కుట్రాలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?குற்றாலம்
Courtallam, Kutrallam
తమిళనాడు • భారతదేశం
Main waterfalls
Main waterfalls
అక్షాంశరేఖాంశాలు: 8°55′18″N 77°16′43″E / 8.9217°N 77.2786°E / 8.9217; 77.2786Coordinates: 8°55′18″N 77°16′43″E / 8.9217°N 77.2786°E / 8.9217; 77.2786
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) Tirunelveli జిల్లా
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
2,368 (2001 నాటికి)
• 1:1
కోడులు
టెలిఫోను
వాహనం

• +04633
• TN 76

కుట్రాలం (తమిళం: குற்றாலம்) భారత దేశము, తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో పశ్చిమ కనుమలలో 160 మీటర్ల సగటు ఎత్తులో ఉన్న ఒక పంచాయతీ పట్టణము. కొన్ని ఋతువులలో మాత్రమే ప్రవహించే నదులు మరియు చిట్టార్ నది, మనిముతార్ నది, పచైయర్ నది తాంబరపరణి నది వంటి కొన్ని జీవనదులు ఈ ప్రాంతములోనే ఆవిర్భవిస్తున్నాయి. ఇక్కడ ఉన్న అనేక జలపాతాలు, సెలయేళ్ళు మరియు ప్రాంతములో సర్వత్రా ఉన్నఆరోగ్య రిసార్టులు ఈ ప్రాంతానికి దక్షిణ భారత దేశం యొక్క స్పా అనే బిరుదును తెచ్చిపెట్టాయి.

నెలవు[మార్చు]

కుట్రాలం, సెంగొట్టాయ్ నుండి 5 కిమీ దూరములోనూ, పంపోలి నుండి 9 కిమీ దూరములోనూ, తేన్కాసి నుండి 5 కిమీ దూరములోనూ, కడయనల్లూర్ నుండి 20 కిమీ దూరములోనూ, పులియంగుడి నుండి 37 కిమీ దూరములోనూ, తిరునెల్వేలి నుండి 53 కిమీ దూరములోనూ కన్యాకుమారి నుండి 137 కిమీ దూరములోనూ, అలేప్పే నుండి 152 కిమీ దూరములోనూ, తిరువనంతపురం నుండి 112 కిమీ దూరములోనూ, రాజపాళయం నుండి 64 కిమీ దూరములోనూ, శ్రీవిల్లిపుత్తూర్ నుండి 72 కిమీ దూరములోనూ చెన్నై నుండి 640 కిమీ దూరములోనూ ఉంది. కుట్రాలానికి సుమారు 86 కిమీ దూరములో ఉన్న ట్యుటికోరిన్ విమానాశ్రయం (టిసిఆర్) మాత్రమే కుట్రాలానికి సమీపములో ఉన్న విమానాశ్రయం. కుట్రాలం 5 కిమీ దూరములో ఉన్న తేన్కాసి, రైల్వే స్టేషను కుట్రాలానికి అతి సమీపములో ఉన్న రైల్వే స్టేషను.

పర్యాటక రంగం[మార్చు]

కుట్రాలం ఒక చిన్న ఊరయినప్పటికి వారాంతరాలలో మరియు సీజన్ సమయాలలో పర్యాటకులతో నిండి ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు దాదాపుగా పర్యాటక రంగమే మూలం. కుట్రాలంలో అనేక లాడ్జీలు, హొటళ్ళు ఉన్నాయి కాని జలపాతాలు ఎండిపోయినప్పుడు, వాతావరణం విపరీతంగా వేడిగా ఉన్నప్పుడు అవి దాదాపుగా ఖాళీగానే ఉంటాయి. ఒకసారి ఋతుపవన వర్షం కురిసిన తరువాత, సీజన్ కాని ఈ సమయమే, కుట్రాలానికి వెళ్ళడానికి ఉత్తమమైన సమయం. జూన్ -సెప్టెంబరు మధ్య కాలమే తమిళనాడు మరియు కేరళ నుండి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అత్యధిక సీజన్ సమయం. ఆ సమయములో మృదువైన చల్లని గాలితో, అప్పడుప్పుడు జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అత్యధికంగా ఉండే సీజన్ లో, జలపాటాలలో జనం గుంపులు బాగా ఎక్కువయిపోయి పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి, పోలీసులు బలప్రయోగం చేస్తూ ఉంటారు. కుట్రాలంలో విలాసవంతమైన వసతిగృహాలు ఏమి లేవు. అయితే కొన్ని త్రీ-స్టార్ హొటళ్ళు ఉన్నాయి.
కుట్రాలం నీటిలో అనేక వనమూలికా వనరులు ఉన్నాయి. కుట్రాలం నీటిలో ఉన్న వనమూలికా వనరులు రక్తపోటును తగ్గించి మనసుకు ఊరట కలిగిస్తాయి. ఇవి మానసిక రుగ్మతలను తగ్గిస్తాయని నమ్మబడుతుంది.

