కులకర్ణి మల్లప్ప కరవీరప్ప
| కులకర్ణి మల్లప్ప కరవీరప్ప | |||
| పదవీ కాలం 1983 – 1994 | |||
| ముందు | పాటిల్ శంకరగౌడ విరూపాక్షగౌడ | ||
|---|---|---|---|
| తరువాత | గడ్డి కల్లప్ప నాగప్ప | ||
| నియోజకవర్గం | నవలగుండ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
కులకర్ణి మల్లప్ప కరవీరప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నవలగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కులకర్ణి మల్లప్ప కరవీరప్ప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1983 శాసనసభ ఎన్నికలలో నవలగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి జనతా పార్టీ అభ్యర్థి దేశాయ్ నేమచంద్ర జిన్నప్పపై 11667 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 1985 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ కల్లన్నవర్ పై 472 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
కులకర్ణి మల్లప్ప కరవీరప్ప 1989 శాసనసభ ఎన్నికలలో నవలగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక రాజ్య ర్యోత సంఘ అభ్యర్థి మంకాని విజయ్ లింగారెడ్డిపై 10,493 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6][7] ఆయన 1994 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డి కల్లప్ప నాగప్ప చేతిలో 3,348 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka Election Results 1983". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Karnataka Election Results 1985". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ "Karnataka 1989". eci.gov.in.
- ↑ "Karnataka Election Results 1989". www.elections.in.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.