కూచ్ బెహర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cooch Behar జిల్లా
কোচবিহার জেলা
West Bengal జిల్లాలు
West Bengal రాష్ట్రంలో Cooch Behar యొక్క స్థానాన్ని సూచించే పటం
West Bengal రాష్ట్రంలో Cooch Behar యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం West Bengal
డివిజన్ Jalpaiguri
ముఖ్యపట్టణం Cooch Behar
ప్రభుత్వ
 • లోకసభ నియోకవర్గాలు Cooch Behar
 • శాసనసభ నియోజకవర్గాలు Mekliganj, Mathabhanga, Cooch Behar Uttar, Cooch Behar Dakshin, Sitalkuchi, Sitai, Dinhata, Natabari, Tufanganj
Area
 • మొత్తం 3,387
Population (2011)
 • మొత్తం 2
 • సాంద్రత 830
 • Urban 225
జనగణాంకాలు
 • అక్షరాస్యత 75.49 per cent
 • లింగ నిష్పత్తి 942
ప్రధాన రహదారులు NH 31
సగటు వార్షిక వర్షపాతం 3201 మి.మీ
Website అధికారిక వెబ్‌సైటు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో కూచ్ బెహర్ బెంగాలీ: কোচবিহার জেলা జిల్లా ఒకటి. బ్రిటిష్ రాజ్ పాలనా కాలంలో కూచ్ బెహర్ రాజాస్థానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని కూచ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్యాపరంగా ఈ జిల్లా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 3 వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. .[1]

పేరువెనుక చరిత్ర[మార్చు]

కూచ్ బెహర్ స్థానికులైన కూచ్ రాజ్బంగ్షి గిరిజనజాతుల నివసించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతం కూచ్ బెహర్ అయింది. బిహార్ అంటే సంస్కృత భాషలో బిహర్ అని అర్ధం. బిహర్ అంటే తెలుగులో విహారీ అని అర్ధం. కూచ్ రాజ్బాంగ్షి రాజులు విహరించిన ప్రాంతం కనుక ఇది కూచ్ బెహర్ అయింది. కామత్పూర్ సామ్రాజ్యం కూచ్ రాజ్బంషి రాజైన " మహారాజు నరనారాయణన్ పాలించాడు. తతువాత ఆయన తమ్ముడు ఆతరువాత ఇతర వారసులు పాలించారు. ఒకప్పటి కామత్పూర్ రాజ్యమే ప్రస్తుతం ఉత్తర బెంగాల్, అస్సాం రాష్ట్రంలోని అధికభాగం, ప్రస్తుత బంగ్లాదేశ్ , బిహార్ రాష్ట్రంలోని కిషంగంజ్ జిల్లా మరియు భూటాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. కూచ్ రాజబంగ్షి ప్రజలు తమ సంస్కృతి మరియు సంప్రదాయాలను సంరక్షిచడానికి అనువుగా తమకు ప్రత్యేక ప్రాతం కావాలని మహారాజును నిర్భందిస్తూ వచ్చారు.

చరిత్ర[మార్చు]

