కుమార్ గాంధర్వ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమార్ గాంధర్వ
జన్మ నామంశివపుత్ర సిద్ధరామయ్య కోంకళిమఠ్
రంగంHindustani classical music
వృత్తిsinger

కుమార్ గాంధర్వ (కన్నడ: ಕುಮಾರ ಗಂಧರ್ವ) లేదా శివపుత్ర సిద్ధరామయ్య కోంకళిమఠ్ (కన్నడ: ಶಿವಪುತ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಕೋಮಕಾಳಿಮಠ್) ఒక హిందుస్తానీ సాంప్రదాయ గాయకుడు, ప్రత్యేకమైన ఘరానా సంప్రదాయానికి చెందినవారుగా ఉండటానికి తిరస్కరించి నూతన కల్పనలను చేసిన మేధావిగా అతని విలక్షణమైన గాన శైలికి ప్రసిద్ధి చెందారు. కుమార్ గాంధర్వ అనే బిరుదు అతనికి చిన్న వయసులో ఇవ్వబడింది; హిందూ పురాణంలో గాంధర్వ అనగా సంగీతపరమైన ఉత్సుకత అని అర్ధం.

కుమార గంధర్వ ఏప్రిల్ 8, 1924కర్ణాటక రాష్టంలోని బెల్గాం జిల్లాలోని సులేభావి గ్రామంలో జన్మించాడు. హిందుస్తానీ సంగీతంలోఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు కుమార గంధర్వ . "కుమార గంధర్వ" అనే బిరుదు ఆయనకు చిన్నతనంలోనే బహూకరించబడింది. హిందూ పురాణాల్లో గంధర్వుడు సంగీతానికి ఆద్యుడైన దివ్యపురుషుడు.

బాల్యం మరియు విద్యాభ్యాసం[మార్చు]

భారతదేశపు కర్ణాటక రాష్ట్రంలోని బెలగాం సమీపాన ఉన్న సులేబావిలో గాంధర్వ జన్మించారు. ఆయన చిన్నతనంలో కుమార గంధర్వకు సంగీతంలో ప్రొఫెసర్ బి.ఆర్. డియోధర్ నుండి శిక్షణ లభించింది. 1947 లో భానుమతి కాన్స్‌ను వివాహమాడి, మధ్యప్రదేశ్ లోని "దివాస్"కు మకాం మార్చాడు. అక్కడకు బదిలీ అయిన కొంతకాలానికే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ సోకగా, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మళ్ళీ "ఋణానుబంధాచ్య" వంటి మరాఠీ గీతాలు పాడినా, ఊపిరి అందక, మునుపటిలాగా పాడలేకపోయాడు. కుమార గంధర్వ నిర్గుణి భజనలు జానపద గీతాలు, రాగాలు ఒక విశిష్ట శైలిలో పాడేవాడు. కొందరు ఆయన పాడే విలంబిత్ గాయన పద్ధతిని విమర్శించినా, ద్రుపద్ గాయనాన్ని మెచ్చుకొనేవారు. 1961 లో భానుమతి మరణం తరువాత, కుమార గంధర్వ తన సహ విద్యార్థిని, వసుంధరా శ్రీఖండే"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె కుమార గంధర్వ తో కలిసి భజనలు పాడేది. వారి కుమార్తె కలాపిని కోంకళి వారికి తాన్‌పురా వాయించేది. ఆయన శిష్యులలో ముఖ్యులు సత్యశీల్ దేశ్ పాండే మరియు శుభా ముద్గల్ లు. కుమార గంధర్వకు 1990 లో పద్మవిభూషణ్ అవార్డ్ లభించింది.

