Jump to content

కురుమ

వికీపీడియా నుండి

కురుమ : తెలంగాణ వెనుకబడిన కులాల జాబితాలో బి.సి.బి.గ్రూపు కులం . కురుబ అనికూడా అంటారు.

గొర్రెల కాపరులైన కురుమ కులస్థులు సంచార జీవులు, మేకల మందలే వీరి జీవనాధారం. కొండలు- గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఈ జీవాలతో తిరుగుతూ మేపటానికి గరిక భూములు, త్రాగటానికి నీటి సౌకర్యంగల ప్రదేశాలను వెతుక్కుంటూ వెడతారు. పూర్వం కురుమలు కొండమీద నివసిస్తూ గొర్రెలు, మేకలు మేపుకొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చేవారు. నేటికీ దాదాపు అలాగే జీవనం సాగిస్తున్నారు. ఈ కులానికి చెందినవారిలో 90 శాతానికి పైగా గ్రామాల్లో జీవిస్తుస్తున్నప్పటికీ, ఏడాదిలో ఆరు మాసాలు స్వస్థలం విడిచి పచ్చిక దొరికే ప్రాంతాలకు గొర్రెలతో వలస పోతుంటారు. ముఖ్యంగా జవవరి నుంచి జూన్‌ వరకు వలస పోతుంటారు. ఆ కాలంలో వీరు చింత, మామిడి తొక్కు పచ్చడితో వీరు రోజులు గడుపుతారు. ఈ విధంగా వలసలు పట్టిన రోజుల్లో గొర్రెలకు మేత కరువై, సరైన వైద్య సదుపాయం లభించక, రోగ నిరోధక శక్తి తగ్గటంలో అవి రోగాల బారిన పడతాయి. ఒక్కొక్కసారి పరిస్థితి విషమించి గొర్రెలు మొత్తం మృతిచెందితే భుజాన గొంగళి, చేతికరత్రో స్వగ్రామం చేరిన గొర్రెల కాపరులూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో ఉన్ని పరిశ్రమ దెబ్బతిన్నప్పటికీ, కురుమలు మాత్రం ఇప్పటికీ కంబళ్లు నేస్తూనే ఉన్నారు. మెదక్‌ జిల్లా జోగిపేట, వరంగల్ జిల్లా ఆకునూరు, రాంపూర్ లో ఇప్పటికీ భారీగా కంబళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ర్టంలోని గొర్రెల కాపరులు నేటికీ గొంగడి లేనిదే బయటికి వెళ్లరు. జడివానలో సైతం గొంగళి కప్పుకుంటే చుక్క నీరు లోపలికి రాదు. చలికాలం కప్పుకుంటే వెచ్చగా అమ్మవడిలో నిద్రపోయినంత అనుభూతి కలుగుతుంది. రాష్ర్టంలో ఉన్నటువంటి 213 లక్షల గొర్రెలలో దాదాపు 80 లక్షల గొర్రెలు ఉన్ని ఉత్పత్తి చేసేవే. దక్కన్‌ జాతి గొర్రెల నుంచి ఉన్ని ఎక్కువ వస్తుంది. గొర్రెల నుంచి కత్తిరించిన రెండు కిలోల ఉన్నిని 40, 50 రూపాయలకే కొని అదే రెండు కిలోల ఉన్నితో తయారయ్యే శాలువాలను ఏడెనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు. గొర్రెల నుంచి ప్రతి ఏడాదీ రెండు సార్లు ఉన్ని కత్తిరించే అవకాశముంది. ప్రతి గొర్రె నుంచి దాదాపు రెండు కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతోంది. అందులో నుంచి సగం పనికివచ్చే ఉన్ని లభించినా ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నుల ఉన్ని చేతికందుతుంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు 20 లక్షల కంబళ్లు ఉత్పత్తి చేయవచ్చు. అంటే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆదాయం చేతికందటంతోపాటు, వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ జాతి వారిని వీరిని తెలంగాణలో కురుమ, రాయసీమలో కురుబ అని పిలుస్తున్నారు. మాంసాన్ని ఇచ్చే గొర్రెలు మహబూబ్‌నగర్‌ ఎక్కువ. మాంసం విషయానికి వస్తే, మొత్తం గొర్రెల్లో ఏడో వంతు మాంసం కోసం విక్రయించినా దాదాపు 800 కోట్ల రూపాయలు ప్రతి ఏటా లభించే అవకాశముంది. వీటి చర్మం ద్వారా మరో 100 కోట్ల రూపాయలు అందుతు న్నాయి. కురుమలు పట్టిందల్లా బంగారం ఐనా మధ్య దళారీలే లబ్ధిపొందటంతో కురుమలకు మిగిలేది శ్రమ మాత్రమే. నేడు అమలవు తున్న ఎగ్జిమ్‌ విధానం ద్వారా విదేశీ మాంసం ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశించటం ద్వారా స్వదేశీ యులు సృష్టించే ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది.

కురుమ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు.కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్ప లు. వైవిధ్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహితవర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేక మైన వాయిద్యం ఒగ్గు (డమరుకం ) ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెల్సుకోవడం అంటే కురుమ జాతి చరిత్ర, సంస్కృతుల గురించి తెలుసుకోవటమన్నమాట. ఒగ్గు దీక్ష ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది.

ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు బీరన్న, మల్లన్న కథలుచెప్పేందుకి అర్హత సంపాదిం చుకొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విర బోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్ల్లకి కాటుక రాసు కొని ఎరన్రి పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలుపాడతారు.