మహిష్యా సమాజానికి చెందిన వారు కూచ్ సాంరాజ్యానికి పూర్వీకులుగా భావించబడుతుంది. 16వ శతాబ్దం నుండి కూచ్ బెహర్ ప్రాంతం మహిష్యా పాలకుల ఆధీనంలో ఉంటూవచ్చింది. ఈ రాజ్యం చాలాకాలం సురక్షితంగా ఉంటూ వచ్చింది. 1757 లో ప్లాసే యుద్ధం వచ్చింది. 18వ శతాబ్ధపు చివరి భాగంలో ఈ ప్రాంతం మీద భూటాన్ దండయాత్ర జరిగింది. ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం జార్జ్ బోగ్లేను భూటానుకు దూతగా పంపింది. తరువాత 1775 బ్రిటిష్ భూటాన్ మద్య ఒప్పందం జరిగింది. 1947 లో ఈ ప్రాంతం భాతదేశ ఆధీనంలోకి తీసుకురాబడింది. కాలానుగతంగా కూచ్ బెహర్ రాజ్యంగా తరువాత బ్రిటిష్ స్టేట్‌గా ఆతరువాత ప్రస్తుత జిల్లాగా రూపాంతరం చెందుతూ వచ్చింది. 1949 ఆగస్ట్ 28 వరకు కూచ్ బెహర్ ప్రాంతాన్ని కూచ్ బెహర్ మహారాజా " జగజీపేంద్ర నారాయణ " పాలించే వాడు. కూచ్ బెహర్ పాలన మారే సమయంలో న్యాయాధికారం మరియు పూర్తి పాలనాధికారం 1949 సెప్టెంబర్ మాసంలో భరతదేశానికి ఇవ్వబడింది. తరువాత కూచ్ బెహర్ ప్రాంతం 1950 జనవరి 19న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలుపబడింది. తరువాత ఇది జిల్లాగా అవతరుంచింది.

భౌగోళికం[మార్చు]

Exclaves of India and Bangladesh in and around Cooch Behar district

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని జల్పైగురి డివిషన్‌లో కూచ్ బెహర్ జిల్లా ఒకటి. కూచ్ బెహర్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో జల్పైగురి, తూర్పు సరిహద్దులో అస్సాం రాష్ట్రం మరియు దక్షిణ మరియు పశ్చిమ సరిహద్దులలో బంగ్లాదేశ్ రాష్ట్రం ఉన్నాయి. ఈ జిల్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హిమాలయ సానువులలో ఉపస్థితమై ఉంది.

మట్టి[మార్చు]

కూచ్ బెహర్ జిల్లా తూర్పు హిమాలయ పర్వతపాదాల వద్ద ఉన్నందున నదుల ప్రవాహం వేగవంతగా శక్తివంతంగా ఉంటాయి. ఇది కొన్ని ప్రాంతాల వరదకు కారణం ఔతుఇఉంటాయి. ఈ వరదనీరు ఇసుక, వండ్రుమట్టి, గులకరాళ్ళు మోసుకు వస్తుంది. ఇది ఉత్పాదనకు విఘాతం కలిగిస్తుంది. నదీప్రవాహాల కారణంగా మట్టి సారవతం ఔతూ ఉంటుంది. ఈ సారవంతమైన భూమి మీద మట్టి 0.15మీ లోతుపొరలా ఏర్పడి ఉంటుంది.ఈ మట్టిలో నత్రజని తక్కువస్థాయిలో ఉండగా, పొటాషియం మరియు ఫాస్ఫరస్ మధ్యమ స్థాయిలో ఉంది. మెగ్నీషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ నిల్వలు లోపించి ఉన్నాయి.

నదులు[మార్చు]

కూచ్ బెహర్ జిల్లాలోని భూమి చదరంగా ఉన్నప్పటికీ నదులు ప్రవహిస్తున్న ఆగ్నేయదిశలో భూమి దిగువగా ఉంటుంది. ఎగువభూములు అధికంగా శీతల్కుచి వద్ద ఉన్నాయి అలాగే దిగువభూములు అధికంగా దింహత వద్ద ఉన్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న తీస్తానది, జల్ధక, తోర్ష, కజియాని, రైదక్, గదాదర్ మరియు ఘర్ఘారియా నదులు జిల్లాలో వాయవ్యదిశ నుండి ఆగ్నేయ దిశవైపుగా ప్రవహిస్తున్నాయి.

