కుమార సంగక్కర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమార సంగక్కర
Flag of Sri Lanka.svg Sri Lanka
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌స్పిన్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 71 213
పరుగులు 6032 6277
బ్యాటింగ్ సగటు 56.37 36.28
100లు/50లు 16/24 7/42
అత్యుత్తమ స్కోరు 287 138*
ఓవర్లు 1 -
వికెట్లు 0 -
బౌలింగ్ సగటు - -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 149/20 195/54

As of జనవరి 24, 2008
Source: [1]

1977, అక్టోబర్ 27న జన్మించిన కుమార సంగక్కర (Kumar Chokshanada Sangakkara) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్. ప్రారంభంలో బ్యాట్స్‌మెన్‌గా క్రీడాజీవితం ప్రారంభించిననూ క్రమక్రమంగా వికెట్ కీపర్‌గా కూడా విధులను నిర్వహిస్తున్నాడు. [[2007], డిసెంబర్ 6న LG ICC టెస్ట్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్‌గా ప్రకటించబడ్డాడు. శ్రీలంక తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ ఇతడే. టెస్ట్ క్రికెట్‌లో వరుసగా నాలుగు సార్లు 150 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా సంగక్కరే.[1]

క్రీడాజీవితంలో ముఖ్యఘట్టాలు[మార్చు]

2006 జూలైలో సంగక్కర మహేలా జయవర్థనేతో కలిసి 624 పరుగులు భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై సాధించిన ఈ స్కోరు ఫస్ట్ క్లాన్ మరియు టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. అదే ఇన్నింగ్సులో సంగక్కర వ్యక్తిగతంగా 287 పరుగులు సాధించి తన అత్యధిక స్కోరును మెరుగుపర్చుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 4 సార్లు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. అతడు చేసిన 16 సెంచరీలలో చాలా వరకు అత్యధిక పరుగుల వద్దకు లాక్కొచ్చాడు. సెంచరీ చేయగానే వికెట్ పారేసుకొనే తవ్తం కాకుండా బాధ్యతాయుత బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. డిసెంబర్, 2007లో వరుసగా 4 సార్లు 150పై చిలుకు పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గాను రికార్డు సృష్టించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

సంగక్కర 71 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 56.37 సగటుతో 6032 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు మరియు 24 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 287 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

కుమార సంగక్కర 213 వన్డేలు ఆడి 36.28 సగటుతో 6277 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు మరియు 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 138 (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

సంగక్కర 2 పర్యాయాలు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003లో మొదటి సారి మరియు 2007లో రెండో సారి ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. LG ICC Cricket Rankings