ఏప్రిల్ 1947లో ఆయన భానుమతి కన్స్‌ను వివాహం చేసుకొని మధ్యప్రదేశ్‌లో ఉన్న దేవాస్‌కు బదిలీ అయ్యారు. అక్కడకు బదిలీ అయిన కొంతకాలానికే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చింది, దీనిని వైద్యులు క్షయ అని తప్పుగా నిర్ధారణ చేశారు. కాన్సర్ ప్రభావితమైన ఊపిరితిత్తుల భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించటం లేదా ఈ వ్యాధి కారణంగా మరణించటమనే సమస్యను ఆయన ఎదుర్కున్నారు. ఆయన కుటుంబం చేసిన ఒత్తిడి వల్ల మరియు శస్త్రచికిత్స చేసిన తరువాత ఆయన పాడలేరేమోననే సంశయాలను వెలిబుచ్చినా ఆయన చికిత్స చేయించుకోవటానికి సిద్ధపడ్డారు. శస్త్రచికిత్స జరిగిన తరువాత దాని నుంచి తేరుకోవటానికి కర్ణాటకలోని బెలగాం సమీపాన ఉన్న ఖాన్పూర్‌లో ఉన్నప్పుడు, కుమార్ గాంధర్వను చూడటానికి వైద్యుడైన ఆయన అభిమాని ఒకరు వచ్చారు. ఆ వైద్యుడు శస్త్రచికిత్స చేసిన గాయాలు నయమవటం చూసి కుమార్ గాంధర్వను మరొక్కసారి పాడటానికి ప్రయత్నించమని కోరారు. ఈ వైద్యుని వద్ద నుండి క్రమంగా పొందిన సహాయం, ఆ కాలంనాటి మందులు మరియు భార్య భానుమతి కన్స్ తీసుకున్న జాగ్రత్తల కారణంగా కుమార్ గాంధర్వ స్వస్థత చెంది తిరిగి పాడటం ప్రారంభించారు. అయినప్పటికీ, అతని అద్భుతమైన స్వరం మరియు పాటపాడే శైలి కొంతవరకూ ఆయన శస్త్రచికిత్స వల్ల దెబ్బతింది, "దేవ దీన ఘరి ధవళ" నాటకంలోని "ఋణానుబంధచ్యా" అనే పాటను విన్నవారికి ఎవరికైనా ఈ విషయం స్పష్టమవుతుంది.

వృత్తి జీవితం[మార్చు]

భానుమతి కన్స్ ఆరంభంలో దియోధర్ వద్ద తరువాత కుమార్ గాంధర్వ వద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు, ఆయన అనారోగ్యంగా ఉన్న కాలమంతా ఆమె శుశ్రూష చేశారు. ఆయన అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత మొదటి సంగీత కార్యక్రమం 1953లో జరిగింది. తరువాత సంవత్సరాలలో ఈ వ్యాధి ఆయన పాటల మీద అధికమైన ప్రభావాన్ని చూపించింది– శక్తివంతమైన సంక్షిప్త పదసముదాయాలకు మరియు ఉచ్ఛస్థాయిలోని ఆయన స్వరానికి గతంలో ప్రసిద్ధిగాంచారు. ఆయన తన సమకాలీకులైన భీమసేన్ జోషి వంటివారంత పేరుప్రఖ్యాతలను పొందలేకపోవచ్చేమో కానీ ఆయన ఎల్లప్పుడూ రసజ్ఞులైన మరియు అంకితమైన అత్యాసక్తుల ప్రేమను ఇంకా సహకారాన్ని పొందారు. అతని పాటలు శ్రోతలకు భారతీయ సాంప్రదాయ సంగీతానికి మచ్చుతునకలుగా ఉండేవి, ఆశుకవనంగా మరియు పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

కుమార్జీ, పాటల యొక్క ఇతర ఆకృతుల పై కూడా ప్రయోగం చేశారు, ఇందులో నిర్గుణి భజన్లు (భక్తి పాటలు), జానపద పాటలు మరియు రాగాలతో మరియు ప్రదర్శనలతో ప్రయోగాలు ఉన్నాయి, ఇటువంటి ప్రయోగాన్ని ఉత్తర భారత సంగీతకారులు చాలా అరుదుగా సాధించారు. అతని నవీకరణ కృషి, సంపూర్ణంగా తిరస్కరించకుండా సంప్రదాయాన్ని ప్రశ్నించటం, భారతీయ సంస్కృతిని ముఖ్యంగా మధ్యప్రదేశ్ యొక్క జానపద సంగీతాన్ని మూలంగా కలిగి ఉంది. సంగీతంలో ఉన్న అతని నవీకరణ విధానం కారణంగా నూతన రాగాలను పాత రాగాల సమ్మేళనంతో చేయటానికి దారితీసింది.

అతను పాట పాడే శైలి అధికమైన వివాదాన్ని ఆకర్షించింది. ఇతని విలంబిత (మంద గతిలో ఉండే) పాటలు ఏమాత్రం ఆసక్తికరంగా ఉండవని దీర్ఘానుభవం కల గాయకుడు మోగుబాయి కుర్డికర్ భావించారు మరియు ఆయన గురువుగారు దియోధర్, కుమార్ పాడిన పాటల యొక్క కొన్ని ఆకృతులను విమర్శించారు, కానీ 1940లలో భానుమతిని కుమార్ గాంధర్వ వివాహం చేసుకున్న తరువాత వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కుమార్ గాంధర్వ మీద పండరినాథ్ కొల్హాపురే వ్రాసిన పుస్తకంలో దియోధర్ ఆ సంబంధానికి వ్యతిరేకమని తెలపబడింది. కానీ చాలా వరకు ఈ విమర్శలు అతని విలంబిత గానం మీద కేంద్రీకృతమై ఉన్నాయి. వేగవంతమైన గతులలోని అతని పాటలు ముఖ్యంగా మధ్య-లయలోని అతని ప్రవీణత విస్తారంగా గౌరవాన్ని పొందింది.

కుమార్ గాంధర్వ యొక్క మొదటి కుమారుడు ముకుల్ శివపుత్ర కోమ్కలిమఠ్[1] 1955లో జన్మించారు. 1961లో ప్రసవ సమయంలో భానుమతి మరణించిన తరువాత దియోధర్ సంగీతశాలలోని మరొక తోటి విద్యార్థిని వసుంధరా శ్రీఖండేను కుమార్ వివాహం చేసుకున్నారు. వసుంధరా కోమ్కలిమఠ్ అతనితో కలసి భజన పాటలలో ప్రసిద్ధమైన యుగళగానాలను అందించారు. ఈమె తరచుగా అతని సాంప్రదాయకమైన సంగీతానికి గాన సహకారాన్ని కూడా అందించారు. వారి పుత్రిక కళాపిని కోమ్కలిమఠ్ తరువాత తల్లితండ్రులతో కలసి తాన్పురా వాయించారు.

కుమార్ గాంధర్వ యొక్క సిద్ధాంతాలను కొంతవరకు ఆయన కుమారుడు మరియు కుమార్తె అలానే విద్యార్థులు మధుప్ ముద్గల్, శుభా ముద్గల్, విజయ్ సార్దేష్ముఖ్ మరియు సత్యశీల్ దేశపాండే వంటివారు ప్రగతిపథంలోకి తీసుకువెళ్ళేరు. కుమార్జీ యొక్క మనవడు భువనేష్ (ముకుల్ శివపుత్ర కుమారుడు) కూడా సాంప్రదాయ గాయకుడిగా పేరు గడించాడు.

చాలా కాలం వరకూ, సంగీతకారుడిగా కుమార్ గాంధర్వ యొక్క కార్యకలాపాలను అతని స్నేహితుడు మరియు తబలా వాయిద్యగాడు వసంత్ అచరేకర్ నిర్వహించారు. 1950లలో అచరేకర్ వసంత్ దేశాయ్ యొక్క సహాయకుడిగా ఉండేవాడు, కానీ తరువాత 1970ల చివరలో అతను మరణించే వరకూ అతని పూర్తి సమయాన్ని సాంప్రదాయ పాటలకు సహకార వాయిద్యగాడిగా వెచ్చించాడు. అతని కుమారుడు సురేష్ అచరేకర్ కూడా తబలా వాయిద్యగాడు మరియు కుమార్ గాంధర్వ ఇంకా అనేమంది ఇతర కళాకారులకు ప్రక్క వాయిద్యగాడిగా ఉన్నారు.

కుమార్ గాంధర్వకు 1979లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 1990లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని బహుకరించారు.

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]