వాతావరణం[మార్చు]

The district of Cooch Behar has a moderate type of climate characterised by heavy rainfall during the monsoon and slight rainfall in the month of October to mid-November. The district does not have high temperatures at any time of the year. The summer season is from April to May with April being the hottest month with mean daily maximum of 32.5 °C and mean daily minimum of 20.2 °C. The winter season lasts from late November to February, with January being the coldest month with temperature ranging from 10.4 °C to 24.1 °C. The recorded temperature minimum is 3.9 °C and respective recorded maximum is 39.9 °C. The atmosphere is highly humid throughout the year, except the period from February to May, when the relative humidity is as low as 50 to 70%. The rainy season lasts from June to September. The district's average annual rainfall is 3201mm.

ఆర్ధికం[మార్చు]

వ్యవసాయం[మార్చు]

కూచ్ బెహర్ జిల్లా వ్యవసాయభూముల వైశాల్యం 2530.63చ.కి.మీ. జిల్లాలో అత్యధికంగా జనపనార మరియు పుగాకు పంటలు పండించబడుతున్నాయి. వర్షాకాలానుకి ముందు మరియు వెనెక వరిపంట కూడా పండించబడుతుంది. తోటల పెంపకంలో ప్రధానమైనవి వక్క, కొబ్బరి మరియు మిరియాలు పండినచబడుతున్నాయి. కూరగాయలు, ఆవాలు మరియు ఉర్లగడ్డలు పంటలు కూడా జిల్లాలో అధికరిస్తున్నాయి. వ్యవసాయానికి సహకరించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. పొద్దుతిరుగుడు మరియు మొక్కజొన్న మరియు వేరుశనగ పండించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బోరో వరి మరియు ఉర్లగడ్డలు పండొచడానికి విప్లవాత్మకమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఆధునిక పద్ధతులను అనుసరించక వ్యవసాయదారులు ఇంకా సంప్రదాయపద్దతులను అనుసరిస్తున్నారు. 33% వ్యవసాయభూములకు నీటిసరఫరా అభివృద్ధి చేయబడింది. కరీఫ్ సమయంలో కూరగాయలు మరియు ఇతర పంటలు చాలా తక్కువగ పండించబడుతున్నాయి.

ట్జిబెట్ వ్యాపారులు[మార్చు]

ఈ ప్రాంతానికి టిబెట్ దేశ వ్యాపారుల చేత ఈ ప్రాంతానికి గొర్రెజాతులు తీసుకురాబడ్డాయి. బెంగాల్ మైదానంలోని వ్యాపారులకు టిబెట్ వ్యాపారులకు మద్య చక్కని వ్యాపారసంబంధాలు ఉండేవి. జల్పైగురి జిల్లాలోని భాత్ పట్టి బ్లాక్ వద్ద టిబెట్ వ్యాపారులు మరియు బెంగాలీ గంగా మైదాన వ్యాపారులు వస్తుమార్పిడి చేసుకుంటూ ఉండేవారు. ప్రధాన వ్యాపారం రంగ్పూర్ (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది ) వద్ద జరిగేది. బెంగాల్ వ్యవసాయదారులు గొర్రెలకు బదులుగా టిబెటన్ వ్యాపారులకు వస్తువులను ఇచ్చేవారు. గొర్రెలను గంగామైదాలలోమేతకు వదిలే వారు. కాలనీ కాలంలో యురేపియన్లు గొర్రెలను మాసం కొరకు వాడుకునే వారు. 18వ శతాబ్దంలో కొన్ని గొర్రెల మందలు ఆస్ట్రేలియా కాలనీలకు తరలించబడ్డాయి. కొలకత్తా నౌకాశ్రయం ఆస్ట్రేలియాలోని " బూరూలా మెరినో " జాతికి పూర్వీకం ఈ గొర్రెలే.

విభాగాలు[మార్చు]

ఉపవిభాగం[మార్చు]

కూచ్ బెహార్ జిల్లా 4 ఉపవిభాగాలు కలిగి:

 • కూచ్ బెహార్ సదర్ ఉప
 • దిన్హత ఉపవిభాగం
 • మాతభంగ ఉపవిభాగం
 • తుఫాంగని ఉపవిభాగం

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

జిల్లాలో 8 అసెంబ్లీ జియోజకవర్గాలునాయి:[2]

 1. శీతల్కుచి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 2),
 2. మాతాభంగ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 3),
 3. ఉత్తర కూచ్ బెహార్ (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 4),
 4. పశ్చిమ కూచ్ బెహార్ (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 5),
 5. శీతల్ (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 6),
 6. దీంహత (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 7),
 7. నటబరి (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 8) మరియు
 8. తుఫాంగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 9.).

షెడ్యూల్డ్ జాతి మరియు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు[మార్చు]

 • షెడ్యూల్డ్ జాతి మరియు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- మెక్లిగంజ్, శీతల్కుచి, మథభంగ మరియు తుఫాంగంజ్. దింహత మరియు నటబరి.
 • జల్పైగురి పార్లమెంటరీ నియోజకవర్గం :- మెక్లిగంజ్ మరియు జల్పైగురి జిల్లా నుండి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.
 • కూచ్‌బెహర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- శీతల్కుచి, మథభంగ, ఉత్తర కూచ్‌బెహర్, పశ్చిమ కూచ్‌బెహర్, సీతై, ... జిల్లా నుండి .. అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి.అసెంబ్లీ నియోజకవర్గాలు.
 • అలిపురుదుయర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- జల్పైగురి జిల్లా నుండి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.

పునర్విభజన తరువాత నియోజకవర్గాలు[మార్చు]

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమీషన్ " ఆదేశానుసారం కూచ్‌బెహర్ జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 9 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది. [3]

 1. మాతాభంగ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 2),
 2. ఉత్తర కూచ్ బెహార్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 3),
 3. దక్షిణ కూచ్ బెహార్ దక్షిణ (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 4),
 4. శీతల్కుచి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 5),
 5. శీతై (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 6),
 6. దింహట (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 7),
 7. నటబరి (విధాన సభ నియోజకవర్గం) (. అసెంబ్లీ నియోజకవర్గం ఏ 8) మరియు
 8. తుఫాంగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (అసెంబ్లీ నియోజకవర్గం ఏ 9.).

షెడ్యూల్డ్ జాతి మరియు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు[మార్చు]

 • షెడ్యూల్డ్ జాతి మరియు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :-మెకిల్గంజ్, మాథభంగ, ఉత్తర కూచ్ బెహర్, శీతల్కుచి మరియు శీతల్.
 • జల్పైగురి పార్లమెంటరీ నియోజకవర్గం :- మెకిల్గంజ్ మరియు జల్పైగురి జిల్లా నుండి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.
 • కూచ్ బెహర్ పార్లమెంటరీ నియోజకవర్గం :-మథలభంగ, ఉత్తర కూచ్ బెహర్, దక్షిణ కూచ్ బెహర్, శీతల్కుచి, శీతై, దింహత, మరియు నటబరి.
 • పార్లమెంటరీ నియోజకవర్గం :- తుఫాంగంజ్ మరియు జల్పైగురి జిల్లా నుండి 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి. అసెంబ్లీ నియోజక వర్గాలు.

Culture[మార్చు]

పర్యాటకం[మార్చు]

 • " కూచ్ బెహర్ ప్యాలెస్ " (రా జ్బరి) : 1887 లో యురేపియన్ శైలిలో ఇది నిర్మించబడింది. ఈ ప్యాలెస్‌లోనే నిర్మ్ంచబడిన మ్యూజియంలో రాజభవనానికి మరింత వన్నె తీసుకువచ్చింది.

విశాలమైన పసరిక భూమి మరియు పూలతోటలు మ్యూజియానికి అందం తీసుకువచ్చాయి.

 • మదన్ మోహన్ ఆలయం : కూచ్ బెహర్ పట్టణంలో మద్యభాగంలో నిర్మిచబడిన ఈ అలయం 1885-1889 మద్యకాలంలో " మహారాజా నృపేంద్ర నారాయణ " చేత నిర్మించబడింది.

