Jump to content

కుల్కచర్ల

అక్షాంశ రేఖాంశాలు: 17°01′00″N 77°52′24″E / 17.01668590419332°N 77.87327166314952°E / 17.01668590419332; 77.87327166314952
వికీపీడియా నుండి

కుల్కచర్ల, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలంలోని గ్రామం.[1]

కుల్కచర్ల
—  రెవిన్యూ గ్రామం  —
కుల్కచర్ల గ్రామ మెయిన్‌రోడ్డు
కుల్కచర్ల గ్రామ మెయిన్‌రోడ్డు
కుల్కచర్ల గ్రామ మెయిన్‌రోడ్డు
కుల్కచర్ల is located in తెలంగాణ
కుల్కచర్ల
కుల్కచర్ల
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°01′00″N 77°52′24″E / 17.01668590419332°N 77.87327166314952°E / 17.01668590419332; 77.87327166314952
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండలం కుల్కచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,624
 - పురుషుల సంఖ్య 3,869
 - స్త్రీల సంఖ్య 3,755
 - గృహాల సంఖ్య 1,597
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది.2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఈ గ్రామం రామాయణ కాలం నాటి చారిత్రిక ప్రాశస్త్యం కలిగి ఉంది. ఈ గ్రామం వ్యవసాయికంగా, విద్యాపరంగా ముందంజలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి 36 కి.మీ. పరిగి నుంచి 24 కి.మీ. దూరములో ఉంది. ఈ గ్రామం పరిగి శాసనసభ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1597 ఇళ్లతో, 7624 జనాభాతో 2397 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3869, ఆడవారి సంఖ్య 3755. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 945 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1052. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 574598.[3]

2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 6340. ఇందులో పురుషుల సంఖ్య 3319, స్త్రీల సంఖ్య 3021. జనాభాలో షెడ్యూల్ కులాలవారు 943, షెడ్యూల్ తెగలవారు 508 మంది ఉన్నారు.[4]

గ్రామ పాలన

[మార్చు]
కుల్కచర్ల గ్రామపంచాయతి కార్యాలయము

కుల్కచర్ల గ్రామపాలన గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. గ్రామపంచాయతీకి ఇంటిపన్నులు, నీటిబిల్లులు, తైబజారు వేలము ద్వారా ఆదాయం లభిస్తుంది. వీటి ద్వారా గ్రామ పారిశుద్ధ్యం, విద్యుత్ దీపముల ఏర్పాటు, నీటి సరఫరా నిర్వహణ లాంటి పనులు నిర్వహిస్తారు. ఇవి కాకుండా ప్రభుత్వము నుంచి వచ్చే పన్నెండవ ఆర్థిక సంఘం నిధులు, బి.ఆర్.జి.ఎఫ్.నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులచే మురుగునీటి కాల్వల నిర్మాణం, సిమెంటు రోడ్ల నిర్మాణం, పాఠశాల భవనాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.

రాష్ట్ర అవతరణ సమయములోనే 1956లో గ్రామపంచాయతీ ఏర్పడింది. నాగప్ప తొలి సర్పంచిగా పనిచేయగా, ఆ తరువాత మోహన్ రెడ్డి, బిచ్చిరెడ్డి, వెంకట్‌రావు, బాల్‌రెడ్డి, వెంకటయ్య జోగి, ప్రహ్లాద్‌రావు, కె.ఎల్లయ్య, ఎం.జానకిరాం, సర్పంచులుగా పనిచేశారు. సౌమ్య వెంకట్ రాంరెడ్డి (ప్రస్తుతం) సర్పంచు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో గ్రామంలో 2 డిగ్రీ కళాశాలలు, 2 జూనియర్ కళాశాలలు, 11 పాఠశాలలు ఉన్నాయి. సమీప గ్రామ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి విద్యనభ్యసిస్తారు. ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల మహబూబ్ నగర్లో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కుల్కచర్లలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార సౌకర్యం

[మార్చు]

