కూరుగంటివారి ఖండ్రిక

వికీపీడియా నుండి
(కురుగంటివారి ఖంద్రిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కురుగంటివారి ఖండ్రిక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521185
ఎస్.టి.డి కోడ్

కూరుగంటివారి ఖండ్రిక కృష్ణా జిల్లా, నందిగామ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందిగామ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 37 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588877[1].

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నందిగామ మండలం[మార్చు]

నందిగామ మండల పరిధిలోని సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, అడవిరావులపాడు, ఐతవరం, కంచర్ల, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి.

తాగు నీరు[మార్చు]

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ ఆలయం హనుమంతునిపాలెం గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామ పొలాలలో వెలసినది.

భూమి వినియోగం[మార్చు]

కూరుగంటివారి ఖండ్రికలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 14 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 2 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 19 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 162 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 161 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 20 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కూరుగంటివారి ఖండ్రికలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 20 హెక్టార్లు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx