Jump to content

కూచ్ బెహార్ ప్యాలెస్

వికీపీడియా నుండి
కూచ్ బెహార్ ప్యాలెస్
కూచ్ బెహార్ ప్యాలెస్ ముందు భాగం
పటం
Interactive map of the కూచ్ బెహార్ ప్యాలెస్ area
General information
Architectural styleక్లాసికల్ వెస్ట్రన్ / ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమం
Locationకూచ్ బెహార్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Construction started1887; 139 సంవత్సరాల క్రితం (1887)
Clientమహారాజా నృపేంద్ర నారాయణ్

కూచ్ బెహార్ ప్యాలెస్ అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బెహార్ నగరంలో ఉన్న ఒక మైలురాయి. ఇది ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ వాస్తుశిల్ప శైలిలో రూపొందించబడింది. కోచ్ రాజవంశానికి చెందిన మహారాజా నృపేంద్ర నారాయణ్ పాలనలో 1887లో నిర్మించబడింది. ఇది ప్రస్తుతం మ్యూజియంగా ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

కూచ్ బెహార్ ప్యాలెస్ దర్పానికి, వైభవానికి ప్రసిద్ధి చెందింది. ఇది 51,309 square feet (4,766.8 m2) విస్తీర్ణంలో ఇటాలియన్ వాస్తుశిల్ప శైలిలో నిర్మించబడిన ఇటుకలతో కూడిన రెండస్తుల కట్టడం. మొత్తం నిర్మాణం 395 feet (120 m) పొడవు, 296 feet (90 m) వెడల్పు ఉండి భూమి నుండి 4 feet 9 inches (1.45 m) ఎత్తులో ఉంటుంది.[మూలాలు అవసరం] ఈ ప్యాలెస్ ముందు భాగంలో మొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్లలో సింగిల్, డబుల్ వరుసల్లో ప్రత్యామ్నాయంగా అమర్చబడిన వరుస కమాను వరండాలు ఉన్నాయి.

ప్యాలెస్ దక్షిణం, ఉత్తరం చివర్లలో కొద్దిగా ముందుకు పొడుచుకుని వచ్చి మధ్యలో ఉన్న పోర్చ్ దర్బార్ హాల్‌కి ప్రవేశాన్ని అందిస్తుంది. ఈ హాల్ పైకప్పు స్థూపాకార లావర్ తరహా వెంటిలేటర్‌తో కూడిన అందమైన లోహపు గోపురం (డోమ్)తో ఉంటుంది. ఇది భూమి నుండి 124 అడుగుల ఎత్తులో పునరుజ్జీవనోద్యమ వాస్తుశిల్పం శైలిలో ఉంటుంది. గోపురం కింది భాగం మెట్ల నమూనాలతో చెక్కబడి ఉంటుంది, కొరింథియన్ స్తంభాలు కుపోలా ఆధారాన్ని మోస్తాయి. ఇది మొత్తం ఉపరితలానికి రకరకాల రంగులు, డిజైన్లను జోడిస్తుంది. ప్యాలెస్‌లో వివిధ హాళ్లు, గదులు ఉన్నాయి. వీటిలో గొప్ప దర్బార్ హాల్, ఆడియన్స్ హాల్, డ్రాయింగ్ రూమ్‌లు, డైనింగ్ హాల్, బిలియర్డ్స్ రూమ్, లైబ్రరీ, బెడ్ రూమ్‌లు, తోషాఖానా, లేడీస్ గ్యాలరీ, వెస్టిబ్యూల్స్ ఉన్నాయి. ఈ గదులు, హాళ్లలో ఒకప్పుడు ఉన్న పురాతన వస్తువులు, విలువైన వస్తువులు ఇప్పుడు లేవు.

అసలు ప్యాలెస్ పాక్షికంగా 3 అంతస్తుల నిర్మాణం, కానీ తరువాత 1897 అస్సాం భూకంపం కారణంగా ధ్వంసమైంది.

