కూకట్ల తిరుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూకట్ల తిరుపతి
కూకట్ల తిరుపతి1.jpg
కూకట్ల తిరుపతి
జననంతిరుపతి
(1975-06-05) 1975 జూన్ 5 (వయస్సు: 44  సంవత్సరాలు)
మద్దికుంట, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తిఉపాధ్యాయులు
కవి
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మి
పిల్లలుసాయి భారవి
తండ్రికనకయ్య
తల్లిఅంకవ్వ

కూకట్ల తిరుపతి వర్థమాన తెలుగు కవి మరియు ఉపాధ్యాయులు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈయన కూకట్ల అంకవ్వ, కనకయ్య దంపతులకు 1975 జూన్ 5న తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో జన్మించారు. పేద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలో చదువు సాగలేదు. ఓ వైపు పొద్దంతా బాలకార్మికుడిగా పనిచేస్తూనే ఐదో తరగతి వరకు రాత్రి బడిలో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకు కొండపల్కల జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్‌ మంచిర్యాలలో చదివారు. ఓపెన్‌ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యంతో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్శిటీలో తెలుగు పీజీ, తెలుగుపండిట్ శిక్షణ పూర్తిచేశారు. తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ ఉత్తీర్ణత.[2]

ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం[మార్చు]

స్వగ్రామంలోనే నివాసం. 2008 డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగం పొంది వీణవంక మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగారం లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహాన్మియా పేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారు.

వివాహం[మార్చు]

మేన మరదలు బావు లక్ష్మితో 1995 మార్చి 19న వివాహం జరిగింది. వీరికి ఒక కమారుడు సాయి భారవి ఉన్నాడు.

ప్రచురించబడిన మొదటి కవిత[మార్చు]

1996 నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. పలు పత్రికల్లో అవి అచ్చయ్యాయి. 2000 సంవత్సరం ఆగష్టు, గోకుల ప్రభ మాస పత్రికలో మన జాతికే వెలుగంట అనే శీర్షికతో మొదటి కవిత ప్రచురితమైనది.

ప్రచురించిన పుస్తకాలు[మార్చు]

 1. 2005 – మేలు కొలుపు (కవిత్వం)
 2. 2006 – చదువులమ్మ శతకం
 3. 2007 – పల్లె నానీలు
 4. 2015 – ఎర్రగాలు (కవిత్వం)
 5. 2015 – ఆరుద్ర పురుగు (కవిత్వం)[3]

సంపాదకత్వం[మార్చు]

 • 2016 - ఎన్నీల ముచ్చట్లు – 32, 33, 34, 38-39-40, 41, 42-43-44, 45, 46-47, 48-49-50, 51-52-53, 54-55-56-57-58-59, 60-61 కవితా గాన సంకలనాలు
 • 2018 - నల్లాలం పూలు - బడి పిల్లల కవిత్వం

పురస్కారాలు – బిరుదులు[మార్చు]

 • 2007 – జిల్లా ఉత్తమ యువ కవి పురస్కారం.
 • 2009 – గ్రామీణ కళా జ్యోతి పురస్కారం.
 • 2010 – తెలంగాణ సాహిత్య పురస్కారం.
 • 2012 - ప్రజా కవి కాళోజీ స్మారక పురస్కారం.
 • 2012 – జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
 • 2013 – పద్మ భూషణ్ డా . గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం.
 • 2015 – మండల ఉత్తమ సాహితీ వేత్త, రూ. 10,000/- నగదు పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం.
 • 2017 - సినీవాలి పురస్కారం, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్.
 • 2018 - తెలంగాణ సాహిత్య పురస్కారం, శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్.
 • 2018 - కనకం సాహిత్య సేవా పురస్కారం, కనకం కళా సంస్థ.
 • 2018 - సాహితీ జ్యోతి రత్న, కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్టు.

సాహితీ సంస్థలు సాంగత్యం[మార్చు]

 • ఉదయ సాహితీ, కార్యదర్శి.
 • మాతృ భాషా పరిరక్షణ సమితి, అధ్యక్షులు.
 • జిల్లా గ్రంధాలయ సంఘం కార్యవర్గ సభ్యులు.
 • జిల్లా రచయితల సంఘం కార్యదర్శి.
 • తెలంగాణ జాగృతి సాహితీ విభాగం, జిల్లా కన్వీనర్ గా కొనసాగారు.
 • తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా పని చేసి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
 • సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమి కార్యదర్శిగా కొనసాగి, ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

యువజన సంఘాల వ్యవస్థాపకుడు[మార్చు]

 • 1996 – అభ్యుదయ యువజన సంఘం, మద్దికుంట.
 • 2000 – సిద్ధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, మద్దికుంట.

జనాన్ని మేలు కోలుపడం. గుడ్డి నమ్మకాలను రూపు మాపడం. శ్రమ దానాలు. క్రీడల నిర్వహణ. జనాభా నియంత్రణ. ప్రముఖుల జయంతులు వర్థంతులు జరుపడం. నిరక్షరాస్యత నిర్మూలనకుగాను జిల్లా ఉత్తమ యువజన సంఘ పురస్కారాలను, జిల్లా నెహ్రు యువ కేంద్ర నుండి పలుమార్లు పొందారు.

చిత్ర మాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

 1. 442కవుల సంకలనం తొలిపొద్దులో
 2. కినిగె.కాం లో కూకట్ల తిరుపతి రచనలు
 3. ఆటా కవిత్వ బహుమతి
 4. ప్రతిలిపిలో
 5. సారంగలో విలాసాగరం రవీందర్ వ్యాసం
 6. దక్కన్ డేలీలో

మూలాలు[మార్చు]

 1. దక్కన్ డైలీ, సాహితి. "అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1". www.deccandaily.com. Retrieved 10 September 2016.
 2. నవతెలంగాణ, అంకురం (Nov 18,2015). "బాలకార్మికుడి నుంచి భావ కవిత్వం దాకా.. 'కూకట్ల' మేలుకొలుపు". Retrieved 10 September 2016. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 3. ఆంధ్రభూమి, అక్షర (12 February 2016). "కలం కవాతు". Retrieved 10 September 2016. Cite news requires |newspaper= (help)