కుసుమ్ నూనె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చెట్టు
ఆకులు
పూలు
పళ్ళు

మౌలిక వివరణ[మార్చు]

కుసుమ్ చెట్టును ఆంగ్లంలో సిలోన్ ఓక్(ceylon oak)అనికూడా అందురు.ఈచెట్టు సపిండేసి కుటుంబానికి చెందినది.కుసుమ్‍చెట్టు మరియు తెలుగులో కుసుమ అనిపిలువబడు మొక్క ఒకటికాదు.రెండు భినమైనవి.వేరే వృక్షకుటుంబానికి చెందినవి.కుసుమమొక్కఆస్టరేసి/ కంపొసిటె కుటుంబానికి చెందిన మొక్క.కుసుమ ఏక వార్షిక మొక్క,వ్యవసాయపంటగా సాగుచేయునది.కుసుమ్ బహు వార్షికచెట్టు.కుసుమ్ చెట్టువృక్షశాస్త్రనామం ఎస్,ట్రిజుగ(schleichera trijuga),మరియు షెలెఛిర ఒలియోస(sh.oleosa).ఈచెట్టు లక్కపురుగులకు ఆశ్రిత చెట్టు.ఈచెట్టు ఆకులు లక్కపురుగుల ఆహారం.ఈ చెట్టును బహుళ ప్రయోజన వృక్షం(multi purpose tree)అనికూడాఅంటారు[1] .

ఇతరభాషలలో పిలిచే పేరు[2][3][మార్చు]

వ్యాప్తి[మార్చు]

భారతదేశంలో హిమాలయపరిసర(sub-himalayan)ప్రాంతాలలో సముద్రమట్టంనుండి 914 మీటర్ల ఎత్తులోకూడా వ్యాప్తిచెందివున్నాయి.అలాగే ఉత్తర,దక్షిణభారతంలో కూడా వ్యాప్తివెందినది.ఈ చెట్టు దాదాపు 45అడుగుల ఎత్తు పెరుగుతుంది. హిమాలయపర్వతాలపాదపీఠప్రాంతాలు,భారత దేశం,పాకిస్తాను,నేపాలు,బంగ్లాదేశ్,థాయ్‌లాండు ద్వీపసమూహాప్రాంతాలు,మరియు శ్రీలంకలలో పెరుగును.ఇందోనేశియాలోని జావా,బాలి లలో వ్యాప్తిచెంది వున్నది[4].

భారతదేశంలో కుసుమ్‍పంట సాగుకు అనువైనప్రాంతాలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్,బీహార్,కర్నాటక,కేరళ,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,ఒడిస్సా,ఉత్తర ప్రదేశ్,మరియు బెంగాల్రాష్ట్రాలు [3] .

చెట్టు-పూలు-గింజలు[మార్చు]

చెట్టు :బలిష్టమైన. పొట్టి కాండంకలిగి,కలిగి కాండం చివర కిరీటం/గొడుగులా విస్తరించిన కొమ్మలుండి, 12-15 మీటర్లపొడవు పెరుగుతుంది.సతతహరితం,కొన్నిచోట్ల ఆకురాల్చును.గుంపుగా రెమ్మలు,పత్రాలను కలిగి వుండును.10-15 సంవత్సరాలకు చేవ(mature)కొస్తుంది.చెట్టు గట్టికలపనిస్తుంది.ఆకులు పశువులమేతగా పనికొస్తుంది.బెరడులో టన్నిన్(Tannin)వున్నది.కలప ముదురు ఎరుపు,గోధుమ రంగులో చేవకలిగి వుండటం వలన కలపను చక్కెర,నూనెమిల్లులలోఉపయోగిస్తారు.వ్యవసాయపనిముట్లు తయారుచేస్తారు[5] .