ఆకర్షణలు[మార్చు]

కుట్రాలంలో అందరు పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించేది జలపాతాలే. రోడ్డు మార్గాన వెళ్ళగలిగిన ప్రధాన జలపాతాలు మూడు ఉన్నాయి. అవి మెయిన్ ఫాల్స్, ఫైవ్ ఫాల్స్, మరియు ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ . షెన్బగ దేవి ఫాల్స్, హానీ ఫాల్స్ వంటి ఇతర జలపాతాలను కొండ పై నడచి ఎక్కి మాత్రమే చేరుకోగలము. ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ సమీపములో టైగర్ ఫాల్స్ అని పిలవబడే ఒక చిన్న జలపాతం ఉంది. పులులు నీటి కోసం ఇక్కడ తరచూ వస్తాయనే కారణముగా ఈ పేరు పెట్టబడింది. ఫైవ్ ఫాల్స్ పైన ప్రభుత్వ తోటల పెంపకానికి సంబంధించిన ఉద్యానవనం లోపల మరొక చిన్న జలపాతము ఉంది. కాని దీనికి ప్రజలు వెళ్ళటానికి అనుమతి లేదు. ఫైవ్ ఫాల్స్ మరియు ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ సమీపములో ఉన్న పడవ ఇళ్లు, పాముల పార్కు, ఒక బహిరంగ అక్వేరియం, చిన్న పిల్లల పార్కులు మరియు ఆట స్థలాలు కుట్రాలంలోని ఇతర ఆకర్షణలు.

ప్రధాన జలపాతం సమీపములో కుట్రాలేస్వరన్ గుడి అని పిలవబడే ఒక పురాతనమైన శివుడు గుడి ఉంది.

పాలరువి ఫాల్స్ అనే జలపాతం కేరళా రాష్ట్ర సరిహద్దుకు అవతల ఉంది.[1]

కుట్రాలీస్వరన్ ఆలయం
బోట్ హౌసు

జనాభాశాస్త్రం[మార్చు]

As of 2001భారత దేశం జనపరిగణన, ప్రకారం [2] కుట్రాలం జనాభా 2368 మంది ప్రజలు. మొత్తం జనాభాలో పురుషులు 53 శాతం మరియు మహిళలు 47 శాతం మంది ఉన్నారు. కుట్రాలంలో సగటు అక్షరాస్యతా శాతం 75 కాగా, ఇది జాతీయ అక్షరాస్యతా సగటు అయిన 59.5 శాతం కంటే ఎక్కువ. పురుషులలో అక్షరాస్యతా శాతం 78 శాతం కాగా, స్త్రీలలో అక్షరాస్యతా శాతం 74 గా ఉంది. మొత్తం జనాభాలో 7శాతం మంది ఆరేళ్లలోపు వారున్నారు. కేరళా సరిహద్దుకు అతి సమీపములో ఉన్నప్పటికీ, కుట్రాలం యొక్క మొత్తం జనాభా సజాతీయమైన తమిళులే.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • భారతదేశములోని జలపాతాల జాబితా

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. "Palaruvi Falls". World of Waterfalls. Retrieved 2010-06-26. Cite web requires |website= (help)
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కుట్రాలం&oldid=2693845" నుండి వెలికితీశారు