Jump to content

కున్వర్ విజయ్ షా

వికీపీడియా నుండి
కున్వర్ విజయ్ షా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990
ముందు ఆశరం పేతు పటేల్
నియోజకవర్గం హర్సూద్

వ్యక్తిగత వివరాలు

జననం 1962 నవంబర్ 1
మక్రాయ్, హర్దా జిల్లా, మధ్యప్రదేశ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

కున్వర్ విజయ్ షా (జననం 1 నవంబర్ 1962) మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్సూద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

విజయ్‌ షా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో హర్సూద్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1993, 1998 2003 2008 2013, 2018 & 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మూడవ చౌహాన్ మంత్రివర్గంలో పాఠశాల విద్య మంత్రిగా, గిరిజన వ్యవహారాలు, పర్యాటకం, ప్రజా ఆస్తుల నిర్వహణ, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, శివరాజ్ సింగ్ చౌహాన్ నాల్గవ మంత్రివర్గంలో అటవీ మంత్రిగా & మోహన్ యాదవ్ మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాలు, భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

వివాదం

[మార్చు]

విజయ్‌ షా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియా సమావేశాలకు హాజరైన భారత సైనిక అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషిపై 2025 మే 12న వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచి వేస్తే.. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో పాక్‌కు పంపించి గట్టి గుణపాఠం చెప్పాం అని వ్యాఖ్యానించాడు.[3][4] దింతో ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. India Today (25 December 2023). "Madhya Pradesh Cabinet expansion: Kailash Vijayvargiya, 27 others take oath". Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  2. TV9 Telugu (25 December 2023). "కుల సమీకరణాలతో కూర్పు.. మోహన్ ప్రభుత్వంలో మంత్రులుగా 28 మంది ప్రమాణ స్వీకారం". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "'ఉగ్రవాదులను వాళ్ల మతానికి చెందిన సోదరితో మట్టుబెట్టించారు'". Andhrajyothy. 15 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  4. "కల్నల్ సోఫియా ఖురేషీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షా ఎవరు, అసలు వివాదమేంటి?". BBC News తెలుగు. 16 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  5. "నన్ను క్షమించండి..! కల్నల్‌ ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తప్పు ఒప్పుకున్న బీజేపీ నేత". TV9 Telugu. 15 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  6. "కల్నల్ ఖురేషిపై వ్యాఖ్యలు.. మంత్రికి హైకోర్టు షాక్". Andhrajyothy. 14 May 2025. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.