గ్లో చేతిలో 400 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Assam, Arunachal Pradesh leaders meet to resolve boundary dispute" (in ఇంగ్లీష్). India Today. 27 August 2022. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal: MLA Kumsi Sidisow visits Tenga Market fire incident site ; distribute relief materials" (in హిందీ). India Today NE. 16 December 2022. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in Indian English). The Hindu. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Thrizino-Buragaon (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
- ↑ "Arunchal Pradesh Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.