కూచ్ సాంరాజ్యానికి కులదేవత అయిన మదన్‌మోహన్ ఈ ఆలయంలో మదన్ మోహనుడు ప్రధాన దైవంగా ఉన్నాడు. అంతేకాక ఈ ఆలయంలో తరామాత మరియు భవానీ మాతలు కూడా ఉపస్థితులై ఉన్నారు. ఈ ఆలయంలో రాసలీల ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది.

 • రాజ్పాట్ మౌండ్ :- ఈ స్మారకచిహ్నం భారతీయ పురాతత్వశాఖ సరక్షణలో ఉంది. ఇక్కడ ఒక శిధిలమైన రాజభవనం మరియు పురాత్వ పరిశోధనలో లభించిన కళాఖండాలు మరియు శిల్పాలు ఉన్నాయి.
 • బనేశ్వర్ శివ్ ఆలయం :- బనేశ్వర్ షివ్ ఆలయం కూచ్ బెహర్‌కు 10 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయంలో శివలింగం భూమికి 10 అడుగుల లోతులో ఉంది. ఈ ఆలయంలోని కోనేరులో

దీర్ఘకాలంగా జీవిస్తున్న తాబేళ్ళు ఉన్నాయి. శివరాత్రి సందర్భంలో ఈ ఆలయంలో ఒక వారంరోజులపాటు ఉత్సవం నిర్వహించబడుతుంది.

 • మధుపూర్ ధాం :- కూచ్ బెహరుకు 10కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం 1489లో నిర్మించబడింది. మహారాజా నర్ నారాయణ్ ఆహ్వానం మీద శంకరదేవా ఈ ఆలయంలో ఆధ్యాత్మిక నియో వైష్ణవ ఉపన్యాసాలు చెప్పారు. ఆచార్య శంకరదేవ భక్తులు పలవురికి ఇది కేంద్రంగా ఉంది. శంకదేవా గౌరవార్ధం మాధపూర్ ధాం నిర్మించబడింది.
 • కామతేశ్వరి ఆలయం :-
Rasikbeel

కూచ్ బెహర్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న పురాతన కామతేశ్వరి ఆలయం శిధిలమై ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1665లో మహారాజా ప్రాణ్ నారయణ చేత నిర్మించబడింది.ప్రధాన ఆలయం పక్కన రెండు ఉపాలయాలు కూడా ఉన్నాయి. తారకేశరాలయానికి ఇరువైపులా 2 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రధాన దేవతగా దేవి ప్రతిష్ఠించబడి ఉంది.

 • సాగర్ దిగి (కూచ్ బెహర్) :-
Sagar Dighi

సాగర్ దిగి (కూచ్ బెహర్) పట్టణంలోనే ఉంది. ఈ పెద్ద సరసును మహారాజా హితేంద్ర నారాయణ్ చేత నిర్మించబడింది. సాయంత్రపువేళలో విహరించడానికిది అనువైన ప్రదేశం. సంప్రదాయ భవనాల మద్య ఉన్న ఈ భవనం సమీపంలో విక్టర్ హౌస్ మరియు యుద్ధ స్మారకచిహ్నం కూడా ఉంది. శీతాకాలంలో ఈ జలాశయం మరియు సమీపంలో ఉన్న చెట్లమీద వసలపక్షులను కూడా చూడవచ్చు.