పూలు-పళ్ళు-గింజలు ఫిబ్రవరి-ఎప్రిల్ లో పూస్తాయి.పూలు చిన్నవిగా పసుపుఛాయతోకూడిఆకుపచ్చగా వుండును.గుత్తులుగా పూయును.పూలనుండి అద్దకపురంగు(dye)తయారుచేయుదురు.ఈచెట్టుపూలలోని మకరందంను తేనెఉత్పత్తికై తేనెటిగలు సేకరిస్తాయి.పూలు ఉభయలింగకములు. జూన్-జులైకి పండుతాయి.గోళాకారంలేదా అండాకారంగా వుంటాయి.బెర్రి రకానికిచెందినది.పరిమాణం 1.25-2.5x1.1-1.8 సెం.మీ వుండును.బ్రౌన్ రంగులో సాగినట్లు,రెండుపక్కలు నొక్కబడీనట్లు గింజలుండును.పండులో తక్కువ గుజ్జుకండ(pulp)వుండును.గింజలో విత్తనం/బీజం(kernel) 60-64% వుండును.విత్తనం/బీజభాగం(kernel)లో నూనె 51-52% వున్నది గింజలో మాంసకృత్తులశాతం 22.0% గింజలో 25-38% నూనెవున్నది[6].ఒకచెట్టునుండి ఎడాదికి 25-37కిలోల నూనెగింజల దిగుబడి వస్తుంది..ఏడాదికి 80వేలటన్నుల నూనెగింజలు సేకరించు అవకాశమున్నది.అందుండి 25వేల టన్నుల నూనెతీయవచ్చును[3].ఎండిన విత్తనం'యు'రూపంలో వుండును.తేమేక్కువగా వున్నచో విత్తనాన్ని'ఫంగస్'త్వరగా ఆశిస్తుంది.

నూనె[మార్చు]

సీకరించిన నూనెగింజలనుండి పైపొట్టును పొట్టుతొలగించు(Decarticators)యంత్రాలద్వారా పొట్టునుతొలగించిన పిమ్మట గానుగ(ghani),ఎక్సుపెల్లరులద్వారా నూనెను సంగ్రహించెదరు.గానుక కన్న ఎక్సుపెల్లరు నూనెయంత్రాలలో ఆడించిన ఎక్కువనూనె దిగుబడి లభించును.కేకులో మిగిలిననూనెను సాల్వెంట్ ప్లాంట్ ద్వారా సంగ్రహించెదరు.

ముడికుసుమ్‍నూనె పసుపుఛాయతోకూడిన బ్రౌన్‍రంగులో,ముడినూనె చేదుబాదం నూనెవాసన కల్గివుండును.నూనె అర్దఘనరూపంలో వుండును,నూనెలో 50%వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలుండటమే ఇందుకు కారణం.కుసుమ్‍నూనెలో హైడ్రొసైనిక్‍ఆమ్లంవున్నది. అందుచే ఈనూనె వంటనూనెగా పనికిరాదు.నూనెను తేర్చిన,పైభాగంలో తేలికరంగువున్ననూనె పైభాగంలో చేరును.మిగతానూనెలకన్న కుసుమ్ నూనెలోని కొవు ఆమ్లాల సమ్మేళనం భిన్నమైనది.కుసుమ్ నూనె ట్రైగ్లిసెరైడుల మరియు సైనొలిపిడుల(cyanolipids)ల మిశ్రమం.నూనెలో ట్రైగ్లిసెరైడ్(triglyceride)లశాతం కేవలం37% మాత్రమే.మిగిలినవి సైనొలిపిడులు.

కుసుమ్ నూనెలోని ట్రైగ్లిసెరైడ్ సమ్మేళనాలు

సమ్మేళనం శాతం
ట్రై గ్లిసెరైడులు 37.0
సైనొలిపిడులు -I 58
సైనొలిపిడులు-II 5

కుసుమ్‍నూనెలో రెండురకాల సైనొలిపిడులు వున్నాయి.సైనొలిపిడుల ఈస్టరులు(Esters of cyanolipids)58% వరకు,సైనొలిపిడులు 5%శాతం వున్నాయి.