రాష్ర్టంలోని చాలా జిల్లాల్లో కురుమలు గొంగళ్లను, తివాచీలను మగ్గాలపైనే నేస్తున్నారు. వాటిని ఆధునీకరించాల్సిన అవ సరం ఉంది. వీరు 80 నియోజకవర్గాలో ఉన్నారు. ఈ మధ్య జరిగిన కురుమ మహా గర్జనకు రెండు లక్షలమంది హాజరయ్యారు. శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంకందార్లకు శిక్షణ యాజ మాన్య పద్ధతులు ఇవ్వాలనీ గొర్రెల ఆరోగ్య రక్షణకై కావలసిన మందులను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచాలనీ ఉన్నికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కురుమ లకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేసి విద్యాపరంగా అభివృ ద్ధిపరచాలని వీరు కోరుతున్నారు.రు. లెదర్‌ బోర్డు, సిల్కు బోర్డు, టీ బోర్డు ఏర్పాటు చేసినట్లే, షీప్‌ బోర్డు కూడా ఏర్పాటు చేస్తే మన రాష్ర్తంలో ఉన్ని, తోళ్ల, మాంసం పరిశ్రమ అభివృద్ధి చెందుతుందంటారు. రాష్ర్టంలోని కురుమల జనాభా 85 లక్షలు రాష్ర్టం నుంచి వీరి ప్రాతినిధ్యం ఈ విధంగా ఉంది... మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు 5 ఎంపిపిలు 20 జడ్‌పిటిసి 11 ఎంపిటిసీలు 126 సర్పంచ్‌లు 1000

ఇవీ చూడండి

[మార్చు]
  • అహల్య బాయ్ ఓల్ కర్ మహారాష్ట్ర మహారాణి.
  • రాయల హక్క- బుక్క
  • భక్త కనకదాసు
  • సంగోలి రాయన్న (కిట్టూరీ చెన్నమ్మ మహారాణి మహాారాష్ట్ర) సేనాధిపతి.
  • దొడ్డి కొమురయ్య


  • కురుమ కులంలో ముఖ్యమైన వ్యక్తులు 'దొడ్డి కొమురయ్య, దొడ్డి మల్లయ్య' చుక్క సత్తయ్య, కోనపురి సాంబ శివుడు, కోనపురి రాములు, బండారు దత్తాత్రేయ,
  • దొడ్డి కొమురయ్య - విప్లవ యోధుడు

నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యాడు. నిజాం సర్కారు హయాంలో విస్నూర్‌ కేంద్రంగా దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్‌ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు.

1947 జూలై 4వ తేదీన ప్రస్తుత బొడ్రాయి ఏరియాలో ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్న దొరసాని ఆగడాలను ఎండగడుతూ ప్రదర్శనకు వస్తుండగా గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా తొలుత కామ్రెడ్ దొడ్డి మల్లయ్య మోకాళి తగిలి నెలకూడాడు. ఆ తర్వాత ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా.. బుల్లెట్లకు ఎదురొడ్డి.. దోరల మీదకు తిరగబడిన కామ్రెడ్ దొడ్డి కొమురయ్య పొట్టలో నుంచి తుటాలు పోవడంతో రక్తంతో నేలతడిచింది.

శాంతియుతంగా కొనసాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్త దొడ్డి కొమురయ్య తొలి అమరత్వంతో రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మల్చుకొని ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కింది. నిజాం సర్కారు నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఆరున్నర దశాబ్దాలు పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ జరుపకపోవడం గమనార్హం.

నిజాం కాలంలో వెలుగొందుతున్న మీజాన్‌ పత్రికలో విస్నూర్‌ దొరల విజృంభణ, ఆంధ్ర మహాసభ కార్యకర్త ‘దొడ్డి కొమురయ్య హతం’ అనే వార్తా కథనం తొలి అమరత్వానికి చారిత్రాత్మకంగా నిలిచింది.

దొడ్డి కొమురయ్య అంటే విప్లవం- విప్లం అంటేనే దొడ్డి కొమురయ్య అనే విధంగా అందరిలో చెరగరి ముద్రలాగా చరిత్ర పుటలకెక్కాడు. దొడ్డి కొమురయ్య అన్న –

దొడ్డి మల్లయ్య(దొడ్డి కొమురయ్య అన్న) – ఇతడు సాదాసిదా కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వృత్తి గొర్రకాపారీ. కానీ ఎప్పడైతే దొరసారి, దోరల ఆగాడాలు మొదలయ్యాయో అప్పటి నుండి దొడ్డి మల్లయ్యలో తిరుబాటు తత్వం మొదలైంది. దోరల ఆగాడాలను నుండి ప్రజలకు విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి సంఘం నేతలలో కలిసి భువనగిరిలో చర్చలకు వెళ్లి చురుగ్గా పాల్గొనే వాడు. దోరల అంతమే లక్ష్యంగా పోరాటం మొదలు పెట్టాడు. ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర వహించాడు. కడవెండి గ్రామంలో దొడ్డి మల్లయ్యతో పాటు పలువురు సంఘంలో చేరారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు దోరతో వీర పోరాటం చేశాడు. దోరల వేసిన తూట మొకాలికి తగిలినెలకూలడు. దొడ్డి కొమురయ్య మరణం తరువాత మరో ఉద్యమానికి ఉపిరి పోసుకొని.. యావత్ తెలంగాణ వ్యాప్తంగా విప్లవ జ్వాలను రగిల్చాడు. ఇప్పటికి వారి వారసత్వంగా తీసుకొని కురుమలు పోరాటాలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికి దొడ్డి కొమురయ్యని ప్రభుత్వాలు గుర్తించక పోవడం బాధకరం. అలాగే దొడ్డి కొమురయ్య, మల్లయ్య కొడుకు, వారసుడు దొడ్డి బిక్షపతి కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితి. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వలు, రాష్ట్ర కురుమ సంఘాలైన వారి కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిద్దాం.



మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కురుమ&oldid=3326201" నుండి వెలికితీశారు