కుల్కచర్లలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రవాణా సదుపాయాలు

[మార్చు]
రోడ్డు సౌకర్యం

కుల్కచర్ల గ్రామం మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నందున రోడ్డు పరంగా మంచి సౌకర్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు జీపులు, క్యాబ్‌లు కూడా ప్రయాణీకులకు అందుబాటులో ఉన్నాయి. మహబూబ్ నగర్ ఉంచి 36 కిమీ, పరిగి నుంచి 24 కిమీ దూరములో ఉంది. కోస్గి, నవాబ్‌పేట్ వెళ్ళు రహదారులు కూడా కుల్కచర్ల గ్రామ కూడలి వద్ద కలుస్తాయి. కోస్గి నుంచి 18 కిమీ, నవాబ్‌పేట్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. తాండూరు నుంచి వచ్చేటప్పుడు నంచర్ల గేట్ వద్ద దిగి ఎడమవైపుకుకు వెళ్ళవలసి ఉంటుంది.

రైలు సౌకర్యం

కుల్కచర్ల గ్రామానికి రైలు సదుపాయము లేదు. సమీపములో ఉన్న రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కుల్కచర్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 110 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 700 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 785 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 802 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 402 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 400 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కుల్కచర్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 280 హెక్టార్లు* చెరువులు: 120 హెక్టార్లు

ప్రధాన వృత్తి

[మార్చు]

గ్రామప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. గ్రామపరిధిలో పండే ప్రధాన పంటలు వరి, వేరుశనగ. మల్లమ్మ చెరువు గ్రామపరిధిలో ఉంది. నీటిపారుదల కాలువలు గ్రామానికి అందుబాటులో లేవు. వర్షము, మోటారుపంపుల నీటి ద్వారా పంటలు పండిస్తారు.

ఉత్పత్తి

[మార్చు]

కుల్కచర్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న, మొక్కజొన్న

రాజకీయాలు

[మార్చు]

కుల్కచర్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికి నిలుపుకుంటున్నది. 2006లో జరిగిన సర్పంచు ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన అభ్యర్థి గెలుపొందగా, 2 ఎమ్పీటీసి స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ గ్రామం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేది.

దర్శనీయ స్థలాలు

[మార్చు]
కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట

కుల్కచర్ల గ్రామానికి 2 కిమీ దూరములో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతిఏటా ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. పాము ఆకారంలో ఉన్న అతిపెద్ద బండరాయిపై ఉన్న దేవాలయమునకు శ్రీరాముడు దర్శించినట్లు ప్రతీతి. పెద్ద బండరాయిపై కోనేరు ఉండడం, అక్కడ ఎప్పుడూ నీరు ఉండడం విశేషం. ఎత్తయిన బండరాయిపై ఉన్నందున నంచర్ల - పరిగి వెళ్ళు రహదారిపై నుంచి కూడా ఈ దేవాలయం కనిపిస్తుంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • పండుగ సాయన్న: దాదాపు 4 దశాబ్దాల క్రితం పేదప్రజలకు దానధర్మాలు చేసిన వ్యక్తిగా పండుగ సాయన్న ప్రసిద్ధి చెందాడు. సంపన్నుల నుంచి విరాళాలు తీసుకొని పేదలకు పంచిన ఘనతను పొందాడు.
  • కె.ఎల్లయ్య: గ్రామ సర్పంచిగా పనిచేసిన ఎల్లయ్య భారత సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ పొంది కుల్కచర్లలో స్థిర పడ్డాడు.1987లో ఇండీయన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకకు వెళ్ళి బాధ్యతలు నిర్వహించాడు. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కార్గిల్, సియాచిన్ లాంటి ప్రదేశాలలో కూడా విధులు నిర్వహించాడు.2006లో జరిగిన సర్పంచి ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించాడు.
  • బి.భీంరెడ్డి: కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, పి.ఎ.సి.ఎస్.చైర్మెన్ అయిన భీంరెడ్డి గతంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించాడు. రైతుల సమస్యపై పలు రాష్ట్రాలు పర్యటించాడు.

ఇతర సదుపాయాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ముఖ్యప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా ప్రచురించిన జిల్లా గణాంకాల పుస్తకం, 2007-08, పేజీ 264
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-07-25. Retrieved 2010-08-13.

వెలుపలి లింకులు

[మార్చు]