కురుంగ్ కుమే జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kurung Kumey జిల్లా
Arunachal Pradesh పటంలో Kurung Kumey జిల్లా స్థానం
Arunachal Pradesh పటంలో Kurung Kumey జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్య పట్టణంKoloriang
జనాభా
(2011)
 • మొత్తం89,717[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత50.7%[1]
 • లింగ నిష్పత్తి1029[1]

అరుణాచల ప్రదేశ్ రాష్ట్ర 17 జిల్లాలలో కురుంగ్ కుమె జిల్లా ఒకటి. జిల్లా కేంద్రం కొలోరియాంగ్.

పేరువెనుక చరిత్ర[మార్చు]

కురుంగ్, కుమే పదాల కలయికతో ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి కురుంగ్, కుమే నదులు ప్రవహిస్తూ ఉండడమే ఇందుకు కారణం. పురాణకథనం అనుసరించి కురుంగ్, కుమే నదులు అక్కచెల్లెళ్ళని కురుంగ్ వారి తల్లితండ్రులల అనుమతి లేకుండా వివాహం చేసుకొందని. వారి తల్లితండ్రులు ఆమెను శపిస్తూ ఆమె మీద బూడిదను చల్లారని అందుకనే అది ఉగ్రంగా బూడిద వర్ణంలో ప్రవహిస్తుందని, కుమే తన తల్లి తండ్రుల అనుమతితో వివాహం చేసుకుని వారి దీవెనలందుకున్నదని అందుకే అది స్వచ్ఛంగా నెమ్మదిగా ప్రవహిస్తుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

1914లో ప్రస్తుత జిల్లా ప్రాంతం ఒకప్పుడి ఈశాన్య సరిహద్దు భాగంగా ఉండేది. 1954లో ఇది సుబంసిరి విభాగం సరిహద్దుగా మారింది. తరువాత ఇది దిగువ సుబంసిరి అయింది. 2001 ఏప్రిల్ 1 దిగువ సుబంసిరి జిల్లలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది. [2]

విభాగాలు[మార్చు]

కురుంగ్‌కుమే జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పాలిన్, నియాపిన్, కొలోరియాంగ్. పశ్చిమ అరుణాచల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెంది ఉన్నాయి. [3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 89,717, [1]
ఇది దాదాపు. సెచెల్లెస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 617 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 15 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 111.01%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 1029:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 50.67%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

కురంగ్‌కుమే జిల్లాలోని నియాపిన్ గ్రామం వైశాల్యంలోనూ జనసాంధ్రతలోనూ జిల్లాలో ప్రథమస్థానంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "District Census 2011". Census2011.co.in. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "districtcensus" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison: Population". Retrieved 2011-10-01. Seychelles 89,188 July 2011 est. line feed character in |quote= at position 11 (help)

వెలుపలి లింకులు[మార్చు]


Coordinates: 27°54′N 93°21′E / 27.900°N 93.350°E / 27.900; 93.350