Rasikbeel Watch Tower
 • రాసిక్బిల్:- రాస్కిబిల్ కూచ్ బెహరుకు 42కి.మీ దూరంలో ఉంది. ప్రముఖ పక్షుల సంరక్షణాలయంలో డీర్ పార్క్ మరియు సరికొత్తగా నిర్మించబడిన అక్వేరియం ఉన్నాయి. ఇక్కడ చేపలు,

తాబేళ్ళు, చిరుతపులులు, పీఫౌల్ మొదలైనవి ఉన్నాయి. రాసిక్బిల్ వెళ్ళేదారిలో చైనా చేపల వలలు కనిపిస్తుంటాయి. రాసిక్బిల్‌లో బొచమరి బీల్, బతికత బీల్ మరియు రైచంగ్మరి బీల్ మొదలైన జలాశయాలు ఉన్నాయి. బెంగాలీ భాషలో బీల్ అంటే పెదా మడుగు లేక జలాశయం అని అర్ధం. ఇక్కడ ప్రధనంగా షోవెలర్, బార్‌హెడెడ్ గూస్, వైట్ ఐడ్ పోచర్డ్ మొదలైనవి ఉన్నాయి. ఇంతే కాక ఇక్కడ ఇతర జలపక్షులు కూడా ఉన్నాయి. జలాశయాల మొత్తం వైశాల్యం 178 హెక్టార్లు. ఈ మొత్తం ప్రాంతం కూచ్ బెహర్ వసంరక్షణ శాఖ ఆధ్వర్యంలో సంరక్షిత ప్రాంతంగా ఉంది. సమీపకాలంలో కూచ్ బెహర్ ఫారెస్ట్ డివిషన్ ఇక్కడ 70 అడుగుల ఎత్తులో గడియారపు గోపురం నిర్మినచబడింది. ఇక్కడ ఉన్న చిన్నసైజు జంతుప్రదర్శన శాలలో " జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా " సాయంతో పక్షుల గణాంకాలను సేకరిస్తున్నారు. ఇక్కడ చిరుత, తాబేలు, ఘారియల్, మచ్చల జింక, పీఫౌల్ మరియు ఇతర జంతువులు ఉన్నాయి. 2009లో " జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా " సాయంతో పక్షుల గణాంకాలు ఇక్కడ 66 జాతిల పక్షులు ఉన్నట్లు తెలుస్తుంది.

 • రాసోమతి ఎకోసిస్టం కాంప్లెక్స్ :- రాసోమతి ఎకోసిస్టం కాంప్లెక్స్‌ను సమీపకాలంలో కూచ్ బెహర్ ఆటవీశాఖ అభివృద్ధిచేసింది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ రాసోమతి జీల్‌లో దేశీయ విదేశీయ పక్షులు అనేకం ఉన్నాయి. పర్యాటకులకు ఇక్కడ బోటింగ్ టూర్లు కూడా ఉన్నాయి. 6కి.మీ ఆటవీ సందర్శన కూడా పర్యటనలో భాగంగా ఉంది. పక్షులను సందర్శించడానికి 56 అడుగుల గోపురం కూడా నిర్మించబడింది. ఈ ప్రదేశం కూచ్ బెహర్ రాజుల క్రీడా ప్రదేశమైన పత్లహవా వద్ద ఉంది.
 • ఖొల్త ఎకో టూరిజం స్పాట్ :- కూచ్ బెహర్ మరియు అలిపురుదుయర్ రహదారి సమీపంలో కూచ్ బెహర్‌కు 20 కి.మీ దూరంలో ఉంది. కూచ్ బెహర్ ఆటవీశాఖ సమీపకాలంలో అభివృద్ధిచేసిన

చిల్డ్రెంస్ పార్క్, డీర్ పార్క్, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ప్రాంతం అరైకుమరి ఉపనిదికి సమీపంలో ఉంది. ఇక్కడ కూచ్ బెహర్ రాజులు నాటిన టేకుతోటలు ఉన్నాయి.

 • జోరై :- జోరై కూచ్ బెహర్ నగరప్రాంతాలలో ఒకటి. ఇక్కడ ఉన్న సంకోష్ నది ఉపనది జోరై నొడి కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఈ నదిలో డానియో రెయో మరియు డానియో డంగిలా జాతుల చేపలు ఉన్నాయి. ఈ చేపలను బొయిరలి మాచ్ అంటారు. ఈ ప్రాంతం మారథాన్ ఫుట్‌బాల్ లీగ్ మరియు రాసమేళా ఉత్సవాలకు ప్రసిద్ధి. ఇక్కడా జోరై రైల్వే స్టేషను ఉంది.

