Jump to content

కుల్‌దీప్ సింగ్ (అథ్లెట్)

వికీపీడియా నుండి
కుల్‌దీప్ సింగ్
Personal information
Nationalityభారతీయుడు
Sport
Sportఅథ్లెటిక్స్
Eventడిస్కస్ త్రో
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place 1982 ఢిల్లీ డిస్కస్ త్రో
ఆసియా ఛాంపియన్షిప్స్
Bronze medal – third place 1985 జకార్తా డిస్కస్ త్రో

కుల్‌దీప్ సింగ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు డిస్కస్ త్రోలో భారతదేశానికి అంతర్జాతీయ పోటీలలో పతకాలు సంపాదించి పెట్టాడు.

1982లో ఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో పురుషుల డిస్కస్ త్రో పోటీలో 53.50 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు.

1985లో జకార్తాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌ పోటీలో డిస్కస్ త్రో క్రీడలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి కాంస్య పతకం సంపాదించిపెట్టాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు వివిధ జాతీయ అంతర్జాతీయ పోటీలలో సాధించిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1981ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లక్నో, ఉత్తరప్రదేశ్1వడిస్కస్ త్రో48.36
1982 ఆసియా క్రీడలుఢిల్లీ, భారతదేశం2వడిస్కస్ త్రో53.50
1985ఆసియా ఛాంపియన్షిప్స్జకార్తా, ఇండొనేషియా3వడిస్కస్ త్రో52.36
1985భారత జాతీయ క్రీడలుఢిల్లీ, ఢిల్లీ2వడిస్కస్ త్రో50.50

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Kuldip Singh". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 January 2026.