కునమల్ల సంధ్యారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానపద గాయని సంధ్యక్క
జననంకునమల్ల సంధ్యారాణి
కుమర్‌పల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లా
మరణం6 సెప్టెంబర్, 2018
ఇతర పేర్లుసంధ్యక్క
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
ప్రసిద్ధిఓరుగల్లు ప్రముఖ,జానపద గాయని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత
భార్య / భర్తవరంగల్ శంకర్
పిల్లలురాగమయి, శివసాత్విక్
తండ్రి-సారయ్య
తల్లిసరోజన

కునమల్ల సంధ్యారాణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. ఆమె 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

కునమల్ల సంధ్యారాణి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండ, కుమర్‌పల్లి గ్రామంలో సారయ్య, సరోజన దంపతులకు జన్మించింది. ఆమె చింతగట్టులోని పే అండ్ అకౌంట్స్‌శాఖ లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ, టీఎన్జీవోస్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.

వివాహం

[మార్చు]

తెలంగాణ జానపద గాయకుడు వరంగల్ శంకర్ ను కునమల్ల సంధ్య ప్రేమ వివాహం చేసుకుంది. వారికీ కుమార్తె రాగమయి, కుమారుడు శివసాత్విక్ ఉన్నారు.

ప్రజాదరణ పొందిన పాటలు

[మార్చు]

సంధ్యకు గుర్తింపు తెచ్చిన పాటలు ‘ఏలో ఉ య్యాలో... తందన తానా..’, ‘కొండా కోన ల్లో.. వాగుల్లో..’

అవార్డు

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జానపద రంగం నుండి సంధ్యారాణి ఎంపికైంది, ఆమె 8 మార్చి 2016న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅథిదుల చేతులమీదుగా ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందజేసింది. ఆమె ఈ పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు స్వీకరించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 March 2016). "అవార్డుల్లో ఓరు'ఘల్లు'". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  2. Sakshi (6 March 2016). "అవార్డుల్లో ఓరుఘల్లు". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.