ఇతర పర్యాటక ప్రదేశాలు[మార్చు]

 • ఎకో హెరిటేజ్ పార్క్
 • నిపేంద్ర నారాయణ్ పార్క్
 • బ్రహ్మ మందిరం
 • రానిర్బాగం
 • బరదేబి బారి
 • సిద్ధేశ్వరి కాళి బారి
 • దంగర్ ఆయే ఆలయం
 • సిద్ధనాథ్ శివాలయం (దలుయాబరి)
 • మదన్ మోహన్ టెంపుల్ (మాతాభంగ)
 • గోసనిమరి

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,822,780,[1]
ఇది దాదాపు. జమైక దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 136 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 833 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.86%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 942:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 75.49%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

జిల్లాలో తాటి, బంబూస్, క్రీపర్స్, ఫెరన్, ఆర్చిడ్స్, అక్వాటిక్ మొక్కలు, టింబర్, గడ్డి, కూరగాలు మరియు పండ్ల చెట్లు ఉన్నాయి. జిల్లాలో పత్లఖవ తప్ప మరెక్కడా విస్తారమైన అరణ్యాలు లేనందువలన వన్యమృగాలు కూడా లేవు. అయినప్పటికీ జిల్లాలో అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. జల్పైగురి జిల్లా మరియు అలిపురుదుయర్ జిల్లాలలోని వన్యమృగ సంరక్షాలయాలు జిల్లాకు సమీపంలోనే ఉన్నాయి. 1976 లో కూచ్ బెహర్ జిల్లాలో 217 చ.కి.మీ వైశాల్యంలో " జల్దపరా నేషనల్ పార్క్ " ఏర్పాటుచేయబడింది. .[5] It shares the park with Jalpaiguri district.[5]

విద్య[మార్చు]

 • విద్యా సౌకర్యాలు:-

ప్రాథమిక పాఠశాలలు - 1805
హై స్కూల్స్ - 120
హయ్యర్ సెకండరీ స్కూల్స్ - 61
హై మదర్సాను - 5
సీనియర్ మదర్సాను - 2
జూనియర్ హై స్కూల్ - 60
జూనియర్ హై మదర్సాను - 16
కేంద్రీయ విద్యాలయ - పేజీ 1 జవహర్ నవోదయ విద్యాలయ - 1

ఇంజినీరింగ్ / టెక్నికల్ స్కూల్స్ - 2
వృత్తి & టెక్నికల్ స్కూల్స్ - 16
సాధారణ కళాశాలు - 9
బ్లైండ్ స్కూల్ - పేజీ 1 లైబ్రరీస్ - 110

2013 లో కూచ్‌బెహర్ జిల్లాలో కొత్త విశ్వవిద్యాలయం (కూచ్‌బెహర్ పంచనాన్ బర్మా యూనివర్శిటీ ) స్థాపించబడింది. కూచ్‌బెహర్‌కు 15కి.మీ దూరంలో పుందిబరిలో " ఉత్తర భంగ క్రిషి విద్యాలయ " పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. ప్రభుత్వ పాఠశాలలతో జిల్లాలో ఐ.సిఎస్,సి, ఐ.ఎస్.సి మరియు సి.బి.ఎస్.సి వంటి ప్రైవేటు సంస్థల నిధిసాయంతో నడుస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 2. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2008-11-16. 
 3. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-16. 
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est 
 5. 5.0 5.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Retrieved 25 September 2011. 
 • Moore, Lucy (2004) Maharanis: The Extraordinary Tale Of Four Indian Queens And Their Journey From Purdah To Parliament, Penguin, ISBN 0-670-03368-5

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కూచ్_బెహర్&oldid=1674730" నుండి వెలికితీశారు