కుసుమ్‌ నూనె భౌతిక,రాసాయనిక లక్షణాలు[మార్చు]

కుసుం నూనె భౌతిక లక్షణాల పట్టిక [7][8]

భౌతిక లక్షణాలు మితి
తేమ,మలినాలు 0.25% గరిష్టం
రంగు,1/4"సెల్(Y+5R) 25 గరిష్టం
వక్రీభవన సూచిక 500Cవద్ద 1.456-1.460
ఐయోడిన్ విలువ 48-60
సపనిఫికెసను విలువ 220-240
అన్‌సఫొనిపియబుల్ పధార్దం 3.0% గరిష్టం
టైటెర్ విలువ 450C కనీసం
R-M విలువ 15-20
విశిష్ట గురుత్వం 950C /300Cవద్ద 0.8642-0.8990
ఆమ్ల విలువ 10.0% గరిష్టం
polenskey value,Max 1.5

కుసుమ్ గింజలనూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[8][9]

కొవ్వు ఆమ్లాలు శాతం
మిరిస్టిక్ ఆమ్లం(C14:0) 1.0
పామిటిక్ ఆమ్లం(C16:0) 5.3-8.7
స్టియరిక్ ఆమ్లం(C18:0) 1.7-6.3
అరచిడిక్ ఆమ్లం(C20:0) 20-31
లిగ్నొసెరిక్ ఆమ్లం(C24:0) 1.5-3.5
ఒలిక్ ఆమ్లం(C18:1) 40-66
లినొలిక్ ఆమ్లం(C18:2) 2.5-5.2

నూనె ఉపయోగాలు[9][మార్చు]

 • సబ్బుల తయారిలో 10-15% వరకు కుటీర మరియు లఘుపరిశ్రమలలో వినియోగిస్తారు.నూనెలోని సైనొజెనిటిక్ సమ్మేళనాల కారణంగా గ్లిసరిన్ను వేరుచేయున్నప్పుడు పెద్దపరిశ్రమలలోని లోహపాత్రలు(steel vessels)పాడైపోవును.
 • కందెనలతయారిలో వాడెదరు.
 • ఔషదమందుల తయారిలో ఉపయోగిస్తారు.
 • కీళ్ళనొప్పులమర్దనతైలాలలో వినియోగిస్తారు.
 • గజ్జినివారణకు,హైర్‍డ్రస్సింగ్ కు వాడెదరు.
 • చర్మసంబంధ వ్యాధులకు ఉపయోగిస్తారు.
 • కాలినగాయాలకు కూడా పూతమందుగా పనిచేస్తుంది.
 • దేహం మీది అనవసర కేశాలను శాశ్వితంగా తొలగించు ఆయూర్వేదమందులో తనక చుర్ణం/పుడి(tanaka)తో కుసుమ్ నూనెను కలిపి కేశనిర్మూలమందును తయారుచేయుదురు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

 1. "Kusum". nopr.niscair.res.in. http://nopr.niscair.res.in/bitstream/123456789/7435/1/SR%2047(2)%2020-22.pdf. Retrieved 2015-03-21. 
 2. "Kusum Tree". flowersofindia.net. http://www.flowersofindia.net/catalog/slides/Kusum%20Tree.html. Retrieved 2015-03-21. 
 3. 3.0 3.1 3.2 SEA,HandBokk-2009,By Thesolvent Extractors' Association of India
 4. "KUSUM". herbs-treatandtaste.blogspot.in. 2012-01-15. http://herbs-treatandtaste.blogspot.in/2012/01/kusum-ceylon-oak-or-macassar-oil-tree.html. Retrieved 2015-03-21. 
 5. "Kusum ( Schleichera oleosa ) and its utilization". forestrynepal.org. http://www.forestrynepal.org/biblio/2022. Retrieved 2015-03-21. 
 6. [https://law.resource.org/pub/in/bis/S06/is.5294.1969.pdf "GRADING FOR KUSUM SEEDS FOR OIL MILLING"]. law.resource.org. https://law.resource.org/pub/in/bis/S06/is.5294.1969.pdf. Retrieved 2015-03-21. 
 7. IS : 4088 ·1966.Page No:5 "SPECIFICATION FOR KiJSUM OIL". law.resource.org. https://law.resource.org/pub/in/bis/S06/is.4088.1966.pdf IS : 4088 ·1966.Page No:5. Retrieved 2015-03-21. 
 8. 8.0 8.1 "TOP-NOTCH TECHNOLOGY IN PRODUCTION OF OILS AND FATS". chempro.in. http://www.chempro.in/fattyacid.htm. Retrieved 2015-03-21. 
 9. 9.0 9.1 "Kusum". crirec.com. http://www.crirec.com/2011/01/kusum. Retrieved 2015-03-21.