కుమారి అనంతన్
కుమారి అనంతన్ | |||
![]()
| |||
పదవీ కాలం 1989 - 1996 | |||
ముందు | ఎస్.ఎన్. రామసామి | ||
---|---|---|---|
తరువాత | ఎస్.ఎస్. మణి నాడార్ | ||
నియోజకవర్గం | సాతంకులం | ||
పదవీ కాలం 1984 - 1989 | |||
ముందు | ఇ.ముత్తురామలింగం | ||
తరువాత | రమణి నల్లతంబి | ||
నియోజకవర్గం | రాధాపురం | ||
పదవీ కాలం 1980 - 1984 | |||
ముందు | పి. సిగమోని | ||
తరువాత | యు. తంగసామి | ||
నియోజకవర్గం | తిరువొత్తియూర్ | ||
పదవీ కాలం 1977 - 1980 | |||
ముందు | కె.కామరాజ్ | ||
తరువాత | ఎన్. డెన్నిస్ | ||
నియోజకవర్గం | నాగర్‌కోయిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కనియాకుమారి , ట్రావెన్‌కోర్ , బ్రిటిష్ రాజ్ | 1933 మార్చి 19||
మరణం | 2025 ఏప్రిల్ 9 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు: 92)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | హరికృష్ణన్ నాడార్, తంగమ్మాళ్ | ||
జీవిత భాగస్వామి | కృష్ణకుమారి | ||
బంధువులు | హెచ్. వసంత్ కుమార్ (తమ్ముడు) విజయ్ వసంత్ (మేనల్లుడు) | ||
సంతానం | తమిళిసై సౌందరరాజన్ సహా ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు | ||
నివాసం | చెన్నై |
హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ (19 మార్చి 1933 - 9 ఏప్రిల్ 2025) కుమారి అనంతన్ అని పిలుస్తారు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నాయకుడు. అయన 2021లో పెరుమ్తలివర్ కామరాజర్ అవార్డు గ్రహీత. ఆయనకు తమిళనాడు ప్రభుత్వం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కామరాజర్ అవార్డును, 2024లో రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన తగైసల్ తమిజార్ అవార్డుతో సత్కరించింది.[1]
కుమారి అనంతన్ మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి.[2] ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]కుమారి అనంతన్ కన్యాకుమారి జిల్లాలోని కుమారిమంగళంలో 1933 మార్చి 19న జన్మించాడు. ఆయన తమిళంలో మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలను పూర్తి చేసి ఆ తరువాత మధురైలో తమిళ ఉపాధ్యాయుడిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కుమారి అనంతన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1997లో కాంగ్రెస్ తరపున నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1980, 1984, 1989, 1991 ఎన్నికలలో వరుసగా తిరువొత్తియూర్, రాధాపురం, సాతంకులం నియోజకవర్గాల నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు. అనంతన్ కొంతకాలం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.
గాంధీ కామరాజ్ నేషనల్ కాంగ్రెస్
[మార్చు]కుమారి అనంతన్ కాంగ్రెస్ నుండి విడిపోయి 1977 ఎన్నికల సమయంలో గాంధీ కామరాజ్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇది ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం అయింది.
తొండర్ కాంగ్రెస్
[మార్చు]కుమారి అనంతన్ తమిళనాడు రాష్ట్ర పార్టీ యూనిట్, కార్యకర్తలను జాతీయ కాంగ్రెస్ నాయకులు నిర్లక్ష్యం చేయడం పట్ల తాను నిరాశ చెందానని చెబుతూ కాంగ్రెస్ నుండి విడిపోయి 2001లో తొండర్ కాంగ్రెస్‌ను ప్రారంభించాడు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.
సాహితీవేత్తగా
[మార్చు]కుమారి అనంతన్ నీంగళం పెచాలరాగళం (మీరు కూడా వక్త కావచ్చు), సెంబనై నాడు, పారాతీర పాడియ భారతి, నిలిత పుఘలుడైయోర్, కలితోకి ఇన్పం, ఇచ్చాను, నల్లచ్చి తంత నాయకన్ కామరాజ్, తమిళ అముదు, చింతన పన్నయిల్ భారతియార్, చింతన పన్నయిల్ భారతియార్ సహా మొత్తం 29 పుస్తకాలను రచించాడు.

మరణం
[మార్చు]కుమారి అనంతన్ 92 సంవత్సరాల వయస్సులో వయసు సంబంధిత వ్యాధులతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న మరణించాడు. ఆయన భార్య కృష్ణకుమారి 2023లో మరణించగా, తమిళిసై సౌందరరాజన్ సహా నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Kumari Ananthan selected for TN govt's Thagaisal Tamizhar award". The Times of India. 1 August 2024. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "మాజీ గవర్నర్ తమిళి సైకి పితృ వియోగం.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం". Eenadu. 9 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "Kumari Ananthan, former Tamil Nadu Congress chief, dies at 93" (in Indian English). The Hindu. 8 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "Cong veteran Kumari Ananthan, crusader for use of Tamil in Parliament dies" (in ఇంగ్లీష్). The Indian Express. 9 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత." TV9 Telugu. 9 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
- ↑ "காங்கிரஸ் மூத்த தலைவர் குமரி அனந்தனுக்கு 72 குண்டுகள் முழங்க இறுதி மரியாதை". ABP News. 9 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.