ఈ ప్యాలెస్ కోచ్ రాజుల యూరోపియన్ భావజాల స్వీకరణను చూపిస్తుంది.[2]

పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్మారక కట్టడాల జాబితా ప్రకారం కూచ్ బెహార్ ప్యాలెస్ అనేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాబితా చేయబడిన స్మారక చిహ్నం.[3]

కూచ్ బెహార్ ప్యాలెస్ వెనుక భాగం, ఇది స్మారక చిహ్నం అసలు రంగును కలిగి ఉంది.[4]

వాస్తుశిల్పం

[మార్చు]

రాజ్‌బారీ లేదా కూచ్ బెహార్ ప్యాలెస్ అనేది ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ వాస్తుశిల్ప రూపంలో నిర్మించబడిన ఒక గొప్ప స్మారక చిహ్నం. మొత్తం స్మారక కట్టడం 51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, సుమారు 390 అడుగుల పొడవు, 296 అడుగుల వెడల్పుతో అందంగా విస్తరించి ఉంది. ఇది ఇటుకలతో నిర్మించిన కట్టడం. భూమి నుండి 125 అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్మారక చిహ్నంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రవేశద్వారం ఉంది, ఇది ముందుకు పొడుచుకు వచ్చిన పోర్చ్ గుండా దర్బార్ హాల్‌కి దారి తీస్తుంది. మొదటి అంతస్తులో డబుల్, సింగిల్ వరుసలలో ప్రత్యామ్నాయంగా అమర్చబడిన పైర్స్‌తో (పిల్లర్లు) కూడిన అందమైన ఆర్కేడెడ్ వరండాలు ఉన్నాయి. ప్యాలెస్‌లో బెడ్‌రూమ్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లు, బిలియర్డ్స్ రూమ్, వంటగది, డైనింగ్ హాల్, డ్యాన్స్ హాల్, లైబ్రరీ, తోషాఖానా, లేడీస్ గ్యాలరీ సహా 50కి పైగా గదులు ఉన్నాయి.[మూలాలు అవసరం]

దర్బార్ హాల్

[మార్చు]

స్మారక కట్టడం మధ్యలో ఉంచబడిన అద్భుతమైన పోర్చ్ రాజ్‌బారీ దర్బార్ హాల్ గుండా ప్రవేశద్వారంగా పనిచేస్తుంది.[5] దర్బార్ హాల్ పైభాగంలో స్తూపాకార లావర్‌తో కూడిన అందమైన లోహపు గోపురం ఉంది, ఇది వెంటిలేటర్‌గా కూడా పనిచేస్తుంది. గోపురం భూమట్టం నుండి 124 అడుగుల ఎత్తులో ఉండి సాంప్రదాయ ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ వాస్తుశిల్ప శైలిలో నిర్మించబడింది. గోపురం మెట్ల నమూనాతో అందంగా చెక్కబడి పైన లాంతరుతో అలంకరించబడిన భారీ కొరింథియన్ స్తంభాలతో మద్దతు ఉన్న నాలుగు తోరణాలపై ఉంటుంది. దర్బార్ హాల్ గోపురం చుట్టూ చిన్నవైనా అందమైన బాల్కనీలు కూడా ఉన్నాయి.[మూలాలు అవసరం]

గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Cooch Behar Rajbari Museum coochbehar.nic.in. Retrieved 2 October 2021
  2. "Official Website of Cooch Behar district in West Bengal". Coochbehar.nic.in. Archived from the original on 5 November 2016. Retrieved 25 October 2016.
  3. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of West Bengal - Archaeological Survey of India". Item no. 57. ASI. Archived from the original on 1 August 2021. Retrieved 7 August 2020.
  4. "Rajbari in Cooch Behar town". Archived from the original on 14 August 2022. Retrieved 19 October 2019.
  5. "Cooch Behar Galery". Cooch Behar District. 9 July 2023.

బాహ్య లింకులు